పెరూ తీరంలో పెరిగే చేపలు ఏ రకానికి చెందినవి?
4) సముద్ర ప్రవాహాల గతిమార్పునకు గల కారణాలు: ఇవి మూడు రకాలు.
ఎ) ఖండాకృతి: ఖండాల ఆకృతిని బట్టి ప్రవాహ మార్గంలో మార్పు ఏర్పడుతుంది. ఉదా: అట్లాంటిక్‌లోని భూమధ్యరేఖా ప్రవాహం పశ్చిమదిశగా ప్రవహించి మధ్య అమెరికా అడ్డుగా ఉండటం వల్ల ఉత్తర దిశగా మళ్లి గల్ఫ్ ప్రవాహంగా ప్రవహిస్తుంది.
బి) రుతువుల మార్పు: రుతువులను బట్టి సముద్ర ప్రవాహ దిశలో మార్పులు ముఖ్యంగా హిందూ
మహాసముద్రంలో కనిపిస్తాయి. ఉదా: ఈశాన్య రుతుపవన కాలంలో (శీతాకాలం) రుతుపవన ప్రవాహం తూర్పు నుంచి పడమరకు తీరాన్ని అనుసరించి ఉంటుంది. నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల ఈ ప్రవాహం ఈశాన్య దిశగా ప్రవహిస్తుంది.
సి) సముద్ర అంతర్గత స్థలాకృతి: సముద్ర ప్రవాహాలు భూమధ్యరేఖా ప్రాంతంలో తూర్పు నుంచి పడమరకు అంతర్గత స్థలాకృతి ప్రమేయం లేకుండా ప్రవహిస్తాయి.
- పై కారణాల వల్ల సముద్రాల్లో ప్రవాహాలు ఏర్పడటం, వాటి దిశలో మార్పులు కలగడం జరుగుతాయి.
1) పసిఫిక్ మహాసముద్ర ప్రవాహ వ్యవస్థ
ఎ) ఉత్తర పసిఫిక్ సముద్ర ప్రవాహ వ్యవస్థఉష్ణప్రవాహాలు:
1) ఉత్తర పసిఫిక్ భూమధ్యరేఖా ప్రవాహం
2) కురుషకో ప్రవాహం
3) సుషిమా ప్రవాహం
శీతల ప్రవాహాలు:
1) కాంబెట్కా లేదా బయారియా ప్రవాహం
2) ఉత్తర పసిఫిక్ డ్రిఫ్ట్
3) కాలిఫోర్నియా ప్రవాహం (దీనివల్ల సోనార్ ఎడారి ఏర్పడింది)
బి) దక్షిణ పసిఫిక్ సముద్ర ప్రవాహ వ్యవస్థ
ఉష్ణప్రవాహాలు: 1) దక్షిణ పసిఫిక్ భూమధ్యరేఖ ప్రవాహం
2) తూర్పు ఆస్ట్రేలియన్ ప్రవాహం
3) కామ్వెల్ ప్రవాహం
4) ఎల్ నినో ప్రవాహం
- ఎల్ నినో ప్రవాహం: ప్రతి 5 లేదా 7 సంవత్సరాలకోసారి పెరూ తీరం వెంట కదిలే ఉష్ణ జలరాశి. దీని కారణంగా పెరూ తీర ప్రాంతంలో అల్పపీడన పరిస్థితులు ఏర్పడి సమృద్ధిగా వర్షాలు కురవడం వల్ల పెరూ తీరంలో పెరిగే ఆంకోవీ రకానికి చెందిన చేపలు అధిక సంఖ్యలో మరణించడమే కాకుండా భారత్, ఇతర ఆగ్నేయ దేశాల్లో రుతుపవన వ్యవస్థ బలహీనపడి కరువు పరిస్థితులు ఏర్పడతాయి.
- ఎల్ నినో అనే లాటిన్ పదానికి అర్థం క్రీస్తు జననం. ఎల్ నినోకు వ్యతిరేక ప్రక్రియ లా నినా (లా నినా అనే లాటిన్ పదానికి అర్థం ఆడ శిశువు).
- పెరూ తీర ప్రాంతంలో లా నినా వ్యవస్థ ఉంటే భారత్‌లో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి.
శీతల ప్రవాహాలు:
1) పశ్చిమ పవన డ్రిఫ్ట్
2) పెరూవియన్ (హంబోల్ట్) ప్రవాహం (అటకామా ఎడారి ఏర్పడింది)
2) అట్లాంటిక్ మహాసముద్ర ప్రవాహ వ్యవస్థ
ఎ) ఉత్తర అట్లాంటిక్ సముద్ర ప్రవాహ వ్యవస్థ
ఉష్ణప్రవాహాలు: 1) ఉత్తర అట్లాంటిక్ భూమధ్యరేఖ ప్రవాహం
2) ఏంటాలిస్ ప్రవాహం (ఇది సర్గాసో సముద్ర సుడిలో అంతమవుతుంది)
3) గల్ఫ్‌స్ట్రీమ్
4) ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్
శీతల ప్రవాహాలు: 1) గ్రీన్లాండ్ (ఇరమింజల్)
2) కెనరీ (ఇది సహార ఎడారి ఏర్పడటానికి కారణం)
3) లాబ్రడార్
- కెనడా తూర్పుతీరంలో ‘న్యూఫౌండ్‌ల్యాండ్’ దీవిలో గల గ్రాండ్ బ్యాంక్ (తీరం) ప్రాంతం ప్రపంచంలో చేపల
ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉండటానికి కారణం..
1) ఇక్కడ ఖండతీరపు అంచు ఎక్కువ వెడల్పుగా ఉండటం
2) ఈ ప్రాంతంలో గల్ఫ్‌స్ట్రీమ్ అనే ఉష్ణ జలరాశి, లాబ్రడార్ శీతల జలరాశులు కలవడం వల్ల చేపలకు ఆహారంగా ఉపయోగపడే ప్లాంక్టాన్స్, నెక్టాన్స్ అనే సముద్ర జీవులు ఎక్కువగా కనిపిస్తాయి.
- చేపల ఉత్పత్తిలో డాబర్ తీరం రెండో స్థానంలో ఉండటానికి కారణాలు..
1) ఖండతీరపు అంచు ఎక్కువ వెడల్పుగా ఉండటం
2) ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్ అనే ఉష్ణ ప్రవాహం, ఇరమింజల్ (గ్రీన్‌ల్యాండ్) శీతల ప్రవాహాలు ఈ ప్రాంతంలో కలవడం.
- బ్రిటిష్, నార్వే తీరాల్లో శీతాకాలంలో కూడా ఆ ప్రాంత జలరాశి గడ్డకట్టకుండా నౌకాయానానికి వీలుగా ఉండటానికి కారణం
1) ఈ ప్రాంతం గుండా ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్ అనే ఉష్ణప్రవాహం తగలడం వల్ల అక్కడి ఉష్ణోగ్రతలను యథాస్థితికి చేర్చి నీటిని మామూలు స్థితిలోనే ఉంచుతుంది.
బి) దక్షిణ అట్లాంటిక్ సముద్ర ప్రవాహ వ్యవస్థ
ఉష్ణప్రవాహాలు: 1) దక్షిణ అట్లాంటిక్ భూమ్యధరేఖ ప్రవాహం
2) బ్రెజిలియన్ ఉష్ణ ప్రవాహం
శీతల ప్రవాహాలు: 1) పాక్లాండ్ శీతల ప్రవాహం
2) పశ్చిమ పవన డ్రిఫ్ట్
3) బెనిగ్యులా శీతల ప్రవాహం (దీనివల్ల కలహారి ఎడారి ఏర్పడింది)
3) హిందూ మహాసముద్ర ప్రవాహ వ్యవస్థ
ఎ) ఉత్తర హిందూ మహాసముద్ర ప్రవాహ వ్యవస్థ: ఉత్తర అట్లాంటిక్, ఉత్తర పసిఫిక్ సముద్ర ప్రవాహ వ్యవస్థలు సవ్యదిశలో ఉండగా, ఉత్తర హిందూ మహాసముద్ర ప్రవాహ వ్యవస్థ రుతుపవనాల ప్రభావం వల్ల అపసవ్య దిశలో ఉంటుంది.
ఉష్ణప్రవాహాలు: 1) ఈశాన్య రుతుపవన డ్రిఫ్ట్.. ఇది ఈశాన్య రుతుపవనాల వల్ల ఏర్పడి సోమాలియా తీరంవైపు కదులుతాయి.
2) నైరుతి రుతుపవన డ్రిఫ్ట్.. ఇది నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల ఏర్పడి అండమాన్ దీవుల వైపునకు కదులుతాయి.
శీతల ప్రవాహం:
1) సోమాలియా ప్రవాహం
బి) దక్షిణ హిందూ మహాసముద్రం
ఉష్ణప్రవాహాలు: 1) దక్షిణ హిందూ మహాసముద్ర
రేఖా ప్రవాహం
2) మడగాస్కర్ ప్రవాహం
3) మొజాంబికన్ ప్రవాహం
4) అగుల్హస్ ప్రవాహం (మడగాస్కర్, మొజాంబికన్ ప్రవాహాల కలయిక వల్ల ఏర్పడింది)
శీతల ప్రవాహాలు:
1) పశ్చిమ పవన డ్రిఫ్ట్
2) పశ్చిమ ఆస్ట్రేలియన్ ప్రవాహం (ఆస్ట్రేలియా ఎడారి
ఏర్పడింది)
సముద్ర వనరులు
- భూమిపై అనేక రకాల వృక్ష, జంతు సంబంధ జీవరాశులు ఖనిజ, శక్తి వనరులు ఉన్నట్లుగానే సముద్రాల్లో కూడా వివిధ జీవరాశులు, ఖనిజ, శక్తి వనరులు ఉన్నాయి.
- సముద్రాల్లో ఉన్న ముఖ్య జీవరాశులను ప్లవకాలు అంటారు. ఇవి సముద్ర జలాల్లో తేలియాడే సూక్ష్మజీవరాశులు. ఇవి స్వయం చలన జీవులు కావు. సముద్ర ప్రవాహాల వల్ల చలనం చెందుతాయి.
- ప్లవకాలు అతి సూక్ష్మజీవులు. కానీ జెల్లీ చేపలు, సర్గాసం మొక్కలు పెద్దవైనప్పటికీ ఇదే కోవకు చెందినవి.
- ప్లవకాలు: ఇవి రెండు రకాలు.
1) వృక్ష సంబంధ ఫైటో ప్లవకాలు (Phytoplankton)
2) జంతు సంబంధ ప్లవకాలు (Zooplankton)
సముద్ర వృక్ష జీవరాశులు: జంతు సంబంధ జీవరాశుల్లో జూ ప్లవకాలు, బెంథోస్ (Benthos) సైమర్సెల్ (Saimersel) పెలాజిక్ ప్రాంతాల్లో నివసించే అనేక జాతులకు చెందిన చేపలు, తిమింగళాలు, సీల్ జంతువులు ముఖ్యమైనవి.
- బెంథోస్ అంటే సముద్ర అడుగున గల భూతలంపై నివసించే జీవరాశులు.
- డెమెర్సెల్ అనేవి సముద్రలోతులో జీవించే జీవరాశులు.
- పెలాజిక్ అనేవి సముద్ర ఉపరితలంపై తేలియాడేవి.
- వృక్ష సంబంధిత జీవరాశులు సముద్రాల్లో వాటి ఉనికికి కావాల్సిన జంతు సంబంధ జీవరాశులకు సముద్రాల్లో లభించే మొక్కలు అతి ముఖ్యమైన ఆహారం. కానీ ఇవి ఇతర జీవరాశులను కూడా భుజిస్తాయి.
- పోషకాహార పదార్థాలు, వెలుతురు ఉన్న ప్రాంతాల్లో విరివిగా నివసిస్తాయి.
ఫైటో ప్లవకాలు: ఇవి సూక్ష్మ ఉద్బిజ్జాలు, సముద్రాల్లో 180 మీ. లోతు వరకు జీవిస్తాయి. వీటి ఉత్పత్తి సముద్ర జలాల ఉష్ణోగ్రత, లవణీయతలపై ఆధారపడి ఉంటుంది.
- సముద్రంలోని ఖనిజాలను స్వీకరించి ఎక్కువగా సముద్ర ఉపరితల భాగంతో ఉంటుంది. వీటి లభ్యతపై చేపల ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది.
- ఉత్తర సముద్రంలోకి నదుల నుంచి మంచినీరు, బాల్టిక్ సముద్రం నుంచి అల్ప లవణీయత గల నీరు, నార్వే తీరం నుంచి ఆర్కిటిక్ చల్లని నీరు కలవడం వల్ల ఉత్తర సముద్రంలో అత్యధిక ఫైటో ప్లవకాలకు నిలయమై, రకరకాల చేపలకు నిలయంగా ఉంది.
- అందువల్లనే ఉత్తర సముద్రంలో అతి ముఖ్యమైన మత్స్యగ్రహన కేంద్రంగా డాగర్ బ్యాంక్‌గా కీర్తి చెందింది.
జూ ప్లవకం: ఇవి సూక్ష్మజీవరాశులు వీటి ఆహారం కోసం ఫైటోప్లవకంపై ఆధారపడతాయి. వివిధ రకాల ప్లవక జీవులు భిన్న ఉష్ణోగ్రత, లవణీయత గల ప్రాంతాల్లో నివసిస్తాయి. ఇవి కొన్ని రకాల చేపలకు, తిమింగలాలకు ముఖ్య ఆహారం.
బెంథోస్: సముద్రం అడుగున నివసించే జీవులను బెంథోస్ అంటారు. ఇవి ఫైటోప్లవకం, జూప్లవకం, ఇతర ఆహారపదార్థాలను స్వీకరిస్తాయి.
డెమర్సల్ చేపలు: సముద్రపు లోతుల్లో నివసించే చేపలను డెమర్సల్ చేపలు అంటారు. వీటి ముఖ్య కేంద్రాలు దక్షిణ ఓర్కిని, దక్షిణ షెట్లాండ్, దక్షిణ జార్జియా.
- డాల్ఫిన్లు, పోర్పాయిస్ కూడా సముద్ర క్షీరదాలు.
- 90 రకాల తిమింగలాలు సముద్రాల్లో నివసిస్తున్నట్లు గుర్తించారు. వీటి ఆహారం ప్లవకాలు, చేపలు, క్రీల్ అనే చిన్న జంతువు.
- సీల్ జంతువులు గ్రీన్లాండ్, న్యూఫౌండ్లాండ్, లాబ్రడార్ తీరాల్లో ఎక్కువగా ఉన్నాయి.
ఖనిజ-శక్తి వనరులు: సముద్రంలో కరిగి ఉన్న లవణాల్లో ముఖ్యమైనవి ఉప్పు, మెగ్నీషియం, బ్రోమిన్. అలాగే సముద్ర అంతర ఉపరితలం మీద మాంగనీస్ గుళికలు విస్తారంగా ఉన్నాయి. - అట్లాంటిక్, అరేబియా, బంగాళాఖాతం సముద్ర తీరాంచల బావుల నుంచి రిగ్గుల ద్వారా పెట్రోలియం తీస్తున్నారు.
- అలాగే ఏడ్రియాటిక్ సముద్రంలో మీథేన్ వాయువు, ఎర్ర సముద్రంలో బంగారం, వెండి, రాగి, జింక్, హిందూ మహాసముద్రంలో క్రోమియం లభ్యమవుతుంది.
- సముద్రాల్లో అక్కడక్కడ ఉప్పు గుమ్మటాలుగా కనిపిస్తాయి. వీటిలో భాగమే గంధకం అమెరికాలోని లూసియా తీరంలోను, మెక్సికో సింధు శాఖలోను విస్తారంగా ఉంది.\
- ప్రస్తుతం ఉప్పు, బ్రోమిన్, మెగ్నీషియం, సోడియం, క్లోరిన్ మాత్రమే వాణిజ్యపరంగా సముద్రాల నుంచి తీస్తున్నారు. సముద్రాల నుంచి గ్రహించబడుతున్న బ్రోమిన్ ప్రపంచ బ్రోమిన్ ఉత్పత్తిలో సుమారు 66 శాతం ఉంటుంది. అమెరికా వారికి కావాల్సిన మెగ్నీషియం ఎక్కువ భాగం మెక్సికో సింధుశాఖ నుంచి సేకరిస్తున్నారు.
పెట్రోలియం: సముద్ర భూతలం నుంచి పెట్రోలియం సేకరణ వ్యాపార సరళిలో 1930 నుంచి ప్రారంభమైంది.
- దక్షిణ అమెరికాలోని వెనెజులాలోని ‘మారాకైబో సరస్సు’ నుంచి రిగ్గుల ద్వారా మొదటిసారి పెట్రోలియం వెలికితీశారు.
- పెట్రోలియం వనరులు మెక్సికో సింధు శాఖలోను, టెక్సాస్, లూసియానా రాష్ర్టాల తీర ప్రాంతంలోను సముద్ర తీరాన్ని తొలచడం ద్వారా సేకరిస్తున్నారు.
- ఇటీవల అరేబియా సముద్రంలో ‘బాంబే హై’లో, తూర్పుతీరాన కృష్ణాగోదావరి నది పరీవాహక ప్రాంతాల్లో డ్రిల్లింగ్ ద్వారా ముడిచమురు లభిస్తుంది.
- ప్రపంచ పెట్రోలియం వనరుల్లో 20 శాతం సముద్ర భూతలం నుంచే లభిస్తుంది.
- అలలు, తరంగాల నుంచి శక్తి: బలమైన తరంగాల తాకిడి వల్ల శక్తి విడుదలవుతుంది.
- అలల కదలిక ద్వారా తగు పరికరాలతో విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. కానీ ఇప్పటివరకు అలల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయలేదు.
- అలాగే సముద్ర నీటి ఉష్ణోగ్రతలోని తేడాలవల్ల కూడా విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు