వినూత్న కెరీర్ యాక్చురియల్ సైన్స్
ప్రపంచం ఎంత అభివృద్ధి చెందితే అంత ఆర్థికవ్యవస్థలు వృద్ధి చెందుతాయి. ఈ రంగంలో ఉపాధి అవకాశాలకు ఢోకా ఉండదు. ఎవర్గ్రీన్ కెరీర్‌గా చెప్పుకోవచ్చు. దీనిలో ముఖ్యంగా భవిష్యత్ అంచనాలను, ఆర్థిక నష్టాలను ఎప్పడికప్పుడు లెక్కవేసి, విశ్లేషించి చిన్న కంపెనీల నుంచి ఎంఎన్సీల వరకు లాభాల బాటలో పయనించేటట్లు చేసే దానిలో కీలకపాత్ర పోషించే విభాగం యాక్చురియల్ ప్రొఫెషనల్స్. కేవలం ఇంటర్ అర్హతతో ఈ కోర్సు చేస్తే ఉపాధికి భరోసా, వినూత్నమైన రంగం, నిత్యం చాలెంజింగ్ ఉండే కెరీర్ ఇది. ఆకర్షణీయమైన జీతభత్యాలు, మంచి హోదాలు లభిస్తాయి. ప్రస్తుతం ఏసెట్-2021 ద్వారా ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు సంక్షిప్తంగా…
ఐఏఐ:
ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చురీస్ ఆఫ్ ఇండియా (ఐఏఐ) దీన్ని మొదట్లో యాక్చురియల్ సొసైటీ ఆఫ్ ఇండియాగా పిలిచేవారు. 1944లో ప్రారంభించిన ఈ సంస్థ అంతర్జాతీయ అసోసియేషన్‌లో సభ్యత్వం కలిగి ఉంది. 2006లో పార్లమెంట్ చట్టం ప్రకారం ఈ సంస్థను ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చురీస్ ఆఫ్ ఇండియా (ఐఏఐ)గా కేంద్ర ప్రభుత్వం మార్చింది. దేశంలో యాక్చురీస్కు సంబంధించిన నిపుణులను తయారుచేయడం, శిక్షణ ఇవ్వడం వంటివి ఈ సంస్థ చేపడుతుంది.
యూక్చురియల్ సైన్స్: ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన గణిత, గణాంక పద్ధతులను ఉపయోగించి బీమా, ఆర్థిక రంగాల్లో ఆర్థిక నష్టాలను అంచనావేసే ఒక విభాగం యాక్చురియల్ సైన్స్. అనిశ్చిత భవిష్యత్ సంఘటనల ఆర్థిక ఇబ్బందులు, చిక్కులను పరిష్కరించడం, విశ్లేషించడానికి, సంభావ్యత, గణాంకాల గణితాన్ని ఈ యాక్చురియల్ సైన్స్ అందిస్తుంది. దేశవిదేశాల్లో ఆర్థిక గణకులకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఎవర్గ్రీన్ కెరీర్‌గా దీన్ని పేర్కొంటారు.
ఏసెట్-2021
యాక్చురియల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏసెట్)-2021. ఈ ఎంట్రన్స్ టెస్ట్‌ను 2012 నుంచి ఐఏఐ నిర్వహిస్తుంది. ఏటా రెండు సార్లు ఈ నోటిఫికేషన్ విడుదలవుతుంది. ప్రస్తుతం జూన్ సెషన్ ప్రకటన విడుదలైంది.
ఎవరు రాయవచ్చు?
ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక: అసెట్ ర్యాంక్ ఆధారంగా
పరీక్ష విధానం: ఈ పరీక్ష ఆన్లైన్ విధానంలో హోమ్ బేస్డ్ పద్ధతిలో నిర్వహిస్తారు. దీనికి హాజరయ్యే అభ్యర్థులు నిర్దేశించిన హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలి.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: జూన్ 2
పరీక్ష తేదీ: జూన్ 26
వెబ్సైట్: http://www.actuariesindia.org
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు