ఎన్హెచ్ఐడీసీఎల్లో మేనేజర్ పోస్టులు


న్యూఢిల్లీ: భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఐడీసీఎల్)లో ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 61 పోస్టులను భర్తీచేయనుంది. అయితే అవసరాన్నిబట్టి పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా ఈశాన్య భారతదేశంలో, పొరుగు దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులు పంచుకునే ప్రాంతాల్లో జాతీయ రహదారులను నిర్మించడంలో భాగంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. ఎంపికైన అభ్యర్థులు లఢక్, ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులు, జమ్ముకశ్మీర్‌లోని ఎన్హెచ్ఐడీసీఎల్ ప్రాంతీయ కార్యాల్లో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 61
ఇందులో జనరల్ మేనేజర్ (పోస్టుల సంఖ్య పేర్కొనలేదు), డిప్యూటీ జనరల్ మేనేజర్ 25, మేనేజర్ 26, అసిస్టెంట్ మేనేజర్ 2, జూనియర్ మేనేజర్ 8 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ కానీ బీటెక్, బీఈ చేసి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 31
వెబ్సైట్: www.nhidcl.com
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
బీసీ వెల్ఫేర్ గురుకుల కాలేజీల్లో ఇంటర్, డిగ్రీ ప్రవేశాలు
ఆశకు పోయారు.. కటకటాలపాలయ్యారు
అక్కడ కూడా 18 ఏండ్లకు పైబడిన అందరికీ ఉచిత టీకాలు..!
రామయ్య నీ దర్శన భాగ్యం ఎప్పుడయ్యా ?
బాలీవుడ్ వీడియో పోస్ట్ చేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్.. ఆడుకున్న నెటిజన్లు
కరోనా కట్టడిలో కేంద్రం విఫలం : ప్రియాంక గాంధీ
కరోనా మరణాలను దాస్తున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం?
ఛీ కొట్టిన ఫ్యాన్స్.. ఈఎస్ఎల్ నుంచి తప్పుకున్న ఆరు ఇంగ్లిష్ క్లబ్‌లు
కరోనాతో హాస్పిటల్లో చేరిన ధోనీ తల్లిదండ్రులు
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు