మీ ఫోనే ఆక్సీమీటర్
పల్స్‌రేటు, ఆక్సిజన్‌ను సూచించే ‘కేర్‌ప్లిక్స్ విటల్స్’ మొబైల్ యాప్
అభివృద్ధి చేసిన కోల్‌కతా స్టార్టప్
హైదరాబాద్, (నమస్తే తెలంగాణ): కరోనా సంక్షోభ సమయంలో ప్రతీ ఇంట్లో ఆక్సీమీటర్ పెట్టుకోవాల్సిన పరిస్థితి. డిమాండ్ కారణంగా కంపెనీలు రూ. 2వేల వరకు పెంచాయి. ఈ ఇబ్బందులను తొలగిస్తూ ఫోన్లోనే పల్స్ రేటు, ఆక్సిజన్ స్థాయిలను తెలిపేలా కోల్‌కతాకు చెందిన కేర్ నౌ హెల్త్‌కేర్ స్టార్టప్ ‘కేర్‌ప్లిక్స్ విటల్స్’ పేరుతో మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేసింది.
డౌన్లోడ్ ఎలా
ఈయాప్‌ను https:// apkoll.com/apk/ careplex-vitals-apk/ లేదా https:// play. google. com/store/apps/details? id=com. careplix.vitalsలింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకోగానే ఇన్స్టాల్ చేసుకొని రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.అది ఎంటర్ చేస్తే యాప్ పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్ వెనుక కెమెరా, ఫ్లాష్‌లైట్ వద్ద చేతి వేలిని 40 సెకన్లు పెడితే ఆక్సిజన్, పల్స్ రేటు మొబైల్లో కనిపిస్తాయి.
98% కచ్చితత్వం
ఈ యాప్‌ను ఈ ఏడాది ప్రారంభంలో కోల్‌కతాలోని సేత్ సుఖ్లాల్ కర్నానీ దవాఖానలో పరీక్షించారు. దాదాపు 1200 మంది ఆక్సిజన్, పల్స్ రేటును పరిశీలించారు. ఆక్సిజన్ సాచురేషన్ను పసిగట్టడంలో కేర్‌ప్లిక్స్ 98% కచ్చితత్వంతో పనిచేసినట్టు సుబ్రతా పౌల్ తెలిపారు.
- Tags
- mobile app
- mobiles
- oxymeter
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు