మెడిసిన్ ఫ్రం ది స్కై
తెలంగాణ
మెడిసిన్ ఫ్రం ది స్కై
దేశంలోనే తొలిసారిగా ‘మెడిసిన్ ఫ్రం ది స్కై’ కార్యక్రమాన్ని వికారాబాద్‌లో సెప్టెంబర్ 11న కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఇందులో భాగంగా మారుమూల ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లు, మందులను సరఫరా చేస్తారు.
కాళోజీ పురస్కారం
కాళోజీ పురస్కారం-2021 పెన్నా శివరామకృష్ణకు కాళోజీ జయంతి సెప్టెంబర్ 9న అందజేశారు. రిటైర్డ్ లెక్చరర్ అయిన ఆయన నల్లగొండ జిల్లాకు చెందినవారు. ‘అలల పడవల మీద, నిశ్శబ్దం నా మాతృక’ వంటి కవితా సంకలనాలను రచించారు. ఈ అవార్డు కింద రూ.1,01,116 నగదు అందజేశారు.
బీ హబ్
బయోఫార్మా హబ్ (బీ హబ్) భవన నమూనా డిజైన్‌ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సెప్టెంబర్ 5న ఆవిష్కరించారు. రూ.60 కోట్లతో నిర్మించనున్న ఈ బీ హబ్ బయో ఫార్మా అభివృద్ధికి బీ హబ్ ఊతమిస్తుంది. బయోటెక్ ఇండియా, సైటివా, సెరెస్ట్రాట్ సంస్థల భాగస్వామ్యంతో ఈ బీ హబ్‌ను నిర్మించనున్నారు.
జాతీయం
శిక్షక్ పర్వ్-2021
శిక్షక్ పర్వ్-2021 కాంక్లేవ్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సెప్టెంబర్ 7న నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ప్రధాని మోదీ ఇండియన్ సైన్ లాంగ్వేజీ డిక్షనరీ, ఆడియో పుస్తకాలు, టాకింగ్ పుస్తకాలను విడుదల చేశారు. ఈ కాంక్లేవ్ థీమ్ ‘క్వాలిటీ అండ్ సస్టెయినబుల్ స్కూల్స్: లెర్నింగ్ ఫ్రమ్ స్కూల్స్ ఇన్ ఇండియా’.
పీఎల్ఐలో టెక్స్టైల్
టెక్స్టైల్ (వస్త్ర పరిశ్రమ)ను ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకం కిందకు తీసుకువస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని టెక్స్టైల్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ సెప్టెంబర్ 8న వెల్లడించారు. దీంట్లో భాగంగా ఈ రంగానికి రూ.10,638 కోట్లు కేటాయించింది.
మోదీ భేటీ
ప్రధాని మోదీ రష్యన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ నికోలాయ్ పాట్రుషేవ్తో సెప్టెంబర్ 8న సమావేశమయ్యారు. అఫ్గాన్‌తో పాటు ప్రాంతీయ సుస్థిరత దిశగా సమన్వయాన్ని బలోపేతం చేయడం, భారత్-రష్యాల మధ్య అభివృద్ధి, రాజకీయాలు తదితర విషయాలపై చర్చించారు. నికోలాయ్ భారత్‌లో రెండురోజులు పర్యటించారు.
గవర్నర్లు
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కొత్త గవర్నర్లను సెప్టెంబర్ 9న నామినేట్ చేశారు. వీరిలో ఉత్తరాఖండ్‌కు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్‌ను నియమించారు. నాగాలాండ్ గవర్నర్ ఆర్ఎన్ రవిని తమిళనాడు గవర్నర్‌గా నియమించగా.. అస్సాం గవర్నర్ జగదీశ్ ముఖీకి నాగాలాండ్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
బ్రిక్స్ సమావేశం
బ్రిక్స్ 13వ సమావేశం వర్చువల్‌గా ప్రధాని మోదీ అధ్యక్షతన సెప్టెంబర్ 9న నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా నాలుగు అంశాలు.. బహుపాక్షిక వ్యవస్థ సమాచారం, తీవ్రవాద వ్యతిరేక సహకారం, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు టెక్నాలజీని ఉపయోగించడం, వ్యక్తుల నుంచి వ్యక్తుల మార్పిడిని మెరుగుపర్చడంపై చర్చించారు. ఈ సమావేశ థీమ్ ‘బ్రిక్స్@15: ఇంట్రా బ్రిక్స్ కో ఆపరేషన్ ఫర్ కంటిన్యుటీ, కన్సాలిడేషన్ అండ్ కాన్సెన్సస్’. నినాదం- స్థిరంగా, వినూత్నంగా, విశ్వసనీయంగా నిర్మించుకోండి. బ్రిక్స్‌కు గతంలో 2012 (ఢిల్లీ), 2016 (గోవా)లలో భారత్ అధ్యక్షత వహించింది.
ఏడీబీ నిధులు
ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) జార్ఖండ్‌కు 112 మిలియన్ డాలర్ల రుణాన్ని సెప్టెంబర్ 9న మంజూరు చేసింది. వీటిని నీటి సరఫరా, మౌలిక సదుపాయాల కోసం పట్టణ స్థానిక సంస్థల బలోపేతం కోసం ఖర్చు చేయనున్నారు. ఏడీబీ ప్రధాన కార్యాలయం మనీలాలో ఉంది. దీనిని 1966, డిసెంబర్ 9న స్థాపించారు. దీనిలో 68 సభ్యదేశాలు ఉన్నాయి.
అదేవిధంగా ఏడీబీ మహారాష్ట్రకు సెప్టెంబర్ 10న 300 మిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేసింది. మహారాష్ట్ర రూరల్ కనెక్టివిటీ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు కోసం వీటిని వెచ్చించనున్నారు. వీటితో 34 జిల్లాల్లో 2900 కి.మీ. పొడవున 1100 గ్రామీణ రోడ్లు, 230 వంతెనలను మెరుగుపర్చనున్నారు.
ఎంఆర్ శామ్
ఉపరితలంనుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ (ఎంఆర్ శామ్)ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వైమానిక దళంలోకి సెప్టెంబర్ 9న ప్రవేశపెట్టారు. 70 కిలోమీటర్ల పరిధి గల దీనిని ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (ఐఏఐ), డీఆర్డీవోలు అభివృద్ధి చేశాయి.
అంతర్జాతీయం
గాఫెన్-502
భూ పరిశీలన కోసం చైనా తన 24వ గాఫెన్-502 ఉపగ్రహాన్ని లాంగ్‌మార్చ్-4సీ రాకెట్ ద్వారా సెప్టెంబర్ 7న ప్రయోగించింది. షాంగ్జీ ప్రావిన్సులోని తైయువాన్ శాటిలైట్ సెంటర్ నుంచి ఈ రాకెట్‌ను పంపారు.
తాలిబన్ ప్రభుత్వం
అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు తాత్కాలిక ప్రభుత్వాన్ని సెప్టెంబర్ 7న ఏర్పాటు చేశారు. ముల్లా మొహమ్మద్ హసన్ అఖుంద్‌ను ప్రధానమంత్రిగా, ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్‌ను ఉప ప్రధానిగా ఎన్నుకున్నారు. అదేవిధంగా అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేరున్న సిరాజుద్దీన్ హక్కానీ అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిగా నియమితులయ్యాడు.
భారత్-ఆస్ట్రేలియా నేవీ
భారత నౌకాదళం, ఆస్ట్రేలియా నౌకాదళం రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ (ఆర్ఏఎన్-ర్యాన్)ల మధ్య సెప్టెంబర్ 6న ప్రారంభమైన 4వ ఎడిషన్ ‘ఆసిండెక్స్’ ఎక్సర్సైజ్ సెప్టెంబర్ 10న ముగిసింది. భారత్ తరఫున ఐఎన్ఎస్ శివాలిక్, ఐఎన్ఎస్ కద్మత్ ర్యాన్‌కు చెందిన అంజాక్ క్లాస్ ఫ్రిగేట్ హెచ్ఎంఏఎస్ వారముంగ దీనిలో పాల్గొన్నాయి.
వార్తల్లో వ్యక్తులు
నిర్లెప్ సింగ్ రాయ్
నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్‌కు నూతన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా నిర్లెప్ సింగ్ రాయ్ నియమితులయ్యారని సంస్థ సెప్టెంబర్ 5 వెల్లడించింది. దీని ప్రధాన కార్యాలయం నోయిడాలో ఉంది. దీనిని 1979, సెప్టెంబర్ 1న స్థాపించారు.
అరుణ్‌కుమార్ సింగ్
భారత్ పెట్రోలి యం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)కు చైర్మన్‌గా అరుణ్‌కుమార్ సింగ్ సెప్టెంబర్ 6న నియమితులయ్యారు. బీపీసీఎల్ మార్కెటింగ్ విభాగానికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఆయనకు ప్రమోషన్ ఇచ్చారు.
తమన్నా భాటియా
ప్రముఖ నటి తమన్నా భాటియా తన పుస్తకం ‘బ్యాక్ టు ది రూట్స్’ పుస్తకాన్ని సెప్టెంబర్ 6న ఆవిష్కరించారు. ల్యూక్ కౌటిన్హోతో కలిసి ఆ మె ఈ పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకంలో భారతదేశ ప్రాచీన వైద్య రహస్యాలను వెల్లడించారు.
వాంగ్ హైజియాంగ్
భారత్‌తో సరిహద్దు బాధ్యతలను చూసే చైనా మిలిటరీ వెస్టర్న్ థియేటర్ కమాండ్‌కు జనరల్ వాంగ్ హైజియాంగ్ను కమాండర్‌గా అధ్యక్షుడు జిన్‌పింగ్ సెప్టెంబర్ 6న నియమించారు. వెస్టర్న్ థియేటర్ కమాండ్‌కు ఇప్పటివరకు నలుగురు కమాండర్లను చైనా మార్చింది.
జీసీ ముర్ము
ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్ (ఐఎన్‌టీఓఎస్‌ఏఐ-సుప్రీం ఆడిట్ సంస్థల అంతర్జాతీయ సంఘం) ప్రాంతీయ గ్రూప్‌లలో ఒకటైన అసెంబ్లీ ఆఫ్ ది ఆసియన్ ఆర్గనైజేషన్ (ఏఎస్‌ఓఎస్‌ఏఐ) చైర్మన్‌గా భారత కాగ్ జీసీ ముర్ము సెప్టెంబర్ 7న నియమితులయ్యారు. ఏఎస్‌ఓఎస్‌ఏఐ 16వ అసెంబ్లీ సమావేశాన్ని 2024లో భారత్ నిర్వహిస్తుంది. ఆయన ఈ పదవిలో 2024 నుంచి 2027 వరకు ఉంటారు.
ప్రతివ మొహపాత్ర
అడోబ్ ఇండియా వైస్‌ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా ప్రతివ మొహపాత్ర సెప్టెంబర్ 8న నియమితులయ్యారు. ఆమె పీడబ్ల్యూసీ, ఐబీఎంలో పనిచేశారు. అడోబ్ ఇండియాకు ఒక మహిళ నాయకత్వం వహించడం ఇదే మొదటిసారి.
హేమంత్ ధన్ జీ
ఆస్ట్రేలియా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా భారత సంతతి వ్యక్తి హేమంత్ ధన్ జీ సెప్టెంబర్ 9న నియమితులయ్యారు. ఈ పదవి చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తి ఆయన.
క్రీడలు
వెర్స్టాపెన్
సెప్టెంబర్ 5న జరిగిన ఫార్ములా వన్ (ఎఫ్1) డచ్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను రెడ్‌బుల్ డ్రైవర్, నెదర్లాండ్స్ ఆటగాడు మ్యాక్స్ వెర్స్టాపెన్ సాధించాడు. హామిల్టన్ రెండో స్థానంలో నిలిచాడు. వెర్‌స్టాపెన్‌కు ఈ సీజన్లో ఇది ఏడో విజయం కాగా.. మొత్తంగా 17వది.
డొనాల్డ్ ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ 11న నిర్వహించిన బాక్సింగ్ పోటీలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
నీరజ్ చోప్రా
టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా సెప్టెంబర్ 8న నియమితులయ్యారు. నీరజ్ ప్రచారంతో కంపెనీపై ప్రజల్లో అవగాహన కలిగి, విస్తరించగలదని కంపెనీ వెల్లడించింది.
వేముల సైదులు
జీకే, కరెంట్ అఫైర్స్ నిపుణులు
ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ హైదరాబాద్
- Tags
- nipuna
- nipuna news
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు