రాజ్యాంగంపై జాతీయ కమిషన్
భారత ప్రభుత్వ తీర్మానం ద్వారా 2000లో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య అధ్యక్షతన 11మంది సభ్యులతో కూడిన రాజ్యాంగ పనితీరు సమీక్ష కమిషన్‌ను ఏర్పాటుచేశారు. ఈ కమిషన్ తన నివేదికను 2002లో సమర్పించింది.
కమిషన్ విచారణాంశాల పరిధి
-కమిషన్ నియమ నిబంధనల అనుసారం గడిచిన 50 ఏండ్ల అమలులో ఉన్న రాజ్యాంగం అనుభవం దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగ పనితీరును సమీక్షించాలి. రాజ్యాంగం తనకు నిర్దేశించిన ఆశయాలు, ప్రజల ప్రయోజనాలను సమర్థవంతంగా, సున్నితంగా, ప్రభావవంత పరిపాలనతో సాంఘిక, ఆర్థికాభివృద్ధికి నవభారతంలో ఎంత మేరకు సఫలీకృతమైందో సమీక్షించాలి. ఏదైనా రాజ్యాంగ మార్పులకు సంబంధించిన సూచనలు చేయాలి. కమిషన్ నియమ నిబంధనల అనుసారం రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం వాటిల్లకుండా పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి లోబడి అవసరమైన రాజ్యాంగ మార్పులకు సంబంధించిన సూచనలు కమిషన్ చేయాలి. కమిషన్ నియమాలు చాలా స్పష్టంగా, కమిషన్ విధిని రాజ్యాంగ పనితీరును సమీక్షించడం మేరకే పరిమితం అని, కాని తిరిగి రాజ్యాంగాన్ని రాయడానికి కాదని నిర్దేశించింది. కమిషన్ సూచనలు సలహా పూర్వకమైనవి మాత్రమే. ఏవైనా సూచనలను స్వీకరించడం లేదా తిరస్కరించడం పార్లమెంట్ నిర్ణయిస్తుంది. కమిషన్‌కు ఎటువంటి ఎజెండా లేదు. కానీ కమిషన్
పదకొండు విషయాలను తన అభ్యాసన పరిధిగా గుర్తించి సమీక్షించాలని కోరింది. అవి..
-పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతపర్చడం (శాసన, కార్యనిర్వహణ, న్యాయవ్యవస్థ పనితీరు, వాటి జవాబుదారీతనం, పాలనాపరమైన సమస్యలు, రాజకీయ అస్థిరతవల్ల కలిగే ఆర్థిక, సామాజిక నష్టాలు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి లోబడి సుస్థిరతను నెలకొల్పడానికి మార్గ అన్వేషణ)
-ఎన్నికల సంస్కరణలు, రాజకీయ ప్రమాణాలు
-రాజ్యాంగం ఆర్థిక, సామాజిక మార్పును, అభివృద్ధిని ఎంత మేరకు సాధించింది (సాంఘిక, ఆర్థిక హక్కులపై భరోసా, ఎంత మేరకు? ఎంత త్వరితగతిన? ఎంత సమతుల్యంగా?)
-అక్షరాస్యతను పెంపొందించడం, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడం, సాంఘిక భద్రతను కల్పించడం,
పేదరిక నిర్మూలన
-కేంద్ర, రాష్ట్ర సంబంధాలు
-అధికార వికేంద్రీకరణ, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం
-ప్రాథమిక హక్కులను విస్తృతపర్చడం
-ప్రాథమిక విధుల ప్రభావం
-ఆదేశిక సూత్రాల ప్రభావం, రాజ్యాంగ ప్రవేశిక ఆశయాల సాధన
-విత్త ద్రవ్య విధానాల చట్టబద్ధ నియంత్రణ, పబ్లిక్ ఆడిట్ విధానం
-పాలనా వ్యవస్థ, ప్రజాజీవన ప్రమాణాలు
యాభై సంవత్సరాల రాజ్యాంగ పనితీరు
-1950 నుంచి 2000 సంవత్సరం వరకు రాజ్యాంగం పనితీరును కమిషన్ పరిశీలించింది. స్వాతంత్య్రానంతరం 50 ఏండ్ల రాజ్యాంగం సాధించిన ఘనతలు, వైఫల్యాలు? రాజ్యాంగం ఆశించిన సామాజిక విప్లవ సాధనకు రాజ్యం మూడు ప్రధానాంగాలు శాసన, కార్యనిర్వహణ, న్యాయశాఖ ఏవిధంగా స్వీకరించాయి. రాజ్యాంగ నిర్మాతలు కలలుగన్న సాంఘిక, ఆర్థిక పరివర్తన ద్వారా మిలియన్ల పౌరుల ఆత్మగౌరవాన్ని ఎంతమేరకు నెలకొల్పగలిగారు? అప్పుడు సంతులనం ఎంత?
రాజకీయంగా సాధించిన విజయాలు
-అమలులో ఉన్న సమాఖ్య రాజనీతి భారతదేశ ప్రజాస్వామ్య పునాదులను సుస్థిరపర్చాయి. 73వ, 74వ రాజ్యాంగ సవరణలు ప్రజాస్వామ్య పునాదుల చర్చ పరిధిని విస్తృతపర్చాయి. అధికార కేంద్రీకరణకు పెద్దస్థాయిలో వ్యతిరేకత నెలకొంది. నిరవధిక సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తుంది. నియమానుసారంగా శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల ఫలితాలకనుగుణంగా అధికార పంపిణీ జరుగుతుంది.
-పార్లమెంట్, శాసనసభ్యుల విద్యార్హతలు బృహత్తరమైన అభివృద్ధిని సూచిస్తున్నాయి. పెరుగుతున్న సమాజంలోని అన్ని వర్గాల అభ్యర్థిత్వాన్ని పార్లమెంటు, శాసనసభల కూర్పు తెలియజేస్తుంది. వెనుకబడిన తరగతుల సభ్యులు రాజకీయంగా ఎదుగుతున్నారు.
ఆర్థిక అవస్థాపన సౌకర్యాలు-ఆకట్టుకునే ప్రదర్శన
-ఉత్పత్తిలో గుర్తించదగ్గ అభివృద్ధి, విభిన్నత ఆధునిక నిర్వహణ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం వైజ్ఞానిక వైద్య, ఇంజినీరింగ్, సమాచార సాంకేతిక రంగాల్లో గుర్తించదగ్గ అభివృద్ధిని సాధించాయి.
-1950-2000 సంవత్సరాల్లో వ్యవసాయ ఉత్పత్తివృద్ధి సూచీ 46.2 నుంచి 176.8 వరకు సాధించింది.
-1960-2000 మధ్యకాలంలో గోధుమ ఉత్పత్తి 11 మిలియన్ టన్నుల నుంచి 75.6 మిలియన్ టన్నులకు
పెరిగింది.
-1960-2000 మధ్యకాలంలో వరి ఉత్పత్తి 35 మిలియన్ టన్నుల నుంచి 89.5 మిలియన్ టన్నులకు పెరిగింది.
-పారిశ్రామిక, సేవా రంగాల్లో ఆకట్టుకునే వృద్ధిని ప్రదర్శించింది.
-పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 1950-51లో 7.9 నుంచి 1999-2000లో 154.7కు పెరిగింది.
-1950-51లో 5.1 బిలియన్ కేడబ్ల్యూహెచ్ నుంచి 1999-2000 480.7 బిలియన్ కేడబ్ల్యూహెచ్ విద్యుత్ ఉత్పత్తి పెరిగింది.
-1994-2000 (1997-98 మినహా) స్థూల జాతీయ ఉత్పత్తి (జీఎన్‌పీ)లో సంవత్సరిక వృద్ధి 6 శాతం నుంచి 8 శాతానికి సాధించింది.
-సమాచార సాంకేతిక పరిశ్రమ 1990లో రూ. 150 మిలియన్ల నుంచి 1999లో రూ. 4 బిలియన్ల ఆదాయాన్ని సమకూర్చింది.
-1951 సంవత్సరానికి తలసరి జాతీయోత్పత్తికి 2.75 గణాంకాలు 1999-2000 సంవత్సరంలో నమోదు చేసింది.
సామాజిక అవస్థాపన సౌకర్యాలు-సాధించిన విజయాలు
-1950-1998 మధ్యకాలంలో శిశు మరణాల రేటు సగానికి సగం తగ్గింది. శిశు మరణాల రేటు ప్రతి వెయ్యికి 146 నుంచి 72కి తగ్గించబడింది.
-1950-51లో 32 ఏండ్ల ఆయుర్ధాయం నుంచి 2000 సంవత్సరానికి 63 ఏండ్ల ఆయుర్ధాయానికి పెరిగింది.
-వాషింగ్టన్లో పుట్టిన శిశువు కంటే కేరళలో పుట్టిన శిశువు అధిక ఆయుర్ధాయాన్ని కలిగి ఉంటాడు.
-కేరళ మహిళ ఆయుర్ధాయం 75 సంవత్సరాలు
-భారతదేశం ప్రజా ఆరోగ్య సేవలను, వైద్య సదుపాయ శాఖలను విస్తృత వ్యవస్థగా నెలకొల్పింది. 1951లో కేవలం 721 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా 1995 నాటికి 1.56 లక్షలకు పెరిగాయి.
-1951, 1995 కాలంలో పరిగణించదగ్గ స్థాయిలో 2.10 లక్షల ప్రాథమిక పాఠశాలల నుంచి 5.90 లక్షల వరకు పెరిగాయి.
-దాదాపుగా 95 శాతం గ్రామాలకు 1 కి.మీ పరిధిలో ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి.
ప్రతిభకు పరీక్ష
1. ఇటీవల టీ-వ్యాలెట్‌ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం?
1) తమిళనాడు 2) తెలంగాణ
3) పశ్చిమబెంగాల్ 4) మహారాష్ట్ర
2. ఆసియా ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీటీఎఫ్) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా ఎవరు ఎన్నికయ్యారు?
1) ధన్‌రాజ్ చౌదరీ 2) ముఖేశ్ శర్మ
3) అనిల్ యాదవ్ 4) కమల్ సింగ్
3. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నేషనల్ ఎయిరోనాటిక్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) 2018లో ఏ అంశంపై పరిశోధనలు ప్రారంభించనుంది?
1) సర్వేయర్ ప్రోగ్రామ్
2) మెరైనర్ ప్రోగ్రామ్
3) ల్యాండ్‌శాట్ ప్రోగ్రామ్
4) పార్కర్ సోలార్ ప్రోబ్
4. ప్రపంచ పాల దినోత్సవం ఎప్పుడు?
1) మే 25 2) జూలై 5
3) జూన్ 1 4) ఆగస్ట్ 9
5. సోలార్ రూఫ్‌టాప్ ప్రాజెక్టు కోసం ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) 100 మిలియన్ డాలర్లు రుణంగా ఇవ్వడానికి ఏ బ్యాంకుతో ఒప్పందం చేసుకుంది?
1) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2) పంజాబ్ నేషనల్ బ్యాంకు
3) బ్యాంక్ ఆఫ్ బరోడా
4) సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
6. మాజీ కాగ్ వినోద్‌రాయ్ నేతృత్వంలో సుప్రీంకోర్టు నియమించిన బీసీసీఐ పరిపాలకమండలి సభ్యత్వానికి రాజీనామా చేసినవారు?
1) రాజీవ్ శుక్లా 2) అమితాబ్ చౌదరీ
3) వినోద్ రాయ్ 4) రామచంద్ర గుహ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు