‘స్టార్ ఆఫ్ ఇండియా’ బిరుదు పొందిన నిజాం?
సికిందర్ జా (1803-29)
- ఇతని పేరు మీదుగానే సికింద్రాబాద్ ఏర్పడింది.
- ఇతని కాలంలో బ్రిటిష్ రెసిడెంట్ చేతిలో కీలుబొమ్మగా మారిన చందూలాల్ 1806లో పేష్కార్గా నియమితులయ్యాడు.
- 1811లో హైదరాబాద్‌లో బ్రిటిష్ రెసిడెంట్‌గా ‘హెన్రీ రస్సెల్’ వచ్చాడు.
- సంస్థానంలో శాంతిభద్రతలను కాపాడటానికి ‘రస్సెల్స్ దళం’ లేదా హైదరాబాద్ కాంటిజెంట్ సైన్యాన్ని ఏర్పరిచాడు. ఈ దళం హైదరాబాద్ సైన్యంగా పేరుపొందింది.
- రస్సెల్ బ్రిగేడ్ దళం నిజాం నవాబుకు సహాయంగా 1817లో పిండారీలను యుద్ధంలో అణచివేసింది. 1818లో జరిగిన మరాఠా యుద్ధంలో పాల్గొన్నది.
- ఈ దళ నిర్వహణ కోసం సికిందర్ జా ప్రధాని చందూలాల్ ‘పామర్ అండ్ కో’ అనే సంస్థ నుంచి సుమారు రూ.60 లక్షలు అప్పుగా తీసుకొన్నాడు.
- దీనికి బదులుగా బేరార్ వర్తకపు హక్కులు ఈ కంపెనీకి లభించాయి.
- మోసపూరితమైన ఈ అప్పును తిరిగి చెల్లించడంలో బ్రిటిష్ రెసిడెంట్ అధికారి చార్లెస్ మెట్కాఫ్ నవాబుకు సహకరించాడు.
- సికిందర్ జా ప్రధాని చందూలాల్ కర్నూలులో అహోబిలం దేవాలయాన్ని నిర్మించాడు.
నాసిరుద్దౌలా (1829-57)
- ఇతను నిజాం నవాబుగా బాధ్యతలు చేపట్టగానే రాజ్యంలోని యూరోపియన్ సూపరింటెండెంట్లను తొలగించాడు.
- ఇతని కాలంలో జరిగిన ప్రధాన సంఘటనలు 1) వహాబి ఉద్యమం 2) బేరారు దత్తత
- వహాబి ఉద్యమం: హైదరాబాద్‌లో దీనికి నాయకత్వం వహించినది నాసిరుద్దౌలా తమ్ముడు ‘ముబారిజ్ ఉద్దౌలా’. ఆంగ్లేయులు ఇతడిని అరెస్ట్ చేసి గోల్కొండ కోటలో బందీగా ఉంచగా 1854లో అక్కడే మరణించాడు.
- ఈ ఉద్యమానికి కడప-కర్నూలు నవాబుల నాయకుడు గులాం రసూల్ ఖాన్ మద్దతు పలికాడు. ఇతడిని తిరుచినాపల్లి జైలుకు తరలించారు.
- బేరార్ దత్తత: నిజాం తమ నుంచి తీసుకున్న రూ.60 లక్షలు 1850, డిసెంబర్ 31లోగా చెల్లించాలని బ్రిటిష్ ప్రభుత్వం షరతు విధించింది.
- 1853లో గవర్నర్ జనరల్ డల్హౌసీ, నాసిరుద్దౌలా మధ్య ‘బేరార్ ఒప్పందం’ జరిగింది. ఈ ఒప్పందం తరువాత రస్సెల్ సైన్యాన్ని హైదరాబాద్ కంటింజెన్సీ సైన్యంగా మార్చి బ్రిటిష్-ఇండియా సైన్యానికి అనుబంధ దళంగా మార్చాడు.
- అంతేకాకుండా ఈ ఒప్పందం ప్రకారం బ్రిటిష్ వారికి రాయచూర్, బేరార్, ఉస్మానాబాద్ ప్రాంతాలను ఇచ్చారు.
- ఈ అవమానాన్ని తట్టుకోలేక ప్రధాని ‘సిరాజ్ ఉల్ ముల్క్’ అనారోగ్యం పాలై మరణించాడు.
- ఆ సమయంలో 24 ఏండ్ల ‘మీర్ తురబ్ అలీ ఖాన్ (సాలార్జంగ్-1)’ హైదరాబాద్ ప్రధాని అయ్యాడు.
- ‘బ్రూస్ నార్ట్’ తన ‘రిబేలియన్ ఇన్ ఇండియా’ అనే గ్రంథంలో బేరార్ ఒప్పందం గురించి ‘న్యాయదేవత చెవుల్లో దూది పెట్టి ఆమెను ఆంగ్లేయులు చెవిటిదాన్ని, గుడ్డిదాన్ని చేశారు’. అని రాశాడు.
- 1857, మే 10న మీరట్‌లో సైనిక తిరుగుబాటు ప్రారంభమైనప్పుడు హైదరాబాద్ నవాబ్ నాసీరుద్దౌలా.
- ఇతడు తిరుగుబాటు ప్రారంభమైన వారం రోజులకు మరణించాడు. అప్పుడు ‘అఫ్జల్ ఉద్దౌలా’ హైదరాబాద్ నవాబ్ అయ్యాడు.
అఫ్జల్ ఉద్దౌలా (1857-69)
- అఫ్జల్ ఉద్దౌలా, ఇతడి ప్రధాని సాలార్జంగ్ 1857 తిరుగుబాటు కాలంలో బ్రిటిష్‌వారికి మద్దతు పలకాలని నిర్ణయించారు.
- తిరుగుబాటు అణచివేసిన తరువాత 1861లో బ్రిటిష్‌వారు అఫ్జల్ ఉద్దౌలాకు ‘స్టార్ ఆఫ్ ఇండియా (విశ్వసనీయ మిత్రుడు)’ అనే బిరుదు ఇచ్చారు.
- అంతేకాకుండా రాయచూర్, ఉస్మానాబాద్ ప్రాంతాలను బ్రిటిష్ వారి నుంచి తిరిగి పొందటం జరిగింది.
- 1857 తిరుగుబాటు సమయంలో హైదరాబాద్ రెసిడెన్సీ భవనంపై ‘తుర్రేబాజ్ ఖాన్’ దాడి చేశాడు. కానీ ఆ దాడిని డేవిడ్సన్ తిప్పికొట్టాడు.
- చౌమహల్లా ప్యాలెస్ నిర్మాణాన్ని నాసిరుద్దౌలా ప్రారంభించగా అఫ్జల్ ఉద్దౌలా పూర్తిచేశాడు.
- 1859-66 మధ్యకాలంలో అఫ్జల్‌గంజ్ (నయాపూల్) వంతెనను ఇతని కాలంలోనే నిర్మించారు.
మీర్ మహబూబ్ అలీఖాన్ (1869-1911)
- అఫ్జల్ ఉద్దౌలా మరణానంతరం అతడి రెండేండ్ల కుమారుడు మీర్ మహబూబ్ అలీఖాన్‌ను నవాబుగా ప్రకటించారు.
- ఇతడు చిన్నవాడు కావడంతో పాలనా బాధ్యతలు సాలార్జంగ్-1, షంషద్ ఉద్రూలకు అప్పగించారు.
- మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంలోనే మొదటి సాలార్జంగ్ తన సంస్కరణలన్నింటిని పూర్తిగా అమలు చేశాడు.
- మహబూబ్ అలీఖాన్‌కు 18 ఏండ్లు పూర్తయినందున 1884లో లార్డ్ రిప్పన్ స్వయంగా హైదరాబాద్ వచ్చి మహబూబ్ అలీఖాన్‌కు అధికారాలు అప్పగించాడు.
- ఈ విధంగా హైదరాబాద్ సంస్థానాన్ని సందర్శించిన మొదటి వైస్రాయ్ రిప్పన్.
ఇతని ప్రముఖ పాలనా సంస్కరణలు
- మీర్ మహబూబ్ అలీఖాన్ 1893లో ఖ్వానుంచా-ఇ-ముబారక్ అనే రాజపత్రం ద్వారా రాజ్యాంగపరమైన సంస్కరణలను ప్రవేశపెట్టాడు.
- ఇతనికాలంలో వరుసగా సాలార్జంగ్1, సాలార్జంగ్-2, అస్మాన్ జా, వికార్-ఉల్-ఉమ్రా, కిషన్ పెర్షాద్లు ప్రధానులుగా పనిచేశారు.
- ఇతని ప్రధాని వికార్ ఉల్ ఉమ్రా (వికారుద్దీన్) ఫలక్‌నుమా ప్యాలెస్‌ను నిర్మించాడు.
- ఇతని కాలంలోనే ‘చందా రైల్వే సంఘటన’ జరిగింది.
- ఈయన కాలంలోనే చాదర్‌ఘాట్‌లో థియోసోఫికల్ సొసైటీని స్థాపించారు.
విద్యారంగంలో మీర్ మహబూబ్ అలీఖాన్ కృషి
- ముస్లిం బాలికల ప్రత్యేక పాఠశాల-1885 (సయ్యద్ బిల్గ్రామి చొరవతో)
- నాంపల్లి బాలికల పాఠశాల, మెడికల్ కాలేజీ
- సరూర్‌నగర్ అనాథాశ్రమంలో బాలికల పాఠశాల-1905
- ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలు- వరంగల్, ఔరంగాబాద్
- ఇతనికాలంలో రాజభాషగా పర్షియన్ భాష స్థానంలో ఉర్దూ భాషను రెండో సాలార్జంగ్ ప్రవేశపెట్టారు.
- ఇతని కాలంలోనే ‘అసఫియా లైబ్రరీ’ని ఏర్పాటు చేశారు. దీనిలో పర్షియన్, అరబిక్, సంస్కృత భాషల పుస్తకాలు అందుబాటులో ఉండేవి.
మూసీ నది వరద (1908)
- ఇతని కాలంలో 1908, సెప్టెంబర్ 29న తుఫాన్ వచ్చి మూసీ నదికి వరదలు వచ్చాయి.
- మళ్లీ భవిష్యత్తులో మూసీ నదికి వరదలు రాకుండా 1909లో ప్రముఖ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యతో ఆనకట్టల నిర్మాణానికి ప్లాన్ గీయించాడు.
ముఖ్య నిర్మాణాలు
- 1905, ఆగస్టు 25న తన 40వ జన్మదిన సందర్భంగా నిజాం మహబూబ్ అలీఖాన్ పబ్లిక్ గార్డెన్లో టౌన్‌హాల్ నిర్మాణం ప్రారంభించాడు. దీనిని 7వ నిజాం పూర్తిచేశాడు.
- మీర్ మహబూబ్ అలీఖాన్‌కు విక్టోరియా మహారాణి ‘గ్రాండ్ కమాండర్ స్టార్ ఆఫ్ ఇండియా’ అనే బిరుదును ఇచ్చింది.అందుకని 1905, ఫిబ్రవరి 14న విక్టోరియా మెమోరియల్ అనాథ శరణాలయాన్ని సరూర్‌నగర్‌లో నిర్మించాడు.
- వేల్స్ రాకుమారుడు హైదరాబాద్ రాజ్యాన్ని సందర్శించిన సమయంలో మీర్ మహబూబ్ అలీఖాన్ విక్టోరియా జనన హాస్పిటల్ కట్టించాడు.
ప్రాక్టీస్ బిట్స్
- హెన్రీ రస్సెల్ ఆధ్వర్యంలో ‘రస్సెల్ బ్రిగేడ్’ దళం ఏ నిజాం కాలంలో ఏర్పడింది?
1) నిజాం అలీఖాన్ 2) సికిందర్ జా
3) నాసిరుద్దౌలా 4) అఫ్జల్ ఉద్దౌలా - కింది వాటిని జతపర్చండి.
- బేరార్ ఒప్పందం ఎ. 1852
- మూసీ నది వరదలు బి. 1908
- చందా రైల్వే పథకం సి. 1883
- రస్సెల్ బ్రిగేడ్ డి. 1816
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
3) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
- బ్రిటిష్ వారితో ‘స్టార్ ఆఫ్ ఇండియా’ బిరుదు పొందిన నిజాం?
1) అఫ్జల్ ఉద్దౌలా
2) మీర్ మహబూబ్ అలీఖాన్
3) నిజాం అలీఖాన్ 4) నాసిరుద్దౌలా - మొదటి సాలార్జంగ్ ఏ నిజాం కాలంలో హైదరాబాద్ ప్రధాని అయ్యాడు?
1) మీర్ మహబూబ్ అలీఖాన్
2) సికిందర్ జా
3) నాసిరుద్దౌలా 4) సలాబత్ జంగ్ - కింది వాటిని జతపర్చండి.
- ఖ్వానుంచా ఇ ముబారిక్
ఎ. నిజాం అలీఖాన్ - బేరార్ దత్తత బి. అఫ్జల్ ఉద్దౌలా
- చౌమహల్లా ప్యాలెస్ సి. నాసిరుద్దౌలా
- గన్‌ఫౌండ్రీ డి. మీర్ మహబూబ్ అలీఖాన్
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
4) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
- ఖ్వానుంచా ఇ ముబారిక్
- రాజభాషగా పర్షియన్ స్థానంలో ఉర్దూను ఏ నిజాం కాలంలో ప్రవేశపెట్టారు?
1) నిజాం అలీఖాన్
2) మీర్ మహబూబ్ అలీఖాన్
3) సికిందర్ జా 4) నాసిరుద్దౌలా - హైదరాబాద్‌ను సందర్శించిన మొట్టమొదటి వైస్రాయ్?
1) రిప్పన్ 2) లిట్టన్
3) కారన్ వాలీస్ 4) వెల్లస్లీ - కింది వాటిలో సరైనవి.
1) వహాబి ఉద్యమం- నాసిరుద్దౌలా కాలంలో జరిగింది
2) చందా రైల్వే సంఘటన- మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంలో జరిగింది
3) 1 4) 1, 2 - విక్టోరియా మహారాణి ‘గ్రాండ్ కమాండర్ స్టార్ ఆఫ్ ఇండియా’ అనే బిరుదును ఎవరికి ఇచ్చింది?
1) అఫ్జల్ ఉద్దౌలా 2) మహబూబ్ అలీఖాన్
3) నాసిరుద్దౌలా 4) సికిందర్ జా - చాదర్‌ఘాట్‌లో ‘దివ్యజ్ఞాన సమాజం’ను ఏ నిజాం కాలంలో స్థాపించారు?
1) మీర్ మహబూబ్ అలీఖాన్
2) మీర్ ఉస్మాన్ అలీఖాన్
3) ముబారిజ్ ఉద్దౌలా 4) సికిందర్ జా - వహాబి ఉద్యమానికి హైదరాబాద్‌లో నాయకత్వం వహించినది?
1) చందూలాల్ 2) గులాం రసూల్ ఖాన్
3) ముబారిజ్ ఉద్దౌలా 4) తుర్రేబాజ్ ఖాన్
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోరుట్ల
- Tags
- star-of-india
Previous article
పన్ను ఆదా చేసేద్దాం!
Next article
15వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన నితిశ్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు