భవిష్యత్తుకు బంగారు గొలుసు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ
బ్లాక్ చెయిన్ టెక్నాలజీ గురించి తరచుగా వింటున్నాం. ఇదేదో నల్ల గొలుసు లాంటిది కాదు. ఇది సాంకేతికంగా వినియోగించేది. దీని ఆధారంగా లావాదేవీలు, సమాచారం ఏదైనా నిర్వహించుకోవచ్చు. ప్రస్తుతం బ్లాక్ చెయిన్‌కు డిమాండ్ బాగా పెరుగుతుంది. దీనిలో నైపుణ్యం పెంచుకుంటే భవిష్యత్తుకు ఢోకా ఉండదు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ గురించి నిపుణ పాఠకుల కోసం ప్రత్యేకం..
బిట్ కాయిన్ అంటే ఏమిటి?
ఇటీవల కాలంలో తరచుగా వింటున్న పదం బిట్ కాయిన్. బిట్ కాయిన్ అనేది ఒక క్రిప్టో కరెన్సీ. ఇలాంటివి చాలా ఉన్నాయి. ప్రస్తుతం సుమారు తొమ్మిది వేలకు పైగా క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి. వాటిలో బిట్ కాయిన్, ఎథిరియం, పోలాడాట్, కార్డనో వంటివి ముఖ్యమైనవి. టెస్లా, మైక్రోసాఫ్ట్, స్టార్‌బక్స్ వంటి మరిన్ని కంపెనీలు ఇప్పుడు బిట్ కాయిన్ పేమెంట్స్‌ని అంగీకరిస్తున్నాయి. ఈ క్రిప్టో కరెన్సీలన్నీ బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తాయి.
బ్లాక్ చెయిన్ టెక్నాలజీ గురించి తెలుసుకునే ముందు కాలంతో పాటు మన వ్యవస్థలు ఎలా మారాయో చూద్దాం.
కొన్ని వందల సంవత్సరాల క్రితం దాదాపు అందరు పల్లెటూళ్లలో ఉన్నవాళ్లే. ప్రయాణాలు కూడా తకువగా ఉండేవి. పల్లెటూళ్లలో జనాభా కొద్దిగా ఉండేది కాబట్టి ఒకరికొకరికి బాగా పరిచయం ఉండేది. ఆ పరిచయాల ఆధారంగానే లావాదేవీలు జరిగేవి. అలాగే ఒకరిపై ఒకరికి నమ్మకం ఎకువగా ఉండేది. ఏదైనా ఇవ్వాలి లేదా తీసుకోవాలి అంటే ఒక మాట మీద కట్టుబడి నమ్మకం మీదనే లావాదేవీలు జరిగేవి. దీనినే బార్టర్ వ్యవస్థ అంటారు. కానీ కాలక్రమేణా జనాభా పెరుగుతూ వచ్చింది. నగరాలు ఏర్పడ్డాయి. ప్రయాణాలు పెరిగాయి. అసలు ఇంతకు ముందు ఎప్పుడు తెలియని వ్యక్తితో లావాదేవీలు చేయాల్సిన అవసరాలు ఏర్పడ్డాయి. అప్పుడు ఆ నమ్మకాన్ని ఒక వ్యవస్థ పై పెట్టడం మొదలయ్యింది. అలా డబ్బు అనేది మొదలయ్యింది. దాని పై నమ్మకాన్ని, అధికారాన్ని బ్యాంకులపై పెట్టడం జరిగింది. అంటే బ్యాంకు ఏది చెబితే అది మనం నమ్మాలి. ఇలా చాలా అంశాల్లో నమ్మకాన్ని ఒక చోట కేంద్రీకరించడం జరిగింది.
ఇలా నమ్మకాన్ని కేంద్రీకరించినప్పుడు ఒకవేళ ఆ వ్యవస్థ ఏదైనా పొరపాటు చేస్తే ఆ నమ్మకం దెబ్బతింటుంది. ఉదాహరణకు 2008 ఆర్థిక సంక్షోభంలో కొన్ని బ్యాంకులను మూసివేశారు. అలాంటివి చాలా సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అలా 2008 ఆర్థిక సంక్షోభం నుంచి పుట్టుకొచ్చిందే ఈ బిట్ కాయిన్. అంటే ఒక బ్యాంకు కానీ లేదా మరొకరి దగ్గర కానీ నమ్మకాన్ని కేంద్రీకరించకుండా ఉండటం కోసమే బిట్ కాయిన్ని సతోషి నకమోటో అనే వ్యక్తి రూపొందించాడు. ఈ బిట్ కాయిన్ అనేది బ్లాక్ చెయిన్ టెక్నాలజీని వెలుగులోకి తీసుకువచ్చింది. అలాగే గత దశాబ్దంలో ఈ టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి చెందింది.
బ్లాక్ చెయిన్ అంటే ఏమిటి?
బ్లాక్ చెయిన్ అనేది ఒక లావాదేవీల రికార్డు. ఈ లావాదేవీల్లో డబ్బు, వస్తువులు, డేటా ఇలా ఏదైనా ఉండవచ్చు. ఉదాహరణకు సూపర్ మారెట్ వద్ద వస్తువులు కొనుగోలు చేయడం ఒక లావాదేవీ. ప్రభుత్వం ఒక ఐడీ నంబర్ కేటాయించడం లేదా భూమి పట్టా ఇవ్వడం ఒక లావాదేవీ. ఇలా ఏదైనా అవ్వచ్చు.
బ్లాక్ చెయిన్‌లో ఒక లావాదేవీ నమోదయ్యింది అంటే ఇతర వినియోగదారులకు తెలియకుండా ఆ లావాదేవీలో డేటాను జోడించడం, తొలగించడం లేదా మార్చడం దాదాపు అసాధ్యం.
ఈ రోజుల్లో ఏదైనా లావాదేవీలు ఒక కేంద్రీకృతమైన వ్యవస్థ (సెంట్రలైజ్డ్) పై ఆధార పడుతున్నాయి. డబ్బుల విషయంలో బ్యాంకు అనేది ఒక కేంద్రీకృతమైన వ్యవస్థ. ఈ బ్లాక్ చెయిన్‌లో వికేంద్రీకరించబడిన నెట్వర్ (డిసెంట్రలైజ్డ్ నెట్వర్) ఉంటుంది. ఇకడ ధృవీకరణ అనేది వినియోగదారుల ఏకాభిప్రాయం వల్ల జరుగుతుంది. దీంతో నమ్మకం అనేది ఒక కేంద్రీకృత అధికారి లేదా వ్యవస్థ పై ఉండటం కాకుండా వికేంద్రీకరించబడుతుంది.
బ్లాక్ చెయిన్ టెక్నాలజీ క్రిప్టోగ్రఫీ, నెట్వర్స్, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్, గేమ్ థియరీ వంటి వాటిపై ఆధారపడి నడుస్తుంది.
వివిధ రంగాల్లో
ఈ బ్లాక్ చెయిన్ టెక్నాలజీ కేవలం బ్యాంకింగ్ రంగానికే పరిమితం కాకుండా మరెన్నో రంగాల్లో దీనిని ఉపయోగించవచ్చు. ఉదాహరణకు ఉబెర్, అమెజాన్ వంటివి తీసుకుంటే అవి మధ్యవర్తులుగా పనిచేస్తున్నాయి. అందులో ఒక వస్తువు కొనుగోలు చేసినప్పుడు కట్టిన డబ్బుల్లో కొంచెం శాతం వాళ్లకు వెళ్తుంది. అలా కాకుండా ఎటువంటి మధ్యవర్తులపై ఆధారపడకుండా ఈ టెక్నాలజీతో నేరుగా పీర్ టు పీర్ ట్రాన్జాక్షన్ చెయ్యవచ్చు. అలా రియల్ ఎస్టేట్, సప్లయ్ చెయిన్, వైద్య రంగం వంటి మరెన్నో రంగాల్లో ఈ బ్లాక్ చెయిన్ అనువర్తనాలు ఉంటాయి.
బ్లాక్ చెయిన్‌ని కెరీర్‌గా మలుచుకోవాలంటే
బ్లాక్ చెయిన్ డెవలపర్‌గా కెరీర్‌ను మలుచుకోవాలంటే మొదటగా ప్రోగ్రామింగ్ ఫౌండేషన్స్లో నైపుణ్యం సాధించాలి. అలాగే Object oriented programming బేసిక్స్ కూడా అర్థం చేసుకోవాలి. అలాగే క్రిప్టోగ్రఫీ, నెట్వర్స్, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్, గేమ్ థియరీ వంటివి తెలుసుకోవడం కూడా మంచిదే.
పెరుగుతున్న డిమాండ్
బ్లాక్ చెయిన్ ఇంజినీర్లు, డెవలపర్లకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. దీంతో బ్లాక్ చెయిన్ డెవలపర్ జీతాలు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నాయి. జాబ్ సెర్చ్ సైట్ ‘హైర్డ్’ నుంచి వచ్చిన నివేదిక ప్రకారం బ్లాక్ చెయిన్ డెవలప్మెంట్ సిల్స్ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు 517% డిమాండ్ పెరగనుంది. బ్లాక్ చెయిన్ నైపుణ్యాలు కలిగిన సాఫ్ట్వేర్ డెవలపర్ల జీతాలు U.Sలో సుమారు కోటి రూపాయలు ఉన్నాయి. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ అనువర్తనం అయిన క్రిప్టోకరెన్సీ మారెట్ విలువ ఈ రోజుకి సుమారు కోటి నలభై లక్షల కోట్లు పైనే ఉంది.
ఆపిల్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి మరెన్నో కంపెనీలు బ్లాక్ చెయిన్ టెక్నాలజీని రోజువారీ ప్రక్రియల్లో ఉపయోగించడానికి భారీగా పెట్టుబడులు పెడుతున్నారు.
బ్లాక్ చెయిన్ టెక్నాలజీలో బ్లాక్ చెయిన్ డెవలపర్, బ్లాక్ చెయిన్ ఆరిటెక్ట్ వంటి మరెన్నో ఉద్యోగాలు ఉంటాయి.
నేర్చుకోవడం ఎలా?
లక్షల్లో వేతనాలు వచ్చే ఈ బ్లాక్ చెయిన్ టెక్నాలజీలో ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టుగా వారి నైపుణ్యాన్ని పెంచుకోవడం చాలా అవసరం. ఉడెమి, కోర్సెరా వంటి వాటిలో వీటిని నేర్చుకోవచ్చు. ఐబీ హబ్స్, నెక్ట్స్‌వేవ్ కంపెనీ సీసీబీపీ ప్రోగ్రామ్స్ ద్వారా బ్లాక్ చెయిన్ వంటి మరెన్నో 4.0 టెక్నాలజీల్లో ప్రాథమిక స్థాయి నుంచి శిక్షణ ఇస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ ప్రోగ్రాం గురించి www.ccbp.in http://www.ccbp.in వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. 9390111765 నంబర్‌ను వాట్సాప్ ద్వారా సంప్రదించండి లేదా support@nxtwave.tech కి మెయిల్ పంపండి.
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు