అసఫ్‌జాహీల తొలి రాజధాని ఏది?
అసఫ్జాహీలు (1724-1948) 1687 నుంచి 1724 వరకు అంటే కుతుబ్‌షాహీల సామ్రాజ్యం పతనానంతరం హైదరాబాద్ మొఘల్‌ల ఆధిపత్యం కిందకు వచ్చింది. అనంతరం హైదరాబాద్, దక్కన్ పీఠభూమిలో కృష్ణా, గోదావరి నదుల మధ్య ఉన్న విశాలమైన ప్రాంతాలు (కర్నాటక, మరాఠ్వాడ) అసఫ్‌జాహీల పరిపాలనలోకి వచ్చాయి. వీరు టర్కీలోని ‘తురాని తెగకు’ చెందినవారు.
నిజాం-ఉల్-ముల్క్ (1724-48)
- ఇతను అసఫ్‌జాహీ వంశ స్థాపకుడు
- ఇతని అసలు పేరు మీర్ కమ్రుద్దీన్ ఖాన్
- ఇతని జన్మ వృత్తాంతాన్ని వివరించిన జోస్యులు ఇతడిని ‘నేక్భక్త్’ (అదృష్టవంతుడు)గా చెప్పారు.
- ఇతడిని ఔరంగజేబు 4వేల సేనకు మున్సబ్దారునిగా నియమించి ‘చిన్ కిలిచ్ ఖాన్’ అనే బిరుదు ఇచ్చాడు.
- ఫరూఖ్ సియర్ 7వేల సేనకు ఇతడిని మున్సబ్దారునిగా నియమించి ఫతేజంగ్, నిజాం ఉల్ ముల్క్ అనే బిరుదు ఇచ్చాడు.
- మహ్మద్ షా 8వేల సేనకు ఇతడిని మున్సబ్దారునిగా నియమించి ‘అసఫ్‌జా’ అనే బిరుదు ఇచ్చాడు.
- 1724లో ‘శక్కర్ ఖేడా’ యుద్ధంలో ముబారిజ్ ఖాన్‌ను ఓడించి ఔరంగాబాద్‌ను రాజధానిగా చేసుకొని అసఫ్‌జాహీ రాజ్యాన్ని స్థాపించాడు.
- 1739లో ‘కర్నాల్’ యుద్ధంలో పర్షియా రాజు ‘నాదిర్షా’ మొఘల్సైన్యాన్ని ఓడించగా నాదిర్షాకు, మొఘలులకు మధ్య శాంతి ఒప్పందం కుదర్చడంలో
- ‘నిజాం-ఉల్-ముల్క్’ కీలకపాత్ర పోషించాడు.
- ఈ ఒప్పందం ప్రకారం కోహినూర్ వజ్రం, నెమలి సింహాసనాన్ని నాదిర్షాకు మొఘల్ రాజులు ఇచ్చారు.
- 1748లో ఢిల్లీపై అహ్మద్‌షా అబ్దాలీ దండెత్తగా మహ్మద్‌షా రంగీలాలకు సహాయం చేయడానికి వెళుతూ బుర్హాన్పూర్ దగ్గర అనారోగ్యానికి గురై మరణించాడు.
నాజర్‌జంగ్ (1748-50)
- ఇతను నిజాం-ఉల్-ముల్క్ రెండో
- కుమారుడు
- మొఘల్ చక్రవర్తితో ‘నిజాం ఉద్దౌలా’ అనే బిరుదును పొంది దక్కన్ సుబేదార్ అయ్యాడు.
- నిజాం-ఉల్-ముల్క్ మరణానంతరం నాజర్‌జంగ్‌కు తన మేనల్లుడైన ముజఫర్జంగ్తో వారసత్వ యుద్దం మొదలైంది.
- ముజఫర్ జంగ్, ఫ్రెంచి గవర్నర్ డూప్లేలు కుట్ర చేసి నాజర్‌జంగ్‌ను చంపించారు.
ముజఫర్ జంగ్ (1750-51)
- ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే సహాయంతో ముజఫర్‌జంగ్ నవాబుగా నియమితులయ్యాడు.
- ఇతను ఫ్రెంచ్ వారికి మచిలీపట్నం, యానాం, దివి ప్రాంతాలను బహుమానంగా ఇచ్చాడు.
- 1751లో పాండిచ్చేరి నుంచి ఔరంగాబాద్ వెళ్తున్నప్పుడు కడపలోని రాయచోటి ‘లక్కిరెడ్డిపల్లి’ దగ్గర కడప నవాబు హిమ్మత్ఖాన్ ముజఫర్ జంగ్‌ను చంపేశాడు. దీంతో
- హైదరాబాద్‌లో ఫ్రెంచి అధికారి బుస్సీ ‘సలాబత్ జంగ్‌ను’ హైదరాబాద్ నవాబుగా చేశాడు.
- సలాబత్ జంగ్ (1751-61)
- ఇతడు నాజర్‌జంగ్ తమ్ముడు. ఇతడు నవాబు అయిన తర్వాత ఫ్రెంచి వారికి కొండపల్లి, గుంటూరు, ఏలూరు, రాజమండ్రి, చికాకోల్ మొదలైన కోస్తా ప్రాంతాలను ఇచ్చాడు.
- దక్షిణ కృష్ణా ప్రాంతంపై డూప్లేను గవర్నర్‌గా నియమించాడు. ఈ విధంగా దక్కన్లో ఫ్రెంచివారి ప్రతిష్ట ఇనుమడించింది. తర్వాత దక్కన్లో బ్రిటిష్‌వారి ప్రాబల్యం పెరగగానే సలాబత్
- జంగ్ 1759లో పై ప్రాంతాలను ఫ్రెంచివారి నుంచి తిరిగి తీసుకొని ఇంగ్లిష్ వారికి బహూకరించాడు.
- ఇతడి కాలంలో బొబ్బిలి యుద్ధం (1757), చందుర్తి యుద్ధం (1758) జరిగాయి.
నిజాం అలీఖాన్ (1761-1803)
- ఇతడు తన అన్న సలాబత్‌జంగ్‌ను బంధించి హత్య చేయించిన తర్వాత ‘హైదరాబాద్ నిజామ్‌గా’ ప్రకటించుకున్నాడు.
- ఇలా నిజామ్‌గా ప్రకటించుకున్న మొదటి పాలకుడు నిజాం అలీఖాన్.
- నాటి నుంచి నిజాం బిరుదు వంశపారంపర్యంగా రావడం ప్రారంభమైంది.
- ఇతడిని ‘రెండో అసఫ్‌జా’ అని కూడా పిలుస్తారు.
- కాండ్రేగుల జోగిపంతులు దౌత్యంలో ఆంగ్లేయులకు నిజాం అలీఖాన్ తొమ్మిది లక్షల రూపాయలు గుత్తానికి ఐదు ఉత్తర సర్కారులను ఇచ్చాడు.
- నిజాం అలీ లార్డ్ వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్యసహకార ఒప్పందంలో సెప్టెంబర్ 1, 1798లో చేరాడు. ఇలా మొట్టమొదటగా చేరిన స్వదేశీ రాజుగా గుర్తింపుపొందాడు.
- నిజాం ఈ ఒప్పందంలో చేరడానికి ‘కిర్క్ పాట్రిక్’ కీలకపాత్ర పోషించాడు.
- ఒప్పందానికి పూర్వం నిజాం పాలనలో రెండు ఆంగ్ల సైనిక పటాలాలు ఉండేవి. దానికి తోడు ఒప్పందం ప్రకారం మరో ఆరు సైనిక పటాలాలు సమకూర్చారు.
- ఈ ఆరు సైనిక పటాలాలకయ్యే ఖర్చు కింద ఏటా 24,17,100 రూపాయలు నిజాం చెల్లించాలి.
- ఇతని కాలంలో కిర్క్ పాట్రిక్ హైదరాబాద్‌లో బ్రిటిష్ రెసిడెన్సీ భవనాన్ని ‘ఖైరున్నిసా’ కోసం నిర్మించారు.
- ఇతని కాలంలో ఫ్రెంచ్ అధికారి రేమండ్‌ను ‘మూసారాముడిగా’ పిలిచేవారు. ఇతని పేరుమీదుగానే ‘మూసారాంబాగ్’ ఏర్పడింది.
- నిజాం అలీ సహాయంతో రేమండ్ గన్‌ఫౌండ్రీని ఏర్పాటు చేశాడు.
ప్రాక్టీస్ బిట్స్
- కుతుబ్‌షాహీల కాలంలో ఆదరణ పొందిన ప్రముఖ యక్షగానం?
ఎ) సుగ్రీవ విజయం
బి) నిరంకుశోపాఖ్యానం
సి) మార్కండేయ పురాణం
డి) శశిబిందు చరిత్ర - కూచిపూడి భాగవతులకు కూచిపూడి గ్రామాన్ని ఇనామ్‌గా ఇచ్చిన కుతుబ్‌షాహీ పాలకుడు?
ఎ) ఇబ్రహీం కుతుబ్‌షా
బి) అబుల్ హసన్ తానీషా
సి) మహ్మద్ కులీకుతుబ్‌షా
డి) అబ్దుల్లా కుతుబ్‌షా - కుతుబ్‌షాహీల కాలం నాటి రవాణా సాధనాలు, రాజమార్గాల గురించి పేర్కొన్న ఫ్రెంచి యాత్రికుడు?
ఎ) ట్రావెర్నియార్ బి) థేవ్‌నాట్
సి) బెర్నియార్ డి) నికోలా కాంటి - మొఘల్ చక్రవర్తి అక్బర్ తన రాయబారిగా మసూద్బేగ్ను ఎవరి ఆస్థానానికి పంపాడు?
ఎ) సుల్తాన్ మహ్మద్ కుతుబ్‌షా
బి) అబ్దుల్లా కుతుబ్‌షా
సి) మహ్మద్ కులీకుతుబ్‌షా
డి) జంషీద్ కులీకుతుబ్‌షా - ఇబ్రహీం కుతుబ్‌షా ‘రెంటచింతల’ లేదా ‘చింతలపాలెం’ అనే గ్రామాన్ని ఎవరికి దానం చేశారు?
ఎ) అద్దంకి గంగాధర కవి
బి) కందుకూరి రుద్రకవి
సి) మరింగంటి సింగనాచార్యుడు
డి) పొన్నెగంటి తెలగనార్యుడు - ఆంగ్లేయులకు బంగారు ఫర్మానా జారీ చేసిన కుతుబ్‌షాహీ పాలకుడు?
ఎ) అబ్దుల్లా కుతుబ్‌షా
బి) అబుల్ హసన్ తానీషా
సి) మహ్మద్ కులీకుతుబ్‌షా
డి) ఇబ్రహీం కుతుబ్‌షా - జతపర్చండి
- అద్దంకి గంగాధర కవి
ఎ. నిరంకుశోపాఖ్యానం - కందుకూరి రుద్రకవి
బి. తపతీ సంవరణోపాఖ్యానం - పొన్నెగంటి తెలగనార్యుడు
సి. వైజయంతీ విలాసం - సారంగు తమ్మయ్య
డి. యయాతి చరిత్ర
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
సి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
డి) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
- అద్దంకి గంగాధర కవి
- నిజాం-ఉల్-ముల్క్కు ‘చిన్ కిలిచ్ఖాన్’ అనే బిరుదు ఇచ్చిన మొఘల్ చక్రవర్తి?
ఎ) ఫరూక్ సియర్ బి) మహ్మద్ షా
సి) ఔరంగజేబు డి) అహ్మద్‌షా - అసఫ్‌జాహీల తొలి రాజధాని?
ఎ) ఔరంగాబాద్ బి) బీజాపూర్
సి) గోల్కొండ డి) దౌలతాబాద్ - ఉత్తర సర్కార్లను ఫ్రెంచి వారికి ఇచ్చిన నిజాం?
ఎ) ముజఫర్‌జంగ్ బి) సలాబత్ జంగ్
సి) నాజర్ జంగ్
డి) నిజాం ఉల్ ముల్క్ - బొబ్బిలి యుద్ధం-1757, చందుర్తి యుద్ధం-1758 ఏ నిజాం కాలంలో
జరిగాయి?
ఎ) మీర్ కమ్రుద్దీన్ బి) నిజాం అలీఖాన్
సి) సలాబత్ జంగ్ డి) ముజఫర్ జంగ్ - ‘రెండో అసఫ్‌జా’ అని ఏ నిజాం రాజును పిలుస్తారు?
ఎ) నిజాం అలీఖాన్ బి) సలాబత్ జంగ్
సి) సికిందర్జా డి) నాసిరుద్దౌలా - ఫ్రెంచ్‌వారికి మచిలీపట్నం, యానాం, దివి ప్రాంతాలను బహుమానంగా ఇచ్చింది?
ఎ) నిజాం అలీఖాన్ బి) ముజఫర్ జంగ్
సి) సికిందర్జా
డి) నిజాం ఉల్ ముల్క్ - లార్డ్ వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్యసహకార ఒప్పందంలో చేరిన మొట్టమొదటి స్వదేశీ రాజుగా గుర్తింపుపొందిన నిజాం?
ఎ) సికిందర్జా
బి) నిజాం ఉల్ ముల్క్
సి) నిజాం అలీఖాన్
డి) నాసిరుద్దౌలా - కూచిపూడి నృత్యానికి మూలపురుషుడు?
ఎ) క్షేత్రయ్య బి) సిద్ధేంద్ర యోగి
సి) రామదాసు డి) హరిదాసు - ‘మూసారాముడిగా’ పిలిచే ఫ్రెంచ్ అధికారి ఎవరి ఆస్థానంలో ఉండేవాడు?
ఎ) నిజాం అలీఖాన్ బి) అఫ్జలుద్దౌలా
సి) సలాబత్‌సింగ్ డి) నాసిరుద్దౌలా - ఏ నిజాం రాజును కడప నవాబు ‘హిమ్మత్ఖాన్’ హత్యచేయించాడు?
ఎ) నిజాం ఉల్ ముల్క్
బి) ముజఫర్ జంగ్
సి) సలాబత్ జంగ్
డి) నిజాం అలీఖాన్ - కుతుబ్‌షాహీల కాలంలో సతీసహగమనం వంటి దురాచారాలున్నాయని తెలియజేసిన ఫ్రెంచి యాత్రికుడు?
ఎ) బెర్నియార్ బి) థేవ్‌నాట్
సి) ట్రావెర్నియార్ డి) డొమింగోపేస్ - వసంతోత్సవాలను ఏర్పాటు చేసిన కుతుబ్‌షాహీ రాజు?
ఎ) మహ్మద్ కులీకుతుబ్‌షా
బి) ఇబ్రహీం కుతుబ్‌షా
సి) అబ్దుల్లా కుతుబ్‌షా
డి) అబుల్ హసన్ తానీషా - ఎవరి కాలం నుంచి రాగి నాణేల ముద్రణ ప్రారంభమైంది?
ఎ) మహ్మద్ కులీకుతుబ్‌షా
బి) ఇబ్రహీం కుతుబ్‌షా
సి) అబ్దుల్లా కుతుబ్‌షా
డి) సుల్తాన్ మహ్మద్ కుతుబ్‌షా
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోరుట్ల
- Tags
- nipuna
- nipuna news
Previous article
సరైన ప్లానింగ్‌తో విదేశీ విద్య
Next article
హెచ్‌యూఆర్‌ఎల్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్‌లు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు