పాలిసెట్‌కు ప్రిపేరవుదామిలా!


తెలంగాణ పాలిసెట్-2021 పరీక్ష రాసే విద్యార్థులు దృష్టిసారించాల్సిన అంశాలు.
అధికారిక సిలబస్‌నే అనుసరించాలి
సరైన సిలబస్ తెలిసినప్పుడు మాత్రమే అవసరమైన విషయాల్లోని పాఠ్యాంశాలను చదివి మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారు.
దీని ద్వారా అనవసరమైన విషయాల్లోని పాఠ్యాంశాలను చదవకుండా, సమయం వృథాకాకుండా జాగ్రత్తపడవచ్చు.
పునర్విమర్శ చేయడం
ఏదైనా పోటీ పరీక్షలో విజయం సాధించాలంటే సరైన పాఠ్యాంశాలను పునర్విమర్శ చేసుకోవడం తప్పనిసరి.
కాబట్టి సిలబస్‌లోని విషయాల పాఠ్యాంశాలను రోజువారీ పునర్విమర్శ చేసుకోవడం ద్వారా మంచి మార్కులు సాధించగలుగుతారు.
సమయ నిర్వహణ నైపుణ్యాలు
సమయ నిర్వహణ నైపుణ్యాలు గల విద్యార్థులు తెలివిగల అధ్యయనం చేయడంతో పాటు అనుకున్న లక్ష్యాలను నిర్ణీత సమయంలో సాధించగలరు.
సిలబస్, పరీక్ష నమూనాను బట్టి మన సమయ నిర్వహణ చేసుకోవాలి.
అన్ని పాఠ్యాంశాలకు సమాన సమయం కేటాయించాలి.
సిలబస్‌లోని అన్ని విషయాలను నిర్ణీత సమయంలో పూర్తిచేసే విధంగా మన సమయ నిర్వహణ ఉండాలి.
పరీక్ష పరిశీలన
సరైన పరీక్ష పరిశీలన నైపుణ్యాలు కలిగి ఉండటంవల్ల పరిశీలన నైపుణ్యాల ఆధారంగా చేసి అడిగిన ప్రశ్నలకు సమాధానం రాయవచ్చు.
ఇలాంటి ప్రశ్నలను తక్కువ సమయంలోనే సమాధానం చేయవచ్చు. కాబట్టి వీటి ద్వారా ఎక్కువ మార్కులు సాధించడానికి ఈ నైపుణ్యం దోహదపడుతుంది.
నెగెటివ్ మార్కులు లేవు. కాబట్టి వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలకు సమాధానం చేయడానికి ప్రయత్నించాలి.
భావాల ఆధారంగా చదవడం
పరీక్షలో గరిష్టంగా అడిగే ప్రశ్నలు ప్రాథమిక అంశాలను ఆధారితంగా చేసుకొని ఉంటాయి. కాబట్టి భావాల ఆధారంగా విషయాలను చదవడం తప్పనిసరి.
విశ్లేషణాత్మక నైపుణ్యాలు
పరీక్షలో అడిగే సులభ, కఠినతరమైన ప్రశ్నలను విశదీకరించి, దృశ్యమానం చేసుకొని సరైన నిర్ణయం తీసుకోవాలంటే విశ్లేషణాత్మక నైపుణ్యాలు తప్పనిసరి.
ఈ నైపుణ్యాలను కలిగి ఉండటం మోసపూరితమైన ప్రశ్నలకు కూడా సమాధానం చేయడానికి చాలా అవసరం.
రోజువారీ పరీక్ష రాయడం
సాయిమేధ కోఠి వారు అందిస్తున్న saimedha.in యాప్ ద్వారా రోజువారీ పరీక్షలు రాస్తూ మంచి మార్కులు తెచ్చుకోవచ్చు.
గత ప్రశ్నపత్రాల సాధన
గత పాలిసెట్ ప్రశ్నపత్రాలను సాధన చేయడం ద్వారా మనకు ఏయే పాఠ్యాంశాల్లోని ఏ అంశాలపై ఎక్కువ దృష్టిసారించి మంచి మార్కులు తెచ్చుకోవాలో తెలుస్తుంది.

పాలిసెట్
పరీక్ష నిర్వహించే విధానం: ఆఫ్‌లైన్
పరీక్ష వ్యవధి: రెండున్నర గంటలు
పాఠ్యాంశాలు: గణితం, భౌతికశాస్త్రం,రసాయన శాస్త్రం
మొత్తం ప్రశ్నల సంఖ్య: 120
ప్రశ్నలు అడిగే విధానం: బహుళ ఎంపిక ప్రశ్నలు ఉంటాయి.
ఇచ్చిన నాలుగు ఎంపికల్లో సరైనదాన్ని ఎంచుకోవాలి.
భాష: తెలుగు, ఇంగ్లిష్ రెండు ఉంటాయి.
మొత్తం మార్కులు: 120
మార్కులు ఇచ్చే పద్ధతి: ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు ఇస్తారు.
శశికాంత్ వాల్మీకి
కో ఆర్డినేటర్,
సాయిమేధ ఇన్స్టిట్యూట్
కోఠి, హైదరాబాద్
9848692598
- Tags
- Education News
Latest Updates
గురుకులంలో బోధనకు దరఖాస్తులు ఆహ్వానం
ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలు ప్రారంభం
టీశాట్‌లో గ్రూప్ 1 ఇంగ్లిష్ పాఠాలు
ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్‌లో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీ
బ్యాంక్ ఆఫ్ బరోడా లో మేనేజర్ పోస్టులు
ఎన్టీపీసీ లో 12 పోస్టుల భర్తీ
ముడత పర్వతం ఏర్పడటానికి కారణం ఏమిటి?
Gain a grasp over geography
Dalit movement: Role of triumvirate
సూర్యుడిని అనుసరించే వర్షపాతం ఏ ఖండంలో ఉంది?