‘ఓం’ కారమే భాషకు మూలం అని తెలిపేవాదం?
భాషోత్పత్తి వాదాలు లెవల్-1
- ‘భాషోత్పత్తి’ అంశంపై 1866లో చర్చను నిషేధించిన భాషాశాస్త్ర సంఘం?
1) బ్రిటన్ భాషాశాస్త్ర సంఘం (బ్రిటన్ లింగ్విస్టిక్ సొసైటీ)
2) పారిస్ భాషాశాస్త్ర సంఘం (పారిస్ లింగ్విస్టిక్ సొసైటీ)
3) ఇండియన్ భాషాశాస్త్ర సంఘం (ఇండియన్ లింగ్విస్టిక్ సొసైటీ)
4) ఇటాలియన్ భాషాశాస్త్ర సంఘం (ఇటాలియన్ లింగ్విస్టిక్ సొసైటీ) - ‘సహజ ధ్వని ఆధారవాదాలు’ అనే అంశాన్ని 1861లో పేర్కొన్న ప్రముఖ భాషాశాస్త్రవేత్త?
1) మాక్స్ ముల్లర్
2) ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి
3) ట్రాంబెట్టి (ఇటలీ)
4) పైథాగరస్, ప్లేటో - ప్రపంచ ప్రారంభంలో ఒకే మానవ భాష ఉండేదని క్రమక్రమంగా అనేక భాషలు అయ్యాయి అని తెలిపే భాషోత్పత్తివాదం? (టెట్ 2018)
1) సమాలోచన వాదం
2) ఏకమూల భాషావాదం
3) స్ఫోటవాదం
4) దైవదత్తవాదం - ‘మానవులు పరస్పరం సంప్రదించుకొని, చర్చించుకొని అక్షరాలు, పదాలు ఏర్పర్చుకోవడమే భాషకు ప్రారంభ స్థితి’ అన్న అభిప్రాయం? (ఎస్జీటీ 2019)
1) సమాలోచనవాదులది
2) ఆశ్చర్యవాదులది
3) శ్రమజీవులది
4) శ్వాసవాదులది - ‘ఓం’ కారమే భాషకు మూలం అని తెలిపేవాదం?
1) దైవదత్తవాదం 2) స్ఫోటవాదం
3) ఏకమూలభాషావాదం
4) స్వభావవాదం - భగవంతుడే భాషను ప్రసాదించాడు /సృష్టించాడని భావించే వాదం – ఆ వాదానికి ఉన్న ఇతర పేర్లు?
1) భౌభౌ వాదం/ధ్వన్యనుకరణ వాదం
2) వివక్షా ప్రేరణ వాదం/ఆశ్చర్యవాదం /పూపూవాదం/టట్టట్వాదం
3) ప్రకంపనావాదం/డింగ్డాంగ్వాదం
4) దైవదత్తవాదం/భగవద్దత్తవాదం/ భగవత్ప్రసాదవాదం/అలౌకికవాదం/
సంప్రదాయవాదం - దైవదత్తవాదం ప్రకారం ఒక స్వీడన్ భాషావేత్త దేవుడు సృష్టించిన ఈడెన్ ఆరామంలో ఎవరెవరు ఏయే భాషలు వ్యవహరించారో వాటికి సంబంధించి సరికాని జత గుర్తించండి?
1) ఆడమ్- స్వీడిష్
2) సాటన్ (సర్పం)- డేనిష్
3) ఈవ్- ఫ్రెంచ్ 4) ఆడమ్- ఫ్రెంచ్ - హిందువులకు సంస్కృతం, మహ్మదీయులకు అరబ్బీ (అరబిక్), క్రైస్తవులకు హిబ్రూ భాషలు దైవ భాషలు అని తెలిపేవాదం?
1) భగవద్దత్తవాదం 2) ధాతువాదం
3) సాంకేతికవాదం 4) స్వతస్సిద్ధవాదం - ‘కచ్ఛపి’ అనే వీణ నుంచి అక్షర శక్తులు ఏర్పడ్డాయని, అవే భాషా విస్తృతికి మూలరూపాలు అని కొందరు భావిస్తారు. అయితే ‘కచ్ఛపి’ ఎవరి వీణ?
1) సరస్వతీదేవి 2) పార్వతీదేవి
3) లక్ష్మీదేవి 4) పద్మావతీదేవి - ‘భాష’ ఆవశ్యకతను బట్టి స్వాభావికంగా ఉత్పన్నమైనది’ అని భావించిన స్వభావవాదులు (గ్రీకు తత్వవేత్తలు) ఎవరు? (టీజీటీ 2017)
1) పైథాగరస్, ప్లేటో
2) డెమిట్రియస్, పైథాగరస్
3) డెమిట్రియస్, అరిస్టాటిల్
4) ప్లేటో, అరిస్టాటిల్ - ‘భావ వినిమయానికి అవసరమైన సాధనాన్ని అన్వేషించే ప్రక్రియలో భాగంగా మానవుడు భాషను ఉత్పన్నం చేసుకున్నాడు’ ఈ వాదమే? (ఎస్జీటీ 2019)
1) సంకేతవాదం 2) స్వభావవాదం
3) స్వతస్సిద్ధవాదం
4) క్రమపరిణామ వికాసవాదం - భాష సంకేతాల ద్వారా ఏర్పడుతుందని భావించిన గ్రీకు తాత్వికులైన సంకేతవాదులు ఎవరు?
1) పైథాగరస్, ప్లేటో
2) డెమిట్రియస్, అరిస్టాటిల్
3) డెమిట్రియస్, పైథాగరస్
4) ప్లేటో, అరిస్టాటిల్ - అవసరార్థులైన ఆదిమానవులు గుంపులు గుంపులుగా ఒకచోట చేరి ఈ భావానికి ఇలాంటి ధ్వనిరూపమైన సంకేతం ఉండాలని అన్వయాన్ని స్థిరపర్చుకున్నారని తెలిపేవాదం, ఆ వాదాన్ని ప్రతిపాదించినవారు?
1) అన్వయవాదం (థియరీ ఆఫ్ అగ్రిమెంట్)- డెమొక్రటిస్, అరిస్టాటిల్
2) స్వభావవాదం (థియరీ ఆఫ్ ఇన్హిరెంట్ నెసెసిటీ)- పైథాగరస్, ప్లేటో
3) యో హి హో వాదం- నోయిర్/నార్వే
4) ధ్వన్యనుకరణ వాదం- జొహాన్ గాట్ప్రైడ్ - భౌభౌ వాదం ధ్వన్యనుకరణ వాదాన్ని ప్రతిపాదించినది?
1) సర్ రిచర్డ్ పాజెట్
2) జొహాన్ గాట్ప్రైడ్
3) మాక్స్ ముల్లర్ (జర్మనీ)
4) ట్రాంబెట్టి (ఇటలీ) - ‘ఆదిమానవుడు తన పరిసరాల్లో విన్న సహజధ్వనులను అనుకరించడం ద్వారా భాషను నిర్మించుకున్నాడు’ అని తెలిపే భాషోత్పత్తి వాదం?
1) దైవదత్తవాదం 2) స్వభావ వాదం
3) సాంకేతికవాదం
4) భౌభౌ వాదం/ధ్వన్యనుకరణవాదం - కొన్ని పదాల ఉచ్ఛారణలు సహజధ్వనులకు దగ్గరగా ఉండటం ఏ భాషోత్పత్తి వాదానికి ఆధారం?
1) భౌభౌవాదం/ధ్వన్యనుకరణవాదం
2) ధాతువాదం/ధాతుజన్యవాదం
3) దైవదత్తవాదం/అలౌకికవాదం
4) యో హి హో వాదం - భయం, బాధ, సంతోషం, విస్మయం మొదలైన మనోభావాలు వ్యక్తం చేయడానికి మానవుడు అప్రయత్నంగా వెలువరించే ‘ఓ, హా, ఆహ్, ప్చ్’ లాంటి ధ్వనుల నుంచి భాష పుట్టింది అని తెలిపే భాషోత్పత్తివాదం? (ఎస్జీటీ 2019)
1) పూపూవాదం/టట్టట్వాదం
2) యో-హి-హో వాదం
3) ధ్వన్యనుకరణవాదం
4) ప్రకంపనావాదం - ‘ఉద్వేగాల ప్రకటనాభిలాషే భాషకు మూలం’ అని సమర్థించే వాదం? (టెట్ 2018)
1) స్వతస్సిద్ధవాదం
2) సంపాదనావాదం
3) వివక్షాప్రేరణ వాదం 4) దైవదత్తవాదం - పూపూవాదం/టట్టట్వాదం ప్రతిపాదించినది?
1) నోయిర్ (నార్వే)
2) ట్రాంబెట్టి (ఇటలీ)
3) నోమ్‌ఛామ్‌స్కీ
4) కొండికల్ - ఓ, హా, ఆహ్, ప్చ్ లాంటి ధ్వనులు కొన్ని శారీరక కారణాలవల్ల ఏర్పడుతాయని తెలిపింది?
1) నోమ్‌ఛామ్‌స్కీ 2) చార్లెస్ డార్విన్
3) బీఎఫ్ స్కిన్నర్ 4) కొండికల్ - పడవలను నడుపుతున్నప్పుడు నావికులు చేసే ప్రత్యేక ధ్వనులను బట్టి ఏర్పడిన భాషోత్పత్తి వాదం? (పీజీటీ 2017)
1) డింగ్ డాంగ్ వాదం 2) పూపూవాదం
3) యో-హి-హో వాదం
4) భౌభౌ వాదం - యో-హి-హో వాదాన్ని ప్రతిపాదించినది?
1) నోమ్‌ఛామ్‌స్కీ 2) నోయిర్
3) బీఎఫ్ స్కిన్నర్ 4) కొండికల్ - బట్టలు ఉతకడం, బరువులు ఎత్తడం, పడవలు లాగడం, పల్లకీలు మోయడం మొదలైనవి ఏ భాషోత్పత్తివాదాన్ని బలపరుస్తాయి?
1) దైవదత్తవాదం
2) యో-హి-హో వాదం
3) పూపూ/టట్టట్వాదం
4) ధాతువాదం/ధాతుజన్యవాదం - ఒక వ్యక్తి శారీరక శ్రమ చేసేటప్పుడు ముఖ్యంగా అలాంటి పనిలో కొంతమంది వ్యక్తులతో కలిసికట్టుగా శ్రమించాల్సి వచ్చినప్పుడు వెలువడే ధ్వనులు భాషకు మూలం అని తెలిపే భాషోత్పత్తివాదం?
1) డింగ్ డాంగ్ వాదం
2) యో-హి-హో వాదం
3) మౌఖిక – అభినయ వాదం
4) ధాతుజన్యవాదం - ‘మాక్స్ ముల్లర్’ ప్రతిపాదించిన భాషోత్పత్తివాదం? (టీజీటీ 2018)
1) పూపూ వాదం 2) డింగ్ డాంగ్ వాదం
3) ధాతువాదం 4) స్వతస్సిద్ధవాదం - ‘ధ్వనికి-భావానికి అవినాభావ సంబంధం ఉంటుంది’ అని తెలిపే భాషోత్పత్తి వాదం? (టెట్ 2018, డీఎస్సీ 2018)
1) ధాతువాదం
2) మౌఖిక-అభినయ వాదం
3) యో-హి-హో వాదం
4) డింగ్ డాంగ్ వాదం - ఆదిమానవుడు ప్రకృతి నుంచి గ్రహించిన ధ్వనులను కొన్ని అతీంద్రియ సంబంధాల ప్రభావంవల్ల వాగ్రూపంగా మార్చుకున్నాడు. ఆ వాగ్రూపాలే భాషగా రూపొందాయని తెలిపే భాషోత్పత్తివాదం?
1) డింగ్‌డాంగ్ వాదం
2) యో-హి-హో వాదం
3) ప్రకంపనావాదం 4) 1, 3 - ‘శారీరక అభినయానికి – మౌఖిక ధ్వనులకు దగ్గరి సంబంధం ఉంటుంది’ అని తెలిపే భాషోత్పత్తి వాదం?
1) ధాతుజన్య వాదం
2) మౌఖిక అభినయ వాదం
3) నైయాకరణ వాదం
4) వైయాకరణ వాదం - ముఖ కవళికలు, హస్త విక్షేపణ విన్యాసాలను ప్రయత్నంగా అనుకరించడానికి యత్నిస్తారని, ఈ అనుకరణ ఫలితంగా భాష ఏర్పడిందని భావించిన శాస్త్రవేత్త?
1) చార్లెస్ డార్విన్ 2) మాక్స్ ముల్లర్
3) నోమ్‌ఛామ్‌స్కీ 4) బ్లూమ్‌ఫీల్డ్ - ఆదిమానవుడు భావవ్యక్తీకరణకు మొదటగా శారీరక హావభావాలు పెంపొందించుకొని, వాటికి అనుగుణంగా నాలుక, పెదవులు మొదలైన ముఖయంత్రంలోని కరణాల ద్వారా కదలికలు ఏర్పడి ఎన్నో శబ్దాలు ధ్వనులుగా ఏర్పడ్డాయని సూచించే భాషోత్పత్తి వాదం?
1) ధాతువాదం
2) మౌఖిక-అభినయవాదం
3) డింగ్ డాంగ్ వాదం
4) నైయాకరణ, వైయాకరణ వాదాలు - మౌఖిక-అభినయ వాదం ప్రతిపాదించిన భాషావేత్త?
1) జొహాన్ గాట్ప్రైడ్ 2) నోమ్‌ఛామ్‌స్కీ
3) యాస్కాచార్యుడు
4) సర్ రిచర్డ్ పాజెట్ (1930) - ‘ధాతువాదం’ ఏ భాషావేత్త అభిప్రాయం? (పీజీటీ 2018, టీటీజీ 2017)
- భాషోత్పత్తి ధాతువుల మూలంగా జరిగిందని ప్రతిపాదించింది? (ఎల్పీ 2018, 2019)
1) లాటిన్ భాషావేత్తలు
2) ఆంగ్లభాషావేత్తలు
3) సంస్కృత భాషావేత్తలు
4) ఫ్రెంచ్ భాషావేత్తలు - ‘ధాతువుల నుంచి భాష ఆవిర్భవించింది/క్రియలే భాషకు మూలం’ అని తెలిపే భాషోత్పత్తి వాదం? (డీఎస్సీ 2012, టెట్, టీజీటీ 2018)
1) దైవదత్తవాదం/సంప్రదాయవాదం
2) మౌఖిక అభినయ వాదం/టక్టక్ వాదం
3) ధాతువాదం/ధాతుజన్యవాదం
4) స్వతస్సిద్ధవాదం - మొదట భాషలో క్రియాపదాలు ఉత్పన్నం అయ్యాయని, ఆ తర్వాత మిగిలిన పదాలు ఏర్పడ్డాయని తెలిపేవాదం?
1) స్వతస్సిద్ధవాదం 2) సంపాదనావాదం
3) అనుభవవాదం 4) ధాతుజన్యవాదం - నైయాకరణులు (నైయాయిక) పదానికి ఈశ్వర సంకేతరూపమైన శక్తి ఉందని, ఆ శక్తి వల్లనే అర్థం నిర్ణయించబడుతుందని భావించారు. అయితే ఈ భావనను వ్యతిరేకించినవారు?
1) ధాతువాదులు 2) దైవదత్తవాదులు
3) వైయాకరణులు 4) అనుభవవాదులు - ‘పదానికి-అర్థానికి గల సంబంధం మానవ సంకేత జనితం’ అని భావించినవారు?
1) నైయాకరణులు 2) వైయాకరణులు
3) స్ఫోటవాదులు
4) సమాలోచనవాదులు - ‘లోకంలోని వ్యవహారాలను బట్టే పదాలకు అర్థాలు ఏర్పడుతాయి’ అని అభిప్రాయం వ్యక్తం చేసినవారు? (ఎల్పీ 2018)
1) నిఘంటువుకారులు
2) వైయాకరణులు
3) తాత్విక వాదులు 4) భాషాశాస్త్రవేత్తలు - చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన జీవపరిణామ సిద్ధాంత ఆధారవాదం?
1) సంపాదన/అనుభవవాదం
2) స్వతస్సిద్ధవాదం
3) సహజ పరిణామ వాదం
4) డింగ్ డాంగ్ వాదం - సహజ సిద్ధ క్రమ వికాస పరిణామ ఫలితంగా భాష ఉత్పన్నమైందని తెలిపే వాదం? (టెట్ 2018)
1) క్రమ పరిణామ వికాస వాదం
2) స్వతస్సిద్ధ వాదం
3) అనుభవ వాదం
4) ధాతుజన్య వాదం
Answers
1-2, 2-1, 3-2, 4-1, 5-2, 6-4, 7-4, 8-1, 9-1, 10-1, 11-2, 12-2, 13-1, 14-2, 15-4, 16-1 17-1, 18-3, 19-4, 20-2, 21-3, 22-2, 23-2, 24-2, 25-2, 26-4, 27-4, 28-2, 29-1, 30-2, 31-4, 32-3, 33-3, 34-3, 35-4, 36-3, 37-2, 38-2, 39-3, 40-1,
లోక్‌నాథ్ రెడ్డి
విషయ నిపుణులు
ఏకేఆర్ స్టడీ సర్కిల్
వికారాబాద్
- Tags
- Education News
Previous article
వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే కణాలు?
Next article
ఆ శిశువు ఏ భావనను కలిగి ఉన్నాడు?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు