విశ్లేషణాత్మక ప్రిపరేషన్‌తో విజయం
టీఎస్ ఎడ్‌సెట్-2021ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలంటే బీఈడీ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈసారి నూతన విద్యావిధానానికి అనుగుణంగా టీఎస్ ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్షలో మార్పులు చేశారు. అన్ని సబ్జెక్టులవారికి ఒకే ప్రశ్నపత్రాన్ని రూపొందించారు. ఇందుకు అభ్యర్థులు పదోతరగతి వరకు అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించి ఉండాల్సిందే. సాంకేతికతకు ప్రాధాన్యం కల్పించేలా కంప్యూటర్ అంశాలపై ప్రశ్నలు ఉన్నాయి. బీబీఏ చదివినవారికి ఈసారి అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో టీఎస్ ఎడ్‌సెట్ గురించి ‘నిపుణ’ పాఠకుల కోసం..
రెండేండ్ల బీఎడ్ కోర్సులో ప్రవేశించాలనే వారు కచ్చితంగా ‘టీఎస్ ఎడ్‌సెట్’ అర్హత సాధించాల్సిందే. అండర్‌గ్రాడ్యుయేషన్ (డిగ్రీ) కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించినవారు దీన్ని రాయడానికి అర్హులు. నూతన విద్యావిధానానికి అనుగుణంగా ప్రవేశ పరీక్షలో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) సూచనలమేరకు మార్పులు చేశారు. 2021-22కు గాను నిర్వహించే పరీక్షలో అన్ని మెథడాలజీలకు ఒకే ప్రశ్నపత్రాన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి శ్రీకారం చుట్టింది. ఆ దిశగా ‘టీఎస్ ఎడ్‌సెట్-2021’ నోటిఫికేషన్ (బీఈడీ రెండేండ్ల కోర్సులో చేరడానికి) కూడా విడుదల చేసింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో కామన్ పేపర్‌తో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. గతంలో మాదిరిగా డిగ్రీ స్థాయిలో సిలబస్ చదవాల్సిన అవసరం లేకుండా అభ్యర్థులు పదోతరగతి వరకు అన్ని సబ్జెక్టులను చదివి పట్టుసాధిస్తేనే టీఎస్ ఎడ్‌సెట్‌లో సత్తాచాటే అవకాశం ఉంది. దీనికితోడు మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక అంశాలకు ప్రాధాన్యం కల్పించేలా కంప్యూటర్ అంశాలను కూడా పరీక్ష సిలబస్‌లో చేర్చారు. అందుకే విశ్లేషణాత్మకంగా ఆయా అంశాలను ప్రణాళికాయుతంగా విద్యార్థులు చదవాలి. మరోవైపు ఈ పర్యాయం బీబీఏ చదివిన విద్యార్థులకు కూడా బీఎడ్ చేసే అవకాశం కల్పించారు.
ఎవరు అర్హులు?
బ్యాచిలర్ డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్సీ (హోంసైన్స్), బీసీఏ, బీబీఎం, బీఏ (ఓరియంటల్ లాంగ్వేజ్), బీబీఏ కోర్సు చదివిన వారు అర్హులు. అదేవిధంగా ఆయా కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర రిజర్వేషన్లు కలిగిన అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు సాధించి ఉండాలి.
బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీ చదివిన అభ్యర్థులు బీఎడ్‌లో చేరాలంటే గతంలో బీఈ/బీటెక్‌లో కనీస మార్కుల శాతం 55 శాతం ఉండగా దానిని 2021-22 విద్యా సంవత్సరానికి 50శాతం మార్కులకు తగ్గించారు. అంటే వారి ఉత్తీర్ణత శాతం 50 ఉంటే సరిపోతుంది.
జీవో ఎంఎస్ నెం:13 తేదీ:25.5.2017 ప్రకారం ఎంబీబీఎస్, బీఎస్సీ(అగ్రి), బీవీఎస్సీ, బీహెచ్‌ఎంటీ, బీఫార్మసీ, ఎల్ఎల్బీ వంటి కోర్సులు చదివిన వారు ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశానికి టీఎస్ ఎడ్‌సెట్ రాయడానికి, బీఎడ్ విద్యనభ్యసించడానికి అనర్హులుగా ప్రకటించారు.
రాతపరీక్ష విధానం ఇలా..
టీఎస్ ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. పూర్తిగా సీబీటీ (Computer Based Test) విధానంలో ఉంటుంది. దీనిలో సబ్జెక్టులకు వెయిటేజీ కల్పిస్తూ ప్రశ్నపత్రం ఉంటుంది. గతంలో డిగ్రీ స్థాయి వరకు సిలబస్ ఉండేది. దాన్ని మార్పులు చేస్తూ ఈ పర్యాయం పదోతరగతి వరకు అన్ని సబ్జెక్టులపై ప్రశ్నలు ఇస్తున్నారు. అదే విధంగా కంప్యూటర్‌పై కూడా ప్రశ్నలుంటాయి. అందుకే అభ్యర్థులకు సాంకేతిక, కంప్యూటర్ పరిజ్ఞానం తప్పని సరి అవసరం. రాత పరీక్ష ప్రశ్నపత్రం ఇంగ్లిష్ , తెలుగు అండ్ ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలో ఉంటుంది.
సిలబస్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను పదోతరగతి వరకు ఉన్న అన్ని సబ్జెక్టులను చదవాలి.
గణితం: Number System (సంఖ్యావ్యవస్థ), Commercial Mathematics (వాణిజ్య గణితం), Algebra (బీజగణితం), Geometry (జ్యామితి), Mensuration (కొలత), Trigonometry (త్రికోణమితి), Data Handling (డేటా నిర్వహణ).
ఫిజికల్ అండ్ బయోలాజికల్ సైన్స్: Food (ఆహారం), Living Organisms (జీవులు), Life Processes (జీవిత ప్రక్రియలు), Biodiversity (జీవవైవిధ్యం), Pollution (కాలుష్యం), Material (పదార్థం), Light (కాంతి), Electricity &Magnetism (విద్యుత్ అండ్ అయస్కాంతత్వం), Heat (వేడి), Sound (ధ్వని), Motion (కదలిక), Changes (మార్పులు), Weather & Climate (వాతావరణం), Coal & Petrol (బొగ్గు, పెట్రోల్), Some NaturalPhenomena (కొన్ని సహజమైనవి దృగ్విషయం), Stars & Solar System (నక్షత్రాలు, సౌరవ్యవస్థ), Metallurgy (లోహశాస్త్రం), Chemical Reactions (రసాయన ప్రతిచర్యలు).
సాంఘిక శాస్త్రం: Geography (భౌగోళికం), History (చరిత్ర), Political Science (రాజనీతిశాస్త్రం), Economics (అర్థశాస్త్రం).
టీచింగ్ ఆప్టిట్యూడ్: Aptitude questions will be related to understanding teaching-learning process, classroom management and mentoring with special reference to teacher-pupil relationship (ఆప్టిట్యూడ్ ప్రశ్నలు బోధన అభ్యసన ప్రక్రియ, తరగతి గదిని అర్థం చేసుకోవడానికి సంబంధించినవి ఉంటాయి. ఉపాధ్యాయ-విద్యార్థి సంబంధానికి ప్రత్యేక సూచనతో నిర్వహణ, మార్గదర్శకత్వం).
జనరల్ ఇంగ్లిష్: Reading comprehension, spelling errors, vocabulary, phrase replacement, error detection and word
association. (పఠన కాంప్రహెన్షన్స్, స్పెల్లింగ్ లోపాలు, పదజాలం, పదబంధాల పునఃస్థాపన, లోపం గుర్తించడం, పదం అసోసియేషన్)
జనరల్ నాల్జెడ్, ఎడ్యుకేషనల్ ఇష్యూస్: Current affairs (India and International), Contemporary Educational Issues. (ప్రస్తుత వ్యవహారాలు భారతదేశం, అంతర్జాతీయ, సమకాలీన విద్యాసమస్యలు)
కంప్యూటర్ అవేర్నెస్: Computer – Internet, Memory, Networking and Fundamentals. (కంప్యూటర్, ఇంటర్నెట్, మెమరీ, నెట్వర్కింగ్, ఫండమెంటల్స్)
మెథడ్స్‌లో చేరడానికి అర్హతలు ఇవే..
గణితం: బీఏ/బీఎస్సీ గణితం, బీఈ/బీటెక్ విత్ గణితం అదే విధంగా ఇంటర్మీడియట్ స్థాయిలో గణితం సబ్జెక్టు చదివి బీసీఏ పూర్తి చేసిన అభ్యర్థులు.
ఫిజికల్ సైన్స్: బీఎస్సీలో ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ చదివిన వారు, బీఈ/బీటెక్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివిన వారు, ఇంటర్మీడియట్ స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివి బీసీఏ పూర్తి చేసినవారు.
బయోసైన్స్:బీఎస్సీ/బీఎస్సీ (హోంసైన్స్)లో బోటనీ, జువాలజీ చదివి ఉండాలి. ఇంటర్మీడియట్ స్థాయిలో బయోలాజికల్ సైన్స్ గ్రూప్ సబ్జెక్టు చదివి బీసీఏ పూర్తి చేసిన అభ్యర్థులు.
సోషల్ స్టడీస్: బీఏ సోషల్ సబ్జెక్ట్స్, బీకాం, బీబీఎం, బీబీఏ, ఇంటర్మీడియట్ స్థాయిలో సోషల్ సబ్జెక్టు చదివి బీసీఏ పూర్తి చేసినవారు.
ఇంగ్లిష్: బీఏ స్పెషల్ ఇంగ్లిష్/ ఇంగ్లిష్ లిటరేచర్/ఎంఏ ఇంగ్లిష్
ఓరియంటల్ లాంగ్వేజీ- వారు చదివిన సబ్జెక్టుల ఆధారంగా బీఎడ్‌లో మెథడాలజీ తీసుకోవాల్సి ఉంటుంది.
మంచి స్కోర్ సాధిద్దామిలా!
ఎడ్‌సెట్‌లో ఉత్తీర్ణత సాధించాలంటే కచ్చితంగా పాఠశాల స్థాయిలోని పదోతరగతి వరకు అన్ని సబ్జెక్టులను చదవాలి. Telangana State curriculum ప్రాథమిక స్థాయి పాఠ్యపుస్తకాల నుంచి పదోతరగతి పుస్తకాలను విశ్లేషణాత్మకంగా చదువుతూ ప్రిపరేషన్ సాగిస్తే ఎంట్రన్స్‌లో ఉత్తమ మార్కులు (ర్యాంక్స్) సాధించడానికి అవకాశం ఉంది.
తెలంగాణ ప్రభుత్వం ప్రచురించిన పాఠ్యపుస్తకాలకే ప్రాధాన్యం ఇచ్చి చదివితే మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది.
ప్రవేశ పరీక్షకు నాలుగు నెలల గడువు ఉంది. కాబట్టి ప్రణాళికాయుతంగా చదువుకోవడం ఉత్తమం.
ప్రాథమిక స్థాయి నుంచి పదోతరగతి వరకు ఉన్న పాఠ్యపుస్తకాలను సేకరించి వివరణాత్మకంగా చదువుతూ సొంత నోట్స్ తయారుచేసుకోవాలి.
ఈ నోట్స్ పరీక్ష సమయం ముందు రోజు చూసుకోవడానికి, చదివిన అంశాలను సులభంగా పునఃశ్చరణ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
అదే విధంగా ఇదే సిలబస్ ప్రభుత్వం నిర్వహించే ‘టెట్’, టీఆర్టీ (టీచర్ రిక్రూట్మెంట్ టెస్టు)కి కూడా ఉపయోగపడుతుంది. సొంత నోట్స్ తయారు చేసుకొని చదవడానికి తొలి ప్రాధాన్యం ఇస్తే చాలా ఉత్తమం.
ఉదాహరణకు గణితం సబ్జెక్టు చదువుతున్నారనుకుంటే సంఖ్యావ్యవస్థ చదివితే దానికి సంబంధించిన అంశాలు పదో తరగతి వరకు విశ్లేషణాత్మకంగా చదివితే సులభంగా సబ్జెక్టు అర్థమవుతుంది. బట్టీ విధానంలో చదవకూడదు. జీకే కోసం ప్రతిరోజు న్యూస్ పేపర్స్‌ను చదవాలి. అవసరమైతే వాటికి సంబంధించిన పేపర్ కటింగ్స్ దగ్గర ఉంచుకుని వాటిని నోట్స్‌గా తయారు చేసుకోవాలి.
ముఖ్యతేదీలు
ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమయ్యింది.
దరఖాస్తులకు చివరితేదీ: 15.06.2021 (ఎలాంటి అపరాధ రుసుం లేకుండా),
రూ.250 ఫైన్‌తో 25.06.2021
రూ.500 ఫైన్‌తో 05.07.2021
రూ.1000 ఫైన్‌తో 20.07.2021
హాల్‌టికెట్స్ డౌన్లోడ్ వెబ్సైట్ https://edcet.tsche.ac.in 10.08.2021
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్: 24.08.2021 (మంగళవారం), 25.08.2021 (బుధవారం)
పరీక్ష సమయం
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు
మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకు
ప్రాథమిక ‘కీ’ విడుదల: 31.08.2021
‘కీ’ లోఅభ్యంతరాల స్వీకరణ: 03.09.2021
ఫలితాల విడుదల: 12.09.2021
దరఖాస్తు చేయండి ఇలా…
ఆన్లైన్లో దరఖాస్తులు చేయాలి. https://edcet.tsche.ac.inలో లాగిన్కావాలి. దరఖాస్తుకు సంబంధించి ఫీజు టీఎస్, ఏపీ ఆన్లైన్ సెంటర్స్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. దరఖాస్తు చేసే సమయంలో కింది సర్టిఫికెట్స్, సమాచారం సిద్ధంగా ఉంచుకోవాలి.
ఉత్తీర్ణత సాధించిన కోర్సు హాల్‌టికెట్ నెంబర్, సర్టిఫికెట్
పుట్టిన తేదీ
కులధృవీకరణ పత్రం (ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు)
పీహెచ్, ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మొదలైనవి
ఆధాయ ధృవీకరణ పత్రం
స్టడీసర్టిఫికెట్స్ లేదా నివాసధృవపత్రం లేదా సమానమైన సర్టిఫికెట్
ఆధార్‌కార్డు
బ్యాంకు అకౌంట్ వివరాలు
పరీక్ష ఫీజు: రూ.650,
ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌లకు రూ.450
బొడ్డుపల్లి రామకృష్ణ,
M.Sc(Bot), MCJ, M.A(Tel), M.Ed, M.Phil.
సీనియర్ అధ్యాపకులు బీఈడీ
నల్లగొండ.
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు