ప్రపంచ పార్లమెంట్లకు మాతగా దేన్ని పేర్కొంటారు?
- పాలిటీ
1. రాజ్యాంగానికి సంబంధించి కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి?
1) రాజ్యాంగం అనే భావనను తొలిసారిగా శాస్త్రీయంగా ప్రతిపాదించింది
2) అ లిఖిత రాజ్యాంగం గల దేశం -బ్రిటన్
3) అతి పెద్ద లిఖిత రాజ్యాంగం గల దేశం
– భారత్
4) ప్రపంచంలో తొలి రాజ్యాంగం
గల దేశం- కెనడా
2. రాజ్యాంగ సభ/ రాజ్యాంగ పరిషత్‌కు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి?
1) 1942 నాటి క్రిప్స్ రాయబారం ద్వారా భారతీయులకు రాజ్యాంగసభను ఏర్పాటు చేస్తామని ఆంగ్లేయులు తొలిసారిగా
ప్రతిపాదించారు
2) 1946 నాటి క్యాబినెట్ మిషన్ సిఫారసు ద్వారా భారతీయులకు రాజ్యాంగసభను ఏర్పాటు చేస్తామని ఆంగ్లేయులు
తొలిసారిగా ప్రతిపాదించారు
3) క్యాబినెట్ మిషన్ సిఫారసుల మేరకు 1946 జూలైలో రాజ్యాంగసభకు ఎన్నికలు జరిగాయి
4) రాజ్యాంగసభకు జరిగిన ఎన్నికలు పరోక్షమైనవి, పరిమిత ఓటింగ్‌తో కూడినవి
3. రాజ్యాంగ సభకు జరిగిన ఎన్నికలకు సంబంధించి సరికానిది?
1) ఎన్నికైన మొత్తం ప్రతినిధులు- 299
2) రాష్ర్టాల నుంచి ఎన్నికైనవారు-292
3) స్వదేశీ సంస్థానాల నుంచి ఎన్నికైనవారు-93
4) ఎన్నికైన మొత్తం ప్రతినిధులు- 389
4. రాజ్యాంగసభకు ఎన్నికకాని ప్రముఖులు?
1) జవహర్లాల్ నెహ్రూ, డా. బాబూ
రాజేంద్రప్రసాద్
2) కేఎం మున్షీ, హెచ్వీ కామత్
3) మహాత్మాగాంధీ, మహ్మద్ అలీ జిన్నా
4) మౌలానా అబుల్ కలాం ఆజాద్, కేటీషా
5. రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికకాని తెలుగు వ్యక్తిని గుర్తించండి?
1) టంగుటూరి ప్రకాశం
2) బులుసు సాంబమూర్తి
3) ఆచార్య ఎన్జీ రంగా
4) దుర్గాబాయి దేశ్‌ముఖ్
6. రాజ్యాంగసభకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి?
1) భారత జాతీయ కాంగ్రెస్ నుంచి 202 మంది ఎన్నికయ్యారు
2) ముస్లింలీగ్ నుంచి 73 మంది
డడడడడడఎన్నికయ్యారు
3) షెడ్యూల్డ్ కులాల నుంచి 15 మంది ఎన్నికయ్యారు
4) స్వాతంత్య్రానంతరం భారత రాజ్యాంగ సభలో గల సభ్యుల సంఖ్య 299 మంది
7. 1947 ఆగస్టు 29న డా.బీఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఏర్పడిన రాజ్యాంగ ముసాయిదా కమిటీ (డ్రాఫ్టింగ్ కమిటీ)లో లేని సభ్యులు ఎవరు?
1) కేఎం మున్షీ, బీఎల్ మిట్టల్
2) కేటీ షా, హెచ్వీ కామత్
3) సయ్యద్ మహ్మద్సాదుల్లా, డీపీ ఖైతాన్
4) ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, ఎ కృష్ణస్వామి అయ్యర్
8. కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి?
1) 1946 డిసెంబర్ 9న జరిగిన రాజ్యాంగ పరిషత్ తొలిసమావేశానికి డా. సచ్చిదానందసిన్హ్హా తాత్కాలిక అధ్యక్షునిగా వ్యవహరించారు
2) 1946 డిసెంబర్ 11న రాజ్యాంగ పరిషత్‌కు శాశ్వత అధ్యక్షునిగా డా. బాబూ రాజేంద్రప్రసాద్ ఎన్నికయ్యారు
3) 1946 డిసెంబర్ 13న రాజ్యాంగ పరిషత్‌లో జవహర్లాల్ నెహ్రూ ఉద్దేశాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు
4) రాజ్యాంగ పరిషత్‌లో శాశ్వత ఆహ్వాని
తులుగా సోమనాథ్ లహరి వ్యవహరించారు
9. 1949 నవంబర్ 26న రాజ్యాంగపరిషత్ చేత ఆమోదించబడిన రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి రావడానికి కారణం?
1) గాంధీజీ ఆకాంక్ష మేరకు
2) లాహోర్ సంపూర్ణ స్వరాజ్ తీర్మానం
3) లార్డ్ మౌంట్‌బాటన్ ప్రణాళిక
4) నెహ్రూ రిపోర్ట్ నిర్దేశనం
10. నెహ్రూ రిపోర్ట్ (1928) కరాచీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం (1931)లో భారతీయులు ప్రధానంగా దేన్ని డిమాండ్ చేశారు?
1) సార్వజనీన వయోజన ఓటు హక్కు
2) స్వేచ్ఛా, సమానత్వపు హక్కు
3) భారత్‌కు అవసరమైన రాజ్యాంగం ఎలా ఉండాలి 4) పైవన్నీ
11. రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించి సరికానిది?
1) భారత రాజ్యాంగం ప్రవేశికతో ప్రారంభమవుతుంది
2) ప్రవేశికను రాజ్యాంగానికి ‘గుండె’ వంటిదని జస్టిస్ హిదయతుల్లా, డా. బీఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు
3) ప్రవేశికను సవరించడానికి వీలులేదు
4) ప్రవేశిక జాతీయ లక్ష్యాల గురించి, రాజ్యాంగ తాత్విక పునాదుల గురించి వివరిస్తుంది
12. కింది అంశాలకు సంబంధించి సరికానిది గుర్తించండి?
1) 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా-121 కోట్లు
2) భారతదేశ మొత్తం భాషల సంఖ్య-1652
3) రాజ్యాంగం గుర్తించిన 22 భాషలను 8వ షెడ్యూల్లో పేర్కొన్నారు
4) రాజ్యాంగం గుర్తించిన భాషల్లో ఇంగ్లిష్ ఉంది
13. ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగ ప్రవేశికను సవరించి, చేర్చిన పదాల్లో లేని దాన్ని గుర్తించండి?
1) సామ్యవాద 2) సర్వసత్తాక
3) లౌకిక 4) సమగ్రత
14. భారత్‌లో వివిధ మతాల జనాభా గణాంకాలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి?
1) హిందువులు- 80 శాతం
2) ముస్లింలు- 13 శాతం
3) జైనులు- 2 శాతం
4) క్రైస్తవులు – 2 శాతం
15. కింది అంశాల్లో సరికానిది?
1) భారత్ 1947 ఆగస్టు 15న సర్వసత్తాక రాజ్యాంగంగా అవతరించింది
2) భారత్ 1956 జనవరి 26న గణతంత్ర దేశంగా అవతరించింది
3) రాజ్యాంగ పరిషత్‌కు సలహాదారుడు బెనెగల్ నరసింగరావు
4) భారత రాజ్యాంగం హిందూ మత ప్రధానంగా గల రాజ్యాంగం
16. 1948 నవంబర్ 4 (గురువారం) న డా. బీఆర్ అంబేద్కర్ బృందం రాజ్యాంగ పరిషత్‌కు సమర్పించిన ముసాయిదా రాజ్యాంగంలోని అంశాలకు సంబంధించి సరికానిది ఏది?
1) ఆర్టికల్ 315 2) షెడ్యూల్ 8
3) ఆర్టికల్ 395
4) పరగణనలోకి తీసుకున్న సవరణలు
2000
17. ‘1950 జనవరి 26 నుంచి మనం వైరుధ్యాలతో కూడిన జీవనంలోకి ప్రవేశించబోతున్నాం. రాజకీయాల్లో మనకు సమానత ఉంటుంది. కానీ సామాజిక, ఆర్థిక జీవితాల్లో మనకు అసమానత ఉంటుంది’ అని వ్యాఖ్యానించింది ఎవరు?
1) డా. బీఆర్ అంబేద్కర్ 2) నెహ్రూ
3) మహాత్మాగాంధీ
4) డా. బాబూ రాజేంద్రప్రసాద్
18. ప్రాథమిక విధులకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి?
1) ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు
2) రాజ్యాంగంలోని 4(ఎ) భాగంలో ఆర్టికల్ 51 (ఎ)లో ఉంది
3) ప్రస్తుతం ప్రాథమిక విధుల సంఖ్య- 11
19. కింది వాటిలో రాజ్యాంగ సవరణకు సంబంధించి సరికానిది?
1) రాజ్యాంగ సవరణ విధానాన్ని దక్షిణాఫ్రికా నుంచి గ్రహించారు
2) ఆర్టికల్ 368 ప్రకారం మన రాజ్యాంగాన్ని 3 రకాల పద్ధతుల ద్వారా సవరిస్తారు
3) రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని గోలక్‌నాథ్ కేసులో సుప్రీంకోర్ట్టు పేర్కొంది
20. నెహ్రూ మంత్రివర్గంలో వివిధ మంత్రిత్వశాఖలను నిర్వహించిన వారిలో సరికాని దాన్ని గుర్తించండి?
1) సర్దార్ వల్లభాయ్ పటేల్
– ఉపప్రధాని, గృహమంత్రి
2) జైరాందాస్ దౌలత్‌రాం
– ఆహార, వ్యవసాయ మంత్రి
3) రాజకుమారి అమృతకౌర్
– వైద్య, ఆరోగ్య మంత్రి
4) బాబూ జగ్జీవన్‌రాం- రక్షణమంత్రి
21. ‘భారదేశాన్ని అన్ని రకాల దాస్యం నుంచి’ పోషణ నుంచి విముక్తి చేసే రాజ్యాంగం కోసం నేను కృషిచేస్తాను’ అని మహాత్మాగాంధీ 1931లో ఏ పత్రికలో వ్యాఖ్యానించారు?
1) యంగ్ ఇండియా 2) హరిజన్
3) స్వరాజ్ 4) స్వదేశీదర్శణ్
22. రాజ్యాంగానికి సంబంధించి వివిధ దేశాల నుంచి గ్రహించిన అంశాల్లో సరికానిది ఏది?
1) ఆస్ట్రేలియా- ఉమ్మడి జాబితా, పార్లమెంటు ఉభయసభల సమావేశం
2) జపాన్- జీవించే హక్కు
3) జర్మనీ- ప్రాథమిక హక్కులు
4) అమెరికా- ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, న్యాయసమీక్ష, మహాభియోగతీర్మానం
23. వివిధ రాజ్యాంగ సంస్థలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి?
1) రాజ్యాంగాన్ని సంరక్షించుటకు ఆర్టికల్ 124 ప్రకారం సుప్రీంకోర్టును ఏర్పాటు చేస్తారు
2) ప్రభుత్వాల ఖర్చును పర్యవేక్షించడానికి ఆర్టికల్ 148 ప్రకారం ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)’ ను ఏర్పాటు చేశారు
3) స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించేందుకు ఆర్టికల్ 324 ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు
4) కేంద్ర ఆర్థిక సంఘాన్ని ఆర్టికల్ 260 ప్రకారం ఏర్పాటు చేశారు
24. పార్లమెంట్‌కు సంబంధించి కింది వాటిలో సరికానిది?
1) ప్రపంచ పార్లమెంటులకు మాత (Mother) గా బ్రిటన్ పార్లమెంటును పేర్కొంటారు
2) ప్రభుత్వం పార్లమెంటుకు జవాబుదారీగా ఉండాలి
3) ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పిస్తుంది
4) పార్లమెంటరీ విధానాన్ని అమెరికా నుంచి గ్రహించారు
25. భారత పార్లమెంటు రూపొందించిన కీలకమైన చట్టాలకు సంబధించి సరికాని దాన్ని గుర్తించండి?
1) వరకట్న నిషేధ చట్టం- 1961
2) నూతన జాతీయ విద్యావిధానం-1986
3) ఉపాధిహామీ చట్టం- 2002
4) ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యాహక్కు చట్టం- 2009
26. రాజ్యసభకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి?
1) 1952 ఏప్రిల్ 3న రాజ్యసభ ఏర్పడింది
2) రాజ్యసభ పదవీకాలం- 6 సంవత్సరాలు
3) ప్రస్తుతం రాజ్యసభలో గల సభ్యుల సంఖ్య- 245
4) రాజ్యసభ సమావేశాలకు ఉపరాష్ట్రపతి చైర్మన్‌గా వ్యవహరిస్తారు
27. రాజ్యసభకు సంబంధించి కింది వాటిలో సరికానిది?
1) రాజ్యసభకు రాష్ట్రపతి ద్వారా నామినేట్ అయ్యేవారి సంఖ్య -12
2) రాజ్యసభకు పోటీచేయాలంటే ఉండాల్సిన కనీస వయస్సు- 30 సంవత్సరాలు
3) రాజ్యసభకు రాష్ర్టాల నుంచి ఎన్నికయ్యేవారు- 229
4) రాజ్యసభకు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికయ్యేవారు-7
28. రాజ్యసభలో వివిధ రాష్ర్టాలకు కేటాయించిన సీట్లకు సంబంధించి సరికానిది గుర్తించండి?
1) ఆంధ్రప్రదేశ్-11, గుజరాత్-11
2) తెలంగాణ-7, ఉత్తరప్రదేశ్-31
3) మధ్యప్రదేశ్- 11, అసోం- 7
4) సిక్కిం- 2, మణిపూర్- 2
29. లోక్‌సభ ఆమోదించి పంపిన ఆర్థిక బిల్లులను రాజ్యసభ ఎన్ని రోజుల్లోగా తప్పనిసరిగా ఆమోదించాలి?
1) 14 రోజులు 2) 21 రోజులు
3) 30 రోజులు 4) 90 రోజులు
30. లోక్‌సభ స్పీకర్ అధ్యక్షతన జరిగే పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశానికి సంబంధించి ఇంతవరకు జరిగిన సమావేశాల్లో సరైన దాన్ని గుర్తించండి?
1) 1961- వరకట్న నిషేధ బిల్లు
2) 1978- బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్
ఏర్పాటు/రద్దు బిల్లు
3) 2002 పోటా బిల్లు
4) పైవన్నీ సరైనవే
31. లోక్‌సభకు సంబంధించి సరికానిది గుర్తించండి?
1) 1952 ఏప్రిల్ 17న లోక్‌సభ ఏర్పడింది
2) లోక్‌సభ పదవీకాలం నిర్దిష్టంగా 5సంవత్సరాలు
3) లోక్‌సభకు పోటీచేయాలంటే ఉండాల్సిన కనీస వయస్సు 25 సంవత్సరాలు
4) లోక్‌సభకు తొలి సాధారణ ఎన్నికలు 1952లో జరిగాయి
32. ప్రతిపక్ష రాజకీయ పార్టీల సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ఎక్కడ ప్రవేశపెడతారు?
1) రాజ్యసభ 2) లోక్‌సభ
3) పార్లమెంటు 4) సచివాలయం
33. కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి?
1) కేంద్రమంత్రి మండలి వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహించాలి
2) కేంద్రమంత్రి మండలి వ్యక్తిగతంగా
ప్రధానికి బాధ్యత వహించాలి
3) కేంద్రమంత్రి మండలి సమష్టిగా
లోక్‌సభకు బాధ్యత వహించాలి
4) కేంద్రమంత్రి మండలి అధ్యక్షులుగా ప్రధాని వ్యవహరిస్తారు
34. 1952లో జరిగిన లోక్‌సభ తొలి ఎన్నికలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి?
1) ఎన్నిక జరిగిన స్థానాలు- 489
2) ఎన్నికైన మహిళలు- 22
3) ఈ ఎన్నికలను ‘చీకటిలో ముందుకు
దూకడం’గా పేర్కొంటారు
4) ఈ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం- 51
35. లోక్‌సభకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి?
1) రాష్ర్టాల నుంచి ఎన్నికయ్యేవారు-530 మంది
2) కేంద్రపాలిత ప్రాంతాల నుంచి
ఎన్నికయ్యేవారు- 13 మంది
3) ప్రధాని చేత నామినేట్ అయ్యే సభ్యులు- 4
4) రాష్ట్రపతి చేత నామినేట్ అయ్యే
ఆంగ్లోఇండియన్లు- 2
36. లోక్‌సభలో వివిధ రాష్ర్టాలకు కేటాయించిన సీట్లకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి?
1) ఆంధ్రప్రదేశ్ -25, రాజస్థాన్-25,
కర్ణాటక-28
2) నాగాలాండ్-1, సిక్కిం- 1,
మిజోరాం-1
3) ఉత్తరప్రదేశ్-80, మహారాష్ట్ర- 48,
తెలంగాణ-17
4) గుజరాత్-21, కేరళ-18, ఒడిశా-29
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు