ప్రింటింగ్ ఇంక్ తయారీలో ఉపయోగించే వాయువు?
- కర్బన రసాయనశాస్త్రం
1. గోబర్ గ్యాస్, సహజవాయువులో ప్రధాన అనుఘటకం?
1) మీథేన్ 2) ఎన్-బ్యూటేన్
3) ఐసోబ్యూటేన్ 4) హెక్సేన్
2. ఎల్పీజీలో ప్రధాన హైడ్రోకార్బన్?
1) మీథేన్ 2) ఈథేన్
3) ప్రొఫేన్ 4) బ్యూటేన్
3. చిత్తడి నేలలో, వరిపొలాల్లో విడుదలయ్యే ‘మార్ష్’ వాయువు?
1) మీథేన్ 2) ఈథేన్
3) ప్రొఫేన్ 4) బ్యూటేన్
4. పండ్లు త్వరగా పక్వానికి రావడానికి దోహదపడే వాయువు?
1) మీథేన్ 2) ఈథేన్
3) ఇథిలీన్ 4) బ్యూటేన్
5. గ్యాస్ వెల్డింగ్లలో ఆక్సిజన్‌తో పాటు ఉపయోగించే వాయువు?
1) ఇథిలీన్ 2) ఎసిటిలీన్
3) మీథేన్ 4) బ్యూటేన్
6. మత్తు కలిగించే వాయువు ఏది?
1) మీథేన్ 2) ఇథిలీన్
3) ఎసిటిలీన్ 4) బ్యుటేన్
7. బొగ్గు గనుల్లో డేవీల్యాంప్ సహాయంతో గుర్తించే వాయువు?
1) ఆక్సిజన్ 2) మీథేన్
3) హైడ్రోజన్ 4) నైట్రోజన్
8. ప్రయోగశాలలో తయారుచేసిన మొట్టమొదటి కర్బన సమ్మేళనం?
1) గ్లూకోజ్ 2) యూరియా
3) సుక్రోజ్ 4) మీథేన్
9. ద్విబంధం గల సమ్మేళనం?
1. ఈథేన్ (C2H6)
2. ఎసిటిలీన్ (C2H2)
3. బెంజీన్ (C6H6)
4. ఇథిలీన్ (C2H4)
1) 1, 2 2) 1, 3
3) 3, 4 4) పైవన్నీ
10. త్రిబంధం ఉన్న సమ్మేళనం?
1) ఈథేన్ (C2H6)
2) ఎసిటిలీన్ లేదా ఈథేన్ (C2H2)
3) ప్రొఫేన్ (C3H6)
4) ఏదీకాదు
11. అసంతృప్తి సమ్మేళనం?
1) ఇథిలీన్ (C2H4)
2) ఎసిటిలీన్ (C2H2)
3) బెంజీన్ (C6H6) 4) పైవన్నీ
12. జతపరచండి.
ఎ. -OH 1. ఆల్డిహైడ్
బి. -COOH 2. కార్బాక్సిలికామ్లం
సి. -COOR 3. ఆల్కహాల్
డి. -CHO 4. ఎస్టర్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-3, బి-2, సి-4, డి-1
4) ఎ-3, బి-1, సి-4, డి-2
13. కింది హైడ్రోజన్ల అణుభారం పెరిగే క్రమం?
మీథేన్ (A), ఈథేన్ (B), ప్రొపేన్ (C),
బ్యుటేన్ (D)
1) A < B < C < D
2) D < B < C < A
3) D < C < B < A
4) A < D < C < B
14. మంట (ఫ్లేమ్) రాకుండా కాలేది ఏది?
1) కట్టెలు 2) బొగ్గు
3) ఎల్పీజీ 4) కొవ్వొత్తి
15. తేమ ఉన్నప్పుడు కాల్షియం కార్బైడ్ నుంచి విడుదలయ్యే వాయువు?
1) మీథేన్ 2) ఎసిటిలీన్
3) కార్బన్ డై ఆక్సైడ్ 4) ఇథిలీన్
16. CO2 వాయువును హఠాత్తుగా వ్యాకోచింపజేసినప్పుడు చల్లబడి పొడిమంచు (డ్రై ఐస్)గా మారుతుంది. ఈ ప్రక్రియలో ఇమిడి ఉన్న సూత్రం?
1) టిండాల్ ప్రభావం
2) కూలింగ్ ప్రభావం
3) జౌల్-థామ్సన్ ప్రభావం
4) కాంప్టన్ ప్రభావం
17. రెక్టిఫైడ్ స్పిరిట్ అంటే?
1) 95 శాతం ఇథైల్ ఆల్కహాల్
2) 95 శాతం మిథైల్ ఆల్కహాల్
3) 100 శాతం ఇథైల్ ఆల్కహాల్
4) 100 శాతం మిథైల్ ఆల్కహాల్
18. టింక్చర్ అయోడిన్ అనేది?
1) ఆల్కహాల్లో కరిగించిన
అయోడిన్ ద్రావణం
2) నీటిలో కరిగించిన అయోడిన్ ద్రావణం
3) అయోడిన్ ఆవిరులు
4) హైడ్రోజన్ పెరాక్సైడ్లో కరిగించిన
అయోడిన్
19. ఎక్కువగా ఆల్కహాల్ సేవిస్తే లివర్ చెడిపోయి వచ్చే వ్యాధిని ఏమంటారు?
1) లివరోసిన్ 2) సిర్రోసిస్
3) గాయిటర్ 4) అపెండిసైటిస్
20. పరిశ్రమలకు సరఫరా చేసే ఇథైల్ ఆల్కహాల్లో కొద్ది మోతాదులో మిథైల్ ఆల్కహాల్, పిరిడిన్ కలిపి విషపూరితం చేస్తారు. రంగు కోసం కాపర్ సల్ఫేట్ కలుపుతారు. ఈ ఆల్కహాల్‌ను ఏమంటారు?
1) అబ్సల్యూట్ ఆల్కహాల్
2) రెక్టిఫైడ్ స్పిరిట్
3) డీనేచర్డ్ ఆల్కహాల్
4) ఎస్టరిఫైడ్ ఆల్కహాల్
21. ఏ ఆల్కహాల్ తాగితే అంధత్వంతో పాటు మరణం కూడా సంభవిస్తుంది?
1) మిథైల్ ఆల్కహాల్
2) ఇథైల్ ఆల్కహాల్
3) ప్రొపైల్ ఆల్కహాల్
4) గ్లిజరాల్
22. ఎసిటిక్ ఆమ్ల విలీన ద్రావణాన్ని ఏమంటారు?
1) వెనిగర్ 2) గ్లిజరాల్
3) పెర్‌హైడ్రాల్ 4) సిట్రస్ సాస్
23. సువాసన ద్రవ్యాల్లో సాధారణంగా ఉండేది?
1) ఎస్టర్ 2) ఆమ్లం
3) ఆల్కహాల్ 4) ఎమైన్
24. కార్బోనేట్ లేదా బైకార్బోనేట్ లవణాలకు ఏదైనా ఆమ్లం కలిపితే విడుదలయ్యే వాయువు?
1) CO2 2) CO
3) H2S 4) CH4
25. కారు రేడియేటర్లలో నీరు గడ్డకట్టకుండా ‘యాంటీఫ్రీజ్’గా ఉపయోగించే ఆల్కహాల్?
1) ఇథైల్ ఆల్కహాల్
2) మిథైల్ ఆల్కహాల్
3) ఇథిలీన్ ైగ్లెకాల్ 4) గ్లిజరాల్
26. సబ్బుల పరిశ్రమలో సహ ఉత్పన్నం అయ్యేది?
1) ఇథిలీన్ ైగ్లెకాల్ 2) గ్లిజరాల్
3) మిథైల్ ఆల్కహాల్ 4) ఫినాల్
27. శీతాకాలంలో చర్మం పొడిబారకుండా చేసే మాయిశ్చరైజింగ్ సబ్బుల్లో ఉండే పదార్థం?
1) ఇథిలీన్ ైగ్లెకాల్ 2) గ్లిజరాల్
3) ఇథైల్ ఆల్కహాల్ 4) బోరిక్ ఆమ్లం
28. డెటాల్ ఏ రసాయనాల మిశ్రమం?
1) ఇథైల్ ఆల్కహాల్
2) క్లోరో ైగ్జెలినాల్
3) టెర్పినాల్ 4) పైవన్నీ
29. ప్రింటింగ్ ఇంక్ తయారీలో ఉపయోగించే వాయువు?
1) ఎసిటలీన్ 2) ఇథిలీన్
3) CO2 4) మీథేన్
30. చక్కెర తయారు చేయగా మిగిలిన మాతృ-ద్రావణమైన మొలాసిస్‌ను కిణ్వ ప్రక్రియద్వారా వచ్చే ఆల్కహాల్ ఏది?
1) మిథైల్ ఆల్కహాల్
2) ఇథైల్ ఆల్కహాల్
3) ఇథిలీన్ ైగ్లెకాల్ 4) గ్లిజరాల్
31. బీరును కిణ్వ ప్రక్రియ ద్వారా వేటి నుంచి తయారుచేస్తారు?
1) బియ్యం 2) బార్లీ
3) కొకోవా 4) ఆలుగడ్డ
32. మొలాసిస్లోని చక్కెరను గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌గా విచ్ఛిత్తి చేసే ఎంజైమ్?
1) ఇన్వర్టేజ్ 2) జైమేజ్
3) మాల్టేజ్ 4) డయాస్టేజ్
33. గ్లూకోజ్ లేదా ఫ్రక్టోజ్‌ను ఆల్కహాల్, కార్బన్ డై ఆక్సైడ్‌గా విచ్ఛిత్తి చేయగలిగే ఎంజైమ్?
1) ఇన్వర్టేజ్ 2) డయాస్టేజ్
3) జైమేజ్ 4) మాల్టేజ్
34. మెడికల్ కాలేజీల్లో నమూనాలు(స్పెసిమెన్స్) భద్రపరచడానికి ఉపయోగించే ఫార్మాలిన్ అనేది ఏ సమ్మేళనపు ద్రావణం?
1) ఫార్మికామ్లం
2) ఫార్మాల్డిహైడ్
3) హైడ్రోజన్ పెరాక్సైడ్
4) డెటాల్
35. జ్వరంతో పాటు నొప్పిని తగ్గించడానికి ఉపయోగించే ఎసిటైల్ సాలిసిలిక్ ఆమ్లాన్ని ఏమంటారు?
1) ఆస్పిరిన్ 2) వానిలిన్
3) పారాసెటమాల్ 4) బేకింగ్ సోడా
36. కింది వాటిలో ఏ లవణాన్ని సబ్బుగా పరిగణించవచ్చు?
1) C2H5ONa
2) CH3COONa
3) C17H33COONa
4) NaCl
37. సబ్బు అనేది?
1) కార్బోహైడ్రేట్
2) ఫ్యాటీఆమ్లాల లవణం
3) ప్రొటీన్లు 4) పాలిమర్లు
38. వెజిటెబుల్ ఆయిల్ నుంచి వనస్పతి తయారుచేయడానికి నికెల్ లోహంతో పాటు
అవసరమైన వాయువు?
1) ఆక్సిజన్ 2) హైడ్రోజన్
3) నైట్రోజన్ 4) కార్బన్ డై ఆక్సైడ్
39. డిటర్జెంట్లు అనేవి?
1) కార్బాక్సిలిక్ ఆమ్ల లవణాలు
2) సల్ఫోనేట్ లవణాలు
3) కార్బోనేట్ లవణాలు
4) బైకార్బోనేట్ లవణాలు
40. నూనెల ముఖ్య వనరులు?
1) పెట్రోలియం 2) కోల్
3) వృక్షాలు, జంతువులు
4) సబ్బులు, డిటర్జెంట్లు
41. షేవింగ్ సబ్బులతో పొటాషియం అయాన్లతో పాటు అధికంగా ఉండే పదార్థం?
1) స్టియరిక్ ఆమ్లం 2) గ్లిజరాల్
3) ఫార్మికామ్లం 4) మెంథాల్
42. ఆఫ్టర్‌షేవ్ లోషన్ ఉపయోగించిన తరువాత చర్మం మృదువుగా ఉండటానికి కారణమైన రసాయనం?
1) ఆల్కహాల్ 2) మెంథాల్
3) గ్లిజరాల్ 4) సెంట్
43. నెయిల్ పాలిష్ రిమూవర్లో ఉండే రసాయనం?
1) ఆల్కహాల్ 2) ఎసిటోన్
3) పిరిడిన్ 4) క్లోరోఫాం
44. బూట్ పాలిష్‌లో ఉపయోగించే కర్బన పదార్థం?
1) గ్రాఫైట్ 2) చక్కెర బొగ్గు
3) ఎముక బొగ్గు 4) కోక్
45. కింది వాటిలో తక్షణశక్తికి మంచిది?
1) ఉప్పు నీరు 2) చక్కెర నీరు
3) ఉప్పు కలిపిన నిమ్మరసం
4) చక్కెరలేని పాలు
46. శస్త్ర చికిత్స చేసేటప్పుడు మత్తు కలిగించడానికి ఉపయోగించే రసాయనం?
1) క్లోరోఫాం 2) కార్బమైడ్
3) ఎసిటలీన్ 4) ఫార్మలిన్
47. రాత్రిపూట చెట్లు విడుదల చేసే వాయువు?
1) కార్బన్ డై ఆక్సైడ్
2) కార్బన్ మోనాక్సైడ్
3) నైట్రస్ ఆక్సైడ్
4) నైట్రిక్ ఆక్సైడ్
48. వజ్రం ఏ ధర్మాన్ని క్యారట్లలో కొలుస్తారు?
1) స్వచ్ఛత 2) రంగు
3) కఠినత్వం 4) బరువు
49. టమోటా పండ్లకు ఆ రంగు రావడానికి కారణం అయిన పదార్థం?
1) ఫ్లేవనాయిడ్స్
2) ఆల్కలాయిడ్స్
3) కెరోటినాయిడ్ కుటుంబానికి చెందిన లైకోపీన్
4) ఆంథోసయనిన్
50. పక్వానికి వచ్చిన తియ్యటి పండ్లవాసన ఇచ్చే సమ్మేళనం?
1) కార్బాక్సిలిన్ ఆమ్లం 2) ఎస్టర్
3) ఈథర్ 4) ఆల్కహాల్
51. ఆల్కేన్లకు మరో పేరు?
1) ఫారాఫీన్లు 2) చాల్కోజన్లు
3) ఓలిఫీన్లు 4) ఎస్టర్లు
52. నిశ్చితం (ఎ) – కాయలను పక్వం చెందడానికి ఇథిలీన్ వాయువు ఉపయోగిస్తారు కారణం (ఆర్) – ఇథిలీన్ కాయలను కృత్రిమంగా పక్వం చెందిస్తుంది
1) (ఎ), (ఆర్) రెండూ సరైనవి. (ఎ)కు (ఆర్) సరైన వివరణ
2) (ఎ), (ఆర్) రెండూ సరైనవి, కానీ (ఎ)కు (ఆర్) సరైన వివరణ కాదు
3) (ఎ) సరైనది, కానీ (ఆర్) సరైనది కాదు
4) (ఎ) సరైనది కాదు, కానీ (ఆర్) సరైనది
53. నిశ్చితం (ఎ) – డిటర్జెంట్లు కఠిన జలంలో నురుగనిస్తాయి కారణం (ఆర్) – డిటర్జెంట్లు Ca2+, Mg2+ అయాన్లలో అవక్షేపాన్ని ఏర్పరచవు
1) (ఎ), (ఆర్) రెండూ సరైనవి. (ఎ)కు (ఆర్) సరైన వివరణ
2) (ఎ), (ఆర్) రెండూ సరైనవి, కానీ (ఎ)కు (ఆర్) సరైన వివరణ కాదు
3) (ఎ) సరైనది, కానీ (ఆర్) సరైనది కాదు
4) (ఎ) సరైనది కాదు, కానీ (ఆర్) సరైనది
54. ఆహారాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి కలిపే పదార్థం?
1) సోడియం పాస్ఫేట్
2) సోడియం బెంజోయేట్
3) సోడియం సిలికేట్
4) వెనిగర్
55. నిమ్మ ఉప్పులో ఉండేది?
1) ఎసిటికామ్లం 2) ఆస్కార్బికామ్లం
3) సిట్రికామ్లం 4) హైడ్రోక్లోరికామ్లం
56. పచ్చళ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి దోహదపడేది?
1) టేబుల్ సాల్ట్ 2) బేకింగ్ సోడా
3) చాకలి సోడా 4) నీరు
57. దంతక్షయాన్ని అరికట్టడానికి దంతాల్లో నింపే పదార్థం?
1) సోరెల్స్ సిమెంట్, బంగారం
2) కాంక్రీట్ సిమెంట్
3) డంగు సున్నం, బంగారం
4) అల్యూమినియం
58. దేన్ని ఎసిటైలేషన్ చేస్తే హెరాయిన్ అనే మత్తు పదార్థం వస్తుంది?
1) రెసిర్పిన్ 2) కినైన్
3) మార్ఫీన్ 4) కెఫీన్
59. డీనేచర్డ్ స్పిరిట్ తాగినప్పుడు కంటి చూపు పోవడానికి కారణమైన ఇథైల్ ఆల్కహాల్‌కు
కలిపిన పదార్థం ఏది ?
1) పిరిడిన్ 2) మిథైల్ ఆల్కహాల్
3) గ్లిజరాల్ 4) ఇథిలీన్ ైగ్లెకాల్
60. బొద్దింకలు, సిల్వర్ ఫిష్‌ల నుంచి కాపాడటానికి బట్టల మధ్యలో ఉంచే పదార్థం?
1) నాఫ్తలీన్ 2) ఆంథ్రసీన్
3) కాంఫర్ 4) ఏదీకాదు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు