‘వాగ్భూషణమే భూషణం’ అని చెప్పినవారు?
భాషణం
- స్పష్టత, నిర్దుష్టత, నిర్దిష్టత, ధారాళత అనే లక్షణాలుండాల్సిన అంశం? (టీజీటీ 2018) (టెట్ 2018)
1) శ్రవణం 2) భాషణం
3) సహృదయత 4) అనుసృజన - విద్యార్థుల భాషణ సామర్థ్యం ఏయే నైపుణ్యాలను ప్రభావితం చేస్తుంది?
1) పఠనం, లేఖనం 2) శ్రవణం, లేఖనం
3) శ్రవణం, పఠనం 4) శ్రవణం, భాషణం - స్పష్టంగా, నిర్దుష్టంగా మన అభిప్రాయాల్ని ఎదుటి వ్యక్తికి మాటల రూపంలో వ్యక్తీకరించడం?
1) శ్రవణ చర్య 2) చదవడం
3) రాయడం 4) భాషణం/వాచిక చర్య - భాషా బోధన ప్రారంభ చర్య? (టెట్ 2018)
1) శ్రవణ చర్య 2) లిఖిత చర్య
3) వాచిక చర్య 4) లేఖన చర్య - P Gurry అనే విద్యావేత్తననుసరించి ధ్వనుల వినియోగం, అందించదలచిన సమాచార వినిమయానికి ఉపయోగించే భాషారూపం, వక్తల వ్యక్తిత్వాలు అనేవి దేనికి తోడ్పడుతాయి? (ఎస్జీటీ 2018)
1) విద్యార్థులకు మాట్లాడటంలో శిక్షణ ఇవ్వడానికి
2) విద్యార్థులకు వినడంలో శిక్షణ ఇవ్వడానికి
3) విద్యార్థులతో చర్చలు జరపడానికి
4) విద్యార్థులకు సాహిత్య విశేషాలను పరిచయం చేయడానికి - నూతన శబ్ద పరిచయం, విషయ పరిచయం, ఉచ్ఛారణ దక్షత, భావ ప్రకటనా కౌశలం- వీటిరి ప్రాధాన్యమివ్వాల్సిన చర్య? (ఎస్జీటీ 2018)
1) లిఖిత చర్య 2) వాచిక చర్య
3) లోపనివారణ చర్య 4) శ్రవణ చర్య - చక్కని భావ వినియమానికి ఆధారమైనవి? (ఎల్పీ 2019)
1) మాట 2) క్రియ
3) చేష్ట 4) హావము - విద్యార్థుల భాషణాన్ని అభివృద్ధి చేసే క్రమంలో భాగంగా బాలగేయాలు (శిశు గేయాలు), అభినయ గేయాలు, కథాకథనం, నాటకీకరణం ఏ తరగతి వరకు ఉపకరిస్తాయి?
1) 9వ తరగతి 2) 10వ తరగతి
3) 4వ తరగతి 4) 3వ తరగతి - ఉక్తరచన, వక్తృత్వ శిక్షణ ఏ తరగతుల్లో ప్రవేశపెట్టాలి?
1) 1, 2 తరగతులు 2) 2, 3 తరగతులు
3) 4, 5 తరగతులు 4) 9, 10 తరగతులు - స్పష్టంగా మాట్లాడటం, ఉచ్ఛారణ దోషాలు లేకుండా మాట్లాడటం, ధైర్యంగా మాట్లాడటం ఏ దశలో శిక్షణ ఇవ్వాలి?
1) పూర్వ ప్రాథమిక స్థాయి
2) ప్రాథమిక స్థాయి
3) మాధ్యమిక దశ 4) ఉన్నత దశ - ‘ఊనిక, స్వర భేదం పాటిస్తూ మాట్లాడటం’ ఏ స్థాయి భాషా నైపుణ్య లక్షణం? (పీజీటీ 2018)
1) ప్రాథమిక స్థాయి
2) ప్రాథమికోన్నత స్థాయి
3) ఉన్నత స్థాయి 4) స్నాతకోత్తర స్థాయి - మానవుడు సంఘజీవి. సమాజంలో పరస్పర సంబంధాల స్థాపనకు అతడు తెలుసుకోవాల్సింది? (ఎల్పీ 2019)
1) ఇంట్లోని వారితో మాట్లాడే తీరు
2) తన అవసరాల కోసం మాట్లాడే తీరు
3) ఇరుగు పొరుగుతో మాట్లాడే తీరు
4) తనకన్నా చిన్నవారితో మాట్లాడే తీరు - వాచికాభినయం, ఆంగికాభినయంతో మాట్లాడటం, అలంకారికంగా మాట్లాడటం ఏ స్థాయి భాషా నైపుణ్య లక్షణం?
1) ప్రాథమిక స్థాయి
2) ప్రాథమికోన్నత స్థాయి
3) ఉన్నత స్థాయి
4) పూర్వ ప్రాథమిక స్థాయి - ‘సామెతలు, నుడికారాలు, జాతీయాలు అవసరమైన సందర్భాల్లో ఉపయోగిస్తూ మాట్లాడటం’ ఏ దశలో భాషణాన్ని పెంపొందించే చర్య?
1) ప్రాథమిక దశ 2) ఉన్నత దశ
3) పూర్వ ప్రాథమిక దశ
4) స్నాతకోత్తర స్థాయి - భాషణానికి ప్రధానమైనది?
1) ఉచ్ఛారణ 2) ధ్వని
3) లిపి 4) వ్యాకరణం - ‘వాగ్భూషణమే భూషణం’ అని చెప్పినవారు?
1) వేమన 2) ఏనుగు లక్ష్మణ కవి
3) భర్తృహరి 4) నండూరి రామకృష్ణమాచార్యులు - ‘వాక్కువలనగలుగు పరమ మోక్షంబు’ అన్న కవి?
1) నన్నయ 2) తిక్కన
3) ఎర్రన 4) వేమన - ‘వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు’ అన్న కవి, అతడి రచనల వరుసక్రమం?
1) నండూరి రామకృష్ణమాచార్యులు- ప్రగతిగీత
2) విశ్వనాథ సత్యనారాయణ- వేయిపడగలు
3) శ్రీశ్రీ- మహాప్రస్థానం
4) శ్రీశ్రీ- మరోప్రస్థానం - వాచికాభినయం, ఆంగికాభినయం అనే రెండు రకాల అభినయాలకు చోటు ఉండే భాషా నైపుణ్యం?
1) శ్రవణం 2) భాషణం
3) పఠనం 4) లేఖనం - ప్రాథమిక దశలో భాషణాబివృద్ధికి చేపట్టదగిన చర్యల్లో ఒకటి? (ఎల్పీ 2018)
1) పద్యాలు వినిపించడం
2) విరివిగా మాట్లాడించడం
3) ఆటలాడించడం 4) జట్లు చేయడం - ‘చిన్న పిల్లలు మాట్లాడుకునే స్వేచ్ఛ లేని బడి వ్యర్థం’ అన్నది?
1) పోరంకి దక్షిణామూర్తి 2) గిజూభాయ్
3) గాంధీజీ 4) కృష్ణకుమార్
22, ‘తెలిసిన విషయం నుంచి తెలియని విషయానికి’ అనే మనోవైజ్ఞాన శాస్త్ర సూత్రం అనుసరించి మొదటిసారిగా పాఠశాలకు వచ్చిన విద్యార్థికి చెప్పే అంశం? (ఎస్జీటీ 2018)
1) అక్షరాలను దిద్దించడం
2) శిశు గేయాలను చెప్పడం
3) బోర్డుపై రాసిన అక్షరాన్ని చదవమనడం
4) కృత్యాల ద్వారా అక్షరాలను నేర్పడం - బాలగేయాలు/శిశు గీతాలకు సంబంధించి సరికాని ప్రవచనం?
1) అర్థప్రధానమైన గేయాలు
2) భావానికంటే శబ్దానికి ఎక్కువ ప్రాధాన్యం ఉండే గేయాలు
3) నూతన పదాలు పరిచయమై పదజాలాభివృద్ధి చెందుతుంది
4) జట్లలో పాడటం వల్ల సంఘీభావం పెంపొందుతుంది - పిల్లలు వాచికాభినయంతోపాటు, ఆంగికాభినయం చేస్తూ పాడే గేయాలను ఏమంటారు? (టీజీటీ 2017)
1) శిశు గీతాలు 2) అభినయ గేయాలు
3) పారమార్థిక గేయాలు 4) బాలగేయాలు - కాల్పనికతకు, ఊహకు, భావానికి ప్రాధాన్యంగల కథలను ఏ తరగతులకు చెప్పాలి?
1) 3, 4 తరగతులు 2) 4, 5 తరగతులు
3) 9, 10 తరగతులు 4) 1, 2 తరగతులు - కథాకథన పద్ధతి, కథా పద్ధతి- ఇవి క్రమంగా వేటిని అభివృద్ధి చేయడానికి
తోడ్పడుతాయి?
1) పఠనం-పఠనం 2) భాషణం-భాషణం
3) భాషణం-పఠనం4) పఠనం-భాషణం - పేదరాశి పెద్దమ్మ కథలు, గాంధర్వ కథలు, అద్భుత కథలు, నీతి కథలను ఏ తరగతుల్లో పరిచయం చేయాలి?
1) 1, 2 తరగతులు 2) 6, 7 తరగతులు
3) 8, 9, 10 తరగతులు
4) 3, 4, 5 తరగతులు - ఉపాధ్యాయుడు విద్యార్థులకు కథలు చెప్పేటప్పుడు ఉపయోగించదగిన వాక్యాలు? (పీజీటీ 2018)
1) పరోక్ష వాక్యాలు 2) ప్రత్యక్ష వాక్యాలు
3) కర్మణి వాక్యాలు 4) సంశ్లిష్ట వాక్యాలు - పాత్రానుగుణంగా భాషించే సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించగల చర్య? (టెట్ 2018)
1) వక్తృత్వం 2) రచన
3) నాటకీకరణం 4) కథాపూరణం - మాట్లాడేటప్పుడు భావానుగుణమైన స్వరభేదం పాటిస్తే దానిని ఏమంటారు?
1) ఆంగికాభినయం 2) వాచికాభినయం
3) మూకాభినయం 4) అభినయ కౌశలం - మాట్లాడేటప్పుడు ముఖ భంగిమల్లో మార్పుతో కరచరణాల ద్వారా అభినయించే దానిని ఏమంటారు?
1) ఆంగికాభినయం 2) వాచికాభినయం
3) మూకాభినయం 4) అభినయ కౌశలం - ఒక అంశాన్ని కేంద్రీకృతం చేసుకుని లిఖిత రహితంగా చేసే మౌఖిక అభివ్యక్తి విధానాన్ని ఏమంటారు? (ఎస్ఏ 2018)
1) ఉక్త రచన 2) స్వీయ రచన
3) ఉక్త లేఖనం 4) వ్యాసరచన - ఉక్త రచన అంటే? (పీజీటీ 2018)
1) ఉపాధ్యాయుడు చెప్పిన అంశాన్ని రాయడం
2) ఇచ్చిన అంశాన్ని గురించి అవగాహన చేసుకోవడం
3) ఇచ్చిన అంశాన్ని గురించి అందంగా మాట్లాడటం
4) ఇచ్చిన అంశాన్ని గురించి అభినయించడం - ఒక విధంగా ‘సద్యోభాషణం’ దేనికి చెందినది? (టీజీటీ 2019)
1) ఉక్త రచన 2) ఉక్త లేఖనం
3) నాటకీకరణం 4) కంఠస్థం చేయడం - ఏదైనా ఒక అంశంపై కనీసం 2, 3 నిమి షాల పాటు ఎలాంటి తడబాటు లేకుండా సొంత వాక్యాల్లో ధారళంగా మాట్లాడటం?
1) లేఖారచన 2) కథారచన
3) ఉక్తరచన/వక్తృత్వం 4) ఉక్తలేఖనం - వక్తృత్వ పోటీల వల్ల విద్యార్థుల్లో పెంపొందే గుణాలు? (టీజీటీ 2017)
1) అభినయం, పఠనాభివృద్ధి, రసానుభూతి
2) భాషణాభివృద్ధి, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, స్వయంకృషి, ఆనందం, ఉత్సాహం
3) స్వయంకృషి, మాండలిక భాష
4) ఆత్మ విశ్వాసం, పరిమిత పఠనం, రచనా వ్యాసంగం - ‘వక్తృత్వం’ అంటే (టెట్ 2018)
1) రాయడం 2) మాట్లాడటం
3) వినడం 4) సమీక్ష - పొడుపు కథలు, చిక్కు ప్రశ్నలు, సాహిత్య సమావేశాలు, గోష్టులు అనేవి ఏ దశలోని విద్యార్థులకు భాషణాన్ని పెంపొందించే చర్యలు?
1) పూర్వ ప్రాథమిక దశ 2) ఉన్నత దశ
3) ప్రాథమిక దశ 4) మాధ్యమిక దశ - ‘నన్నయ కవిసార్వభౌముడు’ అనే వాక్యంలోని వాగ్దోషం?
1) భావ దోషం 2) భాషా దోషం
3) ఉచ్ఛారణ దోషం
4) ధ్వనులను తారుమారు చేసే దోషం - భావ దోషాలను ప్రధానంగా వేటికి చెందినవి?
1) ధ్వని విజ్ఞానం 2) భాషా విజ్ఞానం
3) వ్యాకరణ పరిజ్ఞానం
4) విషయ పరిజ్ఞానం - విద్యార్థి మాట్లాడేటప్పుడు కర్త, కర్మ, క్రియ, లింగం, వచనం, కాలం, నామవాచకం, విశేషణం, విభక్తులు, సమాసాలు మొదలైన వాటిని గుర్తించకపోవడం వల్ల ఏర్పడే వాగ్దోషాలు?
1) భావ దోషాలు 2) భాషా దోషాలు
3) ఉచ్ఛారణ దోషాలు
4) ధ్వనులను తారుమారు చేసే దోషాలు - ‘స్త్రీ మహిళా జాతిని తక్షణమే ఉద్ధరించాలి’ అనే ఉదాహరణలోని వాగ్దోషం?
1) భావ దోషం 2) ఉచ్ఛారణ దోషం
3) ధ్వనులను తారుమారు చేసే దోషం
4) భాషా దోషం - బాలుర ఉచ్ఛారణ దోషాల్లో చేరని అంశం? (పీజీటీ 2017)
1) నయనమితి దోషం
2) సమస్వర రాహిత్య దోషం
3) సమవేగ రాహిత్య దోషం, ధారళతాలోపం
4) వేగోచ్ఛారణ దోషం, ధ్వనులను తారుమారు చేసే దోషం - విద్యార్థుల్లో ఉచ్ఛారణా దోషాలు ఏర్పడటానికి కారణం కానిది? (టీజీటీ 2019)
1) వాగింద్రియ లోపం
2) వాగింద్రియ అపరిక్వత
3) పరిసర ప్రభావం 4) శ్రద్ధ - వాగింద్రియ లోపం, పరిసరాల ప్రభావంవల్ల ఏర్పడే దోషాలు? (ఎల్పీ 2018)
1) ఉచ్ఛారణ దోషాలు 2) రాత దోషాలు
3) భావదోషాలు 4) లిపిదోషాలు - శ్రోతలు అనుసరించలేనంత వేగంగా మాట్లాడటం? (టెట్ 2018)
1) సమస్వర రాహిత్యం
2) సమవేగ రాహిత్య
3) వేగోచ్ఛారణ దోషం 4) తాలవ్యీకరణ - పిల్లలు మాట్లాడేటప్పుడు మొదట నెమ్మదిగా మొదలుపెట్టి పోను పోను వేగం ఎక్కువ చేసి చివరలో అస్పష్టంగా అర్థరహితంగా మాట్లాడే దోషం?
1) సమస్వర రాహిత్య దోషం
2) వేగోచ్ఛారణ దోషం
3) ధ్వనుల తారుమారు చేసే దోషం
4) సమవేగ రాహిత్య దోషం - ‘కొందరు మాట్లాడేటప్పుడు మొదట బాగా వినబడేటట్లు మొదలుపెట్టి క్రమక్రమంగా స్వరాన్ని తగ్గించి మాట్లాడటం’ అనేది? (టెట్ 2018)
1) సమవేగ రాహిత్య దోషం
2) సమస్వర రాహిత్య దోషం
3) వేగోచ్ఛారణ దోషం 4) అనునాసిక దోషం - వక్తకు భావాలు ఒకదాని వెంట మరొకటి స్ఫురించకపోవడం, వాటిని వ్యక్తీకరించడానికి తగిన భాష, పదసముదాయం జ్ఞప్తికి రాకపోవడం ఏ దోషానికి కారణాలు?
1) వేగోచ్ఛారణ దోషం
2) ధ్వనులను తారుమారు చేయడం
3) ధారాళంగా మాట్లాడలేకపోవడం
4) తాలవ్యీకరణ - భాషణంలో వర్ణమార్పిడి దోషం ఎలా ఉంటుంది? (టీజీటీ 2017, ఎస్ఏ 2018)
1) సుతిలి-తుసిలి, మిగిలిన-మిలిగిన
2) సుతిలి-త్తుస్సలి, మిగిలిన-మిలిగిన
3) సుతిలి-తుసిలి, మిగిలిన-మిగ్గిలిన
4) సుతిలి-సులితి, మిలిగిన-మిల్లిగ్గిన
లోక్నాథ్ రెడ్డి
విషయ నిపుణులు
ఏకేఆర్ స్టడీ సర్కిల్
వికారాబాద్
Previous article
ఇష్టంతో చదివారు.. ఇలా గెలిచారు
Next article
కాకతీయుల కాలం నాటి ప్రఖ్యాత నృత్యం?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు