రూపసాదృశ్య పద్ధతి అని దేనిని అంటారు?
మౌన పఠనం – ప్రయోజనాలు
- వాగింద్రియాలకు అలసట, శ్రమ ఉండదు.
- విస్తృతమైన జ్ఞానప్రాప్తికి సహకరిస్తుంది.
- గ్రంథాలయాల్లో, పఠనాలయాల్లో ఉపయోగించవచ్చు.
- ముఖయంత్రంలో లోపల (నత్తి) ఉన్న వారికి అనుకూలం.
- తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని గ్రహించవచ్చు.
- విస్తార పఠనానికి దారి తీస్తుంది.
మౌనపఠనం – పరిమితులు
- మానసిక విశ్రాంతిని కలిగిస్తుంది.
- తరగతిలోని విద్యార్థులందరి పఠనశక్తిని ఏకకాలంలో పరీక్షించడానికి వీలవుతుంది.
- విద్యార్థుల ఉచ్ఛారణ దోషాలు, శబ్దదోషాలు, విషయ దోషాలను తెలుసుకోలేం.
- శ్రోతలకు వినిపించే అవకాశం ఉండదు.
- మనసు అన్యక్రాంతం అయ్యే ప్రమాదం ఉంది.
క్షుణ్ణపఠనం
- బేకన్:కొన్ని గ్రంథాలను రుచి చూడాలి, కొన్నింటిని దిగమింగాలి, మరికొన్నింటిని నమిలి మింగాలి. లిపి రూపంలోని భావాలను నమిలి జీర్ణం చేసుకోగలిగిన పఠనమే క్షుణ్ణ పఠనం.
- నాష్: ‘కాసట బీసటగా వివిధ విషయాలు చదవడం కంటే విషయమొకటే అయినా క్షుణ్ణంగా చదవడం మేలు’.
- గొడవర్తి సూర్యనారాయణ (అభినవా చార్యకం): ‘ఒక కావ్యాన్ని గాని, వ్యాసాన్ని గాని ఆమూలాగ్రంగా, ప్రతి శబ్దం మీద, అర్థం మీద పరిపూర్ణంగా దృష్టి సారించి విశేషంగా పఠించడమే క్షుణ్ణపఠనం’.
- పాఠ్యాంశానికి సంబంధించిన విషయాన్ని కూలంకషంగా పఠించడాన్ని క్షుణ్ణపఠనం అంటారు.
- క్షుణ్ణపఠనం అంటే ప్రతి అంశాన్ని వివరంగా చదవడం. అంటే ఒక్కొక్క పాఠ్యాంశంలోని భాష, భావ
- విశేషాలు సమగ్రంగా తెలుసుకుంటూ చదవడాన్ని క్షుణ్ణపఠనం అంటారు.
క్షుణ్ణపఠనానికి వాచకాలు ఉపయోగపడతాయి.
ప్రయోజనాలు
- భాష, సాహిత్యాలపై పట్టు సాధించే పఠనం.
- ఛందస్సు, అలంకారాలు, వ్యాకరణాంశాలు మొదలైనవి నేర్చుకొనే అవకాశం కల్పించే పఠనం.
- జడప్రాయంగా ఉన్న అమితజ్ఞానం కంటే చైతన్యరూపంలో ఉన్న పరిమిత జ్ఞానం మిన్న అనే సూక్తి క్షుణ్ణ పఠనానికి వర్తిస్తుంది.
- పాఠ్యాంశంపై సంపూర్ణ అవగాహన కలిగిస్తుంది.
- విద్యార్థుల్లో తార్కికశక్తిని, ఆలోచనా శక్తిని పెంపొందిస్తుంది.
- కావ్య సౌందర్యాన్ని, భావ సౌందర్యాన్ని తెలుసుకుంటారు.
- ప్రతి శబ్దం అర్థం, దాని ప్రయోగం తీరు తెలుస్తుంది.
- కవి/రచయిత భావాలను సంపూర్ణంగా గ్రహించవచ్చు.
విస్తార పఠనం
తక్కువ సమయంలో ఎక్కువ పుస్తకాల్లోని విషయాలను చదివి ఆకళింపు చేసుకోవడాన్ని విస్తార పఠనం అంటారు. శబ్దార్థాలను గ్రహిస్తూ పఠించే విధానమే విస్తార పఠనం.
విస్తార పఠనం – ప్రయోజనాలు
- క్షుణ్ణ పఠనంలో భాషకు, విషయానికి ప్రాధాన్యతనిస్తే, విస్తార పఠనంలో భావగ్రాహణానికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది.
- కేవలం భావ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని పఠనం చేస్తే విస్తార పఠనం అంటారు.
- విస్తార పఠనానికి ఉన్న ఇతర పేర్లు- విస్తృత పఠనం, విస్తరణాధ్యయనం.
- బాహ్యపఠనం ద్వారా కాని, మౌనపఠనం ద్వారా కాని స్థూలాభిప్రాయాలను గ్రహించ గల పఠనాన్ని ‘విస్తార పఠనం’ అంటారు.
- ఉపవాచకాలు విస్తార పఠనానికి నిర్దేశితమైనవి.
- వైవిధ్య భరితమైన గ్రంథాలను/పుస్తకాలను చదవడం- విస్తార పఠనం
- గ్రంథాలయాలు, పఠనాలయాలు, వార్తాపత్రికలు, ఉపవాచకాలు విస్తార పఠనానికి ఉపయోగపడేవి.
- విస్తార పఠనాన్ని పెంపొందించే మార్గాలు- పాఠశాల పత్రిక, సారస్వత సంఘాలు, పుస్తక ప్రదర్శనలు.
- క్షుణ్ణపఠనం ద్వారా విద్యా లక్ష్యాలన్నీ నెరవేరితే విస్తార పఠనం ద్వారా విజ్ఞానం కలుగుతుంది.
- సారస్వతాభిరుచిని పెంపొందిస్తుంది.
- బుద్ధి వికాసాన్ని కలిగిస్తుంది.
- గ్రంథాలయ వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది.
- విరామకాల సద్వినియోగానికి ఉపకరిస్తుంది.
- విద్యార్థుల్లో పఠనశక్తిని వృద్ధి చేస్తుంది.
- తక్కువ కాలంలో ఎక్కువ పుస్తకాలు చదవచ్చు.
- విషయంపై అవగాహన పెరిగి మంచి ఉపన్యాసాలు ఇవ్వగలుగుతారు.
- శారీరక, మానసిక అలసట తొలగి, వినోదం, వికాసం, ఉల్లాసం, మానసికానందం కలిగించి, మౌనపఠన సామర్థ్యాన్ని పెంచే పఠనం.
- రచనా శక్తిని పెంపొందిస్తుంది. స్వతంత్ర రచనలు చేయవచ్చు.
- రస్సెల్: విద్యార్థుల్ని మంచి పుస్తకాలు చదివే పఠనం వైపు మళ్లించకపోతే, వారి కంటికి కనిపించే బజార్లలో దొరికే విలువలు లేని పుస్తకాలను అద్దెకు తెచ్చుకొని చదువుతూ కాలాన్ని, జీవితాన్ని నాశనం చేసుకుంటారు.
శీఘ్రపఠనం
- పఠనాన్ని వేగవంతం చేసి ఒక పద్ధతిగా అమూలాగ్రంగా చదివి విషయంలోని ముఖ్యమైన అంశాలను గుర్తించడాన్ని శీఘ్రపఠనం అంటారు.
- మొత్తం కథలోని లేదా పాఠ్యాంశంలోని ముఖ్యమైన అభిప్రాయన్ని తెలుసుకోవడానికి చేసే పఠనం.
- ఉదా: నవలలు, దినపత్రికలు, వారపత్రికలు మొదలైన వాటిలోని మొదటి చివరి పేరాలు చదవడం, శీర్షికలను చదవడం, విషయసూచికలను చదవడం.
సమాచార పఠనం
- గబగబా చదివి ప్రత్యేక సమాచారాన్ని తెలుసుకోవడం కోసం చేసే పఠనాన్ని సమాచార పఠనం అంటారు.
- ఉదా: పదం వివరాలు తెలుసుకోవడం, టెలిఫోన్ డైరెక్టరీలో నంబర్ను తెలుసుకోవడం, వార్తాపత్రికల్లో ప్రకటనలు చదవడం, క్యాలెండర్లో ముఖ్యమైన తేదీలను గుర్తించడం.
మండూక పుతి పఠనం
- స్వరోచ్ఛారణ పద్ధతి
- అక్షర పద్ధతి
- ప్రాచీనాక్షర పద్ధతి
- నవీనాక్షర పద్ధతి
- పదపద్ధతి
- వాక్యపద్ధతి
- కథాపద్ధతి
- పూర్ణ పద్ధతి
స్వరోచ్ఛారణ పద్ధతి
- ఇంగ్లిష్లో ఫోనిక్స్ మెథడ్ (Phonix Method) అంటారు.
- ప్రతి పదంలోని వివిధ ధ్వనులను గుర్తించి ఉచ్ఛరించడం నేర్పే పద్ధతి.
- విద్యార్థులు పదాల్లోని ధ్వనులను గుర్తించి, వాటి ద్వారా పదాలను స్పష్టంగా గుర్తించగలుగుతారు.
అక్షర పద్ధతి
- అక్షర పద్ధతికి ఉన్న ఇతర పేర్లు- ప్రాచీనాక్షర పద్ధతి, సాంప్రదాయ పద్ధతి, వర్ణ సమామ్నాయ పద్ధతి.
- మనో విజ్ఞాన శాస్ర్తానికి విరుద్ధమైన పద్ధతి.
- వర్ణమాలలో ఉన్న వరుసక్రమాన్ని బట్టి అక్షరాలను నెగ్గితే అది అక్షర పద్ధతి.
- ప్రాచీన పద్ధతిలో అక్షరాభ్యాసంతో భాషా శిక్షణ ప్రారంభమయ్యింది.
- వర్ణమాల క్రమంలో అక్షర రూపాలను నల్లబల్లపై రాసి చూపించి కాని, వర్ణమాల చార్టులో చూపించి కాని చదివించే పద్ధతి.
నవీనాక్షర పద్ధతి
- వర్ణమాల క్రమంలో అక్షరాలను విద్యార్థులు ‘చూసి చదివేట్లు’గా అభ్యాసం ఇస్తారు. ఆ అక్షరాలు,
- గుణింతాలను గుర్తించి చదవడం నేర్చుకుంటారు. తరువాత పదాలను వాక్యాలను చదివించాలి.
అక్షరాల సామ్యాలను బట్టి పఠనం నేర్పే పద్ధతి. - వర్ణమాలలో ఉన్న వరుస క్రమాన్ని బట్టి కాకుండా ఆకారాన్ని/పోలికలను బట్టి అక్షరాలు నేర్పే పద్ధతి నవీనాక్షర పద్ధతి.
- నవీనాక్షర పద్ధతిలో కింది పద్ధతులను ఉపయోగిస్తారు.
రూపసాదృశ్య పద్ధతి
- అక్షరాలను వర్ణమాలలో ఉండే క్రమంలోగాక ఆకార సామ్యాన్ని బట్టి (ఆకృతి) కొన్ని వర్గాలుగా చేసి నేర్పించే పద్ధతి- రూపసాదృశ్య పద్ధతి
- ఉదా: ల అ ఆ ట త, ఉ ఊ డ ఢ
- ఇందులో ప్రతివర్ణం తత్పూర్వ వర్ణంతో రూపసాదృశ్యతను కలిగి ఉంటుంది. అందువల్ల మొదటి వర్ణం నేర్చిన విద్యార్థికి తరువాత వర్ణం నేర్వడం ఎంతో సులువుగా ఉంటుంది.
తరచుదనపు పద్ధతి
- వర్ణమాలలో తరుచుగా రాని అక్షరాలను తీసివేసి మిగిలిన వాటిని మొదట నేర్పడం తరచుదనపు పద్ధతి.
- ముందుగా విద్యార్థులకు సులభంగా ఉండే 32 వర్ణాలను నేర్పి తరువాత మిగిలిన వర్ణాలను నేర్పాలి.
- ఉదా: అ, ఆ, ఇ, ఆ, ఉ, ఊ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ , ఔ, క, గ, చ, జ, ట, డ, ణ,త, ద, న, ప, బ, మ, య, ర, ల, వ, శ, స, హ, ళ.
పరిచయ పదాల పద్ధతి
- ఈ పద్ధతిని రూపొందించిన వారు- రిషి వ్యాలీలోని రీజినల్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ సెంటర్
ఒత్తులు, గుణింతాలు బోధించేటప్పుడు ఒక క్రమపద్ధతి పాటించి బోధించే పద్ధతి. - ఉదా: అదే వర్ణం ఒత్తుగా రావడం- జ్జ, ణ్ణ
- అదే వర్ణం తలకట్టు తీసిరాయడం- ద్ద, గ్గ, డ్డ
- అదే వర్ణం తలకట్టు తీసి, సాగదీసి రాయడం- చ్చ, బ్బ, స్స, ప్ప
- ఏ సంబంధం లేనివి- క్క,న్న, త్త
- ‘అర్థ రహితాలైన అక్షరాలను ప్రాతిపదికగా చేసుకుని పఠనం నేర్పించడం సరైన పద్ధతి కాదు’ అని అక్షర, నవీనాక్షర పద్ధతులను విమర్శించినది- మనోవైజ్ఞానికులు.
పద పద్ధతి
- అర్థవంతమైన పదాలను ప్రాతిపదికగా తీసుకుని, విద్యార్థులు చూసి చదివేట్లు చేయడాన్ని ‘పదపద్ధతి’ అంటారు.
- కొన్ని పదాలను ప్రాతిపదికగా తీసుకుని విద్యార్థులు అవి చూసి చదివేట్లు చేయడమే పదపద్ధతి.
- 1వ తరగతి తెలుగు వాచకం పద పద్ధతిని అనుసరించి తయారు చేశారు.
- 2020-21 విద్యా సంవత్సరంలోని 1, 2 తరగతుల నూతన తెలుగు వాచకాలు (తెలుగు తోట) పద పద్ధతిలో తయారు చేశారు. (ఏపీ)
- తెలిసిన వాటి నుంచి తెలియని వాటికి (Known to Unknown) అనే విద్యా సూత్రం ద్వారా తెలిసినవి బొమ్మలు (ఆకారాలు), తెలియనివి అక్షరాలు, తెలిసిన బొమ్మల ద్వారా పదాల స్వరూపాన్ని సులభంగా గ్రహించి చెప్పగలరు.
గుర్తింపు అట్ట
- పదపద్ధతిలో బోధనకు ‘మెరుపు అట్టలు’ ( Flash cards) అవసరం. ఒక పదాన్ని పరిచయం చేయడానికి నాలుగు మెరుపు అట్టలు (ఒక సెట్) కావాలి.
- ఒక అట్టపై సగభాగంలో చిత్రపటం (బొమ్మ), కింది సగభాగంలో దాని పేరు కలిగిన అట్ట.
- అట్ట రెండో వైపు ఖాళీగా ఉంటుంది.
- చిత్రం/ అమ్మ
స్వయం సవరణ అట్ట
- అట్టకు ఒక వైపు చిత్రపటం (బొమ్మ) రెండవ వైపు దాని పేరు కలిగిన అట్ట.
- చిత్రం అమ్మ
- అట్ట ఒక వైపు అట్టకు రెండో వైపు
జతకూర్పు అట్టలు
- ఒక అట్ట మీద బొమ్మ, మరొక అట్టమీద పేరు కలిగిన అట్టలు.
- అట్ట (చిత్రం ) ఒక వైపు బొమ్మ, రెండో వైపు ఖాళీగా ఉండాలి.
- అట్ట (చిత్రం) ఒక వైపు బొమ్మ పేరు, రెండో వైపు ఖాళీగా ఉండాలి
- పదపద్ధతిలో విద్యార్థులు ఏ మాత్రం శ్రమపడకుండా పఠనం ఒక క్రీడలా భావించే పద్ధతి.
వాక్య పద్ధతి
- వాక్యాలను ప్రాతిపదికగా తీసుకొని పిల్లలు చూసి చదివేట్లు చేయడాన్ని వాక్యపద్ధతి అంటారు.
- సంపూర్ణ అర్థాన్ని ప్రాతిపదికగా తీసుకుని పిల్లలు వాక్యాన్ని చూసి చదివే పద్ధతిని ‘వాక్యపద్ధతి’ అంటారు.
- సంపూర్ణ భావ వ్యక్తీకరణకు మూలం వాక్యం. గెస్టాల్ట్ సమగ్రాకృతి సిద్ధంతానికి దగ్గరంగా ఉండే పద్ధతి.
- వాక్య పత్రాలు మూడు రకాలు. అవి.. గుర్తింపు వాక్య పత్రం, స్వయం సవరణ వాక్యపత్రం, జతకూర్పు వాక్యపత్రాలు పదపద్ధతి కంటే మేలైనది.
- ఆధునిక విద్యావేత్తల ప్రకారం పఠనం నేర్పడానికి ఉత్తమ పద్ధతి.
కథా పద్ధతి
- కథా చిత్రాల ఆధారంగా విద్యార్థి చేత కింద ఉన్న వాక్యాలు చదివిస్తే కథా పద్ధతి.
- పద, వాక్య పద్ధతులకంటే ఉత్తమమైనది- కథాపద్ధతి (మనోవిజ్ఞానవేత్తల అభిప్రాయం)
- కథాచిత్రాలు మూడు రకాలు. అవి.. గుర్తింపు కథా చిత్రం, స్వయం సవరణ కథాచిత్రం, జతకూర్పు
- కథాచిత్రం
- పద పద్ధతి: శ్రేష్టమైనది.
- వాక్య పద్ధతి: శ్రేష్టతరమైనది.
- కథా పద్ధతి-శ్రేష్టతరమైనది.
- ‘ప్రాథమిక దశలో పఠనం నేర్పడానికి వాక్య పద్ధతి, కథాపద్ధతి ఉత్తమ పద్ధతులు’ అని అన్నది-రెబర్న్
పూర్ణ పద్ధతి లేదా పూర్ణ భాషా పద్ధతి
- భాషను మొత్తంగా నేర్పే పద్ధతి
- పదాన్ని అర్థవంతమైన చిన్న అంశంగా పరిగణించేది- పూర్ణపద్ధతి.
- పూర్ణపద్ధతి భాషను ఒక సంపూర్ణ వ్యవస్థగా భావిస్తుంది.
Previous article
రాజ్యాంగ వివాదాలు-వ్యాఖ్యలు
Next article
గుడ్ గవర్నెన్స్ అని దేనికి పేరు?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు