అంటార్కిటికాలో కొత్త నాచు మొక్కల జాతులను కనుగొన్న పంజాబ్ శాస్త్రవేత్తలు

పంజాబ్లోని భటిండాలో ఉన్న కేంద్ర విశ్వవిద్యాలయానికి చెందిన వృక్ష శాస్త్రవేత్తలు కొందరు తూర్పు అంటార్కిటికాలో ఇటీవల ఒక కొత్త స్థానిక నాచు మొక్కల జాతిని కనుగొన్నట్లు ప్రకటించారు. ఈ విశ్వవిద్యాలయానికి చెందిన ధ్రువ, సముద్ర విభాగాల జీవశాస్త్రవేత్త ఫెలిక్స్ బస్త్ అంటార్కిటికాలోని భారత్కు చెందిన భారతి స్టేషన్కు దగ్గరలోని లార్సెమాన్ కొండల మీద ఉన్న రాళ్లపై ఈ నాచు వంటి మొక్కలను కనుగొన్నారు. 2016-17 సంవత్సరంలో కొందరు శాస్త్రవేత్తల బృందం అంటార్కిటికాలోని భారతీయ మిషన్కు యాత్ర జరిపినప్పుడు బస్త్ దీన్ని కనుగొన్నారు. వృక్ష శాస్త్రవేత్తలు ఈ మొక్కల జాతికి ‘బ్రయం భారతీయెన్సిస్’ అని పేరు పెట్టారు. తర్వాత దీనిపై పత్రాలు ప్రచురించి వీటి ఉనికిని నిర్ధారణ చేసుకున్నారు. అంటార్కిటికాలోని భారతీయ మిషన్ శాస్త్రవేత్తలు కనుగొన్న ఏకైక, మొట్టమొదటి మొక్క జాతి ఇది.
Previous article
Find the average of these problems
Next article
బన్ని గేదె జాతి మొదటి ఐవీఎఫ్ దూడ
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు