దూరం పెరుగుతున్నకొద్దీ కాంతి తీవ్రత?
- గాలి సాంద్రత తగ్గితే దానిలో ధ్వనివేగం?
1) తగ్గుతుంది 2) పెరుగుతుంది
3) ఏమార్పు ఉండదు 4) ఏదీకాదు - మునిగిపోయిన వస్తువులను కనుగొనడానికి తోడ్పడే పరికరం?
1) కాలిడోస్కోప్ 2) సోనార్
3) రాడార్ 4) పెరిస్కోప్ - ఆడవారి గొంతు మగవారి కన్నా ‘కీచు’గా ఉండటానికి కారణం?
1) తక్కువ పౌనఃపున్యం
2) తక్కువ తరచుదనం
3) ఎక్కువ పౌనఃపున్యం
4) ఎక్కువ తరచుదనం - జతపర్చండి
ఎ. గుసగుసలు 1. 60 డెసిబుల్స్
బి. టెలిఫోన్ 2. 20-30 డెసిబుల్స్
సి. జెట్ విమానం 3. 80-90 డెసిబుల్స్
డి. ట్రాఫిక్ 4. 100-200 డెసిబుల్స్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-3, బి-1, సి-4, డి-2
4) ఎ-4, బి-2, సి-1, డి-3 - డాప్లర్ ఫలితం అనువర్తనం కానిది?
1) వాహనాల వేగాన్ని లెక్కించే ‘స్పీడ్‌గన్’ అనే పరికరం పనిచేయడం
2) తుఫాన్ల ఉనికిని ముందుగా తెలుసుకోవడం
3) సూర్యుని ఆత్మభ్రమణ దిశ, శనిగ్రహం చుట్టూ ఉన్న రంగుల వలయాలను తెలుసుకోవడానికి
4) శరీరంలో ఎముకలను పరిశీలించడం - కింది వాటిలో రాడార్ ఉపయోగం ఏది?
1) సౌర వికిరణాన్ని శోధించడానికి
2) విమానాలు, క్షిపణుల ఉనికి, వాటి గమనాన్ని శోధించడం
3) గ్రహాలను పరిశీలించడానికి
4) భూకంపాల తీవ్రతలు కొలవడానికి - ఒక వస్తువు సహజ పౌనఃపున్యం దేనిపై ఆధారపడుతుంది?
1) స్థితిస్థాపకత 2) ఆకార, పరిమాణాలు
3) కంపనరీతి 4) పైవన్నీ - లోహ పలకల్లో ఉన్న పగుళ్లను గుర్తించడానికి ఉపయోగించే తరంగాలు?
1) అతిధ్వనులు 2) పరశ్రావ్యాలు
3) సాధారణ ధ్వని తరంగాలు
4) కాంతి కిరణాలు - కాంతి పరావర్తనానికి సంబంధించినది?
1) దర్పణాలు ఈ ధర్మం ఆధారంగా పనిచేస్తాయి
2) వజ్రం మెరవడానికి ఈ ధర్మం కారణం
3) మానవునిలో దృష్టిజ్ఞానానికి కారణం
4) వస్తు ఉపరితలం నునుపుగా ఉంటే అన్ని బిందువుల వద్ద కాంతి పరావర్తనం ఒకే విధంగా ఉంటుంది - జతపర్చండి
ఎ. తరంగ సిద్ధాంతం 1. న్యూటన్
బి. క్వాంటం సిద్ధాంతం 2. హెగెన్స్
సి. కణ సిద్ధాంతం 3. మాక్స్వెల్
డి. విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతం
4. మాక్స్‌ప్లాంక్
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-2, బి-4, సి-1, డి-3
4) ఎ-3, బి-1, సి-4, డి-2 - దూరం పెరుగుతున్నకొద్దీ కాంతి తీవ్రత?
1) పెరుగుతుంది 2) తగ్గుతుంది
3) పెరిగి, తగ్గును 4) ఏ మార్పు ఉండదు - సూర్య, చంద్రగ్రహణాలు ఏర్పడటానికి కారణం?
1) కాంతి రుజువర్తనం 2) వక్రీభవనం
3) ధృవణం 4) వివర్తనం - లేజర్ కిరణాల ఉత్పత్తిలో పాల్గొనేవి?
ఎ. రాబీస్ఫటికం
బి. హీలియం వాయువు
సి. నియాన్ వాయువు
డి. కార్బన్
1) ఎ 2) ఎ, సి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి - పిడుగుపడే సమయంలో మొదట మెరుపు కనిపించి తర్వాత ఉరుము వినపడటం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు?
1) కాంతివేగం ధ్వనివేగం కన్నా ఎక్కువని
2) ధ్వనివేగం కాంతివేగం కన్నా ఎక్కువని
3) ధ్వనివేగం కాంతివేగం రెండు సమానమని
4) కాంతివేగం అప్పుడప్పుడు ధ్వనివేగం కన్నా ఎక్కువని - పరారుణ (IR) అనువర్తనం కానిది?
1) రాకెట్, క్షిపణుల్లో మార్గనిర్దేశక కిరణాలుగా
2) రహస్య సంకేతాల ప్రసారానికి
3) మురిగిన కోడిగుడ్ల నుంచి మంచివాటిని గుర్తించడానికి
4) పొగమంచులో స్పష్టంగా ఫొటో తీయడానికి - సబ్బు బుడగ వివిధ రంగులు ఏర్పడటానికి కారణం?
1) వ్యతికరణం
2) బహుళ వక్రీభవనం, ధృవణం
3) వక్రీభవనం, ధృవణం
4) ధృవణం, వ్యతికరణం - టీవీ రిమోట్ కంట్రోల్లో ఏ కిరణాలు ఉపయోగిస్తారు?
1) పరారుణ కిరణాలు
2) అతినీలలోహిత కిరణాలు
3) గామా కిరణాలు
4) రాడార్ కిరణాలు - వేలి ముద్రలను గుర్తించడానికి ఉపయోగించే కాంతి తరంగాలు ఏవి?
1) గామా తరంగాలు 2) పరారుణ కాంతి
3) మైక్రో తరంగాలు
4) అతినీలలోహిత కాంతి - జతపర్చండి ఎ. ఫెర్రో అయస్కాంతం 1. నికెల్, కోబాల్ట్ బి. డయా అయస్కాంతం
- పాదరసం, నీరు పదార్థాలు
సి. పారా అయస్కాంతం - అల్యూమినియం, ఆక్సిజన్ పదార్థాలు
1) ఎ-2, బి-1, సి-3
2) ఎ-3, బి-2, సి-1
3) ఎ-1, బి-3, సి-2
4) ఎ-1, బి-2, సి-3
- పాదరసం, నీరు పదార్థాలు
- మనిషిపై ఏ కిరణాలు పతనమైనప్పుడు విటమిన్-డి ఉత్పత్తి అవుతుంది?
1) అతినీలలోహిత కిరణాలు
2) పరారుణ కిరణాలు
3) రేడియో తరంగాలు
4) గామా కిరణాలు - నీటిపై నూనె చల్లినప్పుడు భిన్నరంగులు కనిపించడానికి కారణం కాంతికి ఉన్న?
1) వివర్తనం 2) వ్యతికరణం
3) ధృవణం 4) పరావర్తనం - భూ అయస్కాంతత్వానికి సంబంధించి సరికాని వ్యాఖ్య?
1) అయస్కాంత ఉత్తర ధృవం భౌగోళిక దక్షిణాన్ని సూచిస్తుంది
2) ఉత్తర ధృవం దక్షిణ ధృవం కంటే బలమైనది
3) అయస్కాంత ధృవాలు స్థిరంగా తమ స్థానాలను మార్చుకుంటాయి
4) ఏదీకాదు - అయస్కాంత ఆవరణాన్ని (మాగ్నెట్ స్పియర్) గల గ్రహాలు ఏవి?
ఎ. భూమి బి. బుధుడు
సి. బృహస్పతి డి. శని
1) ఎ 2) ఎ, సి 3) ఎ, డి 4) పైవన్నీ - స్టీలు, ఆల్నికో అనేవి ఏ రకమైన అయస్కాంత పదార్థాలు?
1) పారా అయస్కాంతాలు
2) ఫెర్రో అయస్కాంతాలు
3) డయా అయస్కాంతాలు
4) అనయ అయస్కాంతాలు - జతపర్చండి
ఎ. కెపాసిటర్ 1. ఫారడే
బి. విద్యుత్ చాలకబలం 2. వోల్ట్
సి. విద్యుత్ వాహకత 3. సీమెన్
డి. విశిష్ట నిరోధం 4. ఓమ్-మీటర్
1) ఎ-4, బి-3, సి-1, డి-2
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-2, బి-4, సి-1, డి-3 - ఏసీ కరెంట్‌కు సంబంధించి సరైనది?
ఎ. ఇది ద్విమార్గ కరెంట్ (two way current)
బి. ఏసీ ఓల్టేజీని ట్రాన్స్ఫార్మర్స్ ద్వారా సులభంగా మార్చవచ్చు
సి. ఏసీని పంపిణీ చేసేటప్పుడు విద్యుత్ నష్టం కనిష్టం
డి. ఏసీని ఎలక్ట్రోప్లేటింగ్కు ఉపయోగిస్తారు
1) ఎ, బి 2) బి, డి
3) ఎ, బి, సి 4) పైవన్నీ - జతపర్చండి ఎ. వోల్ట్‌మీటర్
- విద్యుత్శక్మ భేదాన్ని కొలిచేది
బి. అమ్మీటర్ - విద్యుత్ కరెంట్‌ను కొలిచేది
సి. గాల్వనోమీటర్ - emf ను కొలిచేది
డి. పొటెన్షియోమీటర్ - విద్యుత్ ప్రవాహ దిశను కనుగొనేది
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-1, డి-2
3) ఎ-1, బి-2, సి-4, డి-3
4) ఎ-3, బి-4, సి-2, డి-1
- విద్యుత్శక్మ భేదాన్ని కొలిచేది
- వాతావరణంలో అత్యధికంగా దుమ్ము, పొగమంచు ఉన్నప్పుడు ఏ రకమైన రోడ్లైట్లను వాడతారు?
1) పాదరస ఆవిరి దీపాలు
2) నియాన్ దీపాలు
3) సోడియం ఆవిరి దీపాలు
4) ఫ్లోరోసెంట్ ఆవిరి దీపాలు - షార్ట్ సర్క్యూట్ అంటే?
1) శక్మభేదం గల రెండు బిందువుల మధ్య ప్రత్యక్ష కరెంట్ రవాణా
2) ఒకే శక్మం గల రెండు బిందువుల మధ్య ప్రత్యక్ష కరెంట్ రవాణా
3) రెండు బిందువుల మధ్య అప్రత్యక్ష కరెంట్ సరఫరా
4) రెండు బిందువుల మధ్య విద్యుత్ సర్క్యూట్‌కు అంతరాయం కలగడం - రెక్టిఫయర్ను ఎందుకు ఉపయోగిస్తారు?
1) డీసీ ని ఏసీగా మార్చడానికి
2) ఎసీ ను డీసీగా మార్చడానికి
3) అధిక ఓల్టేజీని తక్కువ ఓల్టేజీగా మార్చడానికి
4) తక్కువ ఓల్టేజీని ఎక్కువ ఓల్టేజీగా మార్చడానికి - లోహాల్లో అథమ విద్యుత్ వాహకం?
1) వెండి 2) రాగి
3) సీసం 4) అల్యూమినియం - విద్యుత్ బల్బుల్లో తొలిసారిగా ఉపయోగించిన ఫిలమెంట్?
1) టంగ్స్టన్ 2) రాగి
3) జింక్ 4) కార్బన్ - ఫ్యూజ్‌వైర్ వేటితో నిర్మిస్తారు?
1) లెడ్, టిన్ 2) జింక్, లెడ్
3) బిస్మత్, జింక్ 4) కాపర్, బిస్మత్ - పిడుగులను ఆకర్షించే కడ్డీలు దేనితో తయారుచేస్తారు?
1) రాగి 2) ఇనుము
3) ఇనుము మిశ్రమలోహం
4) అల్యూమినియం - అతి తక్కువ విద్యుత్ ప్రవాహాన్ని కొలవడానికి ఉపయోగించే సాధనం?
1) అమ్మీటర్
2) టాంజెంట్ గాల్వనోమీటర్
3) కదిలే తిగచుట్ట…. గాల్వనోమీటర్
4) వోల్ట్‌మీటర్ - వీధి దీపాలను ఏ పద్ధతిలో కలుపుతారు?
1) శ్రేణి 2) సమాంతర 3) 1, 2
4) కొన్ని శ్రేణిలో కొన్ని సమాంతరంగా - నిక్రోమ్ తీగ లక్షణం ఏది?
1) అధిక నిరోధం, అల్ప ద్రవీభవనం
2) అధిక నిరోధం, అధిక ద్రవీభవనం
3) అల్ప నిరోధం, అల్ప ద్రవీభవనం
4) అల్ప నిరోధం, అధిక ద్రవీభవనం - వేడినీటి కంటే ఆవిరి ఎక్కువగా అపాయకరం ఎందుకు?
1) ఆవిరి శరీర రంధ్రాల్లోంచి లోనికి వెళుతుంది
2) ఆవిరికి గుప్తోష్ణం ఎక్కువ
3) ఆవిరికి విశిష్టోష్ణం ఎక్కువ
4) నీటి కంటే ఆవిరి తేలికైంది - స్టోరేజీ బ్యాటరీల్లో ఉపయోగించే రసాయన పదార్థం?
1) కాపర్ సల్ఫేట్
2) అమ్మోనియం క్లోరైడ్
3) గంధకామ్లం
4) నత్రికామ్లం - ఘనరూపంలో ఉన్న కర్పూరం ఆవిరిగా మార్పుచెందడాన్ని ఏమంటారు?
1) బాష్పీభవనం 2) ఘనీభవనం
3) కరగడం 4) ఉత్పతనం
Answers
1-2, 2-1, 3-3, 4-2, 5-4, 6-2, 7-4, 8-1, 9-2, 10-3, 11-2, 12-1, 13-3, 14-1, 15-3, 16-1, 17-1, 18-4, 19-4, 20-1, 21-2, 22-3, 23-4, 24-2, 25-3, 26-1, 27-3, 28-4, 29-4, 30-2, 31-3, 32-4, 33-1, 34-1, 35-3, 36-1, 37-2, 38-2, 39-3, 40-4,
- Tags
- Education News
Previous article
‘ఫ్రీడం టు లెర్న్’ గ్రంథ రచయిత ఎవరు?
Next article
వర్షకాలం.. ఫర్నీచర్ భద్రం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు