ఎన్టీఏ సీయూ సెట్ – 2021
- (సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)
దేశంలో విశిష్టమైన విద్యాకేంద్రాలుగా గుర్తింపు పొందిన విద్యాసంస్థలు సెంట్రల్ యూనివర్సిటీలు. దేశవిదేశ విద్యార్థులు దీనిలో చదవడానికి మక్కువ చూపిస్తారు. సీయూలు పరిశోధనలకు నెలవు, విలక్షణమైన కోర్సులతో విద్యను అందిస్తున్నవి. వీటిలో ప్రవేశాల కోసం ఏటా లక్షలాదిమంది విద్యార్థులు పోటీపడుతుంటారు. 12 సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జాతీయస్థాయిలో నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఎన్టీఏ సీయూ సెట్ -2021 నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో వాటి వివరాలు సంక్షిప్తంగా….
సీయూ సెట్
దేశంలోని 12 సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (సెట్)-2021 నోటిఫికేషన్ను ఎన్టీఏ విడుదల చేసింది.
కేంద్రీయ విశ్వవిద్యాలయాలు (సెంట్రల్ యూనివర్సిటీలు)
దేశంలోని ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల్లో సెంట్రల్ యూనివర్సిటీలది ప్రత్యేక స్థానం. దేశంలో ప్రస్తుతం 49 సెంట్రల్ యూనివర్సిటీలు ఉన్నాయి. వీటిలో అలహాబాద్ యూనివర్సిటీ పురాతనమైంది. దేశవ్యాప్తంగా ప్రామాణికమైన ఉన్నతవిద్యను అందించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం వీటిని ప్రారంభించింది. కొవిడ్-19 ముందు వరకు సెంట్రల్ యూనివర్సిటీలు కలిసి ఏర్పర్చుకున్న కన్సార్టియం ద్వారా ఏటా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించే వారు. ప్రస్తుతం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే ఎంట్రన్స్ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నారు.
ప్రవేశాలు కల్పించే సీయూలు
సిల్చార్లోని అస్సాం యూనివర్సిటీ, ఏపీ సీయూ, గుజరాత్, హర్యానా, జమ్ము, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, రాజస్థాన్, సౌత్ బీహార్, తమిళనాడు.
ఆఫర్ చేస్తున్న కోర్సులు
యూజీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్: బీ వొకేషనల్ (బయోమెడికల్ సైన్సెస్/ ఇండస్ట్రియల్ వేస్ట్ మేనేజ్మెంట్), బీటెక్ (సీఎస్ఈ, ఈఈ, సివిల్, ప్రింటింగ్ అండ్ ప్యాకేజింగ్ టెక్నాలజీ), ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ (ఆనర్స్) ఎమ్మెస్సీ (బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్), బీఎస్సీ (ఎంపీసీ/ కెమిస్ట్రీ), ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ (సీఎస్/ఎన్విరాన్మెంటల్ సైన్స్), బీఎస్సీ బీఈడీ, బీఏ ఆనర్స్, డిప్లొమా బ్యూటీ అండ్ వెల్నెస్, బీపీఏ మ్యూజిక్ తదితర కోర్సులు ఉన్నాయి. మొత్తం 64 అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు ఉన్నాయి.
వీటితోపాటు పీజీ, బీఈడీ, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ, బీఈడీ, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్స్ (మొత్తం 307 కోర్సులు) ఉన్నాయి.
ఎవరు అర్హులు?
డిగ్రీ కోసం ఇంటర్, పీజీ కోర్సులకు డిగ్రీ ఉత్తీర్ణులు లేదా ఆయా కోర్సులు ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష విధానం
ఎన్టీఏ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో పరీక్షను నిర్వహిస్తుంది.
క్వశ్చన్ ప్యాట్రన్-1 పద్ధతి పరీక్షలో రెండు భాగాలు ఉంటాయి. పార్ట్-ఏలో ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీ. ఈ పేపర్ 25 మార్కులకు ఉంటుంది. పార్ట్ బీ ఫిజిక్స్-25, కెమిస్ట్రీ-25, మ్యాథ్స్-25, బయాలజీ-25 మార్కులకు ఉంటుంది.
క్వశ్చన్ ప్యాట్రన్-2 పద్ధతిలో మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. దీనిలో ఇంగ్లిష్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్/డాటా ఇంటర్ప్రిటేషన్, అనలిటికల్ స్కిల్, రీజనింగ్, జనరల్ ఆప్టిట్యూడ్, జీకే)
పరీక్ష కాలవ్యవధి రెండు గంటలు.
ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు. తప్పు జవాబు గుర్తిస్తే ఒక మార్కు కోత విధిస్తారు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: సెప్టెంబర్ 1
ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ. 800/-,
ఎస్సీ/ఎస్టీలకు రూ. 350/-,
పీహెచ్సీలకు ఫీజు లేదు.
పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా 78 ఉన్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్/సికింద్రాబాద్,
రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం,
మహబూబ్నగర్, వరంగల్లో సెంటర్లు ఉన్నాయి.
పరీక్ష తేదీలు: సెప్టెంబర్ 15, 16, 23, 24
(ఉదయం, మధ్యాహ్నం షిఫ్ట్లలో నిర్వహిస్తారు)
పరీక్ష కీ విడుదల: ఏప్రిల్ 30
వెబ్సైట్: https://cucet.nta.nic.in
కేశవపంతుల వేంకటేశ్వరశర్మ
- Tags
- NTA CUCet
- NTA CUCet 2021
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు