దేశంలో తొలి ‘యాంటీ పోచింగ్ డాగ్ స్వాడ్’?
1. ఇంటర్నేషనల్ కమిటీ ఫర్ వెయిట్ అండ్ మేజర్స్‌లో భారత్ తరఫున ఎన్నికయ్యింది ఎవరు? (3)
1) అల్కేష్ కుమార్ శర్మ
2) జయతి ఘోష్
3) వేణుగోపాల్ అచంట
4) అపరాజిత శర్మ
వివరణ: ఇంటర్నేషనల్ కమిటీ ఫర్ వెయిట్ అండ్ మేజర్స్ (సీఐపీఎం) సంస్థకు భారత్ తరఫున వేణుగోపాల్ అచంట ఎన్నికయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా 18 మందిని ఎన్నుకోగా అందులో వేణుగోపాల్ ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీ కేంద్రంగా పనిచేసే సీఎస్ఐఆర్-నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీకి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. సీఐపీఎంకు భారత్ తరఫున ఎన్నికైన 7వ వ్యక్తి ఆయన. సీఐపీఎం అనేది జనరల్ కాన్ఫరెన్స్ ఆన్ వెయిట్స్ అండ్ మేజర్స్ (సీజీపీఎం) ప్రమాణాల్లో భాగంగా పనిచేస్తుంది. సీజీపీఎంను మీటర్ అనే ఒప్పందం ద్వారా ఏర్పాటు చేశారు. ఇది 1875, మే 20న పారిస్‌లో కుదిరింది.
2. రష్యాతో రూపాయి వాణిజ్యం నిర్వహించేందుకు ఏ రెండు బ్యాంకులకు ఇటీవల ఆర్బీఐ అనుమతిచ్చింది? (2)
1) హెడ్‌డీఎఫ్‌సీ, హెచ్ఎస్బీసీ
2) హెచ్డీఎఫ్సీ, కెనరా బ్యాంక్
3) కెనరా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్
4) హెచ్ఎస్బీసీ, కెనరా బ్యాంక్
వివరణ: రష్యాతో రూపాయి వాణిజ్యం కోసం వోస్ట్రో అకౌంట్‌ను తెరుచుకునేందుకు హెచ్డీఎఫ్సీ, కెనరా బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. గతంలో ఈ తరహా అనుమతిని మూడు బ్యాంకులు పొందాయి. అవి.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, యూకో బ్యాంక్.
3. యునెస్కో-ఇండియా-ఆఫ్రికా హ్యాకథాన్ 2022 ఏ రాష్ట్రంలో నిర్వహించారు? (3)
1) గుజరాత్ 2) మధ్యప్రదేశ్
3) ఉత్తరప్రదేశ్ 4) ఒడిశా
వివరణ: యునెస్కో-ఇండియా-ఆఫ్రికన్ హ్యాకథాన్‌ను నవంబర్ 22న ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో నిర్వహించారు. భారత విద్యా మంత్రిత్వ శాఖ దీన్ని నిర్వహించింది. ఆఫ్రికాకు చెందిన 22 దేశాలు పాల్గొన్నాయి. హ్యాకథాన్ అంటే ఒక సాంఘిక కోడింగ్ ఈవెంట్‌గా భావించొచ్చు. ఒక కొత్త సాఫ్ట్వేర్ రూపకల్పనకు కంప్యూటర్ ప్రోగ్రామర్లు, ఇతర ఆసక్తి ఉన్న వారిని ఒక చోటకు చేరుస్తుంది. ప్రస్తుత హ్యాకథాన్‌లో 36 గంటల పాటు నిరంతరాయంగా విద్యార్థులు శ్రమించి విద్య, వ్యవసాయం, వైద్యం, ఇంధనం, తాగునీరు తదితర అంశాలకు నూతన సాంకేతికతను కనుగొనేందుకు యత్నిస్తారు.
4. యునెస్కో-మదన్‌జిత్ సింగ్ ప్రైజ్ 2022ను ఎవరికి ప్రకటించారు? (4)
1) బెర్నడట్టే మాడ్రిడ్ 2) గ్యారి బెంచిగిబ్
3) సౌథెరా చిం
4) ఫ్రాంకా మ-ఇహ్-సులేమ్
వివరణ: యునెస్కో-మదన్‌జిత్ సింగ్ ప్రైజ్‌ను కామెరూన్ దేశానికి చెందిన మ-ఇహ్-సులేమ్ యంగ్ గెలుచుకున్నారు. సహనం, అహింసలను పెంపొందించేందుకు కృషి చేసిన వారికి ఈ అవార్డును ఇస్తారు. మదన్‌జిత్ సింగ్ పేరుమీదుగా ఈ అవార్డును నెలకొల్పారు. ఆయన యునెస్కోకు సౌహార్థ్ర రాయబారిగా వ్యవహరించారు. అలాగే ఆయన కళాకారుడు, రచయిత, దౌత్యవేత్త. ఈ అవార్డును 1996లో నెలకొల్పారు. ఐక్యరాజ్య సమితి 1995 సంవత్సరాన్ని సహన సంవత్సరంగా (ఇయర్ ఆఫ్ టాలరెన్స్) నిర్వహించింది. ఆ ఏడాది మహాత్మాగాంధీ 125వ జయంతి జరిగింది. ఆ తర్వాత సంవత్సరం 1996లో అవార్డును నెలకొల్పారు. బెర్నడెట్టే మాడ్రిడ్, గ్యారి బెంచిగిబ్, సౌథెరా చిమ్ ఈ ఏడాది మెగెసెసె అవార్డు పొందారు.
5. భారత్‌తో ‘ఆర్థిక సహకారం వాణిజ్య ఒప్పందానికి’ ఇటీవల ఏ దేశ పార్లమెంట్ ఆమోదం తెలిపింది? (2)
1) అమెరికా 2) ఆస్ట్రేలియా
3) ఫ్రాన్స్ 4) యూకే
వివరణ: భారత్‌తో ఆర్థిక సహకారం వాణిజ్య ఒప్పందానికి ఆస్ట్రేలియా పార్లమెంట్ అంగీకరించింది. గత పదేళ్లలో భారత్‌తో ఒప్పందం కుదుర్చుకున్న అగ్ర దేశం ఇదే. ఈ ఒప్పందంలో భాగంగా ఇరు పక్షాలు లబ్ధి పొందుతాయి. భారత్ నుంచి 1800 మంది యోగా టీచర్లు, చెఫ్‌లకు ఆస్ట్రేలియా అనుమతి ఇస్తుంది. అలాగే 1000 వర్క్ కమ్ హాలిడే వీసాలను భారత యువ నిపుణులకు ఇస్తారు. అలాగే దాదాపు 96% భారత వస్తువులపై ఆస్ట్రేలియా కస్టమ్స్ డ్యూటీని తొలగిస్తుంది. ఆస్ట్రేలియా కూడా ప్రయోజనాలు పొందనుంది.
6. 2021లో పేటెంట్ హక్కుల కోసం చేసిన దరఖాస్తుల్లో ఏ ఖండం నుంచి ఎక్కువగా వచ్చాయని ఇటీవల వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ వెల్లడించింది? (3)
1) ఉత్తర అమెరికా 2) యూరప్
3) ఆసియా 4) దక్షిణ అమెరికా
వివరణ: పేటెంట్, ట్రేడ్ మార్క్ తదితర సంబంధిత అంశాల్లో 2021లో రికార్డ్ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి అని వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ సంస్థ ప్రకటించింది. ఈ సంస్థ జెనీవా కేంద్రంగా పనిచేస్తుంది. మొత్తం దరఖాస్తుల్లో 67.6% ఆసియా ఖండం నుంచి వచ్చినవే అని పేర్కొంది. ఆసియాలో కూడా భారత్, చైనా, దక్షిణ కొరియా దేశాల నుంచి ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించింది. భారత్, చైనా నుంచి వచ్చిన దరఖాస్తులు అంతకుముందు నుంచి వచ్చిన సంవత్సరంతో పోలిస్తే భారత్ నుంచి 5.5%, అలాగే చైనా నుంచి కూడా 5.5% పెరిగాయని సంస్థ ప్రకటించింది.
7. ఓటర్ల కనీసపు వయస్సును 16 ఏళ్లకు తగ్గించకపోవడం వివక్ష అంటూ ఇటీవల ఏ దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది? (1)
1) న్యూజిలాండ్ 2) కెనడా
3) స్వీడన్ 4) చిలీ
వివరణ: 16 సంవత్సరాలు వచ్చిన యువతకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడంతో పాటు ఫుల్‌టైమ్ వర్క్ అనుమతి ఇస్తూ పన్నులను కూడా తీసుకుంటూ వారికి ఓటు హక్కు ఇవ్వకపోవడం వివక్ష కిందకు వస్తుందని న్యూజిలాండ్ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఆ దేశంలో ఓటుకు ప్రస్తుతం కనీస వయస్సు 18 సంవత్సరాలుగా ఉంది. అయితే దీనిపై ఆ దేశ రాజకీయ పార్టీల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
8. కే9 జోర్బా ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది ఏంటి? (2)
1) కొత్త సాఫ్ట్వేర్ 2) కుక్క
3) కరోనాలో కొత్త వేరియంట్
4) కంప్యూటర్‌పై దాడి చేసే కొత్త వైరస్
వివరణ: కే9 అనేది కుక్క. జంతువులను కాపాడేందుకు దీనికి శిక్షణ ఇచ్చారు. ఈ విధంగా ఇది భారత్‌లో తొలి ‘యాంటీ పోచింగ్ డాగ్ స్వాడ్’గా నిలిచింది. నవంబర్ 22న ఇది మరణించింది. జీవ వైవిధ్య సంస్థ అయిన ‘అరణ్యక్’ దీనికి శిక్షణ ఇచ్చింది. 2011 నుంచి సేవలను జోర్బా అందిస్తుంది. దీన్ని కజిరంగా జాతీయ పార్క్‌లో పహారాకు విడిచిపెట్టారు. జంతువులను వేటాడే వాళ్లను సమర్థంగా ఎదుర్కొంది.
9. ‘జైపూర్ ఫుట్ యూఎస్ఏ’ ఇచ్చే ప్రపంచ మానవత అవార్డ్ (గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డ్) ఎవరికి ఇచ్చారు? (3)
1) ప్రేమ్ బండారి 2) వరుణ్ జెఫ్
3) మంజూర్ భట్ 4) రణ్‌ధీర్ జైస్వాల్
వివరణ: జైపూర్ ఫుట్ యూఎస్ఏ అనే స్వచ్ఛంద సంస్థ గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డును ప్రవేశపెట్టింది. నిస్వార్థంగా సేవచేసే వాళ్లకు ఈ అవార్డును ఇవ్వాలని సంకల్పించింది. ఇందులో భాగంగా ఈ అవార్డును పొందిన తొలి వ్యక్తి మంజూర్ భట్. ఆయన జమ్ముకశ్మీర్ ప్రాంతానికి చెందిన జర్నలిస్ట్. ఆసియా న్యూస్ వీక్ మ్యాగజైన్‌కు ఎడిటోరియల్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే గ్లోబల్ ఎడిటోరియల్ స్ట్రాటజీ, ఇన్నోవేషన్‌కు ఆయన సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా కూడా ఉన్నారు. బెంగళూరు హీల్స్, సబ్కా ఆక్సీమీటర్ వంటి కార్యక్రమాలతో కొవిడ్ సమయంలో ఆయన స్వచ్ఛంద సేవను సమర్థవంతంగా అందించినందుకు అవార్డును గెలుచుకున్నారు.
10. కింది వాటిలో దేనికి సంబంధించిన నాయకత్వాన్ని నవంబర్ 21న భారత్ స్వీకరించింది? (2)
1) షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్
2) జీపీఏఐ 3) జీ-20
4) ఏదీకాదు
వివరణ: గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (జీపీఏఐ)కు నాయకత్వ బాధ్యతలను నవంబర్ 21న భారత్ స్వీకరించింది. కృత్రిమ మేధ మానవులకు ఉపయోగపడేలా చూసేందుకే జీపీఏఐని ఏర్పాటు చేశారు. సిద్ధాంతం, వాస్తవాల మధ్య ఉండే అంతరాన్ని పూడ్చే సంస్థ ఇది. ఇందులో మొత్తం 25 దేశాలకు సభ్యత్వం ఉంది. ఈ సంస్థలో భారత్ వ్యవస్థాపక సభ్యత్వాన్ని కలిగి ఉంది. ఫ్రాన్స్‌లోని పారిస్‌లో ఉన్న ఓఈసీడీ కార్యాలయ ప్రాంగణం నుంచి జీపీఏఐ పనిచేస్తుంది.
11. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ 2023 సమావేశ ఇతివృత్తం ఏంటి? (4)
1) వ్యూ టుగెదర్ టు ఎస్ఈసీయూఆర్ఈ
2) ఎస్ఈసీయూఆర్ఈ సేఫ్టీ టు దిస్ వరల్డ్
3) ఎస్ఈసీయూఆర్ఈ ఫ్రమ్ వైరస్ ఇన్ ద వరల్డ్
4) ఫర్ ఏ ఎస్ఈసీయూఆర్ఈ ఎస్సీవో
వివరణ: షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం 2023లో భారత్‌లో జరుగనుంది. ఈ కూటమికి ఇటీవల భారత్ నాయకత్వం స్వీకరించింది. దీనికి సంబంధించిన అధికారిక వెబ్సైట్, ఇతివృత్తాన్ని భారత్ విడుదల చేసింది. ఇతివృత్తం.. ఎస్ఈసీయూఆర్ఈ-ఎస్సీవో. ఇందులో ప్రతి అక్షరానికి ఒక అర్థాన్ని ఇచ్చారు. అవి ఎస్-సెక్యూరిటీ ఫర్ సిటిజన్స్ (పౌరులకు భద్రత), ఈ-ఎకనామిక్ డెవలప్మెంట్ (ఆర్థిక అభివృద్ధి), సీ-కనెక్టివిటీ (అనుసంధానత), యూ-యూనిటీ (సమైక్యత), ఆర్-రెస్పెక్ట్ ఆఫ్ సావర్నిటీ (సార్వభౌమాధికారాన్ని గౌరవించడం), ఈ-ఎన్విరాన్మెంట్ (పర్యావరణం).
12. ‘జీహెచ్ఏఆర్’ అనే కార్యక్రమాన్ని నవంబర్ 20న ప్రారంభించిన సంస్థ ఏది? (3)
1. జాతీయ మైనార్టీ హక్కుల కమిషన్
2) జాతీయ మానవ హక్కుల సంఘం
3) బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్
4) ఏదీకాదు
వివరణ: జీహెచ్ఏఆర్ అనేది సంక్షిప్త రూపం. దీన్ని విస్తరిస్తే ‘గో హోం అండ్ రీ-యూనైట్’. అంటే ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మళ్లీ కలవండి అనే అర్థాన్ని ఇస్తుంది. నవంబర్ 20న ఈ కార్యక్రమాన్ని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ప్రారంభించింది. ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ. తప్పిపోయిన పిల్లలు తిరిగి వారి ఇంటికి చేరేందుకు ఇది ఒక డిజిటల్ ట్రాకింగ్ వేదికంగా ఉపయోగపడుతుంది. నవంబర్ 20న ప్రపంచ బాలల దినోత్సవంగా నిర్వహిస్తారు. ఆ రోజునే దీన్ని ప్రారంభించారు.
13. గాంధీ-మండేలా అవార్డును ఇటీవల గెలుచుకుంది ఎవరు? (2)
1) రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్
2) దలైలామా 3) గంభీరావు ప్రవీణ్
4) ఎవరూకాదు
వివరణ: గాంధీ-మండేలా 2022 అవార్డును టిబెట్ బౌద్ధ మత గురువు దలైలామాకు ప్రకటించారు. హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ దీన్ని ధర్మశాలలో దలైలామాకు అందజేశారు. ప్రపంచ శాంతి కోసం పోరాడేవారిని గుర్తించేందుకు గాంధీ-మండేలా ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. ఇది లాభాపేక్షలేని, ఒక స్వచ్ఛంద సంస్థ. గాంధీ, మండేలా జీవిత ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు దీన్ని స్థాపించారు.
14. కమిషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్‌కు (ఐటీటీఎఫ్)కు ఎన్నికైన భారతీయుడు ఎవరు? (4)
1) విజేందర్ సింగ్ 2) సింగ్‌రాజ్ అధానా
3) పుల్లెల గోపీచంద్ 4) శరత్ కమల్
వివరణ: స్టార్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు శరత్ కమల్ అచంట మరో ఘనతను దక్కించుకున్నాడు. కమిషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్‌కు ఎన్నికయ్యాడు. దీనికి ఎన్నికైన తొలి భారతీయుడు ఆయనే. నవంబర్ 7 నుంచి 13 వరకు ఆన్లైన్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించారు. ఇటీవల శరత్ కమల్‌కు ధ్యాన్‌చంద్ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే.
15. ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022 అవార్డు ఎవరికి వచ్చింది? (3)
1) రజనీకాంత్ 2) అమితాబ్‌బచ్చన్
3) చిరంజీవి 4) పవన్ కల్యాణ్
వివరణ: తెలుగు సినీ నటుడు చిరంజీవికి ఇండియన్ ఫిలిం ఇంటర్నేషనల్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022 అవార్డు లభించింది. గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ సినీ ఉత్సవం సందర్భంగా చిరంజీవికి ఈ అవార్డును ప్రకటించారు. తెలుగులో ఆయన 150కి పైగా సినిమాలు చేశారు. నాలుగు దశాబ్దాలుగా ఆయన నటిస్తున్నారు. గతంలో ఈ అవార్డును అమితాబ్‌బచ్చన్, రజనీకాంత్ అందుకున్నారు.
-వి. రాజేంద్ర శర్మ ఫ్యాకల్టీ
9849212411
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు






