భూ పటలంలో ఎక్కువగా లభించే మూలకం ఏది?
పరమాణు నిర్మాణం, ఆవర్తన పట్టిక, రసాయన బంధం
1. ఉష్ణాన్ని విద్యుచ్ఛక్తిగా మార్చడానికి ఉపయోగపడేది?
ఎ) ఫొటో ఎలక్ట్రిక్ సెల్
బి) థర్మోకపుల్
సి) అమ్మీటర్
డి) థర్మామీటర్
2. సరైన వాక్యాలను గుర్తించండి.
1. ఫొటోసెల్, కెమెరా, ఫ్లాష్ లైట్లలోని సూత్రం కాంతి విద్యుత్ ఫలితం
2. కాంతి విద్యుత్ ఫలితంపై చేసిన కృషికి గుర్తింపుగా ఐన్‌స్టీన్‌కు నోబెల్ బహుమతి వచ్చింది
3. ఫొటో విద్యుత్ ఫలితం ప్రదర్శించే గుణం సీజియమ్కు ఎక్కువగా ఉంటుంది
ఎ) 3 బి) 1, 3
సి) 2, 3 డి) అన్నీ
3. పరారుణ కిరణాలకు సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి.
1. చీకటిలో వస్తువులను చూడగలిగే కళ్లద్దాలను ఉపయోగిస్తారు
2. టీవీ రిమోట్లలో టీవీలను నియంత్రించడానికి ఉపయోగపడతాయి
3. ఇవి ఉష్ణకాంతి కిరణాలు
ఎ) 1 బి) 2 సి) 1,2 డి) అన్నీ
4. రాడార్లలో ఉపయోగించే విద్యుదయస్కాంత కిరణాలేవి?
ఎ) రేడియోతరంగాలు
బి) మైక్రోతరంగాలు
సి) x-తరంగాలు
డి) పరారుణ కిరణాలు
5. సూక్ష్మ తరంగ బట్టీ కింది ధర్మంపై ఆధారపడి పనిచేస్తుంది?
ఎ) నీటి సూక్ష్మ తరంగ శోషణం
బి) వంట చేసే పాత్ర సూక్ష్మ తరంగ శోషణం
సి) వంట పాత్ర దృగ్గోచర తరంగ శోషణం
డి) అన్నీ
6. సూక్ష్మ తరంగ బట్టీ పనిచేసే సూత్రం?
ఎ) మైక్రోతరంగాలు మంటను విడుదల చేస్తాయి
బి) సూక్ష్మ తరంగాలు నేరుగా వేడిని విడుదల చేస్తాయి
సి) సూక్ష్మ తరంగాలు వండే ఆహారంలోని నీటి బిందువుల్లో కంపనాలు కలగచేయడం ద్వారా వేడి ఉద్గారమవుతుంది
డి) సూక్ష్మ తరంగాలు పాత్రను వేడి చేస్తాయి
7. జతపరచండి.
ఎ. ఫొటో విద్యుత్ ఫలితం 1. ఐన్‌స్టీన్
బి. ఎలక్ట్రానిక్ ద్వంద్వ స్వభావం 2. డీబ్రోగ్లీ
సి. అనిశ్చితత్వ సూత్రం 3. హైసెన్బర్గ్
డి. కేంద్రకం 4. రూథర్‌ఫర్డ్
ఎ) ఎ-1, బి-2, సి-4, డి-3 బి) ఎ-4, బి-1, సి-2, డి-3
సి) ఎ-1, బి-2, సి-3, డి-4 డి) ఎ-4, బి-2, సి-3, డి-1
8. ఒక మోల్ను సూచించే అవగాడ్రో సంఖ్య?
ఎ) 6.023×10-23
బి) 6.023×1023
సి) 6.023×10-14
డి) 6.023×1014
9. దేనిలో 6.023×10-23 పరమాణువులు ఉంటాయి?
ఎ) 1 గ్రా. హైడ్రోజన్
బి) 12 గ్రా. కార్బన్
సి) 16 గ్రా. ఆక్సిజన్
డి) అన్నీ
10. కృష్ణవస్తువు అంటే ?
ఎ) ఇనుముతో చేసిన వస్తువు
బి) తెల్లని వస్తువు
సి) తనపై పడిన కాంతిని పూర్తిగా శోషించుకునే వస్తువు
డి) ఎర్రని వస్తువు
11. ఒక నానో మీటర్ అంటే?
ఎ) 10-9 మీ. బి) 10-6 మీ.
సి) 10-12 మీ. డి) 10-15 మీ.
12. పరమాణువును గుర్తించడానికి ముఖ్యమైనది?
ఎ) పరమాణు సంఖ్య
బి) న్యూట్రాన్ల సంఖ్య
సి) పరమాణు భారం
డి) పరమాణు పరిమాణం
13. జతపరచండి.
ఎ. లూథర్ మేయర్ 1. పరమాణు భారం
బి. మెండలీఫ్ 2. పరమాణు పరిమాణం
సి. మోస్లే 3. పరమాణు సంఖ్య
డి. త్రిక సిద్ధాంతం 4. థామ్సన్ 5. డోబిరైనర్
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-2, బి-3, సి-4, డి-5
సి) ఎ-2, బి-1, సి-3, డి-5
డి) ఎ-2, బి-3, సి-1, డి-4
14. ఆధునిక ఆవర్తన పట్టికలోని మొదటి మూలకం?
ఎ) హైడ్రోజన్ బి) ఆక్సిజన్
సి) నైట్రోజన్ డి) కార్బన్
15. అత్యంత తేలికైన మూలకం ఏది?
ఎ) హైడ్రోజన్ బి) కార్బన్
సి) హీలియం డి) యురేనియం
16. కింద ఇచ్చిన మూలకాల్లో ఏది హాలోజన్?
1. ఫ్లోరిన్ 2. బ్రోమిన్
3. క్లోరిన్ 4. అయోడిన్
5. హైడ్రోజన్
ఎ) 5 బి) 1
సి) 1, 3, 4 డి) 1, 2, 3, 4
17. జడవాయువు కానిది ఏది?
ఎ) హీలియం బి) నియాన్
సి) ఆర్గాన్ డి) రేడియం
18. క్షారలోహం కానిది ఏది?
ఎ) లిథియం బి) సోడియం
సి) కాల్షియం డి) పొటాషియం
19. ఒక గ్రూపులో పరమాణు సంఖ్యతో పాటు పెరిగేది ఏది?
ఎ) పరమాణు పరిమాణం
బి) ధన విద్యుదాత్మకత
సి) రుణ విద్యుదాత్మకత డి) ఎ, బి
20. అతి చిన్న పీరియడ్ అయిన మొదటి
పీరియడ్‌లోని మూలకాలెన్ని?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
21. పరమాణు సంఖ్యకు ఆధారం?
ఎ) ఎలక్ట్రాన్లు బి) ప్రోటాన్లు
సి) న్యూట్రాన్లు
డి) ప్రోటాన్లు+న్యూట్రాన్లు
22. ద్రవ్యరాశి సంఖ్యను నిర్ణయించేది?
ఎ) ఎలక్ట్రాన్లు బి) ప్రోటాన్లు
సి) న్యూట్రాన్లు
డి) ప్రోటాన్లు+న్యూట్రాన్లు
23. వాయుస్థితిలో ఒక ఒంటరి తటస్థ పరమాణు బాహ్యకక్ష్య నుంచి ఎలక్ట్రాన్‌ను తీసివేయడానికి కావల్సిన శక్తిని ఏమంటారు?
ఎ) అయనీకరణ శక్తి
బి) ఎలక్ట్రాన్ ఎఫినిటీ
సి) రుణవిద్యుదాత్మకత
డి) ఏదీకాదు
24. ఒక రుణవిద్యుదాత్మక పరమాణు రుణ అయాన్‌గా మారినప్పుడు?
ఎ) ఎలక్ట్రాన్ల సంఖ్య తగ్గుతుంది
బి) ఎలక్ట్రాన్ల సంఖ్య పెరుగుతుంది
సి) పరమాణు సంఖ్య తగ్గుతుంది
డి) పరమాణు సంఖ్య పెరుగుతుంది
25. ఒక ధనవిద్యుదాత్మక పరమాణువు కాటయాన్‌గా మారినప్పుడు?
ఎ) ఎలక్ట్రాన్లను గ్రహిస్తుంది
బి) ఎలక్ట్రాన్లను కోల్పోతుంది
సి) ప్రోటాన్లను కోల్పోతుంది
డి) పరమాణు సంఖ్య తగ్గుతుంది
26. క్షార మృత్తిక లోహం కానిది ఏది?
ఎ) Mg బి) Ba
సి) Ca డి) Fr
27. హాలోజన్ల ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ లేదా ఎలక్ట్రాన్ఎఫినిటీ తగ్గే క్రమం?
ఎ) F>Cl>Br>I బి) Cl>F>Br>I
సి) I>Br>Cl>F డి) F>Br>Cl>I
28. భూ పటలంలో ఎక్కువగా లభించే మూలకం ఏది?
ఎ) కార్బన్ బి) ఐరన్
సి) నైట్రోజన్ డి) సిలికాన్
29. రేడియోధార్మికత గల హాలోజన్ ఏది?
ఎ) ఫ్లోరిన్ బి) క్లోరిన్
సి) బ్రోమిన్ డి) ఆస్టాటిన్
30. ఆవర్తన పట్టికలో మొదటి నాలుగు మూలకాలు ఏవి?
ఎ) హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం
బి) హైడ్రోజన్, హీలియం, లిథియం, కార్బన్
సి) హైడ్రోజన్, లిథియం, హీలియం, కార్బన్
డి) హైడ్రోజన్, లిథియం, హీలియం, బోరాన్
31. ఒక పరమాణువు ఎలక్ట్రాన్లను గ్రహించి ఆనయాన్‌గా మారినప్పుడు దాని పరిమాణం?
ఎ) తగ్గుతుంది బి) పెరుగుతుంది
సి) మార్పు ఉండదు
డి) పరమాణువుపై ఆధారపడుతుంది
32. ఆధునిక ఆవర్తన పట్టికలోని పీరియడ్ల సంఖ్య?
ఎ) 6 బి) 7 సి) 8 డి) 9
33. రుణవిద్యుదాత్మకత ‘సున్నా’ గల మూలకాలు?
ఎ) హాలోజన్లు బి) చాల్కోజన్లు
సి) పైకోజన్లు డి) జడవాయువులు
34. మూలకాల మౌలిక ధర్మం పరమాణు సంఖ్య అని ప్రయోగాత్మకంగా నిరూపించిన శాస్త్రవేత్త?
ఎ) మోస్లే బి) మెండలీఫ్
సి) బోర్ డి) న్యూలాండ్
35. రేడియోధార్మికత గల జడవాయువవు?
ఎ) హీలియం బి) నియాన్
సి) ఆర్గాన్ డి) రేడాన్
36. జతపరచండి.
ఎ. తేలికైన వాయువు 1. హైడ్రోజన్
బి. తేలికైన జడవాయువు 2. లిథియం
సి. తేలికైన లోహం 3. హీలియం
డి. తేలికైన రేడియోధార్మిక కేంద్రకం 4. డ్యుటీరియం
5. ట్రిటియం
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-1, బి-3, సి-2, డి-5
సి) ఎ-1, బి-3, సి-5, డి-2
డి) ఎ-4, బి-2, సి-3, డి-5
37. ద్వితీయ అయనీకరణ శక్మం వీలుకాని మూలకం ఏది?
ఎ) హైడ్రోజన్ బి) లిథియం
సి) హీలియం డి) ఫ్లోరిన్
38. పరమాణువుల కలయిక వల్ల అణువు ఏర్పడినప్పుడు శక్తి పరమాణువుల మొత్తం శక్తి కంటే?
ఎ) సమానం బి) తక్కువ
సి) ఎక్కువ డి) చెప్పలేం
39. సమయోజనీయ బంధం ఏర్పడే పరిస్థితి?
ఎ) రెండు కేంద్రకాల మధ్య ప్రోటాన్ల మార్పిడి
బి) రెండు కేంద్రకాల మధ్య న్యూట్రాన్ల మార్పిడి
సి) రెండు పరమాణువులు ఎలక్ట్రాన్లను పంచుకోవడం వల్ల
డి) రెండు పరమాణువుల మధ్య ఎలక్ట్రాన్ల మార్పిడి
40. టేబుల్ సాల్ట్ దేనిలో కరుగుతుంది?
ఎ) కిరోసిన్ బి) పెట్రోల్
సి) నీరు డి) అన్నీ
41. చక్కెర సమయోజనీయ పదార్థం అయినా నీటిలో కరగడానికి కారణం?
ఎ) అయానిక బంధాలు
బి) సమయోజనీయ బంధాలు
సి) నీటి అణువులు, సుక్రోజ్ అణువుల మధ్య హైడ్రోజన్ బంధాలు ఏర్పడటం
డి) ఏదీకాదు
42. సాధారణంగా స్ఫటికాకృతిలో ఉండేవి?
ఎ) అయానిక పదార్థాలు
బి) హైడ్రోకార్బన్లు
సి) ఈథర్లు డి) ప్రొటీన్లు
43. సమయోజనీయ స్ఫటికం ఏది?
ఎ) అయాన్ బి) వజ్రం
సి) రెండూ డి) సోడియం క్లోరైడ్
44. లోహాల్లో ఉండే లోహబంధం వివరించే సిద్ధాంతం?
ఎ) స్వేచ్ఛా ఎలక్ట్రాన్ సిద్ధాంతం
బి) అణు ఆర్బిటాల్ సిద్ధాంతం
సి) అవగాడ్రో సిద్ధాంతం
డి) స్ఫటిక క్షేత్ర సిద్ధాంతం
45. సాధారణ ఉప్పులో ఉండే బంధం?
ఎ) అయానిక బంధం
బి) సమయోజనీయ బంధం
సి) హైడ్రోజన్ బంధం
డి) లోహ బంధం
46. నీటి అణువులో బంధకోణం ఎంత?
ఎ) 1040 బి) 1200
సి) 1090 డి) 1800
47. నూనెల హైడ్రోజనీకరణం దేనికి ఉదాహరణ?
ఎ) ఆక్సీకరణం బి) క్షయకరణం
సి) హైడ్రేషన్ డి) జలవిశ్లేషణ
48. నీటి అణువు ఆకృతి?
ఎ) పిరమిడ్ బి) V- ఆకృతి
సి) రేఖీయం డి) త్రిభుజం
49. పిరమిడల్ ఆకృతిలో ఉన్న అణువు?
ఎ) NH3 బి) H20
సి) H2S డి) CH4
50. నీరు ద్రవస్థితిలో ఉండటానికి కారణం?
ఎ) అయానిక బంధం
బి) సమయోజనీయ బంధం
సి) అణ్వంతర హైడ్రోజన్ బంధాలు
డి) అంతరణుక హైడ్రోజన్ బంధాలు
51. చర్యలో ఉష్ణం గ్రహించబడితే ఆ చర్య?
ఎ) ఉష్ణగ్రాహక చర్య
బి) ఉష్ణమోచక చర్య
సి) ఉష్ణగతిక చర్య
డి) విస్ఫోటక చర్య
52. ఉత్ప్రేరకం అనే రసాయన పదార్థం?
ఎ) చర్యను జరుపుతుంది
బి) చర్యావేగాన్ని మార్చదు
సి) చర్యవేగాన్ని పెంచుతుంది
డి) చర్య జరగకుండా అడ్డుకుంటుంది
53. ఒక రసాయన చర్య ఉష్ణోగ్రతను 100c పెంచితే చర్యావేగం?
ఎ) మారదు
బి) రెట్టింపు అవుతుంది
సి) పదిరెట్లు అవుతుంది
డి) సగం అవుతుంది
54. ఇనుము తుప్పుపట్టడం?
ఎ) ఆక్సీకరణం బి) క్షయకరణం
సి) రసాయన వియోగం డి) దహనం
55. రసాయన చర్యకానిది ఏది?
ఎ) బొగ్గు మండించడం
బి) నీరు ఆవిరిగా మారడం
సి) ఆహారం జీర్ణం కావడం
డి) కాగితం మండించడం
56. ఘనస్థితితో ఏవి విద్యుద్వాహకాలు?
ఎ) సమయోజనీయ పదార్థాలు
బి) అయానిక పదార్థాలు
సి) లోహాలు డి) అన్నీ
57. ఆక్సీకరణం అంటే?
ఎ) ఆక్సీజన్‌ను కలపడం
బి) హైడ్రోజన్‌ను తీసివేయడం
సి) ఎలక్ట్రాన్లను తీసివేయడం డి) అన్నీ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు