మీ డాటా జాగ్రత్త

- ఆన్లైన్ లావాదేవీల్లో మోసాలు
- వ్యక్తిగత డాటా గోప్యత అవసరం

ఆన్లైన్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. కార్డు చెల్లింపులు భారీగా పుంజుకున్నాయి. దీంతో వ్యక్తిగత వివరాల గోప్యతకు ఆవశ్యకత పెరిగింది. ముఖ్యంగా క్రెడిట్ కార్డు వివరాల భద్రతకు ప్రాధాన్యత ఏర్పడింది. దీంతోఆన్లైన్ డాటాను భద్రంగా ఉంచుకోవాల్సిందే. ఇక ఆన్లైన్ కొనుగోళ్లు ఎక్కువగా జరిపేది మొబైల్ ఫోన్లలోనే.
దీంతో ఎవరితోనైనా ఫోన్‌ను పంచుకునే సమయంలో అప్రమత్తంగా ఉండడం కీలకం. మన మొబైల్ ఫోన్లలో వ్యక్తిగత, బ్యాంక్ ఖాతా వివరాలు ఇంకా ఇలాంటివి ఎన్నోఉంటాయి. ఆన్లైన్ మోసాలకు పాల్పడేవాళ్లు చూస్తున్నది కూడా ఈసమాచారం కోసమే. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఫిషింగ్, విషింగ్, ఫార్మింగ్ వంటివి చేస్తూ వివరాలను సులువుగా దొంగిలిస్తారు (హ్యాక్).
మన ఖాతాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు మాయమైనప్పుడు లేదా పెద్ద మొత్తంలో బకాయి చెల్లించాల్సి ఉందని క్రెడిట్ కార్డ్ బిల్లు లేదా అలర్ట్ వచ్చినప్పుడు మాత్రమే మనకు ఆ విషయం తెలుస్తుంది. మన వ్యక్తిగత సమాచారం, డాటా విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఇలాంటి అక్రమాలు జరగడానికి ప్రధాన కారణం. ఆన్లైన్ అక్రమాల బారిన పడకుండా ఉండడానికి, క్రెడిట్-డెబిట్ కార్డు వివరాలు చౌర్యం కాకుండా ఉండాలంటే, మీ ఆన్లైన్ వివరాలను భద్రపరచుకోవ డానికి కొన్ని జాగ్రత్తలను తప్పక తీసుకోవాలి. అవేమిటో చూద్దాం.

పబ్లిక్ వై-ఫైలో..
పబ్లిక్ ప్రదేశాల్లో ఉచితంగా అందుబాటులో ఉండే వై-ఫైని ఉపయోగిస్తూ ఆన్లైన్ షాపింగ్‌లు, డబ్బులు బదిలీ చేయకూడదు. వై-ఫైకి మీరు కనెక్ట్ అయినప్పుడు మీరు వాడే మొబైల్ డాటా.. మీ సమాచారాన్ని తస్కరించాలని చూసే అదే రూటర్కి కనెక్టయిన హ్యాకర్‌కు లాభిస్తుంది. హ్యాకర్ మీ మొబైల్ సంభాషణల్ని వినగలరు లేదా డాటాను చూడగలరు, దాన్ని సులభంగా దొంగిలించగలరు. కాబట్టి అత్యవసరంగా ఏవైనా లావాదేవీలకు మీ మొబైల్ నెట్వర్క్ కనెక్షన్‌ను మాత్రమే ఉపయోగించండి.
ఆన్లైన్లో వ్యక్తిగత సమాచారం
వ్యక్తిగత డాక్యుమెంట్లను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. మీ పాన్ నెంబర్, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా, డెబిట్, క్రెడిట్‌కార్డుల వివరాలను ఉపయోగించుకుని అక్రమాలకు పాల్పడేవారు మీ పేరు మీద ఒక రుణాన్ని తీసుకునే అవకాశం కూడా ఉన్నది. ఆరుణానికి సంబంధించి వా యిదాలను చెల్లించాలంటూ మీకు సందేశాలు వచ్చేదాకా మీకు ఆ విషయం తెలియకుండా ఉంటుంది. మీ వ్యక్తిగత వివరాలను ఎలా పడితే అలా సోషల్ మీడియాలో, ఆన్లైన్లో సాధ్యమైనంత వరకూ చూసుకోండి. చివరికి వ్యాక్సిన్ సర్టిఫికెట్ కూడా పోస్ట్ చేయకండి.

ఎన్క్రిప్షన్, టోకనైజేషన్ సేవలు
వీసా, మాస్టర్ కార్డు వంటి నెట్వర్క్ కంపెనీలు తమ కస్టమర్లకు టోకనైజేషన్ సేవలు అందించాలని రిజర్వ్ బ్యాంకు నిర్దేశించింది. మీ 16 అంకెల క్రెడిట్ లేదా డెబిట్ కార్డు నెంబర్ ఎవరికీ తెలియకుండా ఎన్క్రిప్షన్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మీరు ఆ కార్డుతో లావాదేవీలు జరిపినప్పుడు దుకాణాల్లో క్యాషియర్, వ్యాపారులకు మీ కార్డు నెంబర్ తెలియకుండా ఉంటుంది. మీ కార్డు తో పని లేకుండా చెల్లింపు జరపడానికి మొబైల్ వాలెట్లు ఉపయోగపడుతాయి.
క్రెడిట్ స్కోర్ చెక్ చేయండి
క్రెడిట్ స్కోర్, రిపోర్ట్‌లను తరచుగా చెక్ చేసుకోవడం వల్ల మీ పేరు మీద ఉన్న రుణాల వివరాలు అన్నీ మీకు తెలిసిపోతాయి. మీరు అప్పటివరకు తీసుకున్న రుణాల వివరాలన్నీ ఉంటాయి. ఆ వివరాలను, వాటి కచ్చితత్వాన్ని పోల్చి చూసుకోండి. మీరు తీసుకోని రుణం వివరాలు ఏవైనా కనిపిస్తే, మీ వ్యక్తిగత వివరాల ఆధారంగా మీపై ఆర్థిక చౌర్యం జరిగినట్టు తేలిపోతుంది. ఏడాదికి ఒకసారి సిబిల్ ఉచితంగా క్రెడిట్ రిపోర్ట్ ఇస్తుంది. దాని ఆధారంగా మీ రుణ ఖాతాల పర్యవేక్షణ వెంటనే ప్రారంభించండి. సిబిల్ నివేదికను పొందడానికి సబ్‌స్ర్కైబ్ చేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే మీ ఆర్థిక వివరాలు, ముఖ్యంగా రుణ సమాచారాన్ని భద్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. దానివల్ల స్పష్టమైన ప్రయోజనాలుంటాయి. పైగా మెరుగైన సిబిల్ స్కోర్ ఆధారంగా అనువైన రుణాలను తక్కువ వడ్డీతో సత్వరమే పొందవచ్చు.
అమెరికా స్టాక్స్‌లో పెట్టుబడికి మిరే ఫండ్
అమెరికాలోని టాప్-50 కంపెనీల్లో పెట్టుబడికి వీలుకల్పించే ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్)ను మిరే అసెట్ మ్యూచువల్ ఫండ్ ప్రారంభించనున్నది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) సెప్టెంబర్ 1న ప్రారంభమై, 14న ముగుస్తుంది. ఈ ఆఫర్ ద్వారా సమీకరించే నిధుల్ని ఎస్ అండ్ పీ-500 ఇండెక్స్‌లో భాగమైన టాప్-50 షేర్లలో పెట్టుబడి చేస్తుంది. గత పదేళ్లలో భారత్‌లోని నిఫ్టీ-50 చక్రగతిన 12.5 శాతం రాబడినివ్వగా, ఎస్ అండ్ పీ-500లోని టాప్-50 22.6 శాతం రాబడినిచ్చినట్లు ఫండ్ హౌస్ తెలిపింది.
ఈ కింది జాగ్రత్తలను తీసుకోవాలి
మీరు మోసానికి గురైతే రుణం ఇచ్చిన సంస్థకు వెంటనే ఆ విషయాన్ని తెలియజేయండి. ఒకవేళ అది క్రెడిట్ కార్డు అయితే.. మరిన్ని లావాదేవీలు జరగకుండా తక్షణమే కార్డును బ్లాక్ చేయండి.
పోలీసులకు ఫిర్యాదు చేసి, ఎఫ్ఐఆర్ను నమోదు చేయించండి.
క్రెడిట్ బ్యూరోకు సంబంధిత వివరాలన్నింటినీ తెలియజేయండి.
RELATED ARTICLES
-
SBI Recruitment | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ పోస్టులు
-
ITBP Recruitment | ఐటీబీపీలో 81 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు
-
WCDSC Kamareddy Recruitment | కామారెడ్డి జిల్లా సంక్షేమ కార్యాలయంలో ఉద్యోగాలు
-
WCDSC Jayashankar Bhupalpally | జయశంకర్ భూపాలపల్లి జిల్లా సంక్షేమ కార్యాలయంలో ఉద్యోగాలు
-
Current Affairs | ప్రపంచంలో ‘హంగర్ హాట్‌స్పాట్స్’ ఎన్ని ఉన్నాయి?
-
South Central Railway Recruitment | సౌత్ సెంట్రల్ రైల్వేలో జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు
Latest Updates
TSPSC Group-1 Prelims Practice Test | తెలంగాణ పీపుల్స్ స్ట్రగుల్ అండ్ ఇట్స్ లెసన్స్ గ్రంథ కర్త?
NIT Faculty Recruitment | మేఘాలయా నిట్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
TSPSC Group-1 Prelims Practice Test | ‘తెలంగాణ భాషా దినోత్సవం’ ఎప్పుడు జరుపుకొంటారు?
TSPSC Group-1 Prelims Practice Test | ఏడుపు పుట్టించే వాయువు ఏది?
Respiratory System – Gurukula JL special | పదార్థాల విచ్ఛిన్నం.. శక్తి ఉత్పన్నం.. ఉష్ణమోచకం
BEL Recruitment | బెంగళూరు బెల్లో 205 ఇంజినీర్ పోస్టులు
AJNIFM Recruitment | హరియాణా ఏజేఎన్ఐఎఫ్ఎంలో కన్సల్టెంట్స్ పోస్టులు
ALIMCO Recruitment | కాన్పూర్ అలిమ్కోలో 103 పోస్టులు
Current Affairs | వార్తల్లో వ్యక్తులు
Current Affairs June 07 | క్రీడలు