‘చరిత్ర’ సృష్టిద్దాం
గ్రూప్-2లో చరిత్ర సబ్జెక్ట్దే సింహభాగం అని చెప్పవచ్చు. మొత్తం 600 మార్కులు గల పేపర్లలో చరిత్ర నుంచే 225కు పైగా మార్కులు వస్తాయి. పేపర్ల వారీగా చూస్తే పేపర్-1 జనరల్ స్టడీస్‌లో భారతదేశ సాంస్కృతిక-వారసత్వ చరిత్ర, తెలంగాణ సాంస్కృతిక-వారసత్వ చరిత్ర నుంచి సుమారు 25కు పైగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. పేపర్-2లో భారత దేశ, తెలంగాణ సాంఘిక, సాంస్కృతిక చరిత్ర నుంచి 50 ప్రశ్నలు వస్తాయి. పేపర్-4లో తెలంగాణ ఉద్యమ చరిత్ర నుంచి 150 ప్రశ్నలు వస్తాయి.
ఇంటర్, డిగ్రీ తెలుగు అకాడమీ చరిత్ర పుస్తకాలు తప్పకుండా చదవాలి. వీలైతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చరిత్ర పుస్తకాలను కూడా అధ్యయనం చేయాలి. తెలుగు అకాడమీ పోటీ పరీక్షల కోసం ప్రత్యేకంగా ముద్రించిన భారతదేశ చరిత్ర పుస్తకాలు చదవాలి. ముఖ్యంగా ఆధునిక భారతదేశ చరిత్రపై ఫోకస్ చేయాలి.
తెలంగాణ సాంస్కృతిక చరిత్ర కోసం తెలుగు అకాడమీ ప్రత్యేకంగా ముద్రించిన తెలంగాణ సాంస్కృతిక చరిత్ర పుస్తకం చదివితే సంపూర్ణ అవగాహన కలుగుతుంది. ఇది ఒకటికి రెండుసార్లు చదివిన తర్వాత రివిజన్ కోసం ఏదైనా పేరున్న పబ్లికేషన్ బుక్ చూస్తే సరిపోతుంది.
స్కోరింగ్ పేపర్‌గా భావించే తెలంగాణ ఉద్యమ చరిత్ర కోసం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చరిత్ర పుస్తకం, బీఏ ఫైనలియర్ తెలంగాణ ఉద్యమ చరిత్ర బుక్ చదవాలి. దీని వల్ల బేసిక్ నాలెడ్జ్ వస్తుంది. తర్వాత తెలుగు అకాడమీ తెలంగాణ ఉద్యమ చరిత్ర చదవాలి. దీంతో పాటు వీ ప్రకాష్ రాసిన తెలంగాణ ఉద్యమ చరిత్ర బుక్ కూడా చదివితే ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ప్రతి టాపిక్ చదివిన తర్వాత లెసన్స్ వారీగా బిట్స్ తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి.
ముందుగా సిలబస్‌ను పరిశీలించాలి. పేపర్-2లో భారతదేశ, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర అని స్పష్టంగా ఇచ్చారు. చదివేటప్పుడు రాజుల రాజకీయ చరిత్రపై కాకుండా వారి కాలంలో ప్రజల జీవన విధానం, ఆర్థిక పరిస్థితులు, సాహిత్యం, మత పరిస్థితులపై క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి.
ఇటీవల నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో చరిత్రకు సంబంధించిన ప్రశ్నల స్థాయిని పరిశీలిస్తే అర్థం అవుతుంది. దీన్నిబట్టి చూస్తే ప్రశ్నలు కాన్సెప్టెడ్ ఓరియంటేషన్తో అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రతి టాపిక్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. అప్పుడే ఆ టాపిక్ నుంచి ప్రశ్నలు ఏ విధంగా అడిగినా ఆన్సర్ చేసే సామర్థ్యం వస్తుంది. ఉదాహరణకు ఖజురహో స్మారక శిల్పాలకు సంబంధించి కింది వాటిని పరిగణించండి అని అడిగి ఐదు ఆప్షన్స్ ఇచ్చారు. ఇంతకుముందు ఖజురహో దేవాలయాలను నిర్మించిన రాజవంశం ఏది అని మాత్రమే అడిగేవారు. రాజపుత్ర రాజుల కాలంలోని సామాజిక, సాంస్కృతిక, మత పరిస్థితుల గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే పై ప్రశ్నకు సమాధానం గుర్తించవచ్చు. అలాగే సమ్మక్క సారలమ్మ, రామప్ప, కోణార్క్ సూర్య దేవాలయం, శాతవాహనుల కాలంలో సామాజిక పరిస్థితులు గురించి అడిగిన ప్రశ్నలను గమనిస్తే రాజకీయ చరిత్రపై కాకుండా సామాజిక, మత, ఆర్థిక, సాహిత్య పరిస్థితులపై ఫోకస్ ఎక్కువగా చేస్తూ విస్తృత అధ్యయనం చేయాలి.
-సాసాల మల్లికార్జున్ అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ,కోరుట్ల
- Tags
- nipuna news
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు