నిమ్స్‌లో ఎంహెచ్ఎం కోర్సు
నిజామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఎయిమ్స్ తర్వాత అంతటి ప్రాచుర్యాన్ని పొందిన ప్రభుత్వ ఆస్పత్రి. ప్రపంచ శ్రేణి వైద్యం, విద్యాబోధన ఇక్కడి విశిష్టత. వైద్య రంగంలో ఎందరో నిష్ణాతులను ఉత్తమైన స్పెషలిస్టులను తీర్చిదిద్దిన ఘనత నిమ్స్‌కు ఉంది. 2004లో ప్రవేశపెట్టిన మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ (ఎంహెచ్ఎం) కోర్సుకు ఉన్న క్రేజీ అంతా ఇంతా కాదు. ప్రతి ఏడాది ఎందరో విద్యార్థులు ఇక్కడ కోర్సు పూర్తి చేసుకొని మంచి వేతనాలతో కూడిన ఉన్నతమైన ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అలాంటి నిమ్స్ ఎంహెచ్ఎం కోర్సులో
ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైన
నేపథ్యంలో ఆవివరాలు.. ఎంహెచ్ఎం
- ఈ కోర్సును దేశంలోనే మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఇన్స్టిట్యూట్ నిమ్స్. 2004లో మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ (ఎంహెచ్ఎం) కోర్సును ప్రారంభించారు. నిమ్స్‌కు దేశంలో ప్రభుత్వ అనుబంధ వైద్యశాల నడిపే ఏకైక సంస్థగా గుర్తింపు ఉంది.
- కోర్సు వ్యవధి: రెండున్నర సంవత్సరాలు. ఆరు నెలల ఇంటర్న్‌షిప్.
- మొత్తం సీట్లు: 20
- ఫీజు: రూ.1.21లక్షలు
- ఫీజు రియింబర్స్‌మెంట్: అర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు రియింబర్స్‌మెంట్ సౌకర్యాన్ని కల్పించారు. కాబట్టి ఎంహెచ్ఎం కోర్సు విద్యార్థులందరికీ ఈ సౌకర్యం ఉంటుంది. ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితం.
- అర్హత: ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ (డిగ్రీ) పూర్తి చేసి ఉండాలి.
- అర్హత మార్కులు: ఓసీ విద్యార్థులకు 40 శాతం, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 30 శాతం ఉండాలి.
- వయోపరిమితి: 20-30 ఏండ్ల మధ్య ఉన్నవారు అర్హులు.
- ఉద్యోగవకాశాలు: హాస్పిటల్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, మెడికల్ టూరిజం, ఫార్మా, డయాగ్నస్టిక్స్, ట్యూటర్, మెడికల్ ఎన్జీఓ, రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్, మెడికల్ కాలేజీ, ప్రభుత్వ, ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు లభిస్తాయి.
- వేతనం: ప్రారంభంలో రూ.25 వేల నుంచి రూ.40 వేలకు పైగా ఇస్తున్నారు. సంవత్సరానికి కనీసం రూ.5 లక్షలకు వరకు ఉంటుంది.
- విజిటింగ్ ఫ్యాకల్టీలు: ఉస్మానియా మెడికల్ కాలేజీ, ఉస్మానియా హాస్పిటల్, శివశివానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్, విశ్వవిశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్
- కోర్సు సబ్జెక్టులు: స్టాటిటిక్స్, అకౌంట్స్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్, హాస్పిటల్ ప్లానింగ్, మార్కెటింగ్, రిసెర్చ్ మెథడాలజీ, క్వాలిటీ కంట్రోల్, హాస్పిటల్ లా.
- ఎంట్రన్స్ పరీక్షలో సబ్జెలు: హెల్త్ కేర్, అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్, జీకే, ఐక్యూ, ఇంగ్లిష్
- అంతర్జాతీయ శ్రేణిలో తరగతిగదులు: మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సులో చేరినవారికి అంతర్జాతీయ శ్రేణిలో తరగతులు నిర్వహిస్తారు. అందుకోసం స్పెషలైజ్డ్ గదులను ఏర్పాటు చేశారు. డిజిటల్ విద్యాబోధన, వైఫై సౌకర్యం, లైబ్రరీ లాంటి సౌకర్యాలు ఉన్నాయి.
- ఈ కోర్సు 2021 విద్యాసంవత్సరానికి గాను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 16 చివరితేదీ. తెలంగాణవారు ఈ నెల 20 సాయంత్రం 5గంటల్లోగా అసోసియేట్ డీన్, అకడమిక్-2, 2వ అంతస్తు, ఓల్డ్ ఓబీపీ బ్లాక్, నిమ్స్ హాస్పిటల్లో దరఖాస్తులను సమర్పించాలి. ఇతర వివరాలకు www.nims.edu.in వెబ్‌సైట్‌ను చూడవచ్చు.
- కోర్సు వివరాల కోసం కింది వారిని సంప్రదించవచ్చు.
- డాక్టర్ హరిత: 9642928910
- ఐశ్వర్య: 6303113857
- శ్రీలత: 9010889110
- ఉమామహేశ్వరి: 9491454723
సీఈఓ, జనరల్ మేనజర్లుగా…
నిమ్స్ దవాఖానలో 2004లో ఈ కోర్సును ప్రారంభించాం. 20 సీట్లు కలిగిన ఈ కోర్సులో చేరేందుకు 100 మార్కులకు ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తాం. పూర్తి పారదర్శకంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తాం. 250 మందికి పైగా ఈ కోర్సు పూర్తిచేసి సీఈఓ, జనరల్ మేనేనజర్ల హోదాలో పనిచేస్తున్నారు. శిక్షణ తీసుకుంటున్నవారికి ఆర్నెళ్ల పాటు ఆన్ జాబ్ ట్రెయినింగ్ పీరియడ్ ఉంటుంది. నిమ్స్‌లోనే వివిధ విభాగాల్లో పనిచేయిస్తూ శిక్షణ ఇస్తాం. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తరగతులు ఉంటాయి.
- డాక్టర్ మార్త రమేశ్, అకడమిక్ ఇన్చార్జీ
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు