‘అరఘట్టాలు’ అనే పదం దేనిని సూచిస్తుంది?
- దేశంలో జీరో బేస్డ్ బడ్జెట్‌ను మొదట ప్రవేశపెట్టినది?
1) ఇందిరాగాంధీ ప్రభుత్వం
2) రాజీవ్‌గాంధీ ప్రభుత్వం
3) పీవీ నరసింహారావు ప్రభుత్వం
4) వీపీ సింగ్ ప్రభుత్వం - ప్రణాళిక సంఘం తొలి ఉపాధ్యక్షుడు ఎవరు?
1) జవహర్లాల్ నెహ్రూ
2) గుల్జారీలాల్ నందా
3) షణ్ముగం శెట్టి
4) మోక్షగుండం విశ్వేశ్వరయ్య - దేశంలో నూతన ఆర్థిక సంస్కరణల కాలంలో విదేశీరంగానికి సంబంధించి అమలు చేసిన అంశంగా దేనిని
పరిగణిస్తారు?
1) ఎక్కువ అంశాలపై పరిమాణాత్మక ఆంక్షల ఎత్తివేత
2) టారిఫ్‌లను పెంచి విదేశీ పెట్టుబడులను నిరుత్సాహపరచడం
3) వర్తక అంశాలపై పరిమాణాత్మక ఆంక్షల విధింపు
4) ఏదీకాదు - బాలకార్మిక నిషేధ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు?
1) 1991 2) 1986
3) 1950 4) 1947 - జతపర్చండి
ఎ. 1956-61 1. పీఎన్ హక్సర్
బి. 1969-74 2. డీఆర్ గాడ్గిల్
సి. 1974-79 3. మధు దండావతే
డి. 1997- 2002 4. వీటీ కృష్ణమాచారి
1) ఎ-4, బి-2, సి-3, డి-1
2) ఎ-3, బి-2, సి-1, డి-4
3) ఎ-4 బి-2, సి-1, డి-3
4) ఎ-1, బి-2, సి-4, డి-3 - విటి కల్చర్ అంటే?
1) చేపల పెంపకం
2) ద్రాక్షతోటల పెంపకం
3) పట్టు పురుగుల పెంపకం
4) సేంద్రీయ ఎరువుల తయారీ - సంస్కరణల వల్ల పెద్దగా లబ్ధిపొందని రంగం ఏది?
1) బ్యాంకింగ్ రంగం
2) పారిశ్రామిక రంగం
3) ఐటీ, ఐటీఎస్ రంగం
4) వ్యవసాయ రంగం - దక్కన్ ప్రాంతంలో ‘సఖార’ అంటే
1) విద్యాలయాలు 2) వర్తక శ్రేణులు
3) చేతివృత్తి శ్రేణులు 4) మార్కెట్లు - హరడ్-డోమర్ నమూనాలో సమతుల్య వృద్ధి దేనిపై ఆధారపడి ఉంటుంది?
1) పొదుపురేటు, ఉత్పత్తి మూలధన రేటు
2) పొదుపురేటు, జనాభా వృద్ధిరేటు
3) వడ్డీరేట్లు, ద్రవ్యల్బోణం
4) జాతీయాదాయ వృద్ధిరేటు, జనాభా
వృద్ధి రేటు - ప్రణాళిక వనరుల్లో లోటు ద్రవ్యవిధానం వల్ల వచ్చే సమస్య?
1) ద్రవ్య సరఫరా పెరిగి, ద్రవ్యోల్బణం
పెరుగుతుంది
2) ద్రవ్య సరఫరా పెరిగి, పేదరికం
తగ్గుతుంది
3) ద్రవ్య సరఫరా తగ్గి, డిమాండ్ తగ్గుతుంది
4) ద్రవ్య సరఫరా స్థిరంగా ఉండి, ఉద్యోగ కల్పన స్తబ్దత - బ్రిటిష్‌వారు ప్రవేశపెట్టిన ఏ విధానం ద్వారా ఎక్కువ మంది రైతులు వ్యవసాయ కూలీలుగా మారారు?
1) శాశ్వత శిస్తు వసూలు విధానం
2) మహల్వారీ విధానం
3) జాగీర్దారీ విధానం
4) రైత్వారీ విధానం - శిశులింగ నిష్పత్తి కింది వాటిలో దేని ప్రకారం నిర్వహించవచ్చు?
1) శూన్యం నుంచి 4 ఏండ్ల వయస్సు గ్రూప్ గల ప్రతి వెయ్యిమంది బాలురకు అదే వయస్సు గ్రూప్‌లో ఉండే బాలికల సంఖ్య
2) శూన్యం నుంచి 6 ఏండ్లు వయస్సు గల ప్రతి వెయ్యిమంది బాలురకు అదే వయస్సు గ్రూప్‌లో ఉండే బాలికల సంఖ్య
3) శూన్యం నుంచి 4 ఏండ్ల వయస్సు గ్రూప్ గల ప్రతి వెయ్యిమంది బాలికలకు అదే వయస్సు గ్రూప్‌లో ఉండే బాలుర సంఖ్య
4) శూన్యం నుంచి 6 ఏండ్ల వయస్సు గ్రూప్ గల ప్రతి వెయ్యిమంది బాలురకు అదే వయస్సు గ్రూప్‌లో ఉండే బాలుర సంఖ్య - 12వ ప్రణాళిక దృక్పథపత్రం ప్రకారం వెనుకబడిన పట్టణాలు సమ్మిళిత వృద్ధిలో భాగం కాలేదు ఎందుకు?
1) ప్రోత్సాహం లేకపోవడం
2) జనాభా లేకపోవడం
3) పనిచేసే వయస్సు గల ప్రజలు ఎక్కువగా లేకపోవడం
4) అవస్థాపనా సౌకర్యాలు లేకపోవడం - జతపర్చండి
ప్రణాళికలు కాలం
ఎ. వార్షిక 1. 1951-66
బి. పంచవర్ష 2. 1978-80
సి. నిరంతర 3. 1966-69
1) ఎ-3, బి-2, సి-1
2) ఎ-2, బి-1, సి-3
3) ఎ-1, బి-3, సి-2
4) ఎ-3, బి-1, సి-2 - దేశంలో లఘు, కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడంలో లక్ష్యం?
ఎ. మూలధన పెంపు
బి. ఉద్యోగాల కల్పన
సి. వలసల నివారణ
1) ఎ 2) ఎ, బి 3) బి, సి 4) బి - ప్రాంతీయ అసమానతలను తగ్గించడానికి కింది వాటిలో ఎలాంటి చర్యలు చేపట్టాలి?
1) వెనుకబడిన ప్రాంతాల్లో అందరికి
సబ్సిడీలను కల్పించాలి
2) వెనుకబడిన ప్రాంతాల్లో అవస్థాపనా
సౌకర్యాలను అభివృద్ధి చేయాలి
3) పెద్ద పారిశ్రామిక సంస్థలకు సబ్సిడీలను కల్పించాలి
4) వెనుకబడిన ప్రాంతాల పేద ప్రజలకు కనీస జీవనాధార స్థాయికి చేరుకోవడానికి ఆసరా కల్పించాలి
1) 2, 4 2) 1, 3 3) 1, 2 4) 1, 4 - నాలుగో ప్రణాళిక కాలంలో ప్రతిపాదిత లక్ష్యాన్ని చేరుకోపోవడానికి కారణాలు?
ఎ. 1971లో పాకిస్థాన్ యుద్ధం
బి. కాందిశీకుల భారం
సి. అతిద్రవ్యోల్బణం
డి. రుతుపవనాల వైఫల్యం
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి
3) ఎ, సి, డి 4) బి, సి, డి - జతపర్చండి
ఎ. వ్యవసాయ ధరల కమిషన్ 1. 1964
బి. జాతీయ విత్తన కార్పొరేషన్ 2. 1965
సి. ఐడీబీఐ, యూటీఐ 3. 1963
1) ఎ-2, బి-3, సి-1
2) ఎ-2, బి-1, సి-3
3) ఎ-1, బి-3, సి-2
4) ఎ-3, బి-2, సి-1 - బ్రిటిష్ పాలనా కాలంలో ఏర్పాటైన తొలి వస్త్ర మిల్లు ఎక్కడ ఉంది?
1) రిష్రా, పశ్చిమ బెంగాల్
2) బొంబాయి, మహారాష్ట్ర
3) కలకత్తా, పశ్చిమబెంగాల్
4) మద్రాస్, తమిళనాడు - ఆర్థికాభివృద్ధికి అనుకూలంగా ఉండే జనాభా పరిణామ దశ ఏది?
1) స్తబ్దత దశ
2) తగ్గుతున్న వృద్ధి దశ
3) జనాభా విస్ఫోటన దశ 4) ఏదీకాదు - సంస్కరణల పూర్వం కంటే సంస్కరణల తరువాత పేదరికం తగ్గుదల రేటు తక్కువగా ఉండటానికి కారణం?
ఎ. సంస్కరణల వల్ల వ్యవసాయానికి
ఆశించిన స్థాయిలో మేలు జరగకపోవడం
బి. చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలను
సంస్కరణలతో ప్రయోజనం లభించలేదు
సి. ఆశించిన రీతిలో పారిశ్రామిక వృద్ధి
జరగలేదు
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఎ, బి, సి - కింది వాటిలో జాతీయాదాయాన్నిరాబట్టడానికి కలపాల్సిన అంశాలు ఏవి?
ఎ. అన్ని బదిలీ చెల్లింపులను కలపడం
బి. ఉత్పత్తి చేసిన అన్ని వస్తు సేవల
విలువలను కలపడం
సి. అన్ని ఉత్పత్తి కారకాలకు చేసే అన్ని
చెల్లింపులను కలపడం
డి. సృష్టించబడిన అన్ని ఆదాయాలను
కలపడం
1) సి, డి, ఎ 2) డి, ఎ, బి
3) ఎ, బి, సి 4) బి, సి, డి - బడ్జెట్ లోటు, ద్రవ్యోల్బణం, మాంద్యం, రుణభారం మొదలైన వాటి వల్ల ఏర్పడిన తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని భారతదేశం ఎదుర్కొన్న సమయంలో ఏ పంచవర్ష ప్రణాళికను ఆమోదించారు?
1) 8వ ప్రణాళిక 2) 9వ ప్రణాళిక
3) 4వ ప్రణాళిక 4) 6వ ప్రణాళిక - వ్యవసాయ ఉత్పత్తులను పెంచడానికి ప్రారంభించిన మొదటి పథకం ఏది?
1) సాంద్ర వ్యవసాయం జిల్లాల కార్యక్రమం (ఐఏడీపీ)
2) సాంద్ర వ్యవసాయ ప్రాంతాల
కార్యక్రమం (ఐఏఏపీ)
3) అధిక దిగుబడినిచ్చే వంగడాల
కార్యక్రమం (హెచ్వైవీపీ)
4) సామాజిక అభివృద్ధి కార్యక్రమం (సీడీపీ) - ఆదాయాల మదింపు పద్ధతి (Income method)కి గల మరొక పేరు?
1) నికర ఆదాయ పద్ధతి
2) ప్రతిఫలాల పంపిణీ పద్ధతి
3) కారకాల చెల్లింపు పద్ధతి
4) పైవన్నీ - జతపర్చండి
ఎ. NABARD
1. పారిశ్రామిక అభివృద్ధి
బి. EXIM Bank
2. నిర్మాణరంగం అభివృద్ధి
సి. NHB
3. విదేశీ వాణిజ్య అభివృద్ధి
డి. IDBI
4. వ్యవసాయ రంగం అభివృద్ధి
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-3, బి-4, సి-2, డి-1
3) ఎ-1, బి-3, సి-2, డి-4
4) ఎ-2, బి-3, సి-4, డి-1 - ‘స్వాభిమాన్ పథకం’ దేనికి ఉద్దేశించింది?
1) ఆహార భద్రత
2) గిరిజనులకు వ్యవసాయ సాంకేతిక శిక్షణ
3) బ్యాంకింగ్ వసతిలేని ప్రాంతాల్లో బడుగు వర్గాల రుణ సహాయానికి
4) బడుగు బలహీన వర్గాల పింఛన్ - 1991 ఆర్థిక సంస్కరణలకు ముందు భారత ఆర్థిక వ్యవస్థ లక్షణం?
1) లైసెన్స్ రాజ్ వ్యవస్థ
2) ప్రభుత్వ రంగం ఆధిక్యం
3) ప్రభుత్వ రంగ సంస్థలు అసమర్థతతో
పనిచేసేవి
4) పైవన్నీ - మార్పిడి వ్యవసాయాన్ని వివిధ రాష్ర్టాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. కింది వాటిని జతపర్చండి
ఎ. అసోం 1. బివార్
బి. ఏపీ, ఒడిశా 2. పోనం
సి. మధ్యప్రదేశ్ 3. పోడు
డి. కేరళ 4. జూమ్
1) ఎ-4, బి-3, సి-1, డి-2
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-2 బి-3, సి-1, డి-4
4) ఎ-3, బి-4, సి-1, డి-2 - మధ్యయుగ భారతదేశ చరిత్రలో ‘అరఘట్టాలు’ అనే పదం దేనిని సూచిస్తుంది?
1) వ్యవసాయ కాలువలు
2) వృత్తికళల శిక్షణ కేంద్రాలు
3) నీటిని ఎత్తిపోయడానికి ఉపయోగించే యంత్రాలు
4) కోటలపై దాడికి ఉపయోగించే
యంత్రాలు
Answers
1-4, 2-2, 3-1, 4-2, 5-3, 6-2, 7-4, 8-2, 9-1, 10-1, 11-4, 12-2, 13-4, 14-4, 15-3, 16-1, 17-4, 18-1, 19-3, 20-2, 21-3, 22-4, 23-1, 24-2, 25-4, 26-1, 27-3, 28-4, 29-1, 30-3
- Tags
Previous article
‘గార్డియన్ మినిస్టర్స్’ను ప్రవేశపెట్టిన రాష్ట్రం?
Next article
‘వ్రతఖండ కల్పతరువు’ అనే గ్రంథ రచయిత?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు