ఆస్ట్రేలియా విద్యతో అంతర్జాతీయ భవిష్యత్తు
ఆస్ట్రేలియా ప్రపంచంలోనే అతి చిన్న ఖండం. ఒక ద్వీపం లాగా నీటితో పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రంతో చుట్టి ఉంది. అడవులు, ఎడారులు, కొండ ప్రాంతాలతో ఉన్నచోటు. గ్రేట్ బారియర్ రీఫ్ వంటి అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఆధునికంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశం. ప్రపంచ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ర్యాంక్ 12. ఫైనాన్స్, బ్యాంకింగ్, మైనింగ్, హెల్త్‌కేర్, రిటైల్ వంటి అనేక రంగాల్లో ఎన్నో అవకాశాలు గల దేశం. ఆస్ట్రేలియా. ఇక్కడి ప్రధాన భాష ఇంగ్లిష్. 2017లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం సుమారు 6.1 % జనాభా హిందీ, 5% జనాభా పంజాబీ మాట్లాడేవారు ఉన్నారని తేలింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ విడుదల చేసే గ్లోబల్ పీస్ ఇండెక్స్ ర్యాంకింగ్‌లో కూడా ఆస్ట్రేలియా టాప్ 20లో ఉంది.
ఆస్ట్రేలియాకు వివిధ దేశాల నుంచి విద్యార్థులు చదువుకోడానికి వస్తుంటారు. 2019లో విడుదలైన OECD రిపోర్ట్ ప్రకారం ఆస్ట్రేలియాలో జరిగే తృతీయ స్థాయి అడ్మిషన్లలో 21% ఇంటర్నేషనల్ స్టూడెంట్సే ఉన్నారు. ఇందులో 14% మంది బ్యాచిలర్స్ లేదా దానికి సమానమైన కోర్సుల్లో, 48% మంది మాస్టర్స్ ప్రోగ్రాంలో, 34% మంది డాక్టోరల్ కోర్సుల్లో చేరుతున్నారు.
2019 లెకల ప్రకారం సుమారు 40 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు ఆస్ట్రేలియన్ ఎకానమీకి విదేశీ విద్యార్థులు కాంట్రిబ్యూట్ చేశారు. పాండమిక్ వల్ల 2021లో అది సగానికి తగ్గింది. దీనివల్ల సుమారు 17,000 ఉద్యోగాలపై ప్రభావం చూపింది. ఆస్ట్రేలియన్ బోర్డర్స్ తెరుచుకోవడంలో ఆలస్యం కావడం వల్ల కనీసం 2022లో అయినా పరిస్థితులు మెరుగుపడవచ్చు. 2021 ప్రారంభంలో పాండమిక్ వల్ల ఇంటర్నేషనల్ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించామని, అలాగే డొమెస్టిక్ ఎన్రోల్మెంట్స్ పై ఎకువ శ్రద్ధ పెట్టాలని ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ సూచించినట్లు ఒక పత్రికలో వెలువడింది.
ఆస్ట్రేలియాలోనే ఎందుకు చదవాలి?
ఆస్ట్రేలియా ప్రస్తుతం ప్రపంచంలో ఇంగ్లిష్ మాట్లాడే దేశాల్లో అంతర్జాతీయ విద్యార్థులకు అత్యంత ప్రజాదరణ పొందిన గమ్యస్థానాల్లో టాప్‌లో ఉంది. ఆస్ట్రేలియాలో సుమారు 20,000 కోర్సులను 1100 విద్యాసంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. ప్రపంచంలో టాప్ 100 యూనివర్సిటీల్లో 6 విశ్వవిద్యాలయాలు ఆస్ట్రేలియాలో ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్ వంటి వాటిలో విద్యార్థులు ఎకువగా చదవడానికి ఇష్టపడుతున్నారు.
సాంస్కృతిక వైవిధ్యం, స్నేహపూర్వక స్థానికులు, అధిక నాణ్యత గల విద్య కారణంగా చాలామంది ఆస్ట్రేలియాలో చదవడానికి వెళ్తున్నారు.
ఆస్ట్రేలియాలో చదివిన విద్యకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉండటంవల్ల కూడా మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
విద్యపై ఆస్ట్రేలియా ఎంతో ధనం వెచ్చిస్తుంది. టెర్షియరీ విద్యపై వెచ్చించిన దానిలో సుమారు మూడో భాగం రిసెర్చ్ కోసం కేటాయించింది. మంచి రిసెర్చ్ ఫెసిలిటీస్ అకడ ఉన్నాయి.
ఆస్ట్రేలియా నుంచి విదేశాలకు వెళ్లిన ప్రతి ఒక స్టూడెంట్‌కు సుమారు 28 మంది విదేశీ విద్యార్థులు ఆస్ట్రేలియాకు వస్తున్నారు. దీనిలో అధికంగా ఆసియా నుంచి ఉన్నారు. చైనా నుంచి 34%, భారత్ నుంచి 14% ఉన్నారు.
ఆస్ట్రేలియాలో కాలేజీ తరగతులు నడుస్తున్న సమయంలో, విదేశీ విద్యార్థులు సుమారు 20 గంటలు పనిచేయవచ్చు. అదే వెకేషన్ సమయంలో అధికంగా పనిచేయవచ్చు. దీనివల్ల కొంత లివింగ్ ఎక్స్పెన్సెస్ విషయంలో ఉపయోగపడుతుంది. అలాగే చదువుతున్న కోర్సుకు సంబంధించిన ఉద్యోగం చేస్తే అనుభవం కలుగుతుంది.
టాప్ డెస్టినేషన్ నగరాలు
ప్రపంచంలోని టాప్ 75 నగరాల్లో QS ర్యాంకింగ్స్ ప్రకారం 7 నగరాలు ఆస్ట్రేలియాలో ఉన్నాయి.
మెల్బోర్న్: ఆస్ట్రేలియా బెస్ట్ సిటీస్‌లో టాప్ స్థానంలో ఉంది. టాప్ ఇంటర్నేషనల్ బెస్ట్ సిటీ ర్యాంక్ 6. కోస్టల్ సిటీ అయిన మెల్బోర్న్ ఆస్ట్రేలియాలోని అధిక జనాభా గల నగరాల్లో ఒకటి. మ్యూజిక్, ఆర్ట్, మ్యూజియాలకు ఫేమస్. ఆస్ట్రేలియాకు కల్చరల్ క్యాపిటల్‌గా కూడా దీనికి పేరుంది. ఇకడ ఉన్న హై స్టాండర్ ఆఫ్ లివింగ్, ఉద్యోగ అవకాశాలు వల్ల వివిధ దేశాల నుంచి విద్యార్థులు ఇకడి టాప్ యూనివర్సిటీల్లో చదవడానికి వస్తారు. మెల్బోర్న్ యూనివర్సిటీ, RMIT విశ్వవిద్యాలయం, లా ట్రోబ్ విశ్వవిద్యాలయం, మోనాష్ విశ్వవిద్యాలయం, విక్టోరియా యూనివర్సిటీ ఇకడ ఉన్న ప్రముఖ విశ్వవిద్యాలయాలు.
సిడ్నీ: సుమారు 200 సంవత్సరాల క్రితం స్థాపించిన ఈ నగరం ఆస్ట్రేలియాలోని ప్రముఖ, అధిక జనాభా గల నగరాల్లో ఒకటి. టాప్ ఇంటర్నేషనల్ బెస్ట్ సిటీ ర్యాంక్ 8. సిడ్నీ ఒపెరా హౌస్, హార్బర్ బ్రిడ్జి వంటి అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. సుమారు 180 దేశాల నుంచి వచ్చిన ప్రజలు ఇకడ ఉంటున్నారు. ప్రముఖ విశ్వవిద్యాలయాలు.. మాక్వేరీ యూనివర్సిటీ, న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం, సిడ్నీ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీ, వెస్టర్న్ సిడ్నీ ఆస్ట్రేలియా.
కాన్బెర్రా: ఆస్ట్రేలియా రాజధాని అయిన ఈ మహానగరం, వివిధ సంస్కృతుల నుంచి విద్యార్థులను ఆకర్షిస్తుంది. ప్రతి సంవత్సరం కనీసం 100 దేశాల నుంచి 19,000 మంది విద్యార్థులకు ఈ నగరం స్వాగతం పలుకుతుంది. ఇకడి నేచర్ రిజర్వ్స్, సరస్సులు, కొండ ప్రాంతాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. అమెరికాలోని న్యూయార్ కంటే ఇకడ 24% ఖర్చు తకువని అంచనా. ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ, కాన్బెర్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్బెర్రా విశ్వవిద్యాలయం, UNSW కాన్బెర్రా ఇకడి ప్రముఖ విద్యాలయాలు
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాలో థర్డ్ మోస్ట్ పాపులేటెడ్ సిటీ అయిన ఈ నగరం బ్రిస్బేన్ నదిపై ఉంది. వాతావరణం బాగుండటం వల్ల అవుట్ డోర్ యాక్టివిటీస్ ఎక్కువ. ఎన్నో అందమైన బీచ్‌లున్నాయి. ఈ నగరం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుంది. బ్రిస్బేన్‌లో రెంట్ సిడ్నీ కంటే 36% తకువ. చకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంతో ఇది విద్యార్థులకు ఫ్రెండ్లీ సిటీ అయ్యింది. క్వీన్స్‌ల్యాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, క్వీన్స్‌ల్యాండ్ విశ్వవిద్యాలయం ఇకడి ప్రముఖ విశ్వవిద్యాలయాలు.
అడిలైడ్: ఇది ఆస్ట్రేలియాలోని 5వ మహానగరం. ఓపెన్ స్థలాలు, బౌలేవార్డులు, వైన్యార్డ్స్ గల అందమైన నగరం. హైకింగ్, సైక్లింగ్ ఇతర వైల్డ్‌లైఫ్ యాక్టివిటీలు ఎకువ. అడిలైడ్ విశ్వవిద్యాలయం, దక్షిణ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం, ఫ్లిండర్స్ విశ్వవిద్యాలయం ఇకడి ప్రముఖ యూనివర్సిటీలు. ఇకడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తకువ కాబట్టి సుమారు 20,000 మంది ఇంటర్నేషనల్ విద్యార్థులు ఇకడికి వస్తుంటారు.
పెర్త్: స్వాన్ రివర్, సౌత్‌వెస్ట్ కోస్ట్ కలిసే ప్రాంతంలో ఉన్న ఈ నగరం సిడ్నీ మెల్బోర్న్కు 2000 మైళ్ల దూరంలో ఉంది. బొటానికల్ గార్డెన్, బీచ్, హార్బర్, జూ ఉన్నాయి. వివిధ దేశాల ప్రజలు ఉండటం వల్ల వివిధ రకాల భోజనం కూడా ఇకడ దొరుకుతుంది. యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా, కర్టిన్ యూనివర్సిటీ ఇకడి ప్రముఖ కళాశాలలు.
గోల్డ్‌కోస్ట్: బ్రిస్బేన్‌కి దక్షిణ భాగాన ఉన్న ఈ నగరం ఒక సన్నీ సిటీ. సుమారు 300 రోజులు సన్నీ డేస్ ఉంటాయి. ఇది సర్ఫర్లు ఇష్టపడే ప్రదేశం. ఫారెస్ట్, బీచ్, వాటర్‌ఫాల్స్ వంటి అనేక ప్రదేశాలున్నాయి. గ్రిఫిత్ యూనివర్సిటీ, బాండ్ యూనివర్సిటీ ఇకడి ప్రముఖ విశ్వవిద్యాలయాలు.
ఆస్ట్రేలియాలో హౌసింగ్ కోసం అత్యంత ఖరీదైన ప్రదేశం సిడ్నీ. యుటిలిటీలతో సహా మెల్బోర్న్ ధర కన్నా ఎకువ. ఇది రెండో అత్యంత ఖరీదైన నగరం. ఆస్ట్రేలియాలోని ప్రధాన నగరాల్లో తక్కువ ఖర్చుతో నివాసయోగ్యమైన నగరం అడిలైడ్.
టాప్ యూనివర్సిటీలు
ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ: ఇది ఆస్ట్రేలియాలో మొదటి స్థానంలో ఉంది. QS ర్యాంకింగ్ ప్రకారం గ్లోబల్ ర్యాంక్ 36. కాన్బెర్రాలో ఉన్న ఈ పబ్లిక్ యూనివర్సిటీ సుమారు 56 అండర్ గ్రాడ్యుయేట్, 120కి పైగా పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్‌ని ఆఫర్ చేస్తుంది. అడ్మిషన్ రేట్ 35% ఉంటుంది. సుమారు 35% పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు. మొత్తం కనీసం 27% విదేశీ విద్యార్థులు.
యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ: 1850లో ప్రారంభమైన ఈ యూనివర్సిటీ ఆస్ట్రేలియాలోని ప్రాచీనమైన యూనివర్సిటీల్లో ఒకటి. ఇకడ 400కు పైగా రంగాల్లో విద్యను బోధిస్తున్నారు. అడ్మిషన్ యాక్సెప్టెన్స్ 30%. ఇకడ చదువుతున్నవారిలో 22% మంది విద్యార్థులు విదేశీయులు.
QS ర్యాంకింగ్ ప్రకారం గ్లోబల్ ర్యాంక్ 40.
యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్: 1853లో ప్రారంభమైన ఈ యూనివర్సిటీ ఆస్ట్రేలియాలోని రెండో ప్రాచీనమైన విశ్వవిద్యాలయం. QS ర్యాంకింగ్ ప్రకారం గ్లోబల్ ర్యాంక్ 41. ఇకడ చదువుతున్న వారిలో 27% మంది విద్యార్థులు విదేశీయులు. ఇకడ అడ్మిషన్ మొదటి కాలేజీలతో పోలిస్తే సులభమే.
యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్‌వేల్స్: సిడ్నీలోని ఈ యూనివర్సిటీలో చదివినవారి ఎంప్లాయ్మెంట్ అవకాశాలు బాగున్నాయి. ఇది ఆస్ట్రేలియాలోని ప్రముఖ పబ్లిక్ రిసెర్చ్ యూనివర్సిటీల్లో ఒకటి. అడ్మిషన్ యాక్సెప్టెన్సీ సుమారు 30%. సుమారు 130 దేశాల నుంచి ఇకడికి ఇంజినీరింగ్, బిజినెస్, లా, ఆర్ట్, ఆరిటెక్చర్ వంటి అనేక కోర్సులు చేయడానికి వస్తుంటారు. QS ర్యాంకింగ్ ప్రకారం గ్లోబల్ ర్యాంక్ 44.
యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌ల్యాండ్: 1909లో ప్రారంభించిన ఈ యూనివర్సిటీ బ్రిస్బేన్‌లో ఉంది. 23% విద్యార్థులు విదేశాల నుంచి వచ్చినవారే. సుమారు 130కు పైగా దేశాల నుంచి విద్యార్థులు ఏటా ఇకడ చదువుకుంటారు. అలాగే ఇకడ చదివినవారిలో నోబెల్ గ్రహీతలు కూడా ఉన్నారు. QS ర్యాంకింగ్ ప్రకారం గ్లోబల్ ర్యాంక్ 46.
ఇతర యూనివర్సిటీలు
మోనాష్ యూనివర్సిటీ (గ్లోబల్ ర్యాంక్ 55)
యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా (గ్లోబల్ ర్యాంక్ 92) యూనివర్సిటీ ఆఫ్అడిలైడ్ (గ్లోబల్ ర్యాంక్ 106)
యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీ (గ్లోబల్ ర్యాంక్ 133)
యూనివర్సిటీ ఆఫ్ ఒల్లోంగాంగ్ (గ్లోబల్ ర్యాంక్ 196)
యూనివర్సిటీ ఆఫ్ న్యూ క్యాజిల్, ఆస్ట్రేలియా (UON)
మాక్వేరీ విశ్వవిద్యాలయం
కర్టిన్ విశ్వవిద్యాలయం
క్వీన్స్‌ల్యాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ(QUT)
RMIT విశ్వవిద్యాలయం
డైకిన్ విశ్వవిద్యాలయం
యూనివర్సిటీ ఆఫ్ సదరన్ ఆస్ట్రేలియా (యూనిసా)
గ్రిఫిత్ విశ్వవిద్యాలయం
ఆస్ట్రేలియాలో చదువుకోసం సాధారణంగా ఇంగ్లిష్ లాంగ్వేజ్ పరీక్షలైన IELTS, TOEFL, PTE వంటివి రాస్తారు. జాయిన్ అవ్వాలనుకుంటున్న కాలేజీకి అవసరమైన పరీక్షలు తెలుసుకొని రాయండి.
వీసా కోసం సంవత్సరానికి కనీసం 21,041 ఆస్ట్రేలియన్ డాలర్ల జీవన వ్యయాన్ని భరించే ఆర్థిక సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని చూపించాలి. ఇంటి నుంచి దూరంగా నివసిస్తున్న విద్యార్థికి వసతి, ఆహారం, వినియోగాలు, వినోదం కోసం నెలకు కనీసం $ 1,754 అవసరం. ఈ వ్యయాలు జీవనశైలి, అవసరాలపై కూడా ఆధారపడి ఉంటాయి.
అధికారిక ప్రభుత్వ సైట్ ప్రకారం అంతర్జాతీయ విద్యార్థులు ఆస్ట్రేలియాలో చదువు కోసం సాధారణ వార్షిక ట్యూషన్ ఫీజులు కనీసం మాస్టర్స్ డిగ్రీ.. ఆస్ట్రేలియన్ డాలర్ 20,000 (US $ 14,400) నుంచి $ 37,000 (US $ 26,600). డాక్టోరల్ డిగ్రీ.. ఆస్ట్రేలియన్ డాలర్ $ 14,000 (US $ 10,060) నుంచి $ 37,000 (US $ 26,600) ఉంటుంది.
యూనివర్సిటీ అడ్మిషన్ డెడ్‌లైన్ జాగ్రత్తగా గమనించాలి. సాధారణంగా అక్టోబర్-నవంబర్, ఏప్రిల్-మే నెలలో అప్లికేషన్స్ ఓపెన్ అవచ్చు. అడ్మిషన్ వచ్చిన తర్వాత కోర్స్ స్టార్ట్ అవడానికి కనీసం 6 వారాల కన్నా ముందు వీసాకు అప్లయ్ చేసుకోవాలి.
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు