టీచర్ ఎడ్యుకేషన్ @ ఆర్ఈఐ
దేశంలో ఒక్కో విద్యకు ఒక్కో సంస్థ ప్రసిద్ధిగాంచాయి. ఇంజినీరింగ్‌కు ఐఐటీ, మెడిసిన్‌కు ఎయిమ్స్, డిజైనింగ్‌కు ఎన్ఐడీ, ఫ్యాషన్‌కు నిఫ్ట్ ఇలా ఆయా రంగాలకు సంబంధించి టాప్ కాలేజీలుగా నిలుస్తున్నాయి. అదేవిధంగా టీచర్ ఎడ్యుకేషన్‌కు ఎన్‌సీఈఆర్‌టీఈ పరిధిలోని రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఆర్ఐఈ)లు పేరుగాంచాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఈ కాలేజీల్లో టీచర్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు సంక్షిప్తంగా….
అందించే కోర్సులు
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ)- రెండేండ్లు
బీఎస్సీ-బీఈడీ (నాలుగేండ్లు)
బీఏ-బీఈడీ (నాలుగేండ్లు)
ఎంఈడీ (రెండేండ్లు)
ఎమ్మెస్సీ-ఈడీ (ఆరేండ్లు)
అర్హతలు: బీఈడీ కోర్సుకు కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణత. బీఏ-బీఈడీ కోర్సుకు కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. 2019, 2020, 2021లో ఇంటర్ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎస్సీ-బీఈడీ కోర్సుకు ఇంటర్లో (ఎంపీసీ/బైపీసీ) కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎంఈడీ కోర్సుకు కనీసం 50 శాతం మార్కుతో బీఈడీ లేదా బీఈ-బీఈడీ/బీఎస్సీ-బీఈడీ లేదా డీఈఎల్ఈడీతోపాటు కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎమ్మెస్సీ-ఈడీ కోర్సుకు ఇంటర్ (ఎంపీసీ/స్టాటిస్టిక్స్) కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
ఆర్ఐఈ
రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఆర్ఐఈ). వీటిని 1963 ఆగస్టు 1న ప్రారంభించారు. ఇవి ఎన్‌సీఈఆర్‌టీఈ పరిధిలో పనిచేస్తాయి. మొదట్లో వీటిని రీజినల్ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్‌గా పిలిచేవారు. ఈ సంస్థలు టీచర్ ఎడ్యుకేషన్‌లో ప్రామాణికమైన విద్యను అందించడానికి వీటిని ఏర్పాటు చేశారు. దేశంలో ఐదు ఆర్‌ఐఈలు ఉన్నాయి. వీటితోపాటు ఎన్ఐఈ, సీఈఈటీ, పీఎస్ఎస్సీఏవీఈలు కూడా టీచర్ ఎడ్యుకేషన్ సంబంధ కోర్సులను అందిస్తున్నాయి.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: జూన్ 30
కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (సీఈఈ) తేదీ: జూలై 18
వెబ్సైట్: http://www.cee.ncert.gov.ina
కేశవపంతుల వేంకటేశ్వరశర్మ
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు