కోల్బర్గ్ ప్రకారం ప్రశాంత్ నైతిక వికాస స్థాయి?
పియాజే, కోల్బర్గ్ సిద్ధాంతాల అనుప్రయుక్త ప్రశ్నలు
- ఒక శిశువు రోజు ఆడుకునే బొమ్మ కనిపించనప్పుడు ఆ బొమ్మను వెతుకుతూ సమయం గడిపితే జీన్ పియాజే ప్రకారం ఆ శిశువు ఏ వికాసదశకు చెందుతాడు?
1) పూర్వ ప్రచాలక దశ
2) ఇంద్రియ చాలక దశ
3) మూర్త ప్రచాలక దశ
4) అమూర్త ప్రచాలక దశ
2 ఒక ఇనుప గోళాన్ని వేడి చేసి సాగదీస్తే మునుపటి స్థితికంటే ప్రస్తుతం సాగదీసిన ఇనుపకడ్డీ పెద్దదని అభిప్రాయపడిన శిశువు సంజ్ఞానాత్మక వికాస దశ ఏది?
1) మూర్త ప్రచాలక దశ
2) నియత ప్రచాలక దశ
3) ఇంద్రియ చాలక దశ
4) అందర్బుద్ధి దశ - వినయ్ తన వద్ద ఉన్న బొమ్మ తుపాకీతో ఎదురుగా ఉన్న వస్తువును తన శత్రువుగా భావిస్తూ కాలిస్తే వినయ్ సంజ్ఞానాత్మక వికాసంలో ఏ దశకు చెందుతాడు?
1) అమూర్త ప్రచాలక దశ
2) మూర్త ప్రచాలక దశ
3) పూర్వ ప్రచాలక దశ
4) ఇంద్రియ చాలక దశ - శివ 2+3= 5 అని చెప్పగలిగాడు. కానీ ఐదు ఏ రెండు అంకెల మొత్తం అని అడిగినప్పుడు చెప్పలేకపోయాడు. పియాజే ప్రకారం శివ సంజ్ఞానాత్మక వికాసదశ?
1) పూర్వప్రచాలక దశ
2) ఇంద్రియ చాలక దశ
3) మూర్త ప్రచాలక దశ
4) అమూర్త ప్రచాలక దశ - నేల మీద నివసించే జంతువులన్నీ నీటిలో కూడా జీవించగలవని రమ్య చెప్పినప్పుడు రాణి అనే విద్యార్థిని నేలమీద, నీటిలోని రెండు ఆవాసాల్లో నివసించగల సామర్థ్యం ఉభయచరాలైన కప్పలకు మాత్రమే ఉందని వివరించింది. సంజ్ఞానాత్మక వికాసంలో రాణి ఏ దశకు చెందుతుంది?
1) పూర్వ భావనాత్మక దశ
2) అంతర్బుద్ధి దశ
3) మూర్త ప్రచాలక దశ
4) అమూర్త ప్రచాలక దశ - శిశువు ఆటబొమ్మలకు పేర్లు పెట్టి వాటికి అలంకరణ చేయడం, సీసాలోని పాలు తాగించాలనుకోవడం, జో కొట్టి నిద్రపుచ్చడం వంటివి చేస్తే ఆ శిశువు ఏ వికాస దశకు చెందుతాడు?
1) అంతర్బుద్ధి దశ
2) మార్త ప్రచాలక దశ
3) పూర్వ ప్రచాలక దశ
4) ఇంద్రియ చాల దశ - ఒకే ఆకారం, పరిమాణం ఉన్న రెండు మట్టి గోళాలను తీసుకుని వాటిలో ఒకదాని ఆకారాన్ని మార్చినప్పుడు దానిని తిరిగి మొదటి ఆకారంలోకి మార్చగలమని భావించలేని శిశువులో లోపించిన భావనా లోపం?
1) ఏకమితి భావన
2) సర్వాత్మ భావన
3) అవిపర్యయాత్మక భావన
4) ఏదీకాదు - సాకేత్ తనకు ఒక అక్క ఉందని, అక్కకు తను పెద్ద తమ్ముడినని చెప్పగలిగాడు. సాకేత్ సంజ్ఞానాత్మకంగా ఏ వికాస దశలో ఉన్నాడు?
1) మూర్త ప్రచాలక దశ
2) పూర్వ భావనాత్మక దశ
3) అంతర్బుద్ధి దశ
4) అమూర్త ప్రచాలక దశ - సాయి అనే విద్యార్థి అవసరమైన గణిత సూత్రాలను వినియోగించి క్లిష్టమైన సమస్యలను సైతం సునాయాసంగా సాధించగలిగాడు. సాయి కింది ఏ వికాసదశకు చెందుతాడు?
1) మూర్త ప్రచాలక దశ
2) అమూర్త పచాలక దశ
3) అంతర్బుద్ధి దశ
4) ఏదీకాదు - ఒక విద్యార్థి పంటల దిగుబడి తగ్గడానికి గల వివిధ కారణాలను తెలియజేస్తూ సమస్య పరిష్కారానికి పాటించాల్సిన నియమాలను సూచిస్తూ రైతులందరిలో చైతన్యాన్ని కలిగిస్తున్నాడు. ఆ విద్యార్థి ఏ వికాసదశను సూచిస్తున్నాడు. అతని ప్రజ్ఞాలబ్ధి ఎంతశాతం ఉండవచ్చు?
1) మూర్త ప్రచాలక దశ, సగటు స్థాయి
2) పూర్వ ప్రచాలక దశ, సగటుకంటే తక్కువ
3) అంతర్బుద్ధి దశ, సగటు కంటే ఎక్కువ
4) అమూర్త ప్రచాలక దశ, సగటు స్థాయి - ‘స్వయం అంగీకార సూత్రాల నైతికత’ గా పేరుగాంచిన కోల్బర్గ్ నైతిక వికాసస్థాయి?
1) సాంప్రదాయ స్థాయి
2) ఉత్తర సాంప్రదాయ స్థాయి
3) పూర్వ సాంప్రదాయ స్థాయి
4) నైతిక సాంప్రదాయ స్థాయి - దీర్ఘకాలంగా తీవ్రమైన జబ్బుతో బాధపడుతూ మంచం మీదే నరకయాతన అనుభవిస్తున్న ఒక వ్యక్తిని ఉద్దేశించి సాయి అనే వ్యక్తి అతనికి కారుణ్య మరణాన్ని ప్రసాదించమని కోర్టును ఆశ్రయించాడు. సాయి కోల్బర్గ్ నైతిక వికాస స్థాయి దశలు వరుసగా?
1) పూర్వ సాంప్రదాయ స్థాయి, శిక్ష
ఓరియంటేషన్
2) సాంప్రదాయ స్థాయి, సాంఘిక
క్రమనిర్వహణ
3) ఉత్తర సాంప్రదాయ స్థాయి, వ్యక్తిగత హక్కులు
4) ఉత్తర సాంప్రదాయ స్థాయి,
అంతరాత్మనీతి - తీవ్రవైన మనోవ్యాకులతతో బాధపడుతున్న తన తల్లిని సంతోషపెట్టడానికి ఆమెను మామూలు వ్యక్తిని చేయడానికి మురళి తనకు పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చిందని, ఇకపైన తనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవని ఆమెతో అబద్ధం చెప్పాడు. మురళి నైతిక వికాసస్థాయి ఏది?
1) ఉత్తర సాంప్రదాయస్థాయి
2) సాంప్రదాయ స్థాయి
3) పూర్వ సాంప్రదాయ స్థాయి
4) ఏదీకాదు - కింది వాక్యాల్లో సరికాని జత?
1) శిశువు తనకు బహుమతులు ఇచ్చేది మంచిదిగా, శిక్షించేది చెడుగా భావించే నైతిక స్థాయి- పూర్వ సాంప్రదాయ స్థాయి
2) మంచి ప్రవర్తన అంటే ఇతరులను సంతోషపెట్టేది, ఇతరులకు సహాయపడేదిగా భావించే నైతిక స్థాయి- సాంప్రదాయ స్థాయి
3) వ్యక్తి అంతరాత్మ, న్యాయం, గౌరవం, సమానత్వం అనే సార్వత్రిక సూత్రాలపై ఆధారపడి నిర్ణయాలు తీసుకునే నైతికస్థాయి- ఉత్తర సాంప్రదాయ స్థాయి
4) సాంఘిక నియమాలకు కట్టుబడి ఉండటం ముఖ్యమని భావించే నైతిక వికాసస్థాయి- ఉన్నత సాంప్రదాయ స్థాయి - లావణ్య అనే విద్యార్థిని ప్రతిరోజు గుడికి వెళితే పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయని అంతర్గతంగా ప్రేరణ చెంది రోజూ గుడికి వెళ్లి దేవున్ని ప్రార్థిస్తుంది. ఆమె కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ దశకు చెందుతుంది?
1) విధేయత, శిక్ష ఓరియంటేషన్
2) సాంఘిక క్రమనిర్వహణ పద్ధతి
3) సహజ సంతోష అనుసరణ, సాధనోపయోగం
4) మంచి బాలిక నీతి, మంచి ప్రవర్తన - ప్రశాంత్ అనే విద్యార్థి తాను రోజూ స్కూల్‌కి వెళుతున్నప్పుడు రహదారికి ఎడమవైపు నడవటం వల్ల ప్రమాదాలు జరగవని అది తన బాధ్యతగా గుర్తించి ప్రతిరోజు రహదారికి ఎడమవైపే నడుస్తున్నాడు. కోల్బర్గ్ ప్రకారం ప్రశాంత్ నైతిక వికాసస్థాయి?
1) సాంప్రదాయ స్థాయి
2) పూర్వసాంప్రదాయ స్థాయి
3) ఉత్తర సాంప్రదాయ స్థాయి
4) నియత సాంప్రదాయ స్థాయి - రవి అనే విద్యార్థి తాను తరగతిలో మంచి మార్కులు తెచ్చుకుంటే తన తల్లిదండ్రులు సంతోషిస్తారని భావించి కష్టపడి చదువుతున్నాడు. రవి కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ దశకు చెందుతాడు?
1) సాంఘిక క్రమనిర్వహణ నీతి
2) మంచి బాలుడి నీతి, మంచి ప్రవర్తన
3) సహజ సంతోష అనుసరణ
4) విధేయత, శిక్ష ఓరియంటేషన్ - రమ అనే అమ్మాయి తనకు పాఠశాలకు వెళ్లడం ఇష్టం లేనప్పటికీ తన తండ్రి దండిస్తాడనే కారణంతో రోజూ పాఠశాలకు వెళుతుంది. రమ నైతిక వికాస స్థాయి?
1) సాంప్రదాయ స్థాయి
2) ఉన్నత సాంప్రదాయ స్థాయి
3) ఉత్తర సాంప్రదాయ స్థాయి
4) పూర్వ సాంప్రదాయ స్థాయి - తుఫాన్ ధాటికి నష్టపోయిన బాధితులకు సహాయం చేయడం తన బాధ్యతగా గుర్తించిన శేఖర్ అనే విద్యార్థి తాను వీలైంత ఎక్కువ సహాయం చేస్తున్నాడు. శేఖర్ నైతి క వికాసస్థాయి, దశ వరుసగా
1) సాంప్రదాయస్థాయి, సరైన ప్రవర్తన
2) ఉత్తర సాంప్రదాయ స్థాయి, వ్యక్తిగత హక్కు
3) పూర్వసాంప్రదాయ స్థాయి, విధేయత
4) సాంప్రదాయస్థాయి, మంచి ప్రవర్తన - కోల్బర్గ్ నైతిక వికాసంలో బాగా అభివృద్ధి చెందిన వ్యక్తి మూర్తిమత్వ నిర్మాణ క్రమంలో ఏ గుణాన్ని కలిగి ఉంటాడు?
1) అహం 2) అచిత్తు
3) అద్యహం 4) పైవన్నీ
Answers
1-2, 2-4, 3-3, 4-1, 5-4, 6-3, 7-3, 8-1, 9-2, 10-4, 11-2, 12-3, 13-1, 14-4, 15-3, 16-1, 17-2, 18-4, 19-1, 20-3,
శివపల్లి
టీఎస్& ఏపీ సైకాలజీ ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీ సర్కిల్
- Tags
Previous article
వాట్ నెక్ట్స్ ఆఫ్టర్ ఇంజినీరింగ్!
Next article
DEET ఉద్యోగాలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు