ఆ శిశువు ఏ భావనను కలిగి ఉన్నాడు?
మే 12వ తేదీ 6వ తరువాయి..
పియాజే ఈ దశను 2 అంతర దశలుగా విభజించారు. అవి..
1) పూర్వ భావనాత్మక దశ/ప్రాక్ భావన దశ (ప్రీ కాన్సెప్టువల్ ఫేజ్)
ఈ దశ 2-4 సంవత్సరాల వరకు ఉంటుంది.
ఈ దశలో భాషా వికాసం చాలా వేగంగా జరుగుతుంది.
శిశువు వస్తువును గుర్తించి వాటి పోలికల ఆధారంగా వర్గీకరణలను చేయడం ప్రారంభిస్తాడు.
ఈ విధంగా చేసేటప్పుడు కొన్ని తప్పులను కూడా చేస్తాడు.
ఉదా: ఆడవాళ్లందరినీ అమ్మ అని, మగవాళ్లందరినీ నాన్న అని, ముసలివాళ్లందరినీ అమ్మమ్మ, తాతయ్య అని పిలుస్తారు.
ఈ దశలో 2 ముఖ్య పరిమితులు ఉన్నాయి. అవి.. ఎ) సర్వాత్మ వాదం బి) అహం కేంద్ర వాదం
సర్వాత్మ వాదం (ఎనిమిజం)
శిశువు జీవం (ప్రాణం) లేని వస్తువులకు జీవాన్ని ఆపాదించడమే సర్వాత్మ వాదం
ఉదా: 1) శిశువు తాను ఆడుకొనే బొమ్మలకు స్నానం చేయించి బట్టలు వేస్తాడు.
2) ఊహాత్మక క్రీడలు (మేక్ బిలీవ్ ప్లే)
ఆడుతాడు.
పిల్లలు తమ సమక్షంలో ఉన్న వాటి గురించి, లేని వాటి గురించి మాట్లాడడుతారు.
ఉదా: ఎప్పుడూ చూడని పులులు, సింహాలు, దెయ్యాలు మొదలైన వాటి గురించి మాట్లాడుతారు.
ఒక వస్తువును వేరొక వస్తువుగా భావించి ఆటలాడే ప్రతిభాసాత్మక ఆలోచన కలిగి ఉంటారు.
ఉదా: 1) చెక్క ముక్కను గుర్రం లేదా సైకిల్‌గా భావించి ఆడటం
2) కర్రను తుపాకీగా భావించి ఆడటం
అహం కేంద్రవాదం (ఈగో సెంట్రిజం)
శిశువు తన చుట్టూ ఉన్న ప్రపంచమంతా తన చుట్టూ కేంద్రీకరించబడిందని అందరూ తనలాగే ఆలోచిస్తారని అనుకోవడమే ‘అహం కేంద్ర వాదం’.
ఉదా: శిశువు తను నడుస్తూ ఉంటే తనతోపాటు సూర్యుడు, చంద్రుడు నడుస్తున్నారని అనుకుంటాడు.
అహం కేంద్ర వాదం ఈ దశలోనే కాకుండా మూర్త ప్రచాలక దశలో కూడా కొనసాగుతుంది.
2) అంతర్బుద్ధి దశ (ఇనిషియేటివ్ ఫేజ్)
ఈ దశ 4-7 సంవత్సరాల వరకు ఉంటుంది.
వస్తువులను పోల్చడం, వర్గీకరించడం వంటి మానసిక చర్యలను బాగా చేయగలరు.
ఉదా: ఆపిల్, నారింజ, అరటిపండ్లలో రంగు, రుచి, ఆకారంలో భేదాలున్నప్పటికీ అవన్నీ పండ్లని చెబుతారు.
సమస్యను పరిష్కరించగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ దానిని వివరించే వికాసం ఇంకా పెంపొందదు.
ఈ కాలంలో ఏర్పడే పరిమితులు 2 అవి.. ఎ) పదిలపరచుకొనే భావనాలోపం
బి) అవిపర్యాత్మక భావనాలోపం
పదిలపరచుకొనే భావనాలోపం (కన్జర్వేషన్)
ఒక వస్తువుకు బాహ్యంగా మార్పులు (ఆకారాన్ని, పరిస్థితి మార్చినా) చేసినప్పటికీ దానికి సంబంధించిన లక్షణాలు అలాగే ఉండటాన్ని ‘పదిలపరచుకొనే భావన’ అంటారు.
ఈ దశలోని పిల్లలు ఈ భావనను కలిగి ఉండకపోవడంవల్ల అడిగిన ప్రశ్నలకు తప్పు సమాధానాలు చెబుతారు.
ఉదా: రెండు సన్నని పొడవు గ్లాసుల్లో ఒకే గీత వరకు నీరు చూపించి, ఒక గ్లాసులోని నీరును వేరొక పొట్టి వెడల్పాటి గ్లాసులోకి పోసి, నీరు ఎందులో ఎక్కువ ఉందని అడిగినప్పుడు పిల్లవాడు పొడవు గ్లాసులో నీళ్లు ఎక్కువ ఉన్నాయని చెబుతాడు.
శిశువు ఒకే విశేషంపై ఆలోచనను కేంద్రీకరిస్తాడు.
అవిపర్యాత్మక భావనాలోపం/ఏకమితి
శిశువు విషయాన్ని ఒక కోణంలో మాత్రమే ఆలోచించి, దానికి భిన్నంగా ఆలోచించలేకపోవడాన్ని అవిపర్యాత్మక భావనాలోపం అంటారు.
l ప్రతి తార్కిక ప్రచాలకాన్ని తిరిగి చేయవచ్చనే భావన కలిగి ఉండడు.
ఉదా: నీ పేరేమిటి? అని అడిగితే చెప్పగలడు. కానీ మీ అమ్మ కొడుకు పేరు ఏమిటని అడిగితే చెప్పలేడు.
3) మూర్త ప్రచాలక దశ/అనియత ప్రచాలక దశ
ఈ దశ 7-11 సంవత్సరాల వరకు ఉంటుంది.
విషయాలు, వస్తువుల మధ్య పరస్పర సంబంధాలను స్థాపించగలడు.
తార్కికంగా, క్రమబద్ధంగా ఆలోచించగలడు.
విచక్షణ, తీర్మానాలను చేయడానికి ఆగమనాత్మక, నిగమనాత్మక ఉపగమాలు ఉపయోగిస్తాడు.
పూర్వ ప్రచాలక దశలోని పరిమితులను ఈ దశలో అధిగమిస్తాడు.
ఉదా: 1) ప్రార్థనా సమావేశంలో 1-4 తరగతి విద్యార్థులకు మాత్రమే రేపు సెలవు అని ప్రధానోపాధ్యాయుడు ప్రకటించినప్పుడు, 3వ తరగతి చదువుతున్న బాలుడు తనకు రేపు సెలవని పాఠశాలకు రావాల్సిన అవసరం లేదని అర్థం చేసుకుంటాడు (ఇదే నిగమనాత్మక ఆలోచన)
2) రెండు సన్నని పొడవు గ్లాసుల్లో ఒకే గీత వరకు నీటిని చూపించి ఒక గ్లాసులోని నీటిని వేరొక పొట్టి గ్లాసులోకి పోసి, నీరు ఎందులో ఎక్కువ ఉందని అడిగితే పిల్లవాడు రెండు గ్లాసుల్లో నీరు సమానమని చెబుతాడు.
3) నీ పేరేమిటి? అని అడిగితే ఈశ్వర్ అని చెప్పిన విద్యార్థి మీ అమ్మ కొడుకు పేరు ఏమిటని అడిగితే తన పేరైన ఈశ్వర్‌ను
చెప్పగలడు.
వాస్తవిక తర్కంతో కూడిన ఆలోచనలు మూర్త విషయాలకే పరిమితం. అంటే వీరు ఉద్దీపనలను భౌతికంగా చూస్తేనే పరిష్కరణ చేయగలడు. కానీ గైర్హాజరులో కాదు.
ఉదా: 1) శిశువు ఎక్కడి నుంచైనా తనకు తెలిసిన దారిలో ఇంటికి వెళ్లగలడు. కానీ ఇంటికి దారిని చెప్పలేడు.
2) ఒక విద్యార్థి ఎదురుగా ముగ్గురు వ్యక్తులను నిలబెట్టి వారిలో ఎవరు పొట్టి అని అడిగితే సమాధానం చెప్పగలడు. కానీ ఇదే విషయాన్ని వాక్య రూపంలో అడిగితే సమాధానం చెప్పలేడు.
పదిలపరచుకునే భావన, వర్గీకరణ శక్తి, విశ్లేషణ శక్తి అభివృద్ధి చెందుతాయి.
ఈ దశలో పిల్లల ఆలోచన ఎంతమాత్రం అహం కేంద్రీకృతంగా ఉండదు. సంఖ్య, బరువు, కాలానికి చెందిన భావనలు
ఏర్పడుతాయి.
4) అమూర్త ప్రచాలక దశ/నియత ప్రచాలక దశ
ఈ దశ 11-16 సంవత్సరాల వరకు ఉంటుంది.
తార్కిక ఆలోచన ద్వారా అమూర్తంగా వ్యవహరించడం నేర్చుకుంటారు.
మూర్త నిర్ణయాలు ప్రత్యేకతల మధ్య సంబంధాలేర్పర్చడం ప్రారంభిస్తారు.
ఈ దశలో శిశువు తన వివేచనాన్ని ఉపయోగించి తార్కిక పరిష్కారాలను అనుప్రయుక్తం చేసి సమాధానం చెప్పగలడు.
ఉదా: ఆకుపచ్చ రంగుగల పులులను జూపార్కులో ఉంచితే జూపార్కులో పులులన్నీ ఆకుపచ్చ రంగులో ఉంటాయా అని అడిగితే పులులు ఆకుపచ్చ రంగులో కాకుండా పసుపు రంగులో ఉంటాయని
తెలియజేస్తాడు.
విభిన్న కోణాల్లో ఆలోచించి సమస్యను పరిష్కరిస్తారు.
ప్రామాణీకరించిన ప్రజ్ఞా పరీక్షల్లో సగటు కంటే తక్కువ స్కోరు సాధించే వ్యక్తి అమూర్త ప్రచాలక దశను చేరుకోలేడు.
కార్యాచరణ సంబంధాన్ని అర్థం చేసుకోగలరు. ఈ దశ చివరికి సంజ్ఞానాత్మక వికాసం పూర్తవుతుంది.
నోట్: పియాజే ప్రకారం 1) ప్రాథమిక పాఠశాల దశలో మూర్త విషయాలను ప్రవేశపెట్టాలి.
2) ఉన్నత పాఠశాల దశలో అమూర్త విషయాలను ప్రవేశపెట్టాలి.
3) విద్యాలక్ష్యం, పాత తరాలు చేసినవే చేయడం కాకుండా కొత్తవాటిని చేసే మనుష్యులను సృష్టించే విధంగా ఉండాలి.
4) ప్రజ్ఞా స్థాయిలను బట్టి బోధనాంశాలు, బోధనా పద్ధతులను రూపొందించాలి.
ప్రాక్టీస్ బిట్స్
- వ్యక్తి తన పరిసరాలతో ప్రభావంతంగా సర్దుబాటు చేసుకొని అనుసరించే సామర్థ్యమే?
1) సహజ సామర్థ్యం 2) ప్రజ్ఞ
3) నైపుణ్యం 4) అభ్యసనం - వ్యక్తి తన గురించి, తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి తెలుసుకొని అవగాహన చేసుకోవడమే?
1) సంజ్ఞానం 2) జ్ఞానం
3) అభ్యసనం 4) ప్రత్యక్ష జ్ఞానం - పరిసరాల్లో ఉన్న వస్తువులతో సర్దుబాటు చేసుకోవడానికి పిల్లలు, పెద్దలు ఉపయోగించుకొనే ప్రవర్తనా నమూనాలే?
1) కొండగుర్తులు 2) స్మృతిచిహ్నాలు
3) స్కిమాటాలు 4) భావనలు - బాహ్య ప్రవర్తనలు, మానసిక చర్యలు శిశువు ఎదుగుదలతో పాటు మార్పునకు లోనవుతాయి. వీటిని ఏమంటారు? వీటి ఉదాహరణలకు సంబంధించి కిందివాటిలో సరైన జత?
1) ప్రచాలకాలు – సంజ్ఞానం, స్మృతి, మూల్యాంకనం
2) సంజ్ఞానం – స్మృతి, విచక్షణ
3) నైపుణ్యాలు – ఏకకేంద్ర ఆలోచన, విభిన్న ఆలోచన
4) సహజ సామర్థ్యాలు – విభిన్న ఆలోచన, మూల్యాంకనం - వయసుతో పాటు లేదా అనుభవాల వల్ల స్కిమాటాల్లో మార్పులు రావడానికి కారణమైనవి?
1) అనుకూలత 2) వ్యవస్థీకరణ
3) 1, 2 4) ఏదీకాదు - వ్యక్తి తన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి జ్ఞానాన్ని పొంది తదనుగుణంగా సమర్థవంతంగా వ్యవహరించడానికి తోడ్పడే అభ్యసనం, స్మృతి, ఆలోచన, ప్రత్యక్షం మొదలైనవాటితో కూడుకున్న ప్రవర్తనే?
1) సహజ సామర్థ్యం 2) నైపుణ్యం
3) ప్రచాలకం 4) సంజ్ఞానం - పరిసరాలతో ప్రత్యక్షంగా జరిగే పరస్పర చర్య వల్ల ఏర్పడే స్కిమాటాలతో
కూడుకున్నదే?
1) వ్యవస్థీకరణ 2) అనుకూలత
3) ప్రతిచర్య 4) ఏదీకాదు - తనకు తెలిసిన పెద్దదైన తెల్లని పక్షిని చూసిన బాలుడు కొత్తగా విమానాన్ని చూసినప్పుడు విమానాన్ని పక్షిగా భావించాడు. ఆ బాలుడు పోల్చుకున్న ప్రక్రియ?
1) సాంశీకరణం 2) అనుగుణ్యం
3) వ్యవస్థీకరణ 4) ప్రతిచర్య - విమానాన్ని చూసి పక్షిగా భావించిన పిల్లవాడు దాని ఆకారం, పరిమాణం, ధ్వని వంటివాటిలోని భేదాలను గుర్తించి విమానాన్ని ఒక ఎగిరే సాధనంగా గుర్తించాడు. అతడు ఉపయోగించిన సంజ్ఞానాత్మక ప్రక్రియ?
1) సాంశీకరణం 2) అనుకూలత
3) అనుగుణ్యం 4) సంశ్లేషణ - కింది వాక్యాలకు సంబంధించి సరికానిది?
1) పరిసరాలతో ప్రత్యక్ష పరస్పర చర్య- అనుకూలత
2) పాత అనుభవాలను కొత్త అనుభవాలతో సరిపోల్చుకునే ప్రక్రియ- సాంశీకరణం
3) కొత్త స్కిమాటాలను సృష్టించుకునే ప్రక్రియ- అనుగుణ్యం
4) పాత స్కిమాటాలను దృఢపర్చుకొనే ప్రక్రియ- వ్యవస్థీకరణం - రవి అనే బాలుడు కర్రను తుపాకీగా భావించి ఆటలాడుతున్నాడు. రవికి సంబంధించి కింది వాటిలో సరైనది?
1) అంతరబౌద్ధిక దశ- అవిపర్యయాత్మక ఆలోచన
2) పూర్వభావనాత్మక దశ- ప్రతిభాసాత్మక ఆలోచన
3) పూర్వభావనాత్మక దశ- అహంకేంద్ర ఆలోచన
4) ఇంద్రియ చాలక దశ- వస్తుస్థిరత్వ భావన - కింది వాటిలో సరికాని వాక్యం?
1) ఒక వస్తువు ఆకారాన్ని మార్చినా, స్థితిని మార్చినా దాని గుణం కూడా మారుతుంది అనే పదిలపర్చుకొనే భావన
2) శిశువు తన ఎదుటలేని వస్తువు ఎక్కడో ఒక చోట ఉంటుందని భావించడమే వస్తుస్థిరత్వ భావన
3) శిశువు తనతోపాటు సూర్యుడు, చంద్రుడు కూడా నడుస్తున్నారని అనుకోవడమే అహంకేంద్ర వాదం
4) శిశువు విషయాన్ని ఒక కోణంలో మాత్రమే ఆలోచించి దానికి భిన్నంగా ఆలోచించలేని అవిపర్యాత్మక భావన లోపాన్ని పూర్వప్రచాలక దశలో కలిగి ఉంటాడు - సంజ్ఞానాత్మక వికాసానికి సంబంధించనది?
1) ఉపాధ్యాయుడి ప్రవర్తనా నమూనాలు విద్యార్థి అనుసరించడం
2) తన గురించి పరిసరాల గురించి శిశువు అవగాహన చేసుకోవడం
3) దశపై ఆధారపడదు కానీ వయస్సుపై ఆధారపడుతుంది
4) సంజ్ఞానాత్మక వికాసం దశలక్రమంపై ఆధారపడుతుంది. కానీ వయస్సుపై ఆధారపడదు - శిశువు ఊహాత్మక క్రీడలు ఆడుతూ తాను ఎప్పుడూ చూడని దెయ్యాలు, పులులు, సింహాల గురించి మాట్లాడుతున్నాడు. పియాజే ప్రకారం ఆ శిశువు ఏ భావనను కలిగి ఉన్నాడు?
1) కన్జర్వేషన్ 2) ఎనిమిజం
3) వస్తు స్థిరత్వ భావన 4) స్కిమాటా
Answers
1-2, 2-1, 3-3, 4-1, 5-3, 6-4, 7-2, 8-1, 9-3, 10-4, 11-2, 12-1, 13-3, 14-2.
శివపల్లి
టీఎస్& ఏపీ సైకాలజీ ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీ సర్కిల్
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు