యూనిట్ పథకం ప్రయోజనం?
ప్రణాళికలు (విద్యా ప్రణాళిక-బోధనా ప్రణాళిక)
- బోధనాభ్యసన కార్యక్రమాల ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు తమ గమ్యాలను చేరుకోడానికి ఉపయోగించే మార్గం?
1) విషయ ప్రణాళిక 2) విద్యా ప్రణాళిక
3) యూనిట్ ప్రణాళిక 4) వార్షిక ప్రణాళిక - విద్యా ప్రణాళికకు ఎంపిక చేసుకున్న అంశాలు హేతువాదం, కచ్చితత్వం, వేగం, ఏకాగ్రత, ఊహాశక్తి మొదలైన విలువలను పెంపొందింపచేసే కరికుల నిర్మాణ సూత్రం?
1) కఠినతా సూత్రం 2) వ్యాసక్తి సూత్రం
3) సహసంబంధ సూత్రం
4) క్రమశిక్షణ సూత్రం - NPE-86 ప్రకారం లక్ష్యాలు, గమ్యాలను సాధించడం కోసం పాఠ్యప్రణాళికలో పొందుపరిచిన 10 మౌలిక అంశాల్లో లేని అంశం?
1) భారతదేశ స్వాతంత్య్రోద్యమ చరిత్ర
2) సామాజిక పరిధుల తొలగింపు
3) ప్రాంతీయ అసమానతల తొలగింపు
4) శాస్త్రీయ దృక్పథం పెంపుదల - ఏ ప్రణాళికను రూపొందించినప్పుడు ఒక విద్యా సంవత్సరంలోని పాఠశాల పనిదినాలు, ఐచ్ఛిక సెలవులు, పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన దినాలు, ఉపాధ్యాయులు వాడుకొనే సెలవులు దృష్టిలో ఉంచుకోవాలి?
1) విద్యా ప్రణాళిక 2) యూనిట్ ప్రణాళిక
3) విషయ ప్రణాళిక 4) వార్షిక ప్రణాళిక - హెర్బర్ట్, మోరిసన్ సూచించిన పాఠ్యపథం సోపానాల్లో మూడవ, నాలుగవ సోపానాలు వరుసగా?
1) సంసర్గం, సాంశీకరణం
2) సమర్పణ, సాధారణీకరణం
3) అన్వయం, అన్వేషణ
4) వ్యవస్థీకరణ, పునశ్చరణ - మంచి పాఠ్యపథకానికి ఉండాల్సిన లక్షణాల్లో ఒకటి కానిది?
1) బోధనా లక్ష్యాలను స్పష్టంగా పేర్కొనాలి
2) పూర్వ, ప్రస్తుత పాఠ్యాంశాల మధ్య సంబంధం ఉండాలి
3) ఉపాధ్యాయుడు తన ఆసక్తి ప్రకారం పద్ధతులను ఎంపిక చేయవచ్చు
4) పాఠ్యాంశాన్ని బోధించడానికి అనువైన కృత్యాలు, బోధనా సామగ్రి పేర్కొనాలి - ‘కరికులం’ అనే పదం దేని నుంచి వచ్చింది?
1) Carier 2) Caurier
3) Currere 4) Carrier - విద్యాసంవత్సరంలో ఏ విధంగా జరిగే విద్యాబోధన కార్యక్రమ పథకమే వార్షిక పథకం?
1) జనవరి నుంచి డిసెంబర్
2) ఏప్రిల్ నుంచి జూలై
3) జనవరి నుంచి ఏప్రిల్
4) జూన్ నుంచి ఏప్రిల్ - యూనిట్ పథకం ప్రయోజనం?
1) ఉపాధ్యాయుడు విషయాన్ని
వరుసక్రమంలో బోధిస్తాడు
2) ఏ నెలలో ఎంతమేర బోధించాలో తెలుసుకుంటారు
3) క్షేత్రపర్యటన, విహారయాత్రల నిర్వహణను నిర్ణయించడానికి
4) నిర్ణీత లక్ష్యాలను పీరియడ్ కాలంలో బోధిస్తుంది - మొక్కలు-జంతువులు పాఠ్యాంశాన్ని బోధిస్తున్న ఉపాధ్యాయుడు మౌఖిక ప్రశ్నల ద్వారా విద్యార్థి పూర్వజ్ఞానాన్ని మోరిసన్ సూచించిన ఏ సోపానాన్ని అనుసరించి తెలుసుకుంటాడు?
1) అన్వేషణ 2) ప్రదర్శన
3) సాంశీకరణ 4) వ్యవస్థీకరణ - ‘మనం పీల్చేగాలి’ పాఠ్యాంశానికి సంబంధించిన అన్ని విషయాల్ని ప్రాథమికంగా సూక్ష్మంగా చెప్పి, పై తరగతులకు పోయే కొద్దీ క్రమ క్రమంగా అధిక విషయాలతో అభివృద్ధి చెందించే పద్ధతి?
1) శీర్షిక పద్ధతి 2) ఏకకేంద్ర పద్ధతి
3) సర్పిల పద్ధతి 4) యూనిట్ పద్ధతి - ఉపాధ్యాయుడు ‘కొవిడ్-19’ సమాచారాన్ని కరోనా వైరస్ను పోలిన వివిధ రకాల నమూనాలతో వివరించడం హెర్బర్ట్ సోపానాల్లో ఏ సోపానాన్నిఅనుసరిస్తుంది?
1) సన్నాహం 2) సమర్పణ
3) సంసర్గం 4) సాధారణీకరణం - ‘సాంఘిక ఉపయోగిక ఉత్పాదనా కృత్యాలు’ విద్యాప్రణాళికలో భాగం కావాలని చెప్పినది?
1) కొఠారి 2) ఈశ్వరీబాయి పటేల్
3) మొదలియార్ 4) యశ్పాల్ - తరగతి పరిమాణాన్ని తరగతి కాలాన్ని తగ్గించిన బోధనా వ్యూహంగా పిలిచే ‘మైక్రోటీచింగ్’పై కృషిచేసిన భారతీయులు?
1) ఎలెన్, రాబర్ట్ బుష్
2) బైనింగ్ అండ్ బైనింగ్
3) అండర్సన్, క్రాత్హాల్
4) పాసీ, జంగీరా - కింది వాటి నుంచి విషయ విశ్లేషణ ప్రయోజనానికి సంబంధించని దానిని గుర్తించండి?
1) ముఖ్య భావనలను గుర్తించడం
2)పాఠ్యాంశాలను పుస్తకంలో
పొందుపర్చడం
3) కృత్యాలను పొందుపర్చడంలో
సహాయపడటం
4) బోధనలో స్పష్టత తేవడం కోసం - అభ్యసన అనుభవాలను కలిగించడం, ప్రవర్తనా మార్పులను మూల్యాంకనం చేయడం అనేవి చివరి రెండు సోపానాలుగా గల నమూనా?
1) RCEM నమూనా
2) మోరిసన్ నమూనా 3) హెర్బర్ట్ నమూనా
4) బ్లూమ్స్ మూల్యాంకనాధార నమూనా - ఎలిమెంటరీ స్థాయిలో సాంఘిక శాస్ర్తాన్ని విభాగాలుగా కాకుండా సమ్మిళితం చేసి చెప్పడం అవసరం అనేది?
1) సమైక్య విధానం 2) చారిత్రక విధానం
3) సర్పిల విధానం 4) ఇతివృత్త విధానం - కింది వాటిలో శీర్షికా పద్ధతి దోషం కానిది?
1) విషయ భారం ఎక్కువ కావడం వల్ల
అవగాహన సన్నగిల్లుతుంది
2) ప్రాథమిక స్థాయిలో ఆచరణాత్మకం కాదు
3) ప్రజ్ఞావంతులైన విద్యార్థులకు
విసుగుపుట్టించే అవకాశం
4) విద్యార్థుల మానసిక స్థాయిని
దాటిపోతుంది - అనుభవ ప్రాముఖ్య యూనిట్ ఫలితం?
1) నిజ జీవిత సమస్యలను
ఎదుర్కొనేలా చేస్తుంది
2) విషయానికి ప్రాధాన్యత ఎక్కువ
3) ఉపాధ్యాయునికి అవసరమైన
సమాచారం అందిస్తుంది
4) విద్యార్థి చేయడం ద్వారా నేర్చుకుంటాడు - సరికానిది గుర్తించండి (విద్యాప్రణాళికను అనుసరించి)
1) విద్యార్థులు అభ్యసన అనుభవాలు పొందడానికి ఏర్పరిచే మార్గం కరికులం- ఎడ్వర్డ్ ఏ క్రగ్
2) పాఠశాల పరిసరాలు, ఆ వాతావరణంలో విద్యార్థులకు కలిగించే అనుభవాలు
కరికులం- అండర్సన్
3) ఉపాధ్యాయుడు మార్గదర్శి కాగా,
కరికులం ఒక మార్గం- విలియం జే బెన్నెట్
4) విద్యాలక్ష్యాల సాధనకు పాఠశాల ఉపయోగించే మొత్తం అనుభవాలు కరికులం- పీ శామ్యూల్
Answers
1-2, 2-4, 3-3, 4-4, 5-1, 6-3, 7-3, 8-4, 9-1, 10-1, 11-2, 12-2, 13-2, 14-4, 15-2, 16-4, 17-4, 18-3, 19-4, 20-4.
మూల్యాంకనం
- విద్యార్థి ఉచ్ఛారణ సరిదిద్దడానికి అనువైన మూల్యాంకన సాధనం?
1) రాత పరీక్ష 2) మౌఖిక పరీక్ష
3) ప్రయోగ పరీక్ష 4) రేటింగ్ స్కేల్ - స్వేచ్ఛాయుత సమాధానాలు కోరుతూ స్వతంత్ర భావ వ్యక్తీకరణకు అవకాశం ఇచ్చే ప్రశ్నలు?
1) పూరణ ప్రశ్నలు
2) సంక్షిప్త సమాధాన ప్రశ్నలు
3) వ్యాసరూప ప్రశ్నలు
4) బహుళైచ్ఛిక ప్రశ్నలు - విద్యార్థి విచక్షణా శక్తిని పరీక్షించి, మాపనం చేసే ప్రశ్న రూపాలు?
1) లఘు సమాధాన ప్రశ్నలు
2) పూరణ ప్రశ్నలు
3) వర్గీకరణ ప్రశ్నలు
4) బహుళైచ్ఛిక ప్రశ్నలు - విద్యార్థికి సంబంధించిన ఏ విషయానికైనా తగిన స్థాయిని నిర్ధారించే సంఖ్యా విలువ?
1) నికష 2) మాపనం
3) మూల్యాంకనం 4) మదింపు - నాని ఒక పరీక్షను మొదటిసారి రాసినప్పుడు 80 మార్కులు, అదే పరీక్షను రెండోసారి రాసినప్పుడు కూడా 80 మార్కులు వచ్చినా ఆ పరీక్షకు గల లక్షణం?
1) విశ్వసనీయత 2) సప్రమాణత
3) వస్తాశ్రయత 4) ఆచరణాత్మకత - ప్రత్యామ్నాయ ప్రతిస్పందన ప్రశ్నలవల్ల ప్రయోజనం?
1) జవాబు రాయడంలో స్వేచ్ఛ ఉండదు
2) సమాధానాన్ని ఊహించడానికి ఎక్కువ అవకాశం
3) ఎక్కువ విషయ నిష్ఠతను కలిగి ఉంటాయి
4) జ్ఞాన లక్ష్యాన్ని మాత్రమే పరీక్షించడానికి ఉపయోగం - కింది వాటిలో సాదృశ్య రకపు ప్రశ్న?
1) మూత్రపిండం చిక్కుడు గింజ ఆకారంలో ఉంటుంది (అవును/కాదు)
2) గుడ్లు పెట్టేవి: అండోత్పాదకాలు :: పిల్లల్ని కనేవి: —
3) శరీరానికి శక్తినిచ్చే పదార్థాలను —- అంటారు
4) కంటికి వైద్యం చేసే డాక్టర్ను ఏమంటారు? - బ్లూ ప్రింట్కు సంబంధించి సరికానిది?
ఎ. నిలువ వరుసలో- పాఠ్యాంశాలు
బి. అడ్డు వరుసలో- ప్రశ్నలు
సి. బ్రాకెట్ లోపల- సమాధానాలు
డి. బ్రాకెట్ వెలుపల- మార్కులు
1) ఎ, బి 2) బి, సి 3) ఎ, డి 4) పైవన్నీ - సంకలన మూల్యాంకనం చేయదగిన సమయం?
1) శిక్షణ ఇచ్చే ముందు
2) అభ్యసనలో ఇబ్బందులు అవగాహన చేసుకునేటప్పుడు
3) శిక్షణ పూర్తయిన తర్వాత
4) శిక్షణ జరుగుతున్నప్పుడు - విద్యార్థుల ప్రయోగ ప్రదర్శన అనంతరం ఆ తరగతి ఉపాధ్యాయురాలు విద్యార్థులను ఒకరి తర్వాత ఒకరిని ఇంటర్వ్యూ చేసింది. ఇది ఏ రకానికి చెందిన పరీక్ష?
1) రాత పరీక్ష 2) లోపనిర్ధారణ పరీక్ష
3) ప్రామాణీకృత పరీక్ష
4) స్వీయ వివరణ పరీక్ష - లోప నిర్ధారణ పరీక్షను నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం?
1) విద్యార్థి ప్రవర్తనా మార్పులను గురించి తెలుసుకోడానికి
2) విద్యార్థి సాధనా స్థాయిని గురించి
తెలుసుకోడానికి
3) విద్యార్థి అంతర్గత శక్తులను గుర్తించి
తెలుసుకోడానికి
4) విద్యార్థి బలం, బలహీనతలను గురించి తెలుసుకోడానికి - కింది వాటిలో ఒకటి CCE లక్ష్యంగా పరిగణించబడదు?
1) బోధనాభ్యసన ప్రక్రియలో మూల్యాంకనం అంతర్భాగంగా చేస్తుంది
2) ఆలోచనా ప్రక్రియకు ప్రాధాన్యత ఇస్తూ, బట్టీ స్మృతికి కూడా ప్రాముఖ్యత ఇస్తుంది
3) జ్ఞానాత్మక, భావావేశ, మానసిక చలనాత్మక నైపుణ్యాలను అభివృద్ధి పరుచుటకు సహాయపడుతుంది
4) ఆశించిన ప్రమాణంతో నిష్పాదన నిర్వహించడానికి మూల్యాంకనం ఒక గుణాత్మక నియంత్రణ యుక్తిగా ఉపయోగిస్తుంది - పిల్లవాడి ప్రతిభ, నైపుణ్యం, సృజనాత్మక అంశాలకు చెందిన సాక్ష్యాధార పత్రాల కలయిక?
1) పోర్టుఫోలియో 2) రూబ్రిక్స్
3) చెక్లిస్ట్ 4) రేటింగ్ స్కేల్ - పిల్లలు పాఠశాలలో చేరినప్పటి నుంచి వారికి అందించే బోధనాంశాలు, కళలు, సాంస్కృతిక విద్య, ఆరోగ్య వ్యాయామ విద్య, పని-కంప్యూటర్ విద్య, విలువల విద్య, జీవన నైపుణ్యాలు మొదలైన అంశాలన్నింటిలో పిల్లల ప్రగతిని పరిశీలించి నమోదు చేసే రికార్డు?
1) పిల్లల డైరీ 2) సోషియోమెట్రీ
3) అనెక్డోటల్ రికార్డు
4) క్యుములేటివ్ రికార్డు - కింది వాటిలో ‘ప్రశ్నించడం-పరికల్పనలు చేయడం’ అనే విద్యాప్రమాణానికి సంబంధించిన వాక్యం?
1) ఎండాకాలం నదుల్లో నీరు లేకుండా ఉండటానికి కారణాలు ఏమై ఉంటాయో ఊహించండి
2) మానవ శరీరంలోని కర్ణికలు-జఠరికలకు గల తేడాలు తెలపండి
3) మూత్రపిండ వ్యవస్థ నమూనాను తయారు చేయండి
4) గుండె ఎప్పుడెప్పుడు వేగంగా కొట్టుకుంటుందో పరిశీలించి రాయండి - నోటు పుస్తకాలు, పరిశీలనలు, Anecdotal, Portfolio, పిల్లల డైరీ, రేటింగ్ స్కేల్ మొదలైనవి దేనికి సాధనాలు?
1) పిల్లల భాగస్వామ్యం-ప్రతిస్పందనలు
2) రాత అంశాలు 3) ప్రాజెక్టు పని
4) లఘుపరీక్ష - భిన్నాలను ఆరోహణ, అవరోహణ క్రమంలో అమర్చడం ఏ గణిత విద్యాప్రమాణాన్ని సూచిస్తుంది?
1) వ్యక్తపరచడం 2) అనుసంధానం
3) కారణాలు-నిరూపణలు 4) దృశ్యీకరణ - ప్రత్యేక అవసరాలు గల వ్యక్తుల పట్ల మనం ఎలా ప్రవర్తించాలి? ఎలాంటి సహాయం అందించాలి? ఈ చర్యలు పరిసరాల విజ్ఞానాన్ని అనుసరించి
1) ప్రశ్నించడం-పరికల్పనలు చేయడం
2) ప్రయోగాలు-క్షేత్ర పరిశీలనలు
3) సమాచార నైపుణ్యాలు-ప్రాజెక్టుపని
4) ప్రశంస-విలువలు-జీవవైవిధ్యంపట్ల స్పృహ - సరైనది సూచించండి
ఎ. విద్యాకార్యక్రమంలో అతి ముఖ్యమైన ఘట్టం మూల్యాంకనం- నార్మన్ గ్రీన్లాండ్
బి. మూల్యాంకనం అవిరళ ప్రక్రియ- కొఠారి
సి. విద్యాలక్ష్యాలు ఎంతమేరకు సాధించబడ్డాయో తెలపడానికి తోడ్పడేదే మూల్యాంకనం- రాల్ఫ్ టేలర్
డి. వంట వాడు వంటను రుచి చూస్తే నిర్మాణాత్మక, ఆ వంటను అతిథులు రుచి చూస్తే సంగ్రహణాత్మక మూల్యాంకనం-
రాబర్ట్ స్టేక్స్
1) ఎ, సి, డి 2) బి, సి, డి
3) ఎ, బి, డి 4) పైవన్నీ సరైనవే - నిర్మాణాత్మక మూల్యాంకన 4 సాధనాల్లో విద్యార్థి సాధించిన మార్కులు వరుసగా 7, 5, 3, 12 అయినా ఆ విద్యార్థి గ్రేడ్
1) B 2) B+ 3) A 4) A+
.
Answers
1-2, 2-3, 3-3, 4-2, 5-1, 6-3, 7-2, 8-2, 9-3, 10-4, 11-4, 12-2, 13-1, 14-4, 15-1, 16-2, 17-3, 18-4, 19-4, 20-2
ఏఎన్ రావు
విషయ నిపుణులు, హైదరాబాద్
- Tags
- Education News
Previous article
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ)లోప్రవేశాలు
Next article
‘హిస్టరీ ఆఫ్ గోల్కొండ’ గ్రంథ రచయిత ఎవరు?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు