అచ్చమైన తెలుగు భాష కనిపించే శాసనం?
తెలంగాణలో సాహిత్య మూలాలు
- శాతవాహనుల రాజభాష ప్రాకృతం. వీరి రాజ్యంలో ప్రాకృతంలో వేయించిన శాసనాలు ‘బ్రాహ్మీ’ లిపిలో ఉన్నాయి.
- ప్రాకృతం సాహిత్యానికి శాతవాహనుల
- పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగంగా
- చెప్పవచ్చు.
- గౌతమీపుత్ర పుత్ర శాతకర్ణి నాణేల మీద రెండు భాషలు ఉంటాయి.
- 1. ప్రాకృతం- ‘గోతమి పుతసరి సతక ణిస’ అని ఉంది
- 2. దేశి- ‘గోతమి మగకు తిరుహితకణి’ అని ఉంది
- ‘మగ’ అంటే ద్రావిడ భాషలో కొడుకు అని, తెలుగులో కూడా ‘మగ’కు కొడుకు అనే అర్థం ఉంది.
కవులు గుణాఢ్యుడు
- కుంతల శాతకర్ణి ఆస్థానంలోని సుప్రసిద్ధ కవి. బృహత్కథను పైశాచీ ప్రాకృత భాషలో రచించాడు
- పైశాచీ భాష అనేది ఆనాటి సమాజంలో సామాన్యులు మాట్లాడే భాష
- గుణాఢ్యుడు బృహత్కథను తెలంగాణలోని కొండాపురం (మెదక్)లో రచించినట్లు ఆధారాలున్నాయి. బృహత్కథలో ప్రసిద్ధమైన రాజు ఉదయనుడు అతని కుమారుడు నరవాహనదత్తుల సాహస విన్యాసాలు
- వర్ణించారు.
- బృహత్కథ రచనతో వాల్మీకి, వ్యాసుల సరసన గుణాఢ్యుడికి స్థానం లభించింది. గుణాఢ్యుడిని తెలంగాణలో మొదటి లిఖిత కవిగా పేర్కొంటారు.
- బృహత్కథ ఆధారంగా క్షేమేంద్రుడు బృహత్కథా మంజరి, సోమదేవసూరి కథాసరిత్సాగరం అనే గ్రంథాలను రచించాడు.
- బృహత్కథను బట్టి ప్రజల భాష దేశీ పేరుతో ఉండేదని, అది తెలుగు భాష అని
- అర్థమవుతుంది.
హాలుడు
- శాతవాహన రాజుల్లో 17వ వాడైన హాలుని (బిరుదు కవివత్సలుడు) ఆస్థానానికి వచ్చిన కవులు చెప్పిన 700 గాథలను కూర్చి ‘గాథాసప్తశతి’గా సంకలనం చేశాడు.
- ఈ గాథలు చెప్పిన వారిలో కవులే గాక కవయిత్రులు కూడా ఉన్నారు. దాదాపు 350 మంది తెలంగాణ వాళ్ల గురించిన వివరాలు ఈ గ్రంథం అందించింది.
- ఈ గాథల్లో అమాయక గ్రామీణుల జీవితం, పల్లె ప్రజల సరస శృంగారం, జాతరలు, ప్రకృతి చిత్రణ, పొలాలు, కష్టజీవుల జీవితం చిత్రించారు.
- గాథసప్తశతిలో అద్దం, పొట్ట, అత్త, పాడి, పిల్ల, కంటి, కరణి, పత్తి మొదలైన దేశీ పదాలున్నాయి. హాలుని ఇతర గ్రంథాలు- లీలావతి కావ్యం, అభిదమన చింతామణి, దేశీనామమాల.
శర్వవర్మ
- ఈయన కుంతల శాతకర్ణి ఆస్థానంలో ఉన్న కవి. ‘కాతంత్ర వ్యాకరణం’ అనే సంస్కృత గ్రంథాన్ని రచించాడు. కుంతల శాతకర్ణి కాతంత్ర వ్యాకరణం ఆధారంగా 6 నెలల్లో సంస్కృతం నేర్చుకున్నాడు. అందుకే కుంతల శాతకర్ణి కాలం నుంచి సంస్కృతం అభివృద్ధి చెందింది.
ఆచార్య నాగార్జునుడు
- ఇతను మహాయాన బౌద్ధం స్థాపించాడు. యజ్ఞశ్రీ శాతకర్ణికి సమకాలికుడు. శ్రీపర్వతంలో విశామైన గ్రంథాలయాన్ని స్థాపించి విద్యాభివృద్ధికి కృషి చేశాడు.
- సంస్కృతంలో అనేక బౌద్ధమత గ్రంథాలు రచించాడు. అవి సుహృల్లేఖ, ప్రజ్ఞాపారమిత సూత్రం, మాధ్యమిక కారిక, రత్నావళి మొదలైన 24 గ్రంథాలు రాశాడు.
కుతూహాలుడు
- ఇతను మహారాష్ట్రి ప్రాకృతంలో ‘లీలావతి పరిణయం’ కావ్యాన్ని రచించాడు.
వాత్స్యాయనుడు
కామసూత్రాలను రచించాడు. ఇందులో శాతవాహనుల కాలం నాటి కోళ్లు, గొర్రెల పందాల ప్రస్థావన, బొమ్మలకు పెళ్లిల్లు చేసే ఆటలున్నాయి.
ఇక్ష్వాకులు
- వాశిష్టీపుత్ర శ్రీశాంతమూలుడు నాగార్జునకొండ సమీపంలో ‘విజయపురి’ రాజధానిగా ఇక్ష్వాకువంశ రాజ్యాన్ని స్థాపించాడు.
- దేవాలయాలు నిర్మించిన తొలి రాజులు ఇక్ష్వాకులు. దక్షిణ భారతదేశంలో సంస్కృతంలో శాసనాలు ముద్రించిన తొలి రాజులు.
- వీరు ప్రాకృతాన్ని పోషించినప్పటికీ తెలుగు భాష కూడా వాడుకలో ఉంది. మహాతలవర, సిరి, ఖండ, చలిక, బాపి, అంక మొదలైన తెలుగు పదాలు ఉపయోగించారు. తలవర అనే పదం ఇప్పుడు తలారిగా రూపాంతరం చెంది వాడుకలో ఉంది.
- ప్రస్తుతం వాడుకలో ఉన్న తిథి, వార, పక్ష మాసాలతో కూడిన పంచాంగమ్ వీరి కాలం నుంచే ప్రాంరభమైంది.
వాకాటకులు
- ఇక్ష్వాకులకు సమాంతరంగా వాకాటకులు ఉత్తర తెలంగాణ జిల్లాలను పరిపాలించారు. వీరు కవి పండిత పోషకులేకాక స్వయంగా కవులు.
- వీరి కాలంలో కాళిదాసు ‘మేఘదూతం’ అనే నాటకాన్ని రచించాడు.
- నోట్: ఇతడు వాకాటక రాజ్యంలోని రాంటేక్ (రామగిరి, కరీంనగర్)లో దీన్ని రచించాడు. వాకాటకరాజు రెండో ప్రవరసేనుడు ‘సేతుబంధ’ అనే ప్రాకృత కావ్యాన్ని రచించాడు.
- నోట్: శ్రీరాముడు లంకపై చేసిన దాడిని ఇతివృత్తంగా చేసుకుని ఈ గ్రంథాన్ని రచించాడు. సర్వసేనుడు హరివిజయం అనే ప్రాకృత కావ్యాన్ని రచించాడు.
- వాకాటకుల కాలంలోని ఇతర ముఖ్య గ్రంథాలు
- 1. యాజ్ఞవల్క్య 2. పదార్థ సంగ్రహం
- 3. నారదీయ 4. సాంఖ్యకారిక
- 5. కాత్సాయణ స్మృతులు
- 6. లంకావర్త సూత్రాలు
విష్ణుకుండినులు
- వీరి రాజధాని ఇంద్రపాలనగరం (ఉమ్మడి నల్లగొండ (ప్రస్తుతం యాదాద్రి జిల్లా) జిల్లాలోని రామన్నపేట దగ్గర తుమ్మలగూడెం).
- ఇంద్రపాల నగరం సమీపంలోని నాగారంలోని గోవింద వర్మ వేయించిన క్రీ.శ. 370 435 నాటి ‘తామ్రశాసనం’ తెలంగాణలో మొదటి సంస్కృత శాసనం.
- హైదరాబాద్ చైతన్యపురిలోని మూసీనది ఒడ్డున దొరికిన క్రీ.శ. 370 నాటి విష్ణుకుండిన గోవిందరాజు వేయించిన ‘విహార శాసనం’ తెలంగాణలో మొదటి ప్రాకృత శాసనం.
- ఈ రెండు శాసనాల కన్నా పురాతన శాసనం నల్లగొండ జిల్లా ఏలేశ్వరంలో ఉన్నట్లు చరిత్రకారులు భావిస్తున్నారు.
- విష్ణుకుండిన మాధవవర్మ (జనాశ్రయుడు) రచించిన ‘జనాశ్రయ చంధోవిచ్ఛిత్తి’ తెలంగాణలో లభ్యమైన సంస్కృత లక్షణ గ్రంథాల్లో మొదటిది.
- వీరి కాలం నాటి తెలుగు వ్యవహార భాషగా ఉంది కాబట్టి విష్ణుకుండినుల శాసనాల్లో తెలుగు పదాలు కనిపించాయి.
- క్రీ.శ. 674 నాటి గద్వాల సంస్కృత శాసనంలోనూ తెలుగు పదాలున్నాయి.
బాదామి చాళుక్యులు
- వీరి కాలంలో భవభూతి తెలంగాణ నుంచి విలసిల్లిన ప్రసిద్ధ కవి.
- ఈయన రచనలు- మాలతీమాధవం (సంస్కృతంలో) ఉత్తరరామ చరిత్ర మహావీర చరిత్ర నాటకాలు కూడా రచించారు.
- కృష్ణయజుర్వేద తైత్తరీయశాఖకు చెందిన భవభూతి కరీంనగర్, నిజామాబాద్ సరిహద్దు ప్రాంతానికి చెందినవారు. ఈయనను యశోవర్మ తన ఆస్థాన కవిగా నియమించుకున్నాడు. ‘రణవిక్రమ’ అనే మొదటి పులకేశి బిరుదు ఉన్న శాసనం నల్లగొండ జిల్లా ఏలేశ్వరంలో లభించింది.
ముదిగొండ చాళుక్యులు
- వరంగల్ జిల్లాలో తొలివెలుగు గద్యశాసనంగా ప్రసిద్ధి చెందిన ‘కురవి శాసనం’ వీరి కాలంలోనే వెలువడింది. ఈ శాసనం ఆనాటి అందమైన తెలుగు వాచకంగా ప్రసిద్ధి చెందింది. కురవి శాసనం రచించినది 3వ కుసుమాయుధుడు. ఇతని బిరుదు వినీత జనాశ్రయుడు. కొండపర్తి శాసనం కూడా వీరికాలంలోనే వెలుగులోకి వచ్చింది.
రాష్ట్రకూటుల కాలం
- వీరి కాలంలో అమోఘవర్షుడు కన్నడ భాషలో కవిరాజమార్గం, రత్నమాలిక (చంధోవిచ్ఛిత్తి) గ్రంథాలను రచించాడు. వీరి ఆస్థానంలో ఉన్న సంస్కృత పండితుడు-రాజశేఖరుడు.
వేములవాడ చాళుక్యుల కాలం
- వేములవాడ చాళుక్యుల కాలం తెలుగు సాహిత్యానికి మొదటి స్వర్ణయుగంగా పేర్కొనవచ్చు.
- పంపకవి: ఇతని బిరుదు కవితాగుణార్ణవుడు
- నోట్: జినవల్లభుడు ఒక చెరువును తవ్వించి దానికి ‘గుణార్ణవం’ అనే పేరు పెట్టాడు. పంపకవి ఆదికావ్యం (ఆదిపురాణం) పేరుతో మొదటి జైన తీర్థంకురుడైన వృషభనాథుని చరిత్రను రచించాడు. రెండో అరికేసరి ఆస్థాన కవి అయిన పంపడు అరికేసరిని నాయకుడిగా కీర్తిస్తూ ‘విక్రమార్జున విజయం’ రచించాడు.
- రెండో అరికేసరి పంపకవికి ప్రసిద్ధ ధర్మక్షేత్రం ధర్మపురిని అగ్రహారంగా దానం చేశాడు. పంపడు జినేంద్రపురాణాన్ని తెలుగులో రచించాడు.
- ఇతని సోదరుడు జినవల్లభుడు రచించిన కుర్క్యాల శాసనంలో (క్రీ.శ. 940) మొదటిసారిగా పద్యాలు కనిపించాయి.
- ఈ శాసనంలో మూడు కంద పద్యాలతో పాటు సంస్కృత, కన్నడ పద్యాలు కూడా ఉన్నాయి. జినవల్లభుని మిత్రుడు మల్లియరేచన రచించిన కవిజనాశ్రయం తెలుగులో మొదటి లక్షణ గ్రంథం.
- నన్నయకు పూర్వం తెలుగులో సాహిత్యం ఉందని, అది జైన సాహిత్యమని మొదటిసారిగా నిరూపించింది ‘ప్రబంధ రత్నావళి’ అందుకే తెలంగాణలో నన్నయకు పూర్వయుగాన్ని సాహిత్యంలో ‘జైనయుగం’ అంటారు.
భీమన (భీమకవి)
- వేములవాడకు చెందిన భీమకవి బహుగ్రంథ కర్త. ఇతడు శ్రీనాథుని వలే సంచార కవి. నన్నయకు పూర్వుడని చెప్పవచ్చు.
- భీమకవి రాసిన ‘రాఘవ పాండవీయం’ అనే ద్వర్థికావ్యాన్ని నన్నయ నాశనం చేయించాడచే కథ వ్యాప్తిలో ఉంది. ఇతను ‘కవిజనాశ్రయం’ను మల్లియరేచన ఆశ్రయంలో రచించాడనే వాదన కూడా ఉంది. తెలుగులో రచించిన కవిజనాశ్రయం ‘భీమన ఛందం’ పేరుతో ప్రసిద్ధమైంది. నృసింహపురాణం ఇతని మరో రచన. నన్నెచోడుడు కుమారసంభవం రచించాడు.
- సోమదేవ సూరి- ఇతని బిరుదు ‘శాద్వాదచలసింహ’
- రచనలు: ‘యశస్తిలకచంపు’ అనే కథా కావ్యాన్ని, నీతి కావ్యమనే రాజనీతి గ్రంథాన్ని సంస్కృతంలో ‘కథాసరిత్సాగరం’ అనే మరో గ్రంథం రచించాడు. సోమదేవసూరి రెండో బద్దెనకు విద్యాగురువు. రెండో బద్దెన వేములవాడలో సోమదేవసూరికి శుభదామమనే జినాలయాన్ని నిర్మించి ఇచ్చాడు. ‘వేములవాడ శాసనం’ ద్వారా ఈ విషయం
- తెలుస్తుంది.
- బద్దెన- ఇతని బిరుదు ‘కమలాసనుడు’
- రచనలు: నీతి శాస్త్రముక్తావళి (రాజనీతి గ్రంథం) సుమతీ శతకం, దశవివాభరణాంక కర్త వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే ‘బద్దెన’ అని చరిత్రకారుల అభిప్రాయం.
కళ్యాణి చాళుక్యులు
- రెండో తైలవుడు క్రీ.శ. 973లో కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని స్థాపించాడు.
- ఇతని ఆస్థాన కవి రన్నడు తన ‘గధాయుద్ధ’ కావ్యంలో క్రీ.శ. 1009 నాటి కౌథేం శాసనాన్ని బట్టి కళ్యాణి చాళుక్యులు బాదామి చాళుక్య వంశానికి చెందినవారని తెలుస్తుంది.
- వీరు వీరశైవాన్ని అభిమానించారు. శైవం వల్ల కళ్యాణి చాళుక్యుల ముందున్న వర్ణవ్యవస్థ ప్రాముఖ్యతను కోల్పోయింది. ఈ కారణం వల్లనే వీరికాలంలో సంస్కృతం స్థానంలో దేశభాషలు క్రమంగా రాజాదరణను పొందాయి.
కందూరు చోడులు
- వీరి కాలంలో ఉదయనుడు సంస్కృతంలో ‘ఉదయాదిత్యాలంకారం’ అనే లక్షణ గ్రంథం రచించాడు.
- ఇతను నల్లగొండ జిల్లాలోని పానగల్లు సమీపంలో ఉదయసముద్రం తవ్వించాడు.
- కందూరు చోడుల్లో చివరివాడైన రామనాథ దేవచోడుడు వేసిని ‘ఆగా మోత్కూరు’ శాసనంలో (క్రీ.శ. 1282) కాకతి రుద్రమదేవి ప్రస్థావన ఉంది.
- ఈ శాసనంలో అచ్చమైన తెలుగు భాష
- కనిపిస్తుంది.
- మొదటి గోకర్ణుడు ‘గోకర్ణఛందస్సు’ అనే లక్ష్మణ గ్రంథం రచించాడు. కందూరుచోడులు మొత్తంగా 40 శాసనాలు వేయించారు. వీరి కాలంలో తెలుగు, కన్నడ భాషలకు ఒకే లిపి ఉండేది. అందుకే వీరి శాసనాలు తెలుగు, కన్నడ లిపుల్లో ఉన్నాయి.
దేవపూజ పబ్లికేషన్స్ సౌజన్యంతో
- Tags
- nipuna
- nipuna news
Previous article
యునెస్కోలో సభ్యత్వం ఉన్న దేశాల సంఖ్య?
Next article
పంచకర్మ టెక్నీషియన్ కోర్సు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు