తొలి పశువుల హాస్టల్‌ను ఏ జిల్లాలో నిర్మించారు?
గతవారం తరువాయి..
33. తెలంగాణలోని అడవులు ఏ అటవీ సమూహాలకు చెందినవి?
ఎ. ఉష్ణమండల పొడి ఆకురాల్చే అడవులు
బి. ఉష్ణమండల ముళ్ల అడవులు
సి. ఉష్ణమండల తేమ ఆకురాల్చే అడవులు
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
34. కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వ విద్యాలయం ఏ జిల్లాలో ఉంది?
1) హైదరాబాద్ 2) మేడ్చల్ మల్కాజిగిరి
3) రంగారెడ్డి 4) సిద్దిపేట
35. ‘ది లార్జెస్ట్ గ్రీన్ లంగ్ స్పేస్ ఇన్ ది సిటీ ఆఫ్ హైదరాబాద్’ అని ఏ నేషనల్ పార్కును పేర్కొంటారు?
1) కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్, హైదరాబాద్
2) మృగవని నేషనల్ పార్క్, రంగారెడ్డి
3) మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్, రంగారెడ్డి
4) ఏదీకాదు
36. పక్షుల స్వర్గం (బర్డ్స్ ప్యారడైజ్)గా పేర్కొనే చెరువును గుర్తించండి?
1) రామప్ప 2) లక్నవరం
3) అమీన్పూర్ 4) మీర్ ఆలం
37. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెన్ రిపోర్ట్-2021 ప్రకారం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 38.93 శాతంతో అత్యంత సమృద్ధిగా ఉన్న వృక్షం?
1) వేప చెట్టు 2) చింత చెట్టు
3) మామిడి చెట్టు 4) ఏదీకాదు
38. రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు అధికంగా, అత్యల్పంగా ఉన్న జిల్లాలను గుర్తించండి (వరుసగా, శాతంపరంగా)
1) మెదక్, రంగారెడ్డి
2) మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి
3) జనగామ, మేల్చల్ మల్కాజిగిరి
4) జనగామ, మేడ్చల్ మల్కాజిగిరి
39. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఎన్ని మెగావాట్ల సామర్థ్యంతో యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులను స్థాపించనున్నారు?
1) 4080 మె.వా. 2) 5080 మె.వా.
3) 8040 మె.వా. 4) 8050 మె.వా.
40. భూమి వినియోగం, మొత్తం భౌగోళిక విస్తీర్ణ శాతాలను జతపర్చండి?
ఎ. బారెన్ అండ్ అన్కల్టివబుల్ ల్యాండ్స్ 1. 5.4
బి. ల్యాండ్ పుట్ ఆన్ నాన్ అగ్రికల్చరల్ యూజెస్ 2. 7.5
సి. కల్టివబుల్ వేస్ట్ ల్యాండ్ 3. 1.5
డి. కరెంట్ ఫాలో ల్యాండ్స్ 4. 5.1
ఇ. అదర్ ఫాలో ల్యాండ్స్ 5. 4.0
6. 2.5
1) ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5 2) ఎ-6, బి-5, సి-4, డి-3, ఇ-2
3) ఎ-2, బి-3, సి-4, డి-5, ఇ-6 4) ఎ-3, బి-4, సి-2, డి-1, ఇ-4
41. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి?
ఎ. తెలంగాణ రాష్ర్టాన్ని 3 వ్యవసాయ శీతోష్ణస్థితి మండలాలుగా విభజించారు
బి. మధ్య తెలంగాణ జోన్ ప్రధాన కేంద్రం- వరంగల్
సి. ఉత్తర తెలంగాణ జోన్ ప్రధాన కేంద్రం- పాలెం (నాగర్ కర్నూలు)
డి. దక్షిణ తెలంగాణ జోన్ ప్రధాన కేంద్రం- జగిత్యాల
1) ఎ, బి 2) బి, సి
3) సి, డి 4) ఎ, డి
42. రాష్ట్రంలో సాగుకు వీలైన భూమి ఎక్కువగా గల మొదటి రెండు జిల్లాలను గుర్తించండి?
1) ఖమ్మం, నిజామాబాద్
2) నల్లగొండ, ఖమ్మం
3) నల్లగొండ, నిజామాబాద్
4) ఖమ్మం, నల్లగొండ
43. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం 2021-22 సర్వే ప్రకారం అఖిల భారత స్థాయిలో ఆహార ధాన్యాల దిగుబడిలో తెలంగాణ స్థానం?
1) 5 2) 6 3) 7 4) 8
44. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి?
ఎ. 2020-21 తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ప్రకారం వరి పంట విస్తీర్ణంలో అగ్రస్థానంలో ఉన్న మొదటి రెండు జిల్లాలు- నల్లగొండ, సూర్యాపేట
బి. 2020-21 తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ప్రకారం వరి పంట ఉత్పాదకలో అగ్రస్థానంలో ఉన్న మొదటి రెండు జిల్లాలు- నిజామాబాద్, సిద్దిపేట
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
45. కింది వాక్యాల్లో సరైనవి?
ఎ. 2020-21 తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ప్రకారం మొక్కజొన్న పంట విస్తీర్ణంలో అగ్రస్థానంలో ఉన్న మొదటి రెండు జిల్లాలు- వరంగల్ రూరల్, ఖమ్మం
బి. 2020-21 తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ప్రకారం మొక్కజొన్న పంట ఉత్పాదకలో అగ్రస్థానంలో ఉన్న మొదటి రెండు జిల్లాలు- ఖమ్మం, నిర్మల్
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
46. పంట, ఉత్పాదకతలో అగ్రస్థానం గల జిల్లాలను జతపర్చండి?
1. జొన్న ఎ. కామారెడ్డి
2. సజ్జ బి. కరీంనగర్
3. రాగులు సి. రంగారెడ్డి
4. పెసలు డి. మహబూబ్‌నగర్
5. శనగలు ఇ. కరీంనగర్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
2) 1-బి, 2-సి, 3-డి, 4-ఇ, 5-ఎ
3) 1-ఇ, 2-డి, 3-సి, 4-బి, 5-ఎ
4) 1-బి, 2-ఎ, 3-సి, 4-ఇ, 5-డి
47. తెలంగాణ రాష్ట్రం కింది ఏ పంటకు సంబంధించి దేశంలోనే ఉత్పత్తి, సాగును అధికంగా కలిగి ఉంది (ఇతర అన్ని రాష్ర్టాలతో పోలిస్తే)?
1) పత్తి 2) పసుపు
3) మిరప 4) వరి
48. కింది వాక్యాల్లో సరైనవి?
ఎ. ఆయిల్ పామ్ సాగు ఉత్పత్తిలో తెలంగాణ 2వ స్థానంలో ఉంది (దేశంలో)
బి. మామిడి ఉత్పత్తిలో తెలంగాణ 6వ స్థానంలో ఉంది (దేశంలో)
సి. కూరగాయల ఉత్పత్తిలో తెలంగాణ 15వ స్థానంలో ఉంది (దేశంలో)
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
49. కింది ఏ పశుసంపదకు సంబంధించిన జనాభాలో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది?
1) కోళ్లు 2) గొర్రెలు
3) మేకలు 4) బర్రెలు
50. కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ ఏ జిల్లాలో ఉంది?
1) మహబూబ్ నగర్ 2) గద్వాల్
3) నారాయణ పేట 4) వనపర్తి
51. తెలంగాణలోని ఖనిజాలు దొరికే ప్రాంతాలను ఎన్ని మేఖలలుగా గుర్తించారు?
1) 4 2) 5 3) 6 4) 3
52. కింది గిరిజన ఉత్పత్తి కేంద్రాలు, అవి ఉన్న ప్రదేశాలను జతపరచండి.
1. తేనెశుద్ధి కేంద్రం ఎ) కామారెడ్డి
2. జిగురుశుద్ధి కేంద్రం బి) ములుగు
3. పసుపు తయారీ కేంద్రం
సి) ఏటూరు నాగారం
4. సోయా
ప్రాసెసింగ్ యూనిట్ డి) ఉట్నూరు
ఇ) నిర్మల్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-బి, 3-సి, 4-ఇ
3) 1-సి, 2-డి, 3-ఇ, 4-ఎ
4) 1-బి, 2-సి, 3-డి, 4-ఇ
53. సరైనవి గుర్తించండి.
ఎ. రంగారెడ్డి జిల్లా కొత్వాల్‌గూడ వద్ద 85 ఎకరాల విస్తీర్ణంలో హిమాయత్‌సాగర్ దగ్గర ఆక్సిజన్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు
బి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కండ్లకోయ వద్ద ఎకో పార్కును ఏర్పాటు చేశారు
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఎ, బి సరికావు
54. ‘కంపా’ దేనికి సంబంధించింది?
1) ఖనిజ వనరుల సంస్థ
2) సౌర విద్యుత్తును ప్రోత్సహించే సంస్థ
3) అటవీ పునరుద్ధరణకు సంబంధించినది
4) మత్స్య అభివృద్ధి సంస్థ
55. ఈ-నామ్ దేనికి సంబంధించినది?
1) ఫుడ్ ప్రాసెసింగ్‌కు సంబంధించినది
2) రైతు ఉత్పత్తిదారుల సంస్థ
3) వ్యవసాయ మార్కెటింగ్‌కు సంబంధించినది
4) ఏదీకాదు
56. రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి హరీశ్‌రావు 2021, జనవరి 8న ఏ జిల్లాలో తొలి పశువుల
హాస్టల్‌ను నిర్మించారు?
1) కరీంనగర్ 2) మెదక్
3) వరంగల్ 4) సిద్దిపేట
57. హైదరాబాద్ నగర అభివృద్ధి దశలకు సంబంధించి కిందివాటిని జతపరచండి.
1. తొలి కవల నగర దశ
ఎ) 1591 నుంచి 1687
2. ద్వితీయ కవల నగర దశ
బి) 1724-1874
3. ఆధునిక నగర ఆవిర్భావం
సి) 1874-1948
4. మహానగర దశ
డి) 1948-1991
ఇ) 1991 నుంచి..
1) 1-బి, 2-సి, 3-డి, 4-ఇ
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-ఇ, 2-డి, 3-సి, 4-బి
58. ప్రొఫెసర్ షా మంజూర్ ఆలం ఏ కాలవ్యవధిని హైదరాబాద్ పట్టణ పరిణామ దశల్లో పరివర్తన దశ (లేదా) చీకటి దశగా అభివర్ణించారు?
1) 1591-1687
2) 1687-1724
3) 1724-1874 4) 1874-1948
59. నిజాం ప్రభువు హైదరాబాద్ నగరాన్ని మున్సిపాలిటీగా ప్రకటించి మున్సిపల్, రహదారుల విభాగాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించాడు?
1) 1869 2) 1879
3) 1859 4) 1889
60. సబర్బన్ బస్సు సేవలు ప్రారంభించడంతో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల ఏకీకరణ ఏ సంవత్సరంలో జరిగింది?
1) 1927 2) 1928
3) 1929 4) 1930
61. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి.
ఎ. స్థూల సాగు విస్తీర్ణ శాతం పరంగా అధికంగా గల జిల్లా వరంగల్
బి. స్థూల సాగు విస్తీర్ణ శాతం పరంగా అల్పంగా గల జిల్లా మేడ్చల్ మల్కాజిగిరి
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఎ, బి సరికావు
62. రాష్ట్రంలో సగటు భూకమతం పరిమాణం అధికంగా, అల్పంగా గల జిల్లాలు వరుసగా?
1) ఆదిలాబాద్, వరంగల్
2) కుమ్రంభీం ఆసిఫాబాద్, హనుమకొండ
3) నిర్మల్, సిద్దిపేట
4) నిజామాబాద్, మెదక్
63. 1970-71 సంవత్సరం నాటి సగటు కమత పరిమాణాన్ని 2015-16 నాటి సగటు కమత పరిమానంతో పోలిస్తే?
1) 2 రెట్లు పెరిగింది
2) 2 రెట్లు తగ్గింది
3) 2/3 రెట్లు తగ్గింది
4) 2/3 రెట్లు పెరిగింది
64. రాష్ట్రంలో గల మొత్తం కమతాల్లో కింది ఏ రకం కమతాలు 50% కన్నా ఎక్కువ ఉన్నాయి?
1) చిన్న కమతాలు
2) ఉపాంత కమతాలు
3) మధ్యతరగతి కమతం
4) ఏదీకాదు
65. కింది వాక్యాల్లో సరైన దాన్ని గుర్తించండి.
ఎ. రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్‌కు
యాసంగిగా వ్యవహరించాలని ఉత్తర్వులు ఇచ్చింది
బి. రాష్ట్ర ప్రభుత్వం రబీ సీజన్‌ను వర్షాకాలం సీజన్‌గా వ్యవహరించాలని ఉత్తర్వులు ఇచ్చింది
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఎ, బి సరికావు
66. రాష్ట్రంలో పంటల సాంద్రత అత్యధికంగా, అల్పంగా గల జిల్లాలు గుర్తించండి. (వరుసగా)?
1) నిజామాబాద్, మేడ్చల్
2) ఆదిలాబాద్, వికారాబాద్
3) కామారెడ్డి, వికారాబాద్
4) కరీంనగర్, వికారాబాద్
67. 2014-15లో రాష్ట్ర స్థూల సాగు విస్తీర్ణం వరికి సంబంధించి, 2020-21 రాష్ట్రంలో వరి స్థూల సాగు విస్తీర్ణంతో పోలిస్తే ఎన్ని రెట్లు పెరిగింది?
1) 2 రెట్లు పెరిగింది
2) 3 రెట్లు పెరిగింది
3) 2,1/2 రెట్లు పెరిగింది
4) ఏదీకాదు
68. TS SOCA దేనికి సంబంధించింది?
1) ఉధ్యాన పంటలకు
2) నూనె గింజలకు సంబంధించిన సంస్థ
3) విత్తన నాణ్యతకు సంబంధించిన సంస్థ
4) ఏదీకాదు
69. తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎప్పుడు ఏర్పాటైంది?
1) 2015 ఫిబ్రవరి 5
2) 2016 ఫిబ్రవరి 5
3) 2017 ఫిబ్రవరి 5
4) 2018 ఫిబ్రవరి 5
70. 94 సంవత్సరాల ISTA (International Seed Testing Association) చరిత్రలో ఆసియా ఖండంలో మొదటిసారి ISTA సదస్సును హైదరాబాద్‌లో ఏ తేదీల్లో నిర్వహించారు?
1) 2019, మే 26 నుంచి జూన్ 3
2) 2019 జూన్ 26 నుంచి జూలై 3
3) 2019 జూలై 26 నుంచి ఆగస్టు 3
4) 2019 ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 3
71. సరికానివి గుర్తించండి.
ఎ. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (కూరగాయలు, పూలు) గల ప్రదేశం-ములుగు (సిద్దిపేట జిల్లా)
బి. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (పండ్లు) గల ప్రదేశం- జీడిమెట్ల (మేడ్చల్ జిల్లా)
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఎ, బి సరైన
72. రాష్ట్రంలో తలసరి వినియోగంలో అగ్రస్థానంలో గల జిల్లా?
1) రాజన్న సిరిసిల్ల 2) ఖమ్మం
3) ఆదిలాబాద్ 4) సిద్దిపేట
సమాధానాలు
33-4, 34-4, 35-3, 36-3,
37-3, 38-2, 39-2, 40-1,
41-1, 42-2, 43-1, 44-3, 45-3, 46-2, 47-2, 48-4, 49-2, 50-4, 51-3 52-1 53-4 54-3 55-3 56-4
57-2 58-2 59-1 60-2 61-3 62-1 63-3 64-2
65-4 66-4 67-2 68-3
69-1 70-2 71-3 72-1
-గందె శ్రీనివాస్
విషయ నిపుణులు
- Tags
- nipuna news
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు