First genetically engineered vaccine in the country | దేశంలో జన్యుపరంగా తయారైన మొదటి టీకా?
సైన్స్ అండ్ టెక్నాలజీ
1. దేశంలో ప్రతి ఏడాది జనవరి నెలలో జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతాయి. 1914 జనవరి 15 నుంచి 17 వరకు కలకత్తాలో తొలి సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు నిర్వహించారు. అయితే నేషనల్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో విదేశీ శాస్త్రవేత్తలు పాల్గొనడం ఎప్పటి నుంచి ప్రారంభమైంది?
1) 1945 2) 1946 3) 1947 4) 1948
2. కిందివాటిని సరిగా జతపర్చండి.
1. 99వ సైన్స్ కాంగ్రెస్ సమావేశం ఎ. భువనేశ్వర్
2. 100వ సైన్స్ కాంగ్రెస్ సమావేశం బి. కోల్‌కతా
3. 101వ సైన్స్ కాంగ్రెస్ సమావేశం సి. జమ్మూ
4. 102వ సైన్స్ కాంగ్రెస్ సమావేశం డి. ముంబై
1) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
2) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
3) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3. దేశంలో మొదటి న్యూక్లియర్ పవర్‌ప్లాంట్‌ను ఎక్కడ నెలకొల్పారు?
1) తారాపూర్ 2) జైపూర్
3) కూడంకుళం 4) రామగుండం
4. అణువిద్యుత్ కేంద్రాలు, వాటి ఉత్పత్తి సామర్థ్యాలను జతపర్చండి?
1. TAPS-1 ఎ. 160 మెగావాట్లు
2. TAPS-3 బి. 540 మెగావాట్లు
3. RAPS-1 సి. 100 మెగావాట్లు
4. RAPS-2 డి. 200 మెగావాట్లు
5. కైగా ఇ. 220 మెగావాట్లు
6. కూడంకుళం ఎఫ్. 1000 మెగావాట్లు
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ, 6-ఎఫ్
2) 1-ఎఫ్, 2-ఇ, 3-డి, 4-సి, 5-బి, 6-ఎ
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-ఎఫ్, 5-ఇ, 6-డి
4) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి, 5-ఇ, 6-ఎఫ్
5. అణుశక్తి కార్యక్రమంలో రెండో దశ రియాక్టర్ ఏది?
1) ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్
2) అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్
3) ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్
4) ఎవల్యూషనర్ ప్రెజరైజ్డ్ రియాక్టర్
6. దేశంలో క్షిపణులను తయారుచేసే రక్షణ నిర్వహణ సంస్థ ఏది?
1) భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
2) భారత్ డైనమిక్స్ లిమిటెడ్
3) భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్
4) భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్
7. అగ్ని 5 క్షిపణి లక్ష్య దూరం?
1) 5000 కి.మీ 2) 2000-2500 కి.మీ.
3) 3500-4000 కి.మీ. 4) ఏవీకావు
8. శత్రు విమాన ఉనికిని గుర్తించే రాడార్ ఏ తరంగాలను ఉపయోగించుకుంటుంది?
1) విద్యుత్ తరంగాలు 2) రేడియో తరంగాలు
3) శబ్ద తరంగాలు 4) అల్ట్రాసౌండ్స్ తరంగాలు
9. ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టడంలో రాకెట్ల (అంతరిక్ష నౌకలు) పాత్ర కీలకం. ఇప్పటికీ కొన్ని దేశాలకు మాత్రమే రాకెట్ల తయారీకి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం ఉంది. భారత్ మాత్రం సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో తేలికైన అంతరిక్ష నౌకలను నిర్మించడంలో ప్రత్యేకత చాటుకుంటుంది. ఇస్రో శాస్త్రవేత్తలు కేవలం ఒక బాలీవుడ్ సినిమా నిర్మాణానికయ్యే ఖర్చుతో 2013లో మార్స్‌పైకి మామ్ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఆ ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన రాకెట్ ఏది?
1) పీఎస్ఎల్వీ-సీ23 2) పీఎస్ఎల్వీ-సీ24
3) పీఎస్ఎల్వీ-సీ25 4) పీఎస్ఎల్వీ-సీ26
10. రాకెట్ ఇంధనాన్ని మండించడానికి ఉపయోగించే పదార్థం?
1) పొటాషియం క్లోరేట్ 2) మెగ్నీషియం ఆక్సైడ్
3) లెడ్ పెరాక్సైడ్ 4) అమ్మోనియం పెర్క్లోరేట్
11. భారత్ ఏ దేశంతో కలిసి చంద్రయాన్-2ను రూపొందించింది?
1) జపాన్ 2) జర్మనీ 3) ఫ్రాన్స్ 4) రష్యా
12. రేడియోధార్మిక ఐసోటోప్లు, వాటి ఉపయోగాలను జతపర్చండి.
1. సోడియం – 24 ఎ. ల్యుకేమియా చికిత్సలో, బ్రెయిన్ ట్యూమర్‌ను గుర్తించడం
2. అయోడిన్ – 131 బి. కీళ్లవాపు చికిత్సలో
3. కోబాల్ట్ -60 సి. క్యాన్సర్లను గుర్తించడం, వాటి నివారణలో
4. నమారియం – 153 డి. కంటి క్యాన్సర్ చికిత్సలో
5. ఫాస్ఫరస్ – 32 ఇ. గుండె జబ్బులను గుర్తించడంలో
1) 1-ఇ, 2-డి, 3-సి, 4-బి, 5-ఎ
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
3) 1-బి, 2-సి, 3-డి, 4-ఇ, 5-ఎ
4) 1-డి, 2-ఇ, 3-ఎ, 4-బి, 5-సి
13. జన్యుపరంగా భారత్ తయారుచేసిన మొదటి టీకా మందు?
1) హెచ్‌బీవీ 2) బీసీజీ
3) ఎఫ్ఎండీ 4) మలేరియా
14. బాసిల్లస్ తురింజెనిసిస్ అనే బ్యాక్టీరియా నుంచి బీటీ జన్యువును పంట మొక్కకు మార్పిడి చేస్తే.. ఆ మొక్క కింది వాటిలో దేనిపై నిరోధక శక్తిని చూపుతుంది?
1) బ్యాక్టీరియా 2) వైరస్
3) కీటకాలు 4) ఫంగల్ ఇన్ఫెక్షన్
15. 2013లో ప్రపంచ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది?
1) హైదరాబాద్ 2) బెంగళూరు
3) ముంబై 4) చెన్నై
16. ప్రాంటోసిల్ అనేది ఒక?
1) డ్రగ్ 2) ప్రో డ్రగ్
3) కృత్రిమ/సింథటిక్ పెన్సిలిన్
4) విరుగుడు మందు/ఓవర్ ది కౌంటర్ డ్రగ్
17. సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది?
1) కాసరగోడ్ 2) భువనేశ్వర్
3) ఎర్నాకుళం 4) తిరువనంతపురం
18. కంప్యూటర్లలో ఉండే శాశ్వత జ్ఞాపక శక్తి?
1) ర్యామ్ 2) రోమ్ 3) సీపీయూ 4) ఫ్లాపీ
19. ప్రపంచంలో 1940 నుంచి 1956 వరకు మొదటి తరం కంప్యూటర్లను ఉపయోగించారు. 1956 నుంచి 1963 వరకు రెండో తరం కంప్యూటర్లు, 1963 నుంచి 1971 వరకు మూడో తరం కంప్యూటర్లు వినియోగంలో ఉన్నాయి. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న కంప్యూటర్లు నాలుగో తరం కంప్యూటర్లు. వీటిలో మైక్రో ప్రాసెసర్, మౌస్, ప్రింటర్ అనే అధునాతన పరికరాలను ప్రవేశపెట్టారు. కంప్యూటర్‌కు మెదడుగా పరిగణించే మైక్రో ప్రాసెసర్‌ను కనిపెట్టిన శాస్త్రజ్ఞలు ఎవరు?
1) డగ్లస్ ఎంగెల్బర్ట్ 2) ఆడమ్ ఓస్బర్న్
3) సీ మోర్ క్రే 4) గోర్డన్మూర్, రాబర్ట్ నైస్
20. తొలి తరం కంప్యూటర్లలో వాడిన కీలక పదార్థం?
1) ఇంటిగ్రేటెడ్ చిప్స్ 2) చిప్
3) వ్యాక్యూమ్ ట్యూబ్స్ 4) ట్రాన్సిస్టర్స్
21. శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు ఏ రంగానికి సంబంధించింది?
1) జర్నలిజం 2) సాహిత్యం
3) శాంతి 4) సైన్స్ అండ్ టెక్నాలజీ
22. దేశంలో దూరదర్శన్ కార్యక్రమాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి?
1) 1959 అక్టోబర్ 2 2) 1959 సెప్టెంబర్ 5
3) 1959 సెప్టెంబర్ 15 4) 1955 నవంబర్ 14
జవాబులు
1-3, 2-4, 3-1, 4-1, 5-3, 6-2, 7-1, 8-2, 9-3, 10-4, 11-4, 12-1, 13-1, 14-3, 15-1, 16-3, 17-1, 18-2, 19-4, 20-3, 21-4, 22-3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?