ఇంటర్‌తో నేవీలో కొలువులు 2500 ఖాళీలు
కేవలం ఇంటర్ అర్హతతో దేశసేవ చేసుకునే భాగ్యంతోపాటు భద్రమైన కొలువు. ఆకర్షణీయమైన జీతభత్యాలు, పదోన్నతులకు అవకాశం. 2500 కొలువుల భర్తీకి నావికాదళం ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో ఆ వివరాలు సంక్షిప్తంగా….
పోస్టు: సెయిలర్ (ఆర్టిఫిషియర్ అప్రెంటిస్ (ఏఏ), సీనియర్ సెకండరీ రిక్రూట్స్ (ఎస్ఎస్ఆర్) ఆగస్టు-2021 బ్యాచ్.
విభాగాల వారీగా ఖాళీలు: ఏఏ-500, ఎస్ఎస్ఆర్-2000
పేస్కేల్: రూ.21,700-69,100 వీటికి అదనంగా డీఏ, ఇతర అలవెన్స్‌లు ఇస్తారు.
అర్హతలు: ఏఏ పోస్టుకు కనీసం 60 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతోపాటు కెమిస్ట్రీ/బయాలజీ లేదా కంప్యూటర్ సైన్స్‌లలో ఏదో ఒక సబ్జెక్టుతో ఇంటర్ ఉత్తీర్ణత.
ఎస్ఎస్ఆర్ పోస్టులకు: మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతోపాటు కెమిస్ట్రీ/బయాలజీ లేదా కంప్యూటర్ సైన్స్‌లలో ఏదో ఒక సబ్జెక్టుతో ఇంటర్ ఉత్తీర్ణత.
వయస్సు: 2001, ఫిబ్రవరి 1 నుంచి 2004, జూలై 31 మధ్య జన్మించి ఉండాలి.
శారీరక ప్రమాణాలు: కనీసం 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గ ఛాతీ, బరువు ఉండాలి. గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ వ్యాకోచించాలి.
ఈ పోస్టులకు అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.
ఎంపిక విధానం
ఇంటర్/10+2లో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి 10,000 మందిని రాతపరీక్ష, పీఎఫ్టీలకు ఎంపిక చేస్తారు. ఆయా రాష్ర్టాలకు వేర్వేరు కటాఫ్ మార్కుల ప్రకారం ఈ షార్ట్‌లిస్టింగ్ ఉంటుంది.
రాతపరీక్ష: ప్రశ్నపత్రం ఇంగ్లిష్/హిందీలో ఉంటుంది. ఇంగ్లిష్, సైన్స్, మ్యాథ్స్, జనరల్ నాలెడ్జ్‌పై ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నలు ఇంటర్‌స్థాయిలో ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు.
పీఎఫ్‌టీ: ఫిజికల్ ఫిట్‌నెస్ట్ టెస్ట్. ఎంపికలో ఇది తప్పనిసరి పరీక్ష. దీనిలో 1.6 కి.మీ. దూరాన్ని ఏడు నిమిషాల్లో పరుగెత్తాలి. 20 ఉతక్బైఠక్లు, 10 పుష్ అప్స్ చేయాలి.
నోట్: ఏఏ, ఎస్ఎస్ఆర్ పోస్టులకు వేర్వేరుగా మెరిట్ జాబితాలను
తయారుచేస్తారు.
శిక్షణ: ఆగస్టు 2021 నుంచి కోర్సు ప్రారంభమవుతుంది. ఏఏ పోస్టుకు తొమ్మిది వారాలు, ఎస్ఎస్ఆర్ పోస్టులకు 22 వారాలు శిక్షణ ఇస్తారు.
విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న వారికి మొదటగా ఏఏ పోస్టులకు 15 ఏండ్లకు, ఎస్ఎస్ఆర్ పోస్టులకు 20 ఏండ్లకు పోస్టింగ్ ఇస్తారు.
శిక్షణ సమయంలో నెలకు రూ.14,600 ఇస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత లెవల్-3 పోస్టింగ్ ఇస్తారు.
పదోన్నతులు: మాస్టర్ చీఫ్ పెట్టీ ఆఫీసర్-1 వరకు పదోన్నతికి అవకాశం ఉంది. లెవల్-3 నుంచి లెవల్-8 వరకు పదోన్నతి వస్తుంది.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఏప్రిల్ 30
వెబ్సైట్: www.joinindiannavy.gov.in
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు