ఎస్బీఐలో పీఓ ఉద్యోగాలు-2056
డిగ్రీ ఉత్తీర్ణతతో బ్యాంక్ ఆఫీసర్‌గా ఉద్యోగం చేయాలనుకునే వారికి ఎస్బీఐ సదవకాశాన్ని ఇచ్చింది. 2056 పీఓ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ చివరి సెమిస్టర్, చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు కూడా ఎస్బీఐ అర్హత కల్పించింది. 30.12.2021 వరకు డిగ్రీ ఫలితాలు వచ్చే అవకాశమున్న అభ్యర్థులకు ఇది వర్తిస్తుంది.
దేశంలోనే ప్రథమ వాణిజ్య బ్యాంక్ అయిన ఎస్బీఐలో ఉద్యోగం పొందడానికి లక్షల మంది విద్యార్థులు ఆసక్తి చూపుతుంటారు. ఎస్బీఐ వంటి అతిపెద్ద బ్యాంకు మంచి జీతభత్యాలు, ఉద్యోగ సౌకర్యాలు, బ్యాంకింగ్ సేవలతో ప్రజలకు పథకాలు, ఆర్థిక వెసులుబాటు వంటి అవకాశాలు ఉండటం వల్ల చాలామంది నిరుద్యోగులు ఈ జాబ్ కోసం శ్రమిస్తుంటారు. దేశ వ్యాప్తంగా 2056 ఖాళీలు భర్తీ చేయనున్న ఎస్బీఐ ఈ ప్రక్రియను కేవలం 4 నెలల వ్యవధిలోనే పూర్తి చేయనుంది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్, ప్రిపరేషన్ ప్లాన్ గురించి నిపుణ పాఠకుల కోసం.. ప్రిపరేషన్
బ్యాంక్ పరీక్షల లాగానే ఈ పరీక్ష కూడా 3 అంచెల పరీక్ష. ఇందులో మొదటి రెండు రాత పరీక్షలు కాగా.. మూడోది ఇంటర్వ్యూ. పీఓ లేదా క్లర్క్ పరీక్షలో గమనించాల్సింది.. లెవల్ అన్స్టాండర్డ్స్ను, సిలబస్ పరంగా రెండు అంచెల్లో ఒకే రకమైన సబ్జెక్టులు, కామన్ టాపిక్స్ ఉంటాయి. కాబట్టి ఎగ్జామ్‌కు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఉమ్మడిగా రెండు ఫేజ్‌లకు ఒకేసారి ప్రిపరేషన్ కొనసాగించాలి.
ముందుగా సిలబస్‌ను క్షణ్ణంగా పరిశీలించి కామన్ టాపిక్స్‌ను ఎంచుకోవాలి. దీనికి పూర్వ/మెమరీ బేస్డ్ ప్రశ్నపత్రాలు ఉపయోగపడతాయి.
పరీక్ష విధానం: ఫేజ్-1 ప్రిలిమ్స్, ఫేజ్-2 మెయిన్స్. ఇవి రాత పరీక్షలు. పూర్తిగా ఆబ్జెక్టివ్‌గా ఉంటాయి. ఫేజ్-3 ఇంటర్వ్యూ. ఎంపిక ఫేజ్-1, 2లో సాధించిన మొత్తం మార్కులపై ఆధారపడి ఉంటుంది. నార్మలైజేషన్ పద్ధతి ద్వారా 100 మార్కులను స్కేల్‌గా తీసుకుంటారు.
ప్రిలిమ్స్
ఇది అర్హత పరీక్ష. ఇందులో 100 మార్కులకు మూడు విభాగాలు ఉంటాయి. ఇందులో సాధించిన మార్కులతో మెయిన్స్ అర్హత సాధిస్తారు. కానీ తుది జాబితా కోసం మార్కులను పరిగణనలోకి తీసుకోరు.
సిలబస్
- ఇంగ్లిష్ లాంగ్వేజ్-30 ప్రశ్నలు. 20 నిమిషాలు
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూట్-35 ప్రశ్నలు. 20 నిమిషాలు
- రీజనింగ్ ఎబిలిటీ-35 ప్రశ్నలు. 20 నిమిషాలు
మొత్తం100 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్ 0.25 ఉంటుంది. బ్యాంకింగ్ పరీక్షల్లో ప్రిలిమ్స్ చాలా కీలకం. ఇందులో 1:10 పద్ధతిలో మెయిన్స్‌కు అర్హత సాధిస్తారు. కాబట్టి ఈ పరీక్షను తేలికగా తీసుకోకూడదు.
మెయిన్స్
ఇది ప్రధాన పరీక్ష. ఇందులో ఉత్తీర్ణతతో పాటు మెరిట్ మార్కులు కూడా సాధించాలి. ఇంటర్వ్యూతో పాటు తుది ఎంపిక కోసం ఈ మార్కులు ఉపయోగపడతాయి.
సిలబస్ - రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్-45 ప్రశ్నలు, 60 మార్కులు. 60 నిమిషాలు.
- డాటా అనాలసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్స్-35 ప్రశ్నలు, 60 మార్కులు. 45 నిమిషాలు
- జనరల్, ఎకానమీ, బ్యాంకింగ్-40 ప్రశ్నలు, 40 మార్కులు. 35 నిమిషాలు.
- ఇంగ్లిష్ లాంగ్వేజ్- 35 ప్రశ్నలు, 40 మార్కులు. 40 నిమిషాలు. మొత్తం 155 ప్రశ్నలు, 200 మార్కులు.
మెయిన్స్‌లో ఆబ్జెక్టివ్‌తో పాటు 50 మార్కులకు డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్‌లో లెటర్ రైటింగ్, ఎస్సే ఉంటుంది. ప్రస్తుత నోటిఫికేషన్లో సెక్షనల్ కటాఫ్ తొలగించారు. ఇది సంతోషం కలిగించే విషయం.
ఇంటర్వ్యూ
దీనికి 1:3 ప్రకారం పిలుస్తారు. 50 మార్కులకు ఉంటుంది.
రీజనింగ్ ఆప్టిట్యూడ్
బ్యాంకింగ్ రీజనింగ్ ఇతర పోటీ పరీక్షల కంటే భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా స్టేట్మెంట్ ఆధారిత ప్రశ్నలు, సీక్వెన్సింగ్ వంటి అనలిటికల్, క్రిటికల్ రీజనింగ్ అంశాలు ఎక్కువగా వస్తాయి. రీజనింగ్ విభాగంలోని హెచ్చుస్థాయి ప్రశ్నలను ఎక్కువ సాధన చేయాలి. కఠినమైన టాపిక్స్ నుంచి ఎక్కువ మోతాదు ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగం నుంచి ఆల్ఫాబెట్-వర్డ్ సిరీస్, నంబర్ టెస్ట్, ర్యాంకింగ్, డైరెక్షన్స్, అనాలజీ, కోడింగ్, డికోడింగ్, బ్లడ్ రిలేషన్స్, సిలాజిసమ్స్, కన్‌క్లూజన్స్, ఇన్పుట్-అవుట్‌పుట్ వంటి అంశాల్లో స్టాండర్డ్ ప్రశ్నలు వస్తాయి.
దీనిలో మెరిట్ మార్కులు సాధించాలంటే ప్రతిరోజూ మోడల్ పేపర్లను సాల్వ్ చేయాలి.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్,& డి.ఐ
అర్థమెటిక్ మ్యాథ్స్ అంశాలు ఉండే విభాగం ఇది. దీనిలో శాతాలు, యావరేజెస్, టైమ్ అండ్ మెన్ వర్క్, నంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, డాటా అనాలిసిస్, డాటా ఇంటర్ ప్రిటేషన్స్, పర్ముటేషన్స్-కాంబినేషన్స్ ఉంటాయి.
ప్రిలిమ్స్, మెయిన్స్ కోసం టాపిక్స్ ఎంచుకొని ప్రాక్టీస్ చేయాలి. నాన్ మ్యాథ్స్ వారు ప్రతిరోజూ మోడల్ ప్రశ్నపత్రాలను చదవాలి. షార్ట్‌కట్ మెథడ్స్ బోడ్మాస్ సిద్ధాంతం, బేసిక్ క్యాలిక్యులేషన్స్ వంటి వాటిపై ఫోకస్ చేయాలి.
జనరల్ అవేర్నెస్/బ్యాంకింగ్
ఈ విభాగంలో బ్యాంకింగ్/ఎకానమీ, జనరల్ అవేర్నెస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇందులో ముఖ్యంగా జీకే, కరెంట్ అఫైర్స్ ఆధారిత ప్రశ్నలు అధికంగా ఉంటాయి.
డైలీ ఇంగ్లిష్ న్యూస్ పేపర్స్, మేగజైన్స్, సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. దీనిలో బ్యాంకింగ్ కార్యకలాపాలు, లావాదేవీలు, ఆర్బీఐ, కీలక స్టేట్మెంట్లు, పాలసీ రేట్లు, వాణిజ్య బ్యాంకుల విధి విధానాలు, విలీనాలు, ఆర్థిక మంత్రిత్వశాఖ పథకాలు, 15వ ఆర్థిక సంఘం, నీతిఆయోగ్, జీఎస్టీ, బడ్జెట్, ఆర్థిక సర్వే, కరోనా-వ్యాక్సిన్లు, జాతీయ-అంతర్జాతీయ అంశాలు, సదస్సులు-సమావేశాలు, ముఖ్యమైన రోజులు, పుస్తకాలు-రచయితలు, 5 రాష్ర్టాల ఎన్నికల ఫలితాలు, అవార్డులు, రివార్డులు, జాతీయ పార్కులు వంటి అంశాలను చదవాలి.
కంప్యూటర్ ఎడ్యుకేషన్
మెయిన్స్ పరీక్షలో రీజనింగ్ విభాగంతో కలిసి ఉంటుంది. ఇందులో బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్, ఫండమెంటల్స్, ఇన్పుట్, అవుట్‌పుట్, లాంగ్వేజెస్, మొబైల్ బ్యాంకింగ్ అంశాలు, యాప్స్, 5జీ నెట్వర్క్, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కంప్యూటర్ వైరస్, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి నూతన అంశాలపై దృష్టిసారించాలి. దీనిలో మంచి మార్కుల కోసం కంప్యూటర్ నాలెడ్జ్ బుక్ చదవడం, మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి.
బ్యాంకింగ్ జాబ్ సాధించాలంటే నిత్యం 5 విభాగాలపై దృష్టిసారించి ప్రిపేర్ కావాలి.
పరీక్ష ఆన్లైన్లో ఉంటుంది. కాబట్టి ప్రాక్టీస్‌ను కూడా ఆన్లైన్లోనే కొనసాగించాలి.
ఇంగ్లిష్ కోసం గ్రామర్-నాన్ గ్రామర్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మెయిన్స్‌లో ఎస్సేల కోసం దినపత్రికల్లో ఆర్టికల్స్, ఎడిటోరియల్స్ చదవాలి. ఇందుకు 20 అంశాలపై సొంతంగా ఎస్సేలు తయారు చేసుకోవాలి.
టైమ్ మేనేజమెంట్ చాలా కీలకం. టైమ్ బ్యాలెన్స్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి.
విభాగాల వారీగా ప్రిపేపరేషన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్
ఇది మొత్తం 3 దశల్లో ఉండే విభాగం. విద్యార్థులు ఈ సబ్జెక్ట్ నుంచి కామన్ టాపిక్స్‌ను ఎంచుకొని ప్రిలిమ్స్, మెయిన్స్ కోసం సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇంగ్లిష్‌లో గ్రామర్ పార్ట్, నాన్ గ్రామర్ పార్ట్‌ను గుర్తించి మార్కుల వెయిటేజీని బట్టి టాపిక్స్‌ను ఎంచుకోవాలి.
తెలుగు మీడియం విద్యార్థులకు ఈ సబ్జెక్ట్ కఠినంగా అనిపిస్తే పూర్వ ప్రశ్నపత్రాలను చదవడం, స్నేహితులు, తెలిసిన టీచర్ల ద్వారా డౌట్స్‌ను క్లారిఫై చేసుకోవడం వంటివి చేయాలి. ఇందులో 50% మార్కులు సాధించేలా ప్రణాళిక చేసుకోవాలి. దీనిలో రీడింగ్ కాంప్రహెన్షన్, ఆంటానిమ్స్, సినానిమ్స్, ఇడియమ్స్- ఫ్రేజెస్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్, ఎర్రర్ డిటెక్షన్స్, టెన్సెస్, క్లోజ్డ్ టెస్ట్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ వంటి ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో పాటు ఇంగ్లిష్‌లో లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్, స్పీకింగ్ స్కిల్స్ పై కూడా దృష్టి సారిస్తే మంచి మార్కులు పొందవచ్చు. దీనికోసం స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్స్‌తో పాటు పాత ప్రశ్నపత్రాలు, డైలీ ఇంగ్లిష్ న్యూస్ పేపర్స్ చదవాలి.
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు