‘ఫ్రీడం టు లెర్న్’ గ్రంథ రచయిత ఎవరు?
భాషా వికాస సిద్ధాంతం
ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది- చోమ్స్కీ (అమెరికా)
ఈయన పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో ఆధునిక భాషా బోధనపై పరిశోధనలు చేశారు.
ఈయన ప్రముఖ భాషా శాస్త్రవేత్త, తత్వవేత్త, తర్కవేత్త, సంజ్ఞానాత్మక శాస్త్రవేత్త
ఈయనను ‘ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్’ అని పిలుస్తారు.
100కు పైగా గ్రంథాలు రచించారు. వాటిలో ముఖ్యమైనవి..
1) Aspects of theory of syntax
2) Language and mind
3) The logical structure of Linguistic theory
4) Syntactic Structure
5) Lecture on governmet and binding
6) Language and thought
ఈయన నేటివిస్ట్ దృక్పథాన్ని ప్రతిపాదించారు
శిశువు పుట్టిన తర్వాత భాష నేర్చుకుంటాడా?, భాష నేర్చుకొనే శక్తిలోనే పుడతాడా? అనే సమస్యకు పరిష్కారాన్ని సూచించిన సిద్ధాంతమే చోమ్స్కీ భాషా వికాస సిద్ధాంతం
ముఖ్యాంశాలు
పిల్లలు పుట్టుకతోనే భాషను అర్థం చేసుకోగలిగే ప్రత్యేక సామర్థ్యంతో పుడతారు.
దీని ప్రకారం పిల్లలు భాషలకు సంబంధించిన కొన్ని నిర్మాణాలను అర్థం చేసుకోగలిగే సామర్థ్యాలను పుట్టుకతోనే ఆర్జించుకుంటారు.
దీని ద్వారానే భాష నేర్చుకుంటారు. దీనినే గవర్నమెంట్ బైండింగ్ సిద్ధాంతం అంటారు.
ఈ సిద్ధాంతం ప్రకారం శిశువులు భాషను నేర్చుకోరు. గ్రహిస్తారు లేదా ఆర్జిస్తారు.
ఈ గ్రహించే సత్తా పిల్లలకు పుట్టుకతోనే వస్తుంది. ఎవరో భాషను నేర్పిస్తే వచ్చేది కాదు.
ప్రతి వ్యక్తిలోనూ వ్యాకరణ సూత్రాలను (Syntax) అర్థం చేసుకొనే వ్యవస్థ మెదడులో పుట్టుకతోనే ఉంటుంది. దీనినే ‘సార్వత్రిక వ్యాకరణం’ అంటారు.
ఈయన ప్రకారం మానవ భాషలన్నీ ఒక ఉమ్మడి భాషా నిర్మాణం ఆధారం చేసుకొనే రూపొందాయి.
మెదడుకు సంబంధించి ఎడమ మస్తిష్కార్థ గోళార్థం ‘బ్రోకా’ అనే ప్రాంతం భాషోత్పత్తి, విధిని నిర్వహిస్తుంది.
పుట్టుకతోనే వచ్చే సామర్థ్యాన్ని చోమ్స్కీ భాషార్జన పరికరం (LAD-Language Acquisition Device)గా పేర్కొన్నాడు.
ఒక మానవ శిశువుకు, పిల్లి పిల్లకు ఒకే భాషా సంబంధమున్న పరిసరాలు కల్పించినప్పుడు మానవ శిశువు మాత్రమే భాషావగాహన చేసుకొని, తిరిగి భాషను ఉత్పత్తి చేసే సామర్థ్యం పొందగలుగుతాడని, కానీ పిల్లి పిల్ల మాత్రం భాషను ఉత్పత్తి చేయలేదని ఈయన తెలిపారు.
దీనికి గల కారణం మానవుని మెదడులో LAD ఉండటం, పిల్లి మెదడులో LAD లేకపోవడం
LAD వ్యాప్తిని బట్టి ఒక వ్యక్తి అనేక రకాలైన భాషలను నేర్చుకుంటాడని తెలిపారు.
భాషా సూత్రాలను అర్థం చేసుకునే ప్రయత్నంలో నిర్మాణాలను అర్థం చేసుకోవడానికి చోమ్స్కీ రాసిన పుస్తకం ‘Syntactic Structure’.
మానవ భాషలన్నీ ఒక ఉమ్మడి భాషా నిర్మాణాన్ని ఆధారంగా చేసుకొని రూపొందాయని ఈయన భావించారు.
చోమ్స్కీ, సాంప్రదాయక పద్ధతిలో వ్యాకరణ బోధనను వ్యతిరేకించారు.
మన భాషలన్నీ జన్యురీత్యా నిర్ధారించబడిన కార్యక్రమం విస్తరించడంవల్ల రూపొందాయి అనేది ఈ సిద్ధాంత ప్రధాన భావన.
శిశువులకు 3-10 సంవత్సరాల మధ్య భాషార్జన సామర్థ్యం గరిష్టంగా ఉంటుంది.
LAD ద్వారా 4 సంవత్సరాలు వయస్సు వచ్చేసరికి భాషలోని నియమ నిబంధనలన్నీ చాలావరకు అర్థం చేసుకుంటాడు.
సాంప్రదాయక భాషా సిద్ధాంతాల ప్రకారం భాష నేర్పబడుతుంది. చోమ్స్కీ ప్రకారం భాష ఆర్జించబడుతుంది.
ఉత్పాదక వ్యాకరణం (Generative grammar), నియత వ్యాకరణం (Formal grammar), రూపాంతర వ్యాకరణం (Transformative grammar), సార్వత్రిక వ్యాకరణం (Universal grammar) అనే నూతన భావనలను చోమ్స్కీ ప్రవేశపెట్టారు.
చోమ్స్కీ సిద్ధాంతానికి భిన్నంగా బీఎఫ్ స్కిన్నర్, పియాజే వాదాలు ఉన్నాయి. అవి
బీఎఫ్ స్కిన్నర్ Verbal Behaviour అనే గ్రంథంలో ‘నిబంధనం’ వల్ల భాషా సామర్థ్యం కలుగుతుందని తెలిపితే, పియాజే పరిసరాలతో అంతశ్చర్యల వల్ల భాష నేర్చుకోవడం జరుగుతుందని తెలిపాడు.
నోట్: ‘భాష అనేది ఆర్జించే ప్రక్రియ, అభ్యసించే ప్రక్రియ కాదు’.
ఆత్మ భావన సిద్ధాంతం
ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది- కార్ల్ రోజర్స్ (అమెరికా)
ఈయన రచించిన గ్రంథం- ‘Freedom to Learn’
ఈయన మానవతావాది.
ఈ సిద్ధాంతానికి గల ఇతర పేర్లు- ఆత్మ సిద్ధాంతం, స్వీయ సిద్ధాంతం ముఖ్యాంశాలు
వ్యక్తి అవసరాలే వ్యక్తి గమ్యాన్ని, గమనాన్ని నిర్ధారిస్తాయని దానివల్లనే ‘ఆత్మసాక్షాత్కారం’ కలుగుతుందనేది ఈ సిద్ధాంత ముఖ్య భావన
ఈయన సిద్ధాంతాల్లో ప్రముఖంగా చెప్పుకోదగినవి 1) ఆత్మభావన 2) ఆత్మకేంద్రీకృత సిద్ధాంతం 3) చికిత్సార్థి కేంద్రీకృత మంత్రణం 4) దృగ్విషయ క్షేత్ర ఉపగమం
ఈ భావనలన్నీ వ్యక్తిని కేంద్రంగా చేసుకొని చెప్పినవే.
వ్యక్తి తన గురించి తాను చేసుకొనే ఆలోచనల సారాంశాన్ని ‘ఆత్మ భావన’ అంటారు.
‘నేను, నాది’ అనే భావనలకు సంబంధించిన భావనే- ఆత్మభావన
నేను అందంగా ఉంటాను, నేను చాలా తెలివైన వాడిని, ఆ వస్తువు నాది, నాకు ధైర్యం ఎక్కువ అనే భావనలు- ఆత్మ భావనను సూచిస్తాయి.
రోజర్స్ ప్రకారం ఈ ఆత్మభావన రెండు రకాలు అవి.. 1) వాస్తవిక ఆత్మభావన 2) ఆదర్శాత్మక ఆత్మభావన
ఒక వ్యక్తి తను ఎలా ఉన్నాడో తెలిపేది- వాస్తవిక ఆత్మ భావన
ఒక వ్యక్తి తను ఎలా ఉండదలచుకున్నాడో తెలిపేది- ఆదర్శాత్మక భావన
వ్యక్తి ప్రయాణం వాస్తవిక ఆత్మ భావన నుంచి, ఆదర్శ ఆత్మ భావన వైపునకు పయనిస్తుంది.
ఈ రెండు భావనల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంటే సంఘర్షణ పెరిగి మూర్తిమత్వం దెబ్బతింటుంది.
ఈ రెండు భావనలు ఒకటే అయితే సర్దుబాటు పెరిగి మూర్తిమత్వం అభివృద్ధి చెందుతుంది.
వ్యక్తి ఆదర్శ ఆత్మను చేరుకోవడమే ఆత్మ సాక్షాత్కారం. ఇది వ్యక్తి వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తుంది.
ఆత్మ భావనను ఎక్కువగా ప్రభావితం చేసే రక్షక తంత్రం- తాదాత్మకీకరణం
వ్యక్తి బాల్యదశలో శరీరానికి సంబంధించిన ఆత్మభావన ఏర్పడి, కౌమారదశలో మానసిక ఆత్మ భావన ఏర్పడుతుంది.
వాస్తవానికి, ఆత్మభావనకు మధ్య ఉండే భేదాన్ని అంతరం అంటారు. భేదం లేకపోతే అంతర రాహిత్యం అంటారు. ఈ అంతరం పెరిగితే వ్యక్తి మూర్తిమత్వం దెబ్బతింటుంది.
పిల్లలకు షరతులు లేని ప్రేమాభిమానాలు అందిస్తే ఆత్మభావనకు, వాస్తవికతకు మధ్య అంతర రాహిత్యాన్ని తగ్గించవచ్చు.
వ్యక్తి మూర్తిమత్వాన్ని వివరించడంలో ప్రవర్తనా వాదం, మనోవిశ్లేషణా వాదాలకు వ్యతిరేకంగా ఆవిర్భవించినదే మానవతావాదం.
వ్యక్తి మూర్తిమత్వాన్ని విడి విడి భాగాలుగా విభజించినది- ప్రవర్తనా వాదం
వ్యక్తి మూర్తిమత్వం, జంతు సహజాత ప్రవర్తన, అచేతన ప్రవర్తనపై ఆధారపడుతుందని తెలిపినది- మనోవిశ్లేషణ వాదం
మానవ ప్రవర్తనను ఆశావాద దృక్పథంతో/ధనాత్మక గౌరవంతో వ్యాఖ్యానించినది- మానవతా వాదం
మానవతావాద తత్వంలో మానవుడు మధ్యస్తంగా కేంద్రస్థానంలో ఉంటాడు.
అమెరికాకు చెందిన ‘మాస్లో, కార్ల్ రోజర్స్’ ఇద్దరూ మానవతావాదులు.
వ్యక్తి అవసరాలకు, సామర్థ్యాలకు ప్రాధాన్యం ఇచ్చే వాదం- మానవతా వాదం
మాస్లో వ్యక్తి అవసరాలకు ప్రాధాన్యం ఇస్తే, కార్ల్ రోజర్స్ వ్యక్తి సామర్థ్యాలకు ప్రాధాన్యం ఇచ్చాడు.
నోట్: ఆదర్శ, వాస్తవిక ఆత్మ భావనను పిల్లల్లో ‘సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్’ ద్వారా మాపనం చేస్తారు.
మొదట వాస్తవిక ఆత్మ భావనను నిర్వచించిన గంట అనంతరం, ఆదర్శ ఆత్మ భావనను పరీక్షిస్తారు.
ప్రాక్టీస్ బిట్స్
- కార్ల్ రోజర్స్కి సంబంధించి సరికానిది?
1) ఆత్మభావన సిద్ధాంత ప్రతిపాదన- కార్ల్ రోజర్స్
2) ఫ్రీడం టు లెర్న్ గ్రంథ రచయిత
3) ఆత్మభావన సిద్ధాంతానికి ఇతర పేర్లు- ఆత్మ సిద్ధాంతం, స్వీయ సిద్ధాంతం
4) ప్రాకృత వాది- కార్ల్ రోజర్స్ - ఆదర్శ, వాస్తవిక ఆత్మ భావనను పిల్లల్లో మాపనం చేసే పద్ధతి?
1) సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్వెంటరీ
2) ది సైన్ లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్
3) సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్
4) ది ఫెల్స్ పేరెంట్ బిహేవియర్ స్కేల్ - ఆత్మభావనను ఎక్కువగా ప్రభావితం చేసే రక్షక తంత్రం?
1) తాదాత్మకీకరణం 2) హేతుకీకరణం
3) ప్రక్షేపణం 4) స్వైరకల్పన - చోమ్స్కీకి సంబంధించిన వాక్యాల్లో సరికానిది?
1) ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్
2) యాస్పెక్ట్స్ ఆఫ్ థియరీ ఆఫ్
సింటాక్స్ గ్రంథ రచయిత
3) ఉత్పాదక వ్యాకరణం, నియత వ్యాకరణం, సార్వత్రిక వ్యాకరణం అనే నూతన భావనలను ప్రవేశపెట్టారు
4) సాంప్రదాయక పద్ధతిలో వ్యాకరణ బోధనను ప్రోత్సహించారు - చిన్నపిల్ల మెదడు భాషాయంత్రాలతో పోల్చినది?
1) వైగాట్స్కీ 2) నోమ్ చామ్స్కీ
3) కార్ల్ రోజర్స్ 4) కోల్బర్గ్ - ఆత్మభావన సిద్ధాంతం ప్రాధాన్యత ఇచ్చే అంశం?
1) ప్రవర్తన 2) జ్ఞానసముపార్జన
3) కౌశలాల అభ్యసనం 4) ఆత్మసాక్షాత్కారం - చోమ్స్కీ ప్రకారం
1) భాష పిల్లలకు పుట్టుకతోనే ఆర్జించబడే ప్రక్రియ
2) భాష నేర్పబడుతుంది
3) భాషకు అభ్యసనం అవసరం లేదు
4) భాషకు, పరిపక్వతకు సంబంధం లేదు
Answers
1-4, 2-3, 3-1, 4-4, 5-2, 6-4, 7-1
శివపల్లి
టీఎస్& ఏపీ సైకాలజీ ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీ సర్కిల్
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు