ఏ దశలో బహురూప నిత్యత్వ భావన ఏర్పడుతుంది?
లక్ష్యాలు స్పష్టీకరణలు-బోధనా పద్ధతులు
- విద్యార్థి తన వద్దనున్న సమాచారాన్ని మనసులోగానీ, బహిర్గతమైన ప్రవర్తనలో గానీ తనకు ఎక్కువ అర్థవంతమయ్యే విధంగా మార్చుకోవడం?
1) జ్ఞానం 2) అవగాహన
3) వినియోగం 4) సంశ్లేషణ - రాజు అనే విద్యార్థి తన ఉపాధ్యాయుడి ద్వారా సత్య హరిశ్చంద్రుడు చరిత్ర తెలుసుకుని హరిశ్చంద్రుని నైతికత, నడవడిక, ఉన్నత భావాలను తనలో ఇముడ్చుకునే దశ?
1) గ్రహించడం 2) విలువ కట్టడం 3) ప్రతిస్పందించడం 4) శీలస్థాపనం - కింది వాటిలో అవగాహనను సూచించే ప్రశ్న?
1) నిమ్మకాయలో ఉండే విటమిన్ ఏది?
2) ఖండాలు ఎన్ని? అవి ఏవి?
3) కంప్యూటర్ పనితీరును సోదాహరణంగా వివరించండి?
4) రైతు పంటలు పండించకపోతే ఏమవుతుందో ఊహించండి? - వైఖరికి సంబంధించని దానిని ఎన్నుకోండి?
1) అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించని ట్రంప్ తత్వాన్ని విద్యార్థి తప్పుపట్టాడు- కషాయం తాగితే కరోనా తగ్గుతుందన్న విషయాన్ని విద్యార్థి విశ్వసిస్తున్నాడు
3) ఐపీఎల్ కప్పు గెలిచిన ముంబై ఇండియన్స్ ఆటతీరును విద్యార్థి కొనియాడాడు
4) దేశాభివృద్ధికి ఆటంకమైన అవినీతిని విద్యార్థి రూపుమాపాలనుకుంటున్నాడు
- కషాయం తాగితే కరోనా తగ్గుతుందన్న విషయాన్ని విద్యార్థి విశ్వసిస్తున్నాడు
- ఒక విషయాన్ని బోధించడం వల్ల విద్యార్థి ప్రవర్తనలో మార్పును సూచించేది?
1) హస్తలాఘవం 2) స్పష్టీకరణ
3) గమ్యం 4) ఉద్దేశం - ఉపాధ్యాయుని బోధనా విజయం దేనిపై ఆధారపడి ఉంటుంది?
1) ఉపాధ్యాయుని విషయ పరిజ్ఞానంపై
2) అనుభవంపై
3) అభివ్యంజన నైపుణ్యంపై
4) ఉపాధ్యాయుని సమయపాలనపై - విద్యార్థి చిన్న చిన్న పొడవులను కొలవడానికి వెర్నియర్ కాలిపర్స్‌ను ఉపయోగించి, అనంతరం దానిని తగిన విధంగా శుభ్రపరిచి ప్రత్యేక స్థానంలో భద్రపరిచాడు. దీనిలోని నైపుణ్యం?
1) హస్తలాఘవ నైపుణ్యం
2) చిత్రలేఖన నైపుణ్యం
3) పరిశీలన నైపుణ్యం
4) నివేదన నైపుణ్యం - విద్యార్థి మొత్తం పటంలో ఏయే భాగం ఎంతెంత నిష్పత్తిలో ఉండాలో అంతే కొలతలతో అద్భుతంగా గీయడం?
1) జ్ఞానాత్మక రంగం 2) భావావేశ రంగం
3) మానసిక చలనాత్మక రంగం 4) 1, 2 - మానసిక చలనాత్మక రంగాన్ని అనుసరించి
- అనుకరణ ఎ. సాధన
- హస్తలాఘవం బి. జాగ్రత్తలు
- సునిశితత్వం సి. పరిశీలన
- సమన్వయం డి. అలవాటు
- సహజీకరణం ఇ. వేగం, కచ్చితత్వం
1) 1-ఎ, 2-బి, 3-డి, 4-ఇ, 5-సి
2) 1-సి, 2-బి, 3-ఇ, 4-ఎ, 5-డి
3) 1-ఇ, 2-సి, 3-డి, 4-బి, 5-ఎ
4) 1-సి, 2-ఎ, 3-బి, 4-ఇ, 5-డి
- మన కళ్లముందు ఎప్పుడూ కనిపిస్తూ, మనకు దిశానిర్దేశం చేస్తూ, మనం చేసే ప్రతీ పనిని ప్రభావితం చేస్తూ మనల్ని సరైన మార్గంలో నడిపించేదే ఉద్దేశం?
1) జాన్ డూయీ 2) చెస్టర్ ఎం ఆల్టర్
3) ప్లాటో 4) ఫ్రాస్ట్ - గణిత పరికరాల పెట్టెను ఉపయోగించి దీర్ఘచతురస్రం వివిధ లక్షణాలను కనుగొనమని విద్యార్థులను కోరడంలో అనుసరించే బోధనా పద్ధతి?
1) క్రీడా పద్ధతి 2) అన్వేషణ పద్ధతి
3) ప్రాజెక్టు పద్ధతి 4) నిగమన పద్ధతి - నిర్మాణాత్మక ప్రకల్పనను ఏ విధంగా కూడా పిలుస్తారు?
1) ఉత్పత్తిదారుల రకం
2) వినియోగదారుల రకం
3) సమస్యా రకం 4) శిక్షణా రకం - గ్రహణాలు అనే పాఠ్యాంశంలో సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడే విధానాన్ని బోధించడానికి ప్రాథమిక స్థాయికి అనువైన బోధనా పద్ధతి?
1) ప్రకల్పన పద్ధతి
2) సమస్యా పరిష్కార పద్ధతి
3) కృత్యాధార పద్ధతి 4) చర్చా పద్ధతి - విద్యార్థుల్లో హస్తలాఘవ నైపుణ్యాలు పెంపొందించడానికి సహాయపడే పద్ధతి?
1) ఉపన్యాస పద్ధతి
2) ఉపన్యాస-ప్రదర్శనా పద్ధతి
3) సాంఘిక ఉద్గార పద్ధతి
4) ప్రయోగశాల పద్ధతి - ‘తెలంగాణ అభివృద్ధికి కొత్త జిల్లాల ఏర్పాటు అవసరం’ అనే అంశాన్ని ఉత్తమంగా ఏ పద్ధతిలో బోధించవచ్చు?
1) ఉపన్యాస పద్ధతి
2) సమస్యా పరిష్కార పద్ధతి
3) అన్వేషణ పద్ధతి
4) వాద-సంవాద పద్ధతి - మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ‘షీ టీం’ పోలీస్స్టేషన్లను సందర్శించి జ్ఞానాన్ని సముపార్జించడంలో ఇమిడి ఉన్న బోధనా పద్ధతి?
1) అన్వేషణ పద్ధతి 2) ప్రాజెక్టు పద్ధతి
3) క్రీడా పద్ధతి 4) కృత్యా పద్ధతి - కింది వాటిలో నిగమన పద్ధతి లక్షణం కానిది?
1) జ్ఞాపక శక్తికి ప్రాధాన్యం
2) కాలం పొదుపు
3) గణనలో వేగం 4) శ్రమ ఎక్కువ - చర్చా పద్ధతి సోపానాలు వరుసగా
1) ప్రణాళిక, సంసిద్ధత, మూల్యాంకనం, నిర్వహణ
2) సంసిద్ధత, మూల్యాంకనం, ప్రణాళిక, నిర్వహణ
3) ప్రణాళిక, సంసిద్ధత, నిర్వహణ, మూల్యాంకనం
4) ప్రణాళిక, నిర్వహణ, సంసిద్ధత, మూల్యాంకనం - కొత్త అంశాన్ని లేదా ఏ అంశం కొనసాగింపు కోసమైనా ఉపాధ్యాయుడు పరిచయం చేసేలా లేదా ఆ అంశంపై నిమగ్నమయ్యేలా చేయడం అనేది నిర్మాణాత్మక నమూనా అయిన ‘5E’ నమూనాలో ఏ అంశాన్ని సూచిస్తుంది?
1) Engage 2) Explore
3) Explain 4) Elaborate - పియాజే ప్రకారం ఏ దశలో బహురూప నిత్యత్వ భావన ఏర్పడుతుంది?
1) ఇంద్రియ చాలక దశ
2) పూర్వ ప్రచాలక దశ
3) మూర్త ప్రచాలక దశ
4) నియత ప్రచాలక దశ
Answers
1-2, 2-4, 3-3, 4-3, 5-2, 6-3, 7-1, 8-3, 9-4, 10-1, 11-2, 12-1, 13-3, 14-4, 15-4, 16-2, 17-4, 18-3, 19-1, 20-3.
బోధనోపకరణాలు-చరిత్ర-స్వభావాలు
- సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థుల సహకారంతో గ్రామంలో మొక్కలు నాటే కృత్యాన్ని నిర్వహించాడు. ఈ పనిని ఏ విధంగా పేర్కొనవచ్చు?
1) సమాజాన్ని పాఠశాల వద్దకు తీసుకొని రావడం
2) పాఠశాలను సమాజం వద్దకు తీసుకొని పోవడం
3) పై అధికారుల ఉత్తర్వులను అమలు చేయడం
4) ఇది ఉపాధ్యాయుని విధుల్లో ఒక భాగం - కింది వాటిలో గణిత పరికరాల పెట్టెకు చెందని పరికరం?
1) కోణమానిని
2) విభాగిని
3) వృత్తలేఖిని
4) టేపు - ఎడ్గార్ డేల్ అనుభవ శంఖువు ప్రకారం ‘నాటకీకరణ అనుభవాలు’ కంటే అధిక మూర్త అనుభవాన్ని కల్పించేవి?
1) క్షేత్ర పర్యటనలు 2) ప్రదర్శనలు
3) ప్రత్యక్ష ప్రాయోజిక అనుభవాలు
4) చలన చిత్రాలు - మొక్కల సహజ సిద్ధమైన వాతావరణాన్ని గురించి తెలుసుకోడానికి ఉపయోగించే ఫలవంతమైన ఉపకరణం?
1) అక్వేరియం 2) టెర్రేరియం
3) వైవేరియం 4) హెర్బేరియం - కోబిన్ ప్రకారం 3.5 శాతం అభ్యసన స్మృతి ఫలితాన్ని కలుగజేసే జ్ఞానేంద్రియం?
1) కన్ను 2) ముక్కు
3) చెవి 4) చర్మం - ఒక చార్టులోగల రెండు అర్థభాగాల్లో ఒకవైపు నరేంద్ర మోదీ చిత్రం, రెండోవైపు అతను సాధించిన విజయాలకు సంబంధించిన సమాచారం ఇచ్చారు. ఈ రకమైన విషయ వివరణ ఇచ్చే చార్ట్?
1) ఫ్లిప్ చార్ట్ 2) టేబుల్ చార్ట్
3) ప్రవాహ చార్ట్ 4) స్ట్రిప్‌టీజ్ చార్ట్ - కింది వాటిలో వైజ్ఞానిక వస్తు ప్రదర్శన శాలకు సంబంధించిన అంశం?
1) పఠన నైపుణ్యం పెంపొందిస్తూ విద్యార్థులను స్వతంత్ర పాఠకులుగా చేస్తుంది
2) స్వయంగా విద్యార్థులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తుంది
3) విజ్ఞాన శాస్త్ర విషయాల అభివృద్ధిని ప్రచారం చేస్తుంది- పాఠశాలలో ప్రయోగశాల లేని లోటును తీరుస్తుంది
- గణితంలో ఆరోహణ, అవరోహణ అంశాలను సులువుగా బోధించడానికి గణిత పేటిలో పొందుపరిచిన గణితోపకరణం?
1) ఘనాకార కడ్డీలు 2) నేపియర్ పట్టీలు
3) డామినో కార్డులు 4) భిన్నాల చట్రం - జతపర్చండి
- బార్గ్రాఫ్ ఎ. బడ్జెట్ వివరణ
- లైన్ గ్రాఫ్ బి. ఒక్కో చిత్రాన్ని
యూనిట్‌గా పరిగణించడం - పిక్టోరియల్ గ్రాఫ్
సి. అక్షరాస్యతలో హెచ్చుతగ్గులు - సర్కిల్ గ్రాఫ్
డి. ఉత్పత్తి, ధర, డిమాండ్-సప్లయ్
1) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
2) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
3) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
4) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
- నిగూఢమైన అంశాల్ని హాస్యచిత్రాలుగా మలిచి విద్యార్థిలో ఆనందదాయక అభ్యసన కలగజేయడంలో ప్రధాన పాత్ర వహించేవి?
1) చార్టులు
2) ఫ్లాష్కార్డులు
3) కార్టూన్లు
4) పటాలు - OBBకి సంబంధించి సరికానిది?
1) ముఖ్యమైన బోధనా సామగ్రిని పాఠశాలలకు అందించడం
2) భౌతిక వసతుల కల్పన
3) ఏకోపాధ్యాయ పాఠశాలల్లో రెండో ఉపాధ్యాయుడిని నియమింకపోవడం
4) విద్యాప్రమాణాలు మెరుగుపర్చడం - వ్యాయామ ఉపాధ్యాయుడు క్రికెట్ ఆట గురించి చెప్పినప్పుడు ముఖ్యంగా ఏ సబ్జెక్టు మధ్య సహసంబంధం ఏర్పడుతుంది?
1) గణితం-కళలు
2) గణితం-వ్యాయామ విద్య
3) గణితం-తత్వశాస్త్రం
4) గణితం-పరిసరాల విజ్ఞానం - రస్సెల్, వైట్‌హెడ్ ప్రకారం గణిత బోధనలు ఏర్పడటానికి మూలం?
1) వరుసక్రమం 2) తార్కిక నిర్మాణం
3) సహజజ్ఞానం 4) నిగమనం - భాస్కరాచార్యుని గణిత సేవలు గుర్తించండి?
ఎ. బీజగణితంలో ధన, రుణ సంఖ్యలను చర్చించాడు
బి. టాల్మీ సిద్ధాంతానికి ఉపపత్తినిచ్చాడు
సి. పైథాగరస్ సిద్ధాంతానికి ఉపపత్తినిచ్చాడు
డి. అంకశ్రేణిలో ‘n’ పదాల మొత్తానికి సూత్రాన్నిచ్చాడు
1) ఎ, సి 2) బి, డి
3) ఎ, డి 4) బి, సి - పరిసరాల విజ్ఞానం ముఖ్య ఉద్దేశం?
1) ప్రయోగాలు ఎక్కువగా చేయడం
2) బొమ్మలు గీసి, భాగాలు గుర్తించడం
3) ఎక్కువ మార్కులు స్కోర్ చేయడం
4) పరిసరాలపై శాస్త్రీయ అవగాహన - నీటిలోతు పెరిగే కొద్దీ పీడనం పెరగవచ్చు అనేది ఏ రకమైన ప్రకల్పన?
1) శూన్య పరికల్పన
2) ప్రకటనాత్మక పరికల్పన
3) ప్రశ్నా పరికల్పన
4) ప్రాగుక్తిక పరికల్పన - శాస్త్రజ్ఞులు అవలంబించే పద్ధతులు, ప్రక్రియలు, శాస్త్రీయ వైఖరుల సముదాయం?
1) సంశ్లేషణాత్మక నిర్మాణం
2) ద్రవ్యాత్మక నిర్మాణం
3) ప్రయోగాత్మక నిర్మాణం 4) ఏదీకాదు - రాజకీయ, సాంఘిక, ఆర్థిక, మత, విజ్ఞాన శాస్త్ర కళాసంస్కృతి రంగాల్లో మానవుడు సాధించిన విజయాలను, పరాజయాలను తెలిపేది?
1) భూగోళం 2) చరిత్ర
3) పౌరశాస్త్రం 4) అర్థశాస్త్రం - ఎవరి ప్రకారం సాంఘిక శాస్త్రం అంటే సమాజం అధ్యయనం. సంఘం రూపొందించిన విధం. సంఘంలో విద్యార్థుల బాధ్యతాయుత ప్రవర్తన తెలియజేయడం దేని లక్షణం?
1) ఈబీ వెస్లీ
2) ఐఎఫ్ ఫారెస్టర్
3) జేమ్స్ హెమ్మింగ్స్
4) జాన్ వీ మైకేల్స్ - శ్రీకృష్ణదేవరాయలు పాఠ్యాంశం బోధిస్తున్న ఉపాధ్యాయుడు కవి పండిత సభను, వారి విద్వత్తును గురించి వివరించడం, సాంఘిక శాస్త్రంలో ఏ సహసంబంధాన్ని సూచిస్తుంది?
1) అంతర్గత సహసంబంధం
2) బాహ్య సహసంబంధం
3) సబ్జెక్టు సహసంబంధం
4) సమైక్య సహసంబంధం
Answers
1-2, 2-4, 3-3, 4-3, 5-2, 6-1, 7-4, 8-1, 9-2, 10-3, 11-3, 12-2, 13-2, 14-1, 15-4, 16-4, 17-1, 18-2, 19-2, 20-2.
ఏఎన్ రావు
విషయ నిపుణులు, హైదరాబాద్
- Tags
- Education News
Previous article
‘చరాయ్ పన్నులు’ వేటిపై విధించేవారు?
Next article
‘నేటివిస్ట్ పర్స్పెక్టివ్’ను ప్రతిపాదించినవారు?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు