కష్టపడితే బ్యాంక్ కొలువు మీదే!
ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కులు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
మెయిన్స్ జూలై 31, 2021న నిర్వహిస్తే 90 రోజుల వ్యవధి ఉంటుంది. అయితే ప్రిలిమినరీ జూన్‌లో జరుగుతుంది. కాబట్టి మెయిన్స్‌కు ఇంకా 30 రోజులు గడువు మాత్రమే ఉంటుంది. అభ్యర్థులు నిర్లక్ష్య ధోరణితో కాకుండా శ్రద్ధతో చదవాలి.
లోకల్ లాంగ్వేజ్ టెస్ట్
మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించినవారికి భాషా నైపుణ్య పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న లాంగ్వేజీని పదో తరగతి లేదా ఇంటర్లో చదివి ఉంటే ఈ టెస్ట్ రాయాల్సిన అవసరం లేదు.
ప్రిపరేషన్
కరోనా నేపథ్యంలో అభ్యర్థులు తమ తమ అనుకూలతలను బట్టి అందుబాటులో ఉన్న వనరులను బట్టి ప్రిపరేషన్ మొదలుపెట్టాలి. కరోనా వల్ల కోచింగ్ సెంటర్లు, విద్యాసంస్థలు బంద్ పాటిస్తున్నాయి. కాబట్టి కోచింగ్ మెటీరియల్ లేదా స్టాండర్డ్ బుక్స్ ఆధారంగా చదువును కొనసాగించాలి. లేదా ఆన్లైన్ క్లాసులు ఫాలో కావాలి.
బ్యాంకు పరీక్షలు విభాగాలవారీగా నిర్ణీత కాల వ్యవధిలో పూర్తిచేయాలి. కాబట్టి విభాగాలవారీగా గరిష్ట మార్కులు సాధించేలా ప్లాన్ చేసుకోవాలి.
టైం మేనేజ్మెంట్ సాధనలోనే అవలంబించాలి
క్వాంట్స్, రీజనింగ్‌లకు ఇచ్చే ప్రాముఖ్యం ఇంగ్లిష్, జనరల్ అవేర్నెస్లకు ఇవ్వడం వల్ల మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది.
ఎస్బీఐలో కాస్త హెచ్చుస్థాయి ప్రశ్నలు వస్తాయి. విద్యార్థులు ఆ మేరకే ప్రాక్టీస్ చేయాలి.
నూతనంగా బ్యాంక్ పరీక్షలకు ప్రిపేరయ్యేవారు ముందుగా సిలబస్, పరీక్ష విధానం, మార్క్స్ వెయిటేజీ గల చాప్టర్లపై ఎక్కువ ఫోకస్ చేయాలి.
లాక్డౌన్ సమయాన్ని పూర్తిగా కెరీర్ డెవలప్మెంట్కే కేటాయించాలి. ఈ విలువైన సమయాన్ని ప్రిపరేషన్ కోసం ప్లాన్ చేసుకోండి.
ఆన్లైన్ తరగతులను పూర్తి శ్రద్ధతో వినాలి. T-SAT నిపుణ, విద్యా వంటి చానల్స్ ద్వారా కూడా బ్యాంకింగ్, ఎస్సెస్సీ, రైల్వేస్ వంటి పోటీ పరీక్షలకు సంబంధించిన క్లాసులను నిర్వహిస్తున్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలి. మీరు ఎంచుకున్న ఆన్లైన్ క్లాసులు క్రమం తప్పకుండా వినండి.
పూర్వ, నమూన ప్రశ్నపత్రాలు రోజుకు 1, 2 సాల్వ్ చేయాలి. అభ్యర్థులు తమ సామర్థ్యాలను బట్టి ప్రిపేర్ కావాలి. అంటే 100 మార్కులకు 70-80 మార్కులు పొందే అవకాశం ఉన్న టాపిక్స్ ఎంచుకొని వాటినే సాల్వ్ చేసి మంచి మార్కులు పొందడం స్మార్ట్ స్టడీ ప్లాన్ అంటారు.
బ్యాంక్ ఎగ్జామ్ అంటేనే కామన్ టాపిక్స్ 40 శాతం రిపీటెడ్ టాపిక్స్ వస్తుంటాయి. వాటిని గుర్తించి సాధన చేయడం వల్ల 80 శాతం మార్కులు పొందే అవకాశం ఉంటుంది.
విభాగాలవారీగా
బ్యాంక్ పరీక్షల్లో 4 విభాగాలు ఉంటాయి. ఇందులో సాధారణంగా 5 సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తుంటాయి. ప్రిలిమ్స్, మెయిన్స్‌లలో కామన్ సిలబస్, చాప్టర్స్ కనిపిస్తుంటాయి. కాబట్టి విభాగాలవారీగా చదవడం వల్ల ఉపయోగం ఉంటుంది. ప్రతి విభాగం నుంచి బేసిక్ టాపిక్స్‌తో మొదలు పెడితే హెచ్చుస్థాయి ప్రశ్నల వరకు సాల్వ్ చేయగలగాలి.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
ఇది ప్రిలిమ్స్, మెయిన్స్‌లో కామన్‌గా ఉండే సబ్జెక్ట్. ప్రిలిమ్స్‌లో అంకెలు-సంఖ్యలపై ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి. 50 శాతం ప్రశ్నలు BODBAJ, D.I ప్రశ్నలే ఉంటాయి. నంబర్, సిరీస్, సింప్లికేషన్స్, క్వాడ్రాటిక్-ఈక్వేషన్స్ డాటా ఇంటర్‌ప్రిటేషన్స్ వంటి టాపిక్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. ఇతర చాప్టర్లు పర్సంటేజీ, యావరేజెస్, టైం-అండ్ వర్క్స్, రేషియో ప్రపోర్షన్స్, ప్రాబబిలిటీ పర్ముటేషన్స్ కాంబినేషన్స్ వంటివి కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి.
మెయిన్స్‌లో అర్థమెటిక్ కీలక చాప్టర్లు అయిన కాలం-పని-దూరం, లాభనష్టాలు, శాతాలు-నిష్పత్తులు, వయస్సు, యావరేజెస్తో పాటు డాటా ఇంటర్ప్రిటేషన్స్పై ఎక్కువ దృష్టిపెట్టాలి. ప్రిలిమ్స్‌లో 30 మార్కులు, మెయిన్స్‌లో 40 మార్కులు సాధించేలా ప్రయత్నం చేయాలి.
రీజనింగ్
ఈ విభాగం కూడా రెండు భాషల్లో ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్‌లో కామన్ టాపిక్ ఎంచుకొని ప్రిపేర్‌కావాలి. ముందుగా రీజనింగ్ కోసం ఇంగ్లిష్ లాంగ్వేజ్‌పై పట్టు సాధించాలి. రీజనింగ్ పేపర్ 60% వరకు స్టేట్మెంట్ పేరాగ్రాఫ్ ఆధారిత ప్రశ్నలే ఎక్కువగా వస్తుంటాయి. బ్యాంక్ పరీక్షలో రీజనింగ్ ప్రశ్నలు హెచ్చుస్థాయిలో ఉంటుంది. అభ్యర్థుల విశ్లేషణాత్మక సమయ పాలన నైపుణ్యాలను ఇందులో పరీక్షిస్తారు.
ఈ విభాగం నుంచి కోడింగ్, డీకోడింగ్, అనాలజీ, లెటర్-సిరీస్, డైరెక్షన్స్, ర్యాంకింగ్ వంటివి ప్రిలిమ్స్‌లో 60% ప్రశ్నలు వస్తుంటాయి. ఇక మెయిన్స్ ముఖ్యమైన టాపిక్స్ పజిల్స్, సీటింగ్ అరెంజ్మెంట్స్, ఇన్పుట్, అవుట్‌పుట్, స్టేట్మెంట్ ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా వస్తుంటాయి.
రీజనింగ్ విభాగం అనేది మంచి స్కోరింగ్ సబ్జెక్టు. కాబట్టి ఈ సెక్షన్లో ప్రిలిమ్స్ 30 ప్రశ్నలు మెయిన్స్ 40 ప్రశ్నలు వరకు సాల్వ్ చేయడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది.
కంప్యూటర్ నాలెడ్జ్
ఈ సబ్జెక్ట్ కేవలం మెయిన్స్ మాత్రమే వచ్చే సెక్షన్. రీజనింగ్ విభాగంలో 10-15 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
బ్యాంకింగ్ కార్యకలాపాల్లో కంప్యూటర్లు చాలా కీలక భాగం. అన్ని బ్యాంకింగ్ వ్యవహారాలు కంప్యూటర్‌పైనే నిర్వహిస్తారు. కాబట్టి అభ్యర్థులకు కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. ఇందులో ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్, ఇన్పుట్/అవుట్‌పుట్, కంప్యూటర్ విభాగాలు, ప్రాసెసర్లు, పాస్వర్డ్లు, యూజర్ ఫ్రెండ్లీ పోర్టర్లు, బ్యాంకింగ్ యాప్‌లు, వైరస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్మార్ట్‌కార్డుల పనితీరు వంటి అంశాలపై ప్రాక్టికల్ నాలెడ్జ్ సంపాదించాలి. ఇందుకోసం గత ప్రశ్నపత్రాలను తిరగేస్తే సరిపోతుంది.
ఇంగ్లిష్ లాంగ్వేజ్
ఈ విభాగం కూడా ప్రిలిమ్స్, మెయిన్స్‌లలో కామన్ సబ్జెక్ట్. బ్యాంక్ పరీక్షల్లో ఇంగ్లిష్ పేపర్ కాస్త కఠినంగానే ఉంటుంది. అయితే సిలబస్ గత ప్రశ్నపత్రాల ఆధారంగా చూస్తే ఇంగ్లిష్‌లో గ్రామర్ కంటే నాన్గ్రామర్ పైనే ఎక్కువ మార్కుల వెయిటేజీ ఉంది. కాబట్టి అభ్యర్థులు గ్రామర్‌పై పట్టుసాధించి మిగతా టాపిక్స్‌పై దృష్టిసారిస్తే సరిపోతుంది.
ఈ విభాగం నుంచి రీడింగ్ కాంప్రహెన్షన్స్, సెంటెన్స్, అరెంజ్మెంట్స్, సెంటెన్స్ కరెక్షన్స్, ప్రిపోజిషన్స్ గుర్తించడం, ఆర్టికల్స్, సినానిమ్స్, ఆంటనిమ్స్ వంటి తదితర టాపిక్స్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు ఆంగ్లపత్రికలు, ఆంగ్లన్యూస్ వంటివి ఫాలో కావడం వల్ల ఇంగ్లిష్‌పై పట్టు సాధించవచ్చు.
జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్
ఈ విభాగం నుంచి మెయిన్స్‌లో మాత్రమే అడిగే సెక్షన్. ఇందులో జీకే, కరెంట్అఫైర్స్, బ్యాంకింగ్ రంగం గురించి ఆర్థిక అంశాల గురించి అడుగుతారు.
ఈ విభాగంలో 45 మార్కుల వరకు సాధించవచ్చు. కాబట్టి అభ్యర్థులు తమ మార్కులు పెంచుకోవడానికి ఉపయోగపడే సెక్షన్. ఇందులో నుంచి గత 6 నెలల్లో జరిగిన అంశాలపై ప్రశ్నలు వస్తాయి.
జాతీయ-అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలు, ఆర్థిక సంఘం సిఫారసులు, 2021 బడ్జెట్, 2020 ఆర్థిక సర్వే, కొవిడ్ దృష్ట్యా నూతన కేంద్ర రాష్ట్ర పథకాలు, పుస్తకాలు, రచయితలు, ముఖ్యమైన తేదీలు, వ్యక్తులు 5 రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎలక్షన్లు, 48వ భారత ప్రధానన్యాయమూర్తి నియామకం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టిసారించాలి. ఇందులో మంచి మార్కులు సాధించాలంటే దినపత్రికలు, మాసపత్రికలు, ఆన్లైన్ పాఠాలను ఫాలో కావాలి.
ఎస్బీఐ బ్యాంకులో క్లర్క్ జాబ్ కోసం వేచిచూస్తున్న అభ్యర్థులకు 2021 క్లరికల్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం పోస్టుల సంఖ్య 5454 కాగా తెలంగాణ రాష్ర్టానికి 275 ఖాళీలు ఉన్నాయి. క్లరికల్ పోస్టును జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్, సేల్స్) గా పిలుస్తారు. సాధారణ క్లరికల్ కేడర్ విధులతో పాటు బ్యాంకు ప్రత్యేక విధులు కూడా వీరు
నిర్వహిస్తారు.
డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు బ్యాంకు ఉద్యోగాలు చక్కటి అవకాశం. అయితే బ్యాంకుల్లో ఉద్యోగాలకు రెండు ప్రవేశమార్గాలు 1) క్లర్క్ 2) పీఓ. ఇక పై హోదాలు ప్రమోషన్స్ బట్టి వస్తుంటాయి. కాబట్టి సాధారణ డిగ్రీ పూర్తిచేసుకున్న అభ్యర్థులు క్లర్క్ లేదా పీఓ ద్వారానే తమ కెరీర్‌ను మొదలు పెడుతుంటారు. చక్కటి హోదా కలిగిన ఉద్యోగం, సమాజంలో గౌరవం, మంచి జీతభత్యాలు బ్యాంకు ఉద్యోగాల సొంతం. సరైన ప్రణాళిక, దృఢ సంకల్పంతో కఠోర సాధన చేస్తే ఎస్బీఐలో జాబ్ సాధించడం ఖాయం.
2021లో వెలువడిన క్లరికల్ నోటిఫికేషన్లో ఏపీకి ఖాళీలు ప్రకటించలేదు. కానీ తెలుగు భాష సబ్జెక్ట్‌గా సెకండరీ లెవల్లో చదివినవారు తెలుగు రాష్ట్రంలో దరఖాస్తు చేసుకోవచ్చు. క్లరికల్ పోస్ట్ స్టేట్ లెవల్ కాబట్టి భాషా ప్రావీణ్యం చాలా ముఖ్యం. హిందీ భాష/మీడియం ఎంచుకున్న వారు హిందీ రాష్ర్టాల్లో ఎక్కడైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష విధానం
బ్యాంక్ క్లరికల్ పరీక్ష రెండంచెల పరీక్ష. ఇందులో 1. ప్రిలిమినరీ, 2. మెయిన్స్. ఇంటర్వ్యూ ఉండదు. ప్రిలిమినరీ, మెయిన్స్ రెండు కూడా ఆబ్జెక్ట్ పద్ధతిలోనే ఉంటాయి.
ప్రిలిమ్స్
ఇది ప్రథమ పరీక్ష. ఇందులో సాధించిన మార్కులను బట్టి మెయిన్స్‌కు అనుమతిస్తారు. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. అవి
నెగెటివ్ మార్కింగ్-0.25/1/4
l ప్రిలిమ్స్ పరీక్ష చాలా కీలకం. ఈ పరీక్షకు సుమారు 20 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతుంటారు. తెలుగు రాష్ర్టాల నుంచి 4-5లక్షల అభ్యర్థుల వరకు దరఖాస్తు చేసుకుంటారని అంచనా. పోటీస్థాయి తీవ్రంగానే ఉంటుంది. సాధారణంగా ఈ పరీక్షలో చాలామంది అభ్యర్థులు ఏరివేతకు గురవుతుంటారు. ఇందుకు కారణం ఇది అర్హత పరీక్షే కదా అని నిర్లక్ష్యం చేయడం. కాబట్టి ప్రిలిమ్స్‌లోనే మెరిట్ మార్కులు సాధించాలి. తద్వారా మెయిన్స్ ప్రిపరేషన్ సులభమవుతుంది.
మెయిన్స్
ఇది ప్రధాన పరీక్ష. అభ్యర్థి ఉద్యోగాన్ని నిర్ణయించేది ఇందులో సాధించిన మార్కులే. ఇందులో 4 విభాగాలు ఉంటాయి. అవి
ఎస్ మధుకిరణ్
డైరెక్టర్, ఫోకస్ అకాడమీ
9030496929
హైదరాబాద్
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు