జాతీయ- అంతర్జాతీయ వైద్య విద్యా విధానాలు
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత వైద్యవిద్య అనేక మార్పులతో నవ విధానాలకు అనుగుణంగా మారుతోంది. అయితే మన దేశంలో మాత్రం ఎలాంటి కొత్త విధానాలు అమలుకావడం లేదు. చారిత్రకంగా చూసినట్లయితే మన వైద్య విద్యా విధానం బ్రిటీష్ సంప్రదాయ పాఠ్యప్రణాళిక నుంచి ఉద్భవించింది. బ్రిటీష్ పాలన నుంచి మనం అనేక వైద్య విధానాలను నేర్చుకున్నాం. అయితే ఈ మధ్యకాలంలో సంప్రదాయ పాఠ్యప్రణాళికలో అనేక నిర్మాణాత్మక మార్పులు జరుగుతున్నాయి. అయితే ఈ మార్పులు అత్యంత వేగంగా పలు దేశాల్లో జరుగుతున్నప్పటికీ మన వైద్య విద్యా విధానంలో పెద్దగా మార్పులు కనబడటంలేదు. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ వైద్య విద్యలో ముఖ్యంగా నాలుగు విధానాలు అమల్లో ఉన్నాయి. అవి
1. సాంప్రదాయ పాఠ్యప్రణాళిక
2. సమీకృత పాఠ్యప్రణాళిక
3. సమస్య ఆధారంగా నేర్చుకోవడం
4. Blended Learning
సంప్రదాయ పాఠ్య ప్రణాళిక
-ఈ విధానం మన దేశంలో అమలు జరుగుతోంది. ఇందులో ముఖ్యంగా బ్రిటీష్ వ్యవస్థ విద్యా విధానాలు మనకు గోచరిస్తాయి. ఆ పద్ధతిలో నాలుగున్నర సంవత్సరాల బోధన బేసిక్ సైన్స్, క్లినికల్ సైన్స్‌గా విభజించి చేస్తారు. బేసిక్ సైన్స్‌లో అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, పాతాలజీ, మైక్రోబయాలజీ తదితర విభాగాలతో కూడిన విద్యాబోధన జరుగుతుంది.
ఇవన్నీ పూర్తయిన తర్వాత క్లినికల్ విభాగాలు అయిన మెడిసిన్, సర్జరీ తదితర సంబంధిత సబ్జెక్టులో బోధిస్తారు. అయితే ఈ విధానంలో సబ్జెక్టులు విడివిడిగా ఒకదాని తర్వాత ఒకటి చదవడం జరుగుతుంది. ఈ బోధనా పద్ధతిలో ఒక సబ్జెక్టుకు మరో సబ్జెక్టుకు అనుసంధానం లేకుండా విడివిడిగా సాగుతాయి. ఈ విధానం మీద పలు పరిశోధనలు జరిగాయి. పరిశోధన ఫలితాలు, ఈ విధానంలో మార్పులు రావాలని సూచించడం ప్రపంచవ్యాప్తంగా ఈ విధానం వల్ల పెద్దగా విషయ విశ్లేషణ సామర్థ్యాలు పెరగడంలేదని గమనించడంతో పలు అభివృద్ధి చెందుతున్న, చెందిన దేశాలు ఈ బోధనా పద్ధతిని మార్చుకుంటున్నాయి. ఈ విధానం భారతదేశ ఉపఖండంలో, SARCC దేశాలతోపాటు ఆఫ్రికా ఖండ దేశాల్లో ఇంకా అమల్లో ఉంది.
సమీకృత పాఠ్యప్రణాళిక
-ఈ విధానం అమెరికా, ఐరోపా, మిడిల్ ఈస్ట్‌లో చాలా విస్తృతంగా అమల్లో ఉంది. ఈ విధానంలో ట్రెడిషనల్ పద్ధతిలో లాగా కాకుండా అన్ని సబ్జెక్టులు సమాంతరంగా సిస్టమ్ వైజ్ బోధిస్తారు. ఈ విధానంలో పలు పరిశోధనలు జరగడం, పరిశోధనల ఫలితాలు విద్యార్థుల ప్రతిభను పెంచేలా ఉండటం, వైద్య ప్రక్రియ మెరుగుపడటం చూపించాయి. అన్ని సెబ్జెక్టులు సమాంతరంగా బోధించడం వల్ల విషయ పరిజ్ఞానం, విద్యార్థుల మొదడులో సులువుగా చేరుకోవడం ముఖ్య విషయం అని పలు పరిశోధనల్లో తేలింది. అయితే ఈ విధానంలో విద్యార్థుల మీద మానసిక భారం కూడా తక్కువగా ఉంటుంది అని తేలడం వల్ల పలు దేశాలు ఆయా వైద్య విద్యాలయాల్లో ఈ వ్యవస్థను ఇప్పటికే అమలు చేయడం జరుగుతోంది. (ఈ పద్ధతికి సంబంధించి ఫిగర్-1లో మీరు ట్రిడిషనల్కు ఇంటిగ్రెటెడ్కు మధ్య తేడాలను గమనించవచ్చు.
సమస్య ఆధారిత విధానం
-ఈ విధానం అమెరికా, ఐరోపా, పలు ఇతర అభివృద్ధి చెందుతున్న, చెందిన దేశాల్లో అమలు జరగుతోంది. ఈ విధానంలో విద్యార్థులకు మొదటి సంవత్సరం నుంచే వ్యాధులపైన సమస్యలు ఇవ్వడం. అయితే ఈ సమస్యలను తరగతుల్లో బోధించడం లాగా కాకుండా చిన్న చిన్న గ్రూపులుగా విభజించి గ్రూపునకు ఒక టీచర్‌ను నియమించి విద్యార్థులు కేంద్రంగా చర్చ జరుగుతుంది. ఈ చర్చల్లో విద్యార్థులు ఎక్కువగా పాల్గొనడం వల్ల విషయాన్ని చాలా లోతుగా అర్థం చేసుకోవడం, వ్యాధి సమస్యల మీద వారే విషయాన్ని సొంతంగా సేకరించడం (సెల్ఫ్ డైరెక్ట్ ఎర్నింగ్ పద్ధతి) ద్వారా మంచి వైద్యులుగా విద్యార్థులు రాణిస్తున్నారని పలు పరిశోధనల్లో తేలింది.
ఈ విద్యా విధానంలో ఉపాధ్యాయులు కేవలం విద్యార్థులకు మార్గనిర్దేశం మాత్రమే చేయడం. ఈ నిర్దేశంతో విద్యార్థులు సొంతంగా విషయంపై విశ్లేషణ చేయడంతో ఈ విధానం మంచి ఫలితాలు ఇస్తుందని పలు దేశాల విద్యార్థులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ పద్ధతిలో గనుక మనం వైద్య విద్యను అమలు చేయగలిగితే పలు ఉన్నత దేశాల వైద్యరంగంలో మన వైద్య విద్యార్థులు ఇంకా ఎక్కువగా పోటీపడే అవకాశం ఉంది. సమీకృత, సమస్య ఆధారిత పద్ధతిలో చదువుకునే విద్యార్థులు తమ చదువుతోపాటు పరిశోధనలు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మన విద్యార్థులు అమెరికా, ఇంగ్లండ్ దేశాల వైద్యవిధాన పరిషత్ పరీక్షలకు (USMLE, PLAB) తమ తమ పరిశోధనలను ప్రచురించాల్సి అవసరం చాలా ఉంది.
-మెడికల్ ఎడ్యుకేషన్ రేపటి విద్యార్థులను తీర్చిదిద్దడంలో ప్రపంచవ్యాప్తంగా అనేక చాలెంజ్‌లను ఎదుర్కొంటోంది. ఈ ప్రస్తుత కాలంలో ఉన్న టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ విద్యార్థుల జీవితంలో ముఖ్యపాత్ర పోషించడం వల్ల మెడికల్ ఎడ్యుకేషన్ కూడా ఆ దిశగా మార్పును తెచ్చుకొంటుంది. ఈ దిశగా ఇప్పటికే చాలా మెడికల్ యూనివర్సిటీలు ఈ-లెర్నింగ్, వెబ్ బేస్డ్ లెర్నింట్, కొత్తగా బ్లెన్డెడ్ లెర్నింగ్ అని కూడా అమల్లోకి తీసుకొచ్చాయి.
బ్లెండెడ్ లెర్నింగ్ (సమ్మిళిత విద్యావిధానం)
-ఈ పద్ధతిలో ఎలక్ట్రానిక్ (ఈ-లెర్నింగ్)తో పాటు ఫేస్ టూ ఫేస్ లెర్నింగ్ కూడా ఉంటుంది. ఆన్లైన్లో టీచింగ్, లెర్నింగ్ ఫామ్స్ ద్వారా ఈ పద్ధతి ఇప్పటికే పలు మెడికల్ సబ్జెక్టుల్లో అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో నడుస్తోంది. అయితే ఈ పద్ధతిలో విజయవంతంగా రాణించాలంటే విద్యార్థులకు వైడ్ రేంజ్ ఆఫ్ కంప్యూటర్ స్కిల్స్ ఉం డాలి. ప్రపంచంలో మార్పులకు అనుగుణంగా మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఇటువంటి కొత్త పద్ధతులను మన సాంప్రదాయ పాఠ్యప్రణాళికలో ఒక్కొక్కటిగా కలుపుకుంటూ పోతే మన వైద్య విద్య కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా నిలుస్తుంది.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రానున్న కాలంలో మన విద్యార్థులు వైద్యరంగంలో రాణించాలంటే ఈ మార్పులను ఆహ్వానించాల్సిన అవసరం ఉందని గ్రహించాలి. తెలంగాణ వైద్యవిధాన పరిషత్, విద్యార్థులకు ఈ విషయాలు, ప్రపంచ వ్యాప్త వైద్య విద్యా పరిజ్ఞానాన్ని సమకూర్చాలి. (ఫిగర్ 3 దీనికి సంబంధించింది.)
8 పైన పేర్కొన్న కొత్త పద్ధతులు గనుక మన వైద్య విద్యలో అమలు చేసే నిర్ణయం తీసుకుంటే మన విద్యార్థులు ప్రపంచ స్థాయి వైద్య రంగంలో పోటీపడే అవకాశం ఉంది. ప్రస్తుతం మన విద్యా ర్థులు అమెరికా, ఇంగ్లండ్, ఇతర దేశాల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు.
అలాంటి వారికి విద్యాపద్ధతులు అమల్లో ఉన్నాయని తెలపడం వల్ల పక్కా ప్రణాళికతో ముందుకుపోయి వారు తక్కువ మానసిక భారంతో USMLE, PLAB వంటి పరీక్షలు సులువుగా పాస్ అయ్యే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో అమెరికా వైద్య విద్యా పరీక్ష (USMLE)కు పరిశోధనలు చేసి, ఆ పరిశోధనలను ప్రచురించాలి అనే రూల్ కూడా తీసుకొచ్చారు. అయితే ఈ విషయాలన్నీ మన విద్యార్థులు తెలుసుకోపోవడం వల్ల అధిక భారానికి గురవుతున్నారు.
-ప్రపంచ మార్పులకు అనుగుణంగా మన వైద్య విద్యా విభాగాలు ఇటువంటి కొత్త విధానాలను సాం ప్రదాయక పాఠ్యప్రణాళికలో ఒక్కొక్కటిగా కలుపుకు పోవడంతో పాటు భవిష్యత్‌లో మనం కూడా అంత ర్జాతీయ ప్రమా ణాలకు దీటుగా నిలువాలని ఆశిద్దాం.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు