తెలంగాణ రైతాంగ తిరుగుబాటులో మొదటి అమరజీవి ఎవరు?
తెలంగాణ చరిత్ర -4(నవంబర్ 19 తరువాయి)
160. సెప్టెంబర్ 30, 2012న జరిగిన తెలంగాణ మార్చ్‌ను ప్రముఖంగా ఏమని పిలుస్తారు?
1) మిలియన్ మార్చ్ 2) తెలంగాణ గర్జన
3) నగర దిగ్బంధం 4) సాగరహారం
161. తొలి తెలంగాణ ఉద్యమ కాలంలో కింది వాటిలో సినీ హీరో కత్తికాంతారావు నిర్మించిన సినిమా ఏది?
1) పాతకాపు 2) ఆదర్శం
3) సప్త స్వరాలు 4) రైతుబిడ్డ
162. బోధన్ రాజుల శాసనాల్లో గల పేరు?
1) బోధన్ 2) చోధన్
3) బాధన్ కుర్తి 4) బహుధాన్యపురం
163. 1997 ఆగస్టులో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘ప్రాంతీయ అసమానతలు-అభివృద్ధి ప్రత్యామ్నాయాలు’ పేరుతో రెండు రోజుల సదస్సును ఏర్పాటు చేసింది?
1) తెలంగాణ మహాసభ
2) ఫోరం ఫర్ ఫ్రీడం ఆఫ్ ఎక్స్ప్రెషన్
3) సెంటర్ ఫర్ రీజనల్ స్టడీస్
4) సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్
164. కింది అంశాలను గమనించి సరైనవి గుర్తించండి.
ఎ. అష్ట సూత్ర పథకం 1969లో
ప్రకటించబడింది
బి. పంచసూత్ర పథకం 1971లోప్రకటించబడింది
సి. ప్రెసిడెన్సియల్ ఆర్డర్ (రాష్ట్రపతి
ఉత్తర్వులు) 1975లో జారి చేశారు
డి. 1986లో జీవో 610 జారీ చేశారు
1) ఎ, సి 2) బి, డి
3) ఎ, బి, సి 4) బి, సి, డి
165. తెలంగాణ రైతాంగ తిరుగుబాటులో మొదటి అమరజీవి ఎవరు?
1) పల్లె యాదగిరి 2) చాకలి ఐలమ్మ
3) కొండా సమ్మయ్య
4) దొడ్డి కొమురయ్య
166. తెలంగాణకు చెందిన ప్రఖ్యాత సంస్కృత వ్యాఖ్యాత శ్రీమల్లినాథ సూరి ఎక్కడివాడు?
1) పాలకుర్తి 2) కొల్చారం
3) వేములవాడ 4) మంథని
167. రెండవ దశ తెలంగాణ ఉద్యమంలో అత్యంత ప్రాచుర్యం పొందిన గాన, నాట్య కళ?
1) అలైబలై 2) దరువు
3) అరుణోదయ 4) ధూమ్‌ధామ్
168. తెలంగాణ ప్రత్యేక రాష్ర్టాన్ని కోరుతూ ప్రజా ఉద్యమం ఏ సంవత్సరంలో వచ్చింది?
1) 1969 2) 1972
3) 1956 4) 1962
169. ఏడవ నిజాం హైదరాబాద్‌లో ముల్కీ నిబంధనల ఫర్మానా ఏ సంవత్సరంలో జారీ చేశారు?
1) 1917 2) 1918
3) 1919 4) 1920
170. తెలంగాణ పరిభాషలో కైకిలి అంటే అర్థం ఏమిటి?
1) వేతన కూలీ
2) చేతి వేలు
3) దశరథుని భార్య కైకకు చెందినది
4) ఆస్థాన ప్రదేశం
171. ఫిబ్రవరి, 1925లో మొదటి గ్రంథాలయ మహాసభ జరిగిన ప్రాంతం?
1) వరంగల్ 2) మెదక్
3) మధిర 4) నిజామాబాద్
172. హైదరాబాద్‌లో 1857 తిరుగుబాటు ఎవరి నేతృత్వంలో జరిగింది?
1) మౌల్వీ హుస్సైనీ 2) తుర్రేబాజ్‌ఖాన్
3) ఖాసీం రజ్వి 4) బడే గులాం ఖాన్
173. జతపరచండి.
ఎ. దశరథ రాజనందన చరిత్ర 1. ఈడూరు ఎల్లయ్య
బి. యయాతి చరిత్ర 2. మల్లారెడ్డి
సి. వైజయంతి విలాసం 3. సింగరాచార్యులు
డి. శివధర్మోత్తరం 4. సారంగు తమ్మయ్య
5. పొన్నెగంటి తెలగనార్యుడు
1) ఎ-3, బి-5, సి-4, డి-2
2) ఎ-5, బి-2, సి-3, డి-4
3) ఎ-2, బి-3, సి-4, డి-1
4) ఎ-4, బి-3, సి-1, డి-5
174. శ్రీమతి ఇందిరా గాంధీ ప్రతిపాదనకు ప్రతిస్పందనగా తెలంగాణ పోరాట దినాన్ని ప్రకటించడంతో పాటు ఎన్జీవోలు వారి సమ్మెను కింది వాటిలో ఏ తేదీన ఆరంభించారు?
1) ఏప్రిల్ 12, 1969
2) ఏప్రిల్ 15, 1969
3) ఏప్రిల్ 17, 1969
4) ఏప్రిల్ 20, 1969
175. 1857 తిరుగుబాటు సమయంలో హైదరాబాద్‌లోని బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేసింది ఎవరు?
1) షితాబ్ ఖాన్ 2) అఫ్జల్ ఖాన్
3) తుర్రేబాజ్ ఖాన్ 4) కాపీ ఖాన్
176. 2009లో తెలంగాణ ఉద్యమం ఊపందు-కోవడానికి కింది ఏ విషయంపై సుప్రీంకోర్టు తీర్పు కారణం అయింది?
1) కృష్ణా నీటి పంపిణీ
2) ప్రభుత్వ ఆర్డర్ 610
3) ఫ్రీ జోన్‌గా హైదరాబాద్
4) ముల్కీ నిబంధనలు
177. 1989లో ‘తెలంగాణ సంఘర్షణ సమితి’ని ఎవరు స్థాపించారు?
1) మల్లికార్జున్ 2) పీ ఇంద్రారెడ్డి
3) మదన్ మోహన్ 4) కే ప్రభాకర్ రెడ్డి
178. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఖమ్మం జిల్లాలో తొలిసారిగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన వ్యక్తి ఎవరు?
1) మదన్ మోహన్ 2) రవీంద్రనాథ్
3) మల్లికార్జున్ 4) ఆమోస్
179. కింది వేములవాడ చాళుక్య రాజుల్లో ఎవరు 42 యుద్ధాల్లో హీరోగా వర్ణించబడ్డారు?
1) మొదటి నరసింహ
2) మొదటి అరికేసరి
3) బద్దెగ
4) మూడో యుద్ధమల్లుడు
180. ‘పరమ సోగతస్య’ అనే బిరుదు ధరించిన విష్ణుకుండిన రాజు ఎవరు?
1) రెండో ఇంద్ర భట్టారక వర్మ
2) దేవ వర్మ
3) విక్రమేంద్ర వర్మ
4) మాధవ వర్మ
181. హైదరాబాద్‌లో చౌమహల్లా ప్యాలెస్‌ను నిర్మించినవారు?
1) నిజామ్-ఉల్-ముల్క్
2) సాలార్ జంగ్ 3) సలాబత్ జంగ్
4) అఫ్జల్-ఉద్-దౌలా
182. సరైన జతను గుర్తించండి.
ఎ. జోడేఘాట్ ప్రాంతం- కుమ్రం భీంకు సంబంధించినది
బి. ‘ప్రజల మనిషి’ – కాళోజి రచించినాడు
సి. ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ను రచించింది – సురవరం ప్రతాప్‌రెడ్డి
1) ఎ, బి, సి 2) ఎ, బి
3) బి, సి 4) ఎ, సి
183. 2009 అనంతరం తెలంగాణ ఉద్యమ వ్యాప్తికి దోహదపడిన సాంస్కృతిక రూపం?
1) గర్జన 2) శంఖారావం
3) లొల్లి 4) ధూం ధాం
184. 1969 తెలంగాణ ఉద్యమ తొలి అమరజీవి, 17 సంవత్సరాల శంకర్ ఎలా, ఎక్కడ మరణించాడు?
1) ఖమ్మంలో జరిగిన ఒక పోలీస్ కాల్పుల ఘటనలో
2) హైదరాబాద్‌లో జరిగిన ఒక పోలీస్ కాల్పుల్లో
3) సదాశివ పేటలో జరిగిన పోలీస్ కాల్పుల్లో
4) ఖమ్మంలో ఆమరణ నిరాహార దీక్ష పిలుపులో
185. తెలంగాణలో ‘అపర పతంజలి’గా పేరు గాంచిన గోపాలపేట సంస్థాన ప్రభువు ఎవరు?
1) వీర రాఘవాచార్యులు
2) శ్రీ బుక్కపట్నం రాఘవాచార్యులు
3) కస్తూరి రంగాచార్యులు
4) శ్రీరామచంద్రాచార్యులు
186. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సంబంధించి కింది విషయాలను పరిశీలించండి.
ఎ. హైదరాబాద్ ఎనిమిదో నిజాం మీర్ ఉస్మానియా అలీ బేగ్ వ్యవస్థాపకుడు కావడంతో అతని పేరుతో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఆ పేరు వచ్చింది
బి. ఇప్పటి ఉస్మానియా విశ్వవిద్యాలయపు భూమి వాస్తవానికి ఆస్థాన కవయిత్రి మహా లఖా చందాకు ఒక జాగీరు
సి. దేశంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాచీనమైన వాటిలో ఏడవది. దక్షిణ భారతదేశంలో మూడవదిగా నిలిచింది
డి. అప్పటి ప్రభుత్వ హోం శాఖ కార్యదర్శి సర్ అక్బర్ హైదరీ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని ఒక వినతి పత్రాన్ని సమర్పించి కీలక యత్నం చేశాడు
1) ఎ, బి 2)బి, సి
3) ఎ, బి, డి 4) బి, సి, డి
187. కింది వారిలో సికింద్రాబాద్ నగరాన్ని నిర్మించిన రాజు ఎవరు?
1) మీర్ ఉస్మాన్ అలీఖాన్
2) నిజాం ఉల్ ముల్క్
3) 3వ నిజాం, సికిందర్ ఝూ బహద్దూర్
4) సాలార్ జంగ్
188. వరంగల్ కోట నిర్మాణాన్ని ప్రారంభించింది ఎవరు?
1) జాయప 2) రెండో బేతరాజు
3) రెండో ప్రోలుడు 4) రుద్రుడు
189. ‘పండితారాధ్య చరితం’ రచయిత?
1) గణపతి దేవుడు 2) వల్లభ రాయుడు
3) రుద్ర దేవుడు
4) పాల్కురికి సోమనాథుడు
190. రుద్రమ దేవి పాలనా కాలంలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించిన యూరోపియన్ బాటసారి?
1) మార్కోపోలో 2) నికిటిన్
3) డొమింగో పేస్ 4) టావెర్నియర్
191. తెలంగాణ అమరవీరుల స్థూపానికి సంబంధించి ఒక అసంబద్ధ వ్యాఖ్యను గుర్తించండి.
1) దీని పై భాగంలో అశోక ధర్మచక్రాన్ని చెక్కారు
2) దీన్ని 1946-51 కాలంనాటి తెలంగాణ సాయుధపోరాటంలో అమరులైన వారి జ్ఞాపకంగా నిర్మించారు
3) దీన్ని ఎక్కా యాదగిరి రావు చెక్కారు
4) ఇది సాంచీ స్థూపాన్ని తలపించేలా ఉంటుంది
192. జతపరచండి.
ఎ. 27 ఏప్రిల్, 2001 1. మిలియన్ మార్చ్
బి. 29 నవంబర్, 2009 2. టీఆర్ఎస్ స్థాపన
సి. 10 మార్చి, 2011 3. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు
డి. 2 జూన్, 2014 4. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష
1) ఎ-4, బి-2, సి-1, డి-3
2) ఎ-2, బి-4, సి-1, డి-3
3) ఎ-1, బి-4, సి-1, డి-3
4) ఎ-4, బి-2, సి-3, డి-1
193. జైన వాదం తెలంగాణలో అత్యున్నత వైభవాన్ని అనుభవించినది ఎవరి కాలంలో?
1) శాతవాహనులు
2) వేములవాడ చాళుక్యులు
3) కాకతీయులు
4) విష్ణుకుండినులు
194. గ్రామ దేవతలకు జంతు బలి ఇచ్చే సంప్రదాయ అధికారం ఎవరి నేతృత్వంలో జరుగుతుంది?
1) బైండ్ల రాజు 2) పోతరాజు
3) ముదిరాజు 4) బీరప్ప
195. నిజాం కార్యకలాపాలను ప్రజలకు తెలియజేయడానికి కింది వారిలో ఎవరు హైదరాబాద్‌లో ‘భాగ్యనగర్’ రేడియోను ప్రారంభించారు?
1) నారాయణ రావు పవార్
2) కృష్ణమూర్తి
3) పాగా పుల్లా రెడ్డి
4) అబిద్ హసన్
196. కింది గిరిజన తెగల్లో అంతరించే స్థితిలో ఉన్నది?
1) గోండ్లు, పరధాన్లు
2) కోయలు, నాయక్ పోడులు
3) కొండారెడ్లు, కోలాములు
4) రాజ్‌గోండులు, మెస్రంలు
197. శాతవాహనుల కాలంలో కోలికులు అనగా ఎవరు?
1) స్వర్ణకారులు 2) బట్టలు నేసేవారు
3) వడ్రంగి పనివారు 4) చర్మకారులు
198. వీరిని రాచకొండ, దేవరకొండ వెలమ ప్రభువులు అని చరిత్రకారులు పిలుస్తారు?
1) వేములవాడ చాళుక్యులు
2) రేచర్ల పద్మనాయకులు
3) ముదిగొండ చాళుక్యులు
4) విష్ణుకుండినులు
199. జతపరచండి.
ఎ. దశరథ రాజనందన చరిత్ర 1. ఈడూరు ఎల్లయ్య
బి. యయాతి చరిత్ర 2. మల్లారెడ్డి
సి. వైజయంతి విలాసం 3. సింగరాచార్యులు
4. సారంగు తమ్మయ్య
5. పొన్నెగంటి తెలగనార్యుడు
1) ఎ-3, బి-5, సి-4, డి-2
2) ఎ-5, బి-2, సి-3, డి-4
3) ఎ-2, బి-3, సి-4, డి-1
4) ఎ-4, బి-3, సి-1, డి-5
200. నిజాం కాలంలో వీరి ఉమ్మడి ఆధ్వర్యంలో దక్కన్ విమానయాన సంస్థ ఏర్పడింది.
1) నిజాం ప్రభుత్వం – డకోటా ఎయిర్‌లైన్స్
2) నిజాం ప్రభుత్వం – విక్టోరియా
ఎయిర్‌లైన్స్
3) నిజాం ప్రభుత్వం – లుఫ్తాన్సా
ఎయిర్‌లైన్స్
4) నిజాం ప్రభుత్వం – టాటా ఎయిర్‌లైన్స్
తెలుసుకుందాం
రుతువులు ఏర్పడటానికి కారణం
- భూ భ్రమణం, భూ పరిభ్రమణం, భూమి అక్షం వంగి ఉండటం, భూమి వంపు.
- భూమి అక్షం 23 1/2 డిగ్రీలు వాలి ఉండుట వల్ల, భూ అక్షం తన సమతల కక్ష్యా తలంలో 66 1/2 డిగ్రీల కోణం చేయడం వల్ల భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించడం వల్ల రుతువులు, రాత్రింబవళ్లు కాల ప్రమాణాల్లో వ్యత్యాసాలు ఏర్పడుతున్నాయి. సూర్యుడు దగ్గరగా వచ్చినప్పుడు వేసవి కాలం, దూరంగా పోయినప్పుడు శీతాకాలం ఏర్పడుతుంది.
- సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉన్నప్పుడు సంవత్సరమంతా దాని అక్షం ఒకే వైపునకు వంగి ఉంటే మరికొన్ని నెలల్లో దక్షిణార్ధ గోళం సూర్యుడి వైపుకి వంగి ఉంటుంది. ఈ కారణంగా ఉత్తరార్ధగోళంలో వేసవి ఉన్నప్పుడు దక్షిణార్ధగోళంలో శీతాకాలం ఉంటుంది.
- ఉత్తరార్థగోళంలో శీతాకాలం ఉన్నప్పుడు దక్షిణార్ధగోళంలో వేసవికాలం ఉంటుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు