టీఎస్ఐసెట్-2021
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్-2021 నోటిఫికేషన్ విడుదలైంది.
పరీక్ష పేరు: తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ఐసెట్) 2021
ఈసారి ఈ పరీక్షను కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తుంది.
ఎవరు అర్హులు ?
ఎంబీఏ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంసీఏ: డిగ్రీలో మ్యాథ్య్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: జనరల్అభ్యర్థులకు 650/-, ఎస్సీ/ఎస్టీ/వికలాంగులకు 450/-
చివరితేదీ: జూన్ 15
వెబ్సైట్:https://icet.tsche.ac.in/
కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు
న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.
ప్రవేశాలు కల్పించే తరగతులు: ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీలు: 1వ తరగతి ప్రవేశాలకు ఏప్రిల్ 19. రెండు నుంచి తొమ్మిది తరగతుల దరఖాస్తుకు ఏప్రిల్ 15
నోట్: సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు వెల్లడైన 30 రోజుల్లోపు ఇంటర్మీడియట్ ప్రవేశాలు ప్రారంభమవుతాయి.
వెబ్సైట్: https://kvsangathan.nic.in
తిరుపతి ఐఐటీలో ఎంఎస్, ఎంటెక్
తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో 2021 విద్యా సంవత్సరానికిగాను ఎంఎస్/పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది.
ప్రోగ్రామ్: ఎంఎస్ (రిసెర్చ్)
విభాగాలు: కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ లేదా ఎంసీఏ/ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి.
ప్రోగ్రామ్: పీహెచ్డీ
విభాగాలు: కెమికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్.
అర్హతలు: మంచి అకడమిక్ రికార్డ్‌తో సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ గేట్ స్కోర్ లేదా యూజీసీ/సీఎస్ఐఆర్- నెట్ లేదా ఎన్బీహెచ్ఎం లేదా జెస్ట్ స్కోర్ లేదా అర్హత సాధించి ఉండాలి.
ఎంపిక: అకడమిక్ రికార్డ్ ఇంటర్వూ/రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా
ముఖ్యతేదీలు:
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
చివరితేదీ: ఏప్రిల్ 30
రాత పరీక్ష/ఇంటర్వూ తేదీ:
మే 23 నుంచి జూన్ 23 మధ్య నిర్వహిస్తారు.
ప్రోగ్రామ్: ఎంటెక్
విభాగాలు: సివిల్-ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్
అర్హతలు: గేట్ 2019, 2020, 2021 పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. బీఈ/బీటెక్ చివరి ఏడాది పరీక్షలకు హాజరై వాటి ఫలితాలు జూలై 2021లోపు వచ్చే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐఐటీ గ్రాడ్యుయేట్లు 8 జీపీఏ మార్కులతో ఐఐటీ బీటెక్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు: ఆన్లైన్లో చివరితేదీ: ఏప్రిల్ 23
వెబ్సైట్: http://admissions.iittp.ac.in
ఫుల్బ్రైట్ నెహ్రూ ఫెలోషిప్స్
యునైటెడ్ స్టేట్స్, ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ (యూఎస్ ఐఈఎఫ్) సంయుక్తంగా 2022 2023 విద్యాసంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాల్లో ఫెలోషిప్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఫుల్బ్రైట్నెహ్రూ ఫెలోషిప్స్: మాస్టర్స్ ఫెలోషిప్స్, డాక్టోరల్ రిసెర్చ్ ఫెలోషిప్స్, పోస్ట్‌డాక్టోరల్ రిసెర్చ్ ఫెలోషిప్స్. అకడమిక్ అండ్ ప్రొఫెషనల్ ఎక్స్‌లెన్స్ ఫెలోషిప్స్ తదితరాలు ఉన్నాయి.
నోట్: వీటికి సంబంధించిన పూర్తి వివరాలు, చివరితేదీలు వెబ్సైట్లో చూడవచ్చు.
దరఖాస్తు: ఆన్లైన్లో వెబ్సైట్: www.usief.org.in
పదోతరగతి ఫైనల్ టచ్
పదోతరగతి పరీక్షలు మేలో ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో ఈసారి పదోతరగతి పేపర్ల సంఖ్యను, సిలబస్‌ను ప్రభుత్వం కుదించింది. ప్రస్తుతం ఆరుపేపర్లు మాత్రమే. మారిన కొత్త విధానంలో ప్రశ్నపత్రంపై విద్యార్థుల అవగాహన కోసం విజేత కాంపిటీషన్స్ వారు ఫైనల్ టచ్ (తెలుగు, ఇంగ్లిష్ మీడియం) పేరుతో మోడల్పేపర్లను విడుదల చేసింది. వీటిలో ఎస్స్ఈఆర్టీ తగ్గించిన సిలబస్ ప్రకారం ప్రత్యేకంగా ఈ పుస్తకాలు విడుదల చేశారు. ఇవి తక్కువ సమయంలో పరీక్ష ప్రశ్నపత్రం నమూనాలో ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉపయుక్తంగా ఉన్నాయి. అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఫైనల్ టచ్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వివరాల కోసం బండ పబ్లికేషన్స్, బతుకమ్మకుంట, హైదరాబాద్, ఫోన్ నంబర్లు: 040-27429494, 9963293399లో సంప్రదించవచ్చు.
ఆన్లైన్లో గ్రూప్-2 ఉచిత వెబినార్
గ్రూప్-2 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం యాప్‌లో శిక్షణ.
అభ్యర్థులు తమకు వీలున్న సమయంలో నిపుణులు రూపొందించిన వీడియో క్లాసులు యాప్ ద్వారా వినవచ్చు.
ఈ యాప్‌లో గ్రూప్-2 స్టడీ మెటీరియల్, అసైన్మెంట్లు, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు, టెస్టుల నిర్వహణ.
ఈ వెబినార్ లైవ్‌ను
https://www.youtube.com/c/namasthetelangaana లో చూడవచ్చు.
ఉచిత అవగాహన వెబినార్ ఈ నెల ఏప్రిల్ 18న జరుగనున్నది. ఈ వెబినార్‌లో సంస్థ చైర్మన్ కృష్ణప్రదీప్, సీనియర్ ఫ్యాకల్టీలు పాల్గొని గ్రూప్- 2 సంబంధించిన విశ్లేషణ, ప్రిపరేషన్‌పై వివరిస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాలకు 9133637733 ఫోన్‌నంబర్లలో సంప్రదించవచ్చు.
ఉచిత అవగాహన వెబినార్ సమయం
Time: Apr 18, 2021 10:00 AM
Join Zoom
Meetinghttps://us02web.zoom.us/j/83579165036?pwd=Ni92Z2E2V1JwU080SklQUW5iTEpVZz09
Meeting ID: 835 7916 5036 Passcode: 677440
కృష్ణప్రదీప్ 21 సెంచరీ ఐఏఎస్ కోచింగ్ సెంటర్
సంయుక్త ఆధ్వర్యంలో
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు