లిపిని మౌనంగా చదివే విధానాన్ని ఏమంటారు?
సారాంశ పద్ధతి
పద్యాన్ని పూర్తిగా చదివి, పద్యంలోని ప్రధానమైన భావాన్ని చెప్పడమే సారాంశ పద్ధతి.
శబ్ద కాఠిన్యతలేని సులభమైన పద్యాలు బోధించడానికి అనువుగా ఉండే పద్ధతి.
వివిధ దశల్లో బోధించదగిన పద్యాంశాలు
ప్రాథమిక దశ: అభినయ గీతాలు, బాలగేయాలు, కథాత్మక గేయాలు, శతక పద్యాలు, భక్తిగేయాలు, జానపద గీతాలు ఎంపిక చేయాలి. క్రీడా పద్ధతి ద్వారా బోధించడానికి అనుకూలమైన అంశాలను ఎన్నుకోవాలి.
మాధ్యమిక దశ: శ్రవణ పేయంగా ఉండి రసానుభూతిని కలిగించే క్లిష్టమైన పద్యాలు, పద్య కథలు ఉండవచ్చు.
రసవంతమైన పాటలు, లయానుగుణమైన వృత్తాలు, ద్విపదలు, రగడలు, గీతాలు, అధిక్షేపాలు, వర్ణనాత్మక పద్యాలను ఎన్నుకోవాలి.
భక్తి, వాత్సల్యం, కరుణ రస పద్యాలను ఎన్నుకోవాలి.
ఉన్నత దశ: విమర్శనాత్మక, సృజనాత్మక శక్తులు విద్యార్థులు కలిగి ఉంటారు.
వివిధ శైలీ భేదాలు గల కవుల రచనలు, శబ్దాలంకార, అర్థాలంకారాలను తెలియజేసే పద్యాలు, ధ్వని, శ్లేషతో కూడిన పద్యాలను పాఠ్యాంశాలుగా ఎంపిక చేయాలి.
పద్యబోధన-సోపానాలు
పవేశం
పూర్వజ్ఞాన పరిశీలన
ఉన్ముఖీకరణ
శీర్షికా ప్రకటన
ప్రదర్శన
- కవి పరిచయం
- పూర్వ గాథా పరిచయం
- ఉపాధ్యాయుని ఆదర్శ పఠనం (రాగయుక్తంగా, భావయుక్తంగా, విసంధి పాటిస్తూ, అన్వయ క్రమంతో)
- స్థూలార్థ సంగ్రహణం
- సంధులు, సమాసాలు, అర్థ సంగ్రహణ
- ఉపాధ్యాయుని పునఃపఠనం
- విద్యార్థుల ప్రకాశ పఠనం
- చర్చ
- తాత్పర్యం
- కవితా సౌందర్యం
- విశేషాంశాలు
- పునర్విమర్శ
గైహికం
పూర్వజ్ఞాన పరిశీలన
- విద్యార్థులు నేర్చుకోబోయే పాఠ్యాంశానికి సంబంధించిన జ్ఞానం ఎంతవరకు కలిగి ఉన్నారో తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడికి ఉపకరించేది.
- తెలిసిన దాని నుంచి తెలియని విషయానికి (Known to Unkown) అనే (మనో విజ్ఞాన శాస్త్రం) సూత్రం ఆధారంగా విద్యార్థులు పురోగమించడానికి ఉపకరించే ప్రక్రియ.
ఉన్ముఖీకరణ
ఆసక్తిదాయకమైన అంశం ద్వారా గాని, మెరుపు అట్టల సహాయంతో గాని విద్యార్థులను ప్రశ్నించి ప్రస్తుత పాఠ్యాంశం వైపు మరల్చి వారిలో ప్రేరణ (Motivation) కలిగించడాన్ని ఉన్ముఖీకరణ అంటారు.
ప్రదర్శన
- విస్తృతమైన సోపానం
- అనేక ఉప సోపానాలు కలిగి ఉంటుంది.
- బోధనాభ్యాసన కృత్యాలు నిర్వహించే సోపానం.
- బోధనోపకరణాలు ప్రదర్శించే సోపానం.
శీర్షికా ప్రకటన
పూర్వజ్ఞాన పరిశీలన ఉన్ముఖీకరణ మూలంగా విద్యార్థులు నేర్చుకోబోయే పాఠ్యభాగ శీర్షికను వారి నుంచే రాబట్టడం జరుగుతుంది. దీనినే విషయ ప్రకటన/శీర్షికా ప్రకటన అంటారు.
కవి పరిచయం
కవి పరిచయం పట్టికలోని అంశాలను విద్యార్థుల ద్వారా పఠింపచేస్తూ, వివరణ పద్ధతిలో అంశాలను వివరించాలి.
పూర్వగాథా పరిచయం
పాఠ్యాంశ తత్పూర్వ ఇతివృత్తాన్ని క్లుప్తంగా కథాకథన పద్ధతిలో ఆసక్తిదాయకంగా పరిచయం చేసి ప్రస్తుత పాఠ్యాంశానికి అనుసంధానంగా చేయడం జరుగుతుంది.
పాఠ్యాంశాన్ని అవగాహన చేసుకోవడానికి ఇది తోడ్పడుతుంది.
ఉపాధ్యాయుని ఆదర్శ పఠనం
ఉపాధ్యాయుడు పాఠ్యాంశ పద్యాన్ని రాగయుక్తంగా, భావయుక్తంగా విసంధి పాటిస్తూ, అన్వయ క్రమం పాటిస్తూ పఠించాలి.
స్థూలార్థ సంగ్రహణం
- విద్యార్థుల పద్యం కేంద్రీయ భావాన్ని ఏ మేరకు గ్రహిం చగలిగారో 1, 2 ముఖ్యమైన ప్రశ్నల ద్వారా తెలుసుకోవడమే స్థూలార్థ సంగ్రహణం లేదా స్థూల భావ సంగ్రహణం.
- సంధులు, సమాసాలను ఉదాహరణ సహితంగా, నూతన పదాల అర్థ సంగ్రహణను వాక్య ప్రయోగ పద్ధతిలో పరిచయం చేయాలి.
- ఇది విద్యార్థుల పద్య పఠనావగాహన, ఆసక్తిని పెంచుతుంది.
పునర్విమర్శ
- బోధించిన పద్యాంశం విద్యార్థులు ఎంత వరకు అవగాహన చేసుకున్నారో, జ్ఞానాన్ని ఎంత వరకు సముపార్జించారో బోధనా లక్ష్యాలు ఏ మేరకు నెరవేరాయో తెలుసుకోవడానికి నిర్వహించే సోపానం.
- దీని కోసం డామినో ఆట, స్నాప్ ఆట, పద చక్రం వంటివి ఉపయోగించవచ్చు.
ఇంటి పని: ఇంటి పని ఉద్దేశాలు
- అభ్యసన పునర్బలనం (రీ-ఎన్ఫోర్స్మెంట్)
- విరామకాల సద్వినియోగం
- పఠన, లేఖన నైపుణ్యాల అభివృద్ధి
పఠనం-రకాలు- పఠన బోధన పద్ధతులు
- లిఖిత రూపంలో ఉన్న విషయాన్ని చదివి దానిలోని భావాన్ని అర్థం చేసుకోవడమే పఠనం (చదవడం).
నిత్యజీవిత వ్యవహారానికి ఎక్కువగా ఉపయోగపడేది- భాషణం - జ్ఞాన సంపదకు తోడ్పడేది- పఠనం
- చక్కగా మాట్లాడగలగడం అనేది చక్కగా చదవగలిగే శక్తిని పెంపొదిస్తుంది.
- శ్రవణ, భాషణ, లేఖనాలను అభివృద్ధిపరచగలది- పఠనం
- లోకం చూడటానికి కన్ను ఎంత అవసరమో, లోక జ్ఞానాన్ని పొందడానికి పఠనం అంతే అవసరం.
- NCERT- Teaching Reading a Challenge అనే పుస్తకంలో ఒక రచయిత చెప్పింది తెలుసుకోవడం, చెప్పిన దాని అర్థాన్ని గురించి ఆలోచించడం, అది తెలిపే భావాన్ని నిర్ధారించడం, అది పఠితకు ఏ విధంగా మేలు చేస్తుందో నిర్ణయించడం పఠనం.
- సంకేతాలకు భావాన్ని అన్వయించడం- పఠనం
- అక్షరాభ్యాసం అనే కార్యక్రమం పఠనానికి నాంది.
- గ్రహించే విషయంలో పఠనం ప్రముఖమైంది.
- సంకేత రూపంలో ఉన్న లిపిని అవగాహనతో శబ్దరూపం లోకి మార్చడమే చదవడం.
ఉన్నతస్థాయి
- వాచికానికి హావభావాలను జతచేసి చదవగలగడం.
- భావానుగుణమైన స్వరభేదాలను పాటిస్తూ చదవగలగడం.
- అవగాహనతో చదవగలగడం.
- గేయాలు, పదాలు, రాగ, భావయుక్తంగా చదవగలగడం.
- చదివే విధానం బట్టి పఠనం రెండు రకాలు అవి.. ప్రకాశ పఠనం, మౌన పఠనం
- విషయాన్ని గ్రహించడాన్ని బట్టి పఠనం రెండు రకాలు. అవి.. క్షుణ్ణపఠనం, విస్తార పఠనం
ప్రకాశ పఠనం
- లిఖిత (లిపి) రూపంలో ఉన్న అంశాన్ని వాగింద్రియాల సహాయంతో, తగిన వేగంతో, తడబాటు లేకుండా శబ్దయోగంగా, హెచ్చుస్వరంతో, శ్రోతలకు వినపడేలా స్పష్టంగా పఠించడాన్ని ప్రకాశ పఠనం అంటారు.
- ప్రకాశ పఠనానికి గల ఇతర పేర్లు- బాహ్య పఠనం, బిగ్గరగా చదవడం, పైకి చదవడం, వాచా పఠనం, బహిర పఠనం.
- లిపిని చూస్తూ, ధ్వనిని ఉచ్ఛరిస్తూ చేసే పఠనాన్ని ‘ప్రకాశ పఠనం’ అంటారు.
- ప్రాథమిక దశలో అత్యంత ప్రయోజనకరమైన పఠనం.
- ప్రకాశ పఠనంలో లిపి, ఉచ్ఛారణ, ధ్వని ప్రధానమైనవి.
- ప్రకాశ పఠనం చక్కగా కొనసాగాలంటే చూపుమేర, పలుకుమేర మధ్య సహసంబంధం ఉండాలి.
చూపుమేర/నయనమితి (Eye span)
విద్యార్థి ఒక్క చూపులో చూడగలిగే పదసముదాయాన్ని అతని ‘చూపుమేర’ అంటారు.
పఠనం నేర్చుకునే మొదట్లో పిల్లల దృష్టి ఒక అక్షరానికే పరిమితం. అది క్రమంగా పదాలకు వాక్యాలకు దారితీస్తుంది.
పలుకుమేర/వాజ్మితి (Voice span/Speech span)
విద్యార్థి ఒక్క గుక్కలో ఒకసారి అర్థవంతంగా ఉచ్ఛరించగల (పలకగలిగే) పదసముదాయాన్ని ‘పలుకుమేర’ అంటారు.
వాఙ్మయ సమితి (Eye/Voice Span)
- ఒకే సయమంలో చూస్తున్న శబ్ద స్థానానికి పలుకుతున్న శబ్దస్థానానికి మధ్య ఉన్న అంతరాన్ని ‘చూపు మేర-పలుకు మేర అంతరం’ లేదా వారి ‘వాఙ్మయ సమితి’ అంటారు.
- పలుకుతున్న శబ్ద స్థానం కంటే చూస్తున్న శబ్ద స్థానం ముందున్నప్పుడు దానిని ‘పురోగమన వాఙ్మయ సమితి’ అంటారు.
- పలుకుతున్న శబ్ద స్థానం కంటే చూస్తున్న శబ్ద స్థానం వెనుకబడితే దానిని ‘తిరోగమన వాఙ్మయ సమితి’ అంటారు.
వైయక్తిక పఠనం
- తరగతిలోని ప్రతి విద్యార్థితో వ్యక్తిగతంగా చదివించడాన్నే ‘వైయక్తిక పఠనం’ అంటారు.
- విద్యార్థులు స్వయంగా, వ్యక్తిగతంగా చేసే పఠనాన్ని వైయక్తిక పఠనం అంటారు. వ్యక్తిగత దోష సవరణకు ప్రయోజనకారి.
సామూహిక పఠనం
- విద్యార్థులందరితో ముక్తకంఠంగా ఒకేసారి సాముదాయక పఠనం చేయించడాన్ని సామూహిక పఠనం/ సాముదా యక పఠనం అంటారు.
- జట్టుల్లో గాని లేదా తరగతి విద్యార్థులందరూ కలిసి చేసే పఠనాన్ని ‘సామూహిక పఠనం’ అంటారు. పఠన దోషాలు సవరించలేం.
ఆదర్శ పఠనం
- విద్యార్థులకు ఆదర్శంగా ఉండేటట్లు ఉపాధ్యాయుడు చేసే పఠనాన్ని ఆదర్శ పఠనం అంటారు.
- పద్యమైతే మూడు సార్లు (రాగయుక్తంగా, భావయుక్తంగా విసంధిపాటిస్తూ అన్వయక్రమం పాటిస్తూ) చదవాలి.
- గద్యం రెండుసార్లు (భావయుక్తంగా, విసంధి పాటిస్తూ) చదవాలి.
మౌన పఠనం
- వాగింద్రియాలు కదలకుండా, చూపులను పఠనాంశం మీద నడిపిస్తూ విషయ గ్రహణం చేస్తూ మనస్సులో చదవడాన్ని ‘మౌనపఠనం’ అంటారు.
- కళ్లతో చూస్తూ, మనసుతో భావాన్ని గ్రహిస్తూ చేసే పఠనం- మౌనపఠనం
- మౌనపఠనం ధ్వని రహిత పఠనం
లిపిని మౌనంగా చదివే విధానం
- మౌనపఠనం
- మౌనపఠనానికి ఉన్న ఇతర పేర్లు-గంభీర పఠనం, నిశబ్ద పఠనం, మనసులో
చదువుకోవడం - మౌన పఠనం చేస్తున్నప్పుడు నేత్రగతికి- మనోగతికి మధ్య సమన్వయం అవసరం
- విజ్ఞానాత్మకమైన, వినోదాత్మకమైన మూర్తిమత్వాన్ని వికసింపచేసే పుస్తకాలను చదవడానికి ప్రధానంగా ఉపకరించేది- మౌనపఠనం
- ప్రాథమికోన్నత స్థాయిలో మౌనపఠనానికి ప్రాధాన్యం ఎక్కువ ఇవ్వాలి.
- చూపుమేర ఎంత ఎక్కువ ఉంటే అంతవేగంగా ఎక్కువ అంశాన్ని చదవగలిగే పఠనం
- మౌన పఠనాన్ని ఏ తరగతిలో ప్రారంభించవచ్చని కొందరి అభిప్రాయం – మొదటి తరగతి
- క్రీడాపద్ధతిలో ఏ తరగతిలో మౌనపఠనం చేయించవచ్చు- రెండో తరగతి
- 3, 4, 5 తరగతుల్లో చిన్న పేరాలను, చిట్టి కథలను మౌనంగా చదివించాలి.
- క్షుణ్ణ, విస్తార పఠనాలకు ఆయత్తపరుస్తూ విషయగ్రహణ శక్తిని పెంపొందించే పఠనం- మౌనపఠనం
ప్రకాశ పఠనం- అభివృద్ధికి మార్గాలు
- పాఠ్యాంశ పఠనం: ప్రకాశ పఠన పోటీలు నిర్వహించడం
- వార్తా పఠనం: రేడియో, టెలివిజన్, టేప్ రికార్డర్
- బాలకవి సమ్మేళనాలు
ప్రకాశ పఠనం-ప్రయోజనాలు
- పఠన ప్రయోజనాలు సాధించాలంటే ముఖ్యంగా పఠనంలో నాలుగు గుణాలు ఉండాలి. అవి..
- విషయ వివరణం
- భాషోచితమైనధార పఠనం
- భావానుగుణమైన పఠనం
- శైలి (లేదా) ధోరణి
- విద్యార్థి చేసే ఉచ్ఛారణ దోషాలు, శబ్దదోషాలు, విషయ దోషాలు సవరించవచ్చు.
- అక్షర దోషాలు, భావ దోషాలు, భాషాదోషాలు సవరించవచ్చు.
- గేయాలు, పద్యాలు, పాటలు లయబద్ధంగా చదివి, పద్య బోధన ప్రధాన ఉద్దేశం అయిన రసానుభూతి/ ఆనందానుభూతి పొందవచ్చు.
- వాగింద్రియాలకు చక్కని శిక్షణ లభిస్తుంది.
- చదివే అంశం మీద శిక్షణ లభిస్తుంది.
- చదివే అంశం మీద దృష్టి నిలిపి మనసు అన్యాక్రాంతం కాకుండా సహాయపడుతుంది.
- భావస్ఫోరకంగా, విరామ చిహ్నాలను పాటిస్తూ చదవడం అలవడుతుంది.
- కావ్య సౌందర్యాన్ని మెచ్చి ఆనందించడానికి తోడ్పడుతుంది.
- మౌన పఠనానికి ప్రకాశ పఠనం పునాది.
- కంఠాన్ని అదుపులో ఉంచుకొని స్వరాన్ని లయను అను సరించి ఉదాత్త నుదాత్త స్వరభేదాలను పాటిస్తూ శ్రవణ సుఖంగా హృదయంగమంగా పఠిస్తే అతడిని చక్కని ‘పఠిత’ అంటారు.
ప్రకాశ పఠనం-పరిమితులు
- వాగింద్రియాలకు శ్రమ ఎక్కువ
- పరిసరాల్లోని వారికి అసౌకర్యం/ ఇబ్బంది కలుగుతుంది
- తక్కువ కాలంలో ఎక్కువ విషయాన్ని చదవలేరు
- గ్రంథాలయాల్లో ఉపయోగపడదు
- నత్తి,నంగి ఉన్నవారికి ఈ పఠనం ప్రతిబంధకంగా ఉంటుంది
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు