కరోనా ఎఫెక్ట్.. నిలిచిన కేంద్రీయ విద్యాలయాల అడ్మిషన్ ప్రక్రియ
న్యూఢిల్లీ: కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించిన మొదటి జాబితా విడుదల వాయిదాపడింది. షెడ్యూల్ ప్రకారం ఫస్ట్ లిస్ట్‌ను ఈనెల 23న విడుదల చేయాల్సి ఉంది. అయితే దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో కేసుల్లో ఒక్కసారిగా పెరుగుదల నమోదవుతున్నది. దీంతో జాబితా విడుదలను వాయిదావేసినట్లు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) ప్రకటించింది. జాబితాను ఎప్పుడు ప్రకటిస్తామనే విషయాన్ని అధికారిక వెబ్సైట్ kvsonlineadmission.kvs.gov.in.లో ప్రకటిస్తామని తెలిపింది. వచ్చే విద్యాసంవత్సరానికి సంబధించి ఒకటో తరగతి ప్రశాల దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 19న ముగిసిన విషయం తెలిసిందే. మొదటి జాబితాను శుక్రవారం విడుదల చేసిన తర్వాత.. ఏప్రిల్ 30న రెండు, మూడోజాబితాను విడుదల చేస్తామని, అప్పటికీ సీట్లు మిగిలినట్లయితే మే 5న అడ్మిషన్ ప్రక్రియను చేపడతామని ఇప్పటికే ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ప్రసంగాలు కాదు.. పరిష్కారం కావాలి
హాస్పిటల్ నుంచి 1,710 కొవిడ్ వ్యాక్సిన్లు మాయం
కొవిషీల్డ్ ధరల్లో తేడాలెందుకు? అందరికీ వ్యాక్సినేషన్ అక్కర్లేదా?!
ఫాబిఫ్లూ ఫ్రీగా ఇస్తానన్న గంభీర్.. ఎక్కడి నుంచి వచ్చాయన్న కాంగ్రెస్, ఆప్
భాగ్ కరోనా భాగ్.. కాగడాలతో వైరస్‌ను తరిమారు.. వీడియో
నకిలీ టీకాలు.. ఒక డోసు వెయ్యి డాలర్లు
18 ఏళ్లు నిండిన వారికి ఈ నెల 24 నుంచే వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్
IPL 2021: మళ్లీ ఓడిన నైట్‌రైడర్స్.. షారుక్ ఏమన్నాడో తెలుసా?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు