గుడ్ గవర్నెన్స్ అని దేనికి పేరు?
1. కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. (సి)
1. కేంద్రీకృత పాలనకు పునాది వేసింది పిట్స్ ఇండియా చట్టం
2. కేంద్రీకృత పాలనకు పునాది వేసింది రెగ్యులేటింగ్ చట్టం
3. కేంద్రీకృత పాలనకు తుది మెట్టుగా 1853 చట్టాన్ని పేర్కొంటారు
4. కేంద్రీకృత పాలనకు తుది మెట్టుగా 1833 చట్టాన్ని పేర్కొంటారు
ఎ) 1, 3 బి) 2, 3
సి) 2, 4 డి) 1, 4
2. రెగ్యులేటింగ్ చట్టానికి సంబంధించి కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. (డి)
1. ఈ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్‌ను గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు
2. తొలి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వారెన్ హేస్టింగ్స్
3. గవర్నర్ కార్యనిర్వాహక మండలిలో నలుగురు సభ్యులు ఉన్నారు
4. ఈ చట్టం ద్వారా సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు
ఎ) 1, 2, 4 బి) 2, 4
సి) 1, 2 డి) 2, 3, 4
3. ఏ చట్టం ద్వారా కంపెనీ బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌ను ఏర్పాటు చేశారు? (సి)
ఎ) 1773 చట్టం బి) 1793 చట్టం
సి) పిట్స్ ఇండియా చట్టం
డి) 1781 సవరణ చట్టం
4. ప్రతిపాదన (ఎ): కేంద్రంలో ద్విసభ విధానాన్ని 1919 చట్టం ద్వారా ప్రవేశపెట్టారు (బి)
కారణం (ఆర్): రాష్ట్ర స్థాయిలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు
ఎ) ఏ, ఆర్ రెండూ సరైనవే, ఏ ను ఆర్ సరిగ్గా వివరిస్తుంది
బి) ఏ, ఆర్ రెండూ సరైనవే, ఏ కు ఆర్ సరైన వివరణ కాదు
సి) ఏ సరైనదే, ఆర్ సరైనది కాదు
డి) ఏ సరైనది కాదు, ఆర్ సరైనదే
5. ఏ చట్టం ద్వారా గవర్నర్ ఆఫ్ బెంగాల్‌ను గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు? (ఎ)
ఎ) 1833 చట్టం
బి) రెగ్యులేటింగ్ చట్టం
సి) పిట్స్ ఇండియా చట్టం
డి) 1853 చార్టర్ చట్టం
6. కింది వాటిలో సరైనదానిని గుర్తించండి. (సి)
1. రాష్ట్ర స్థాయిలో ద్వి సభ విధానాన్ని 1919 చట్టం ద్వారా ప్రవేశపెట్టారు
2. రాష్ట్ర స్థాయిలో ద్వి సభ విధానాన్ని 1935 చట్టం ద్వారా తీసుకొచ్చారు
3. కేంద్ర స్థాయిలో ద్విసభ విధానాన్ని 1919 చట్టం ద్వారా ఏర్పాటు చేశారు
ఎ) 1, 3 బి) 3 సి) 2, 3 డి) 2
7. అతి తక్కువ కాలం అమల్లో ఉన్న చార్టర్ చట్టం ఏది? (డి)
ఎ) 1861 చట్టం
బి) పిట్స్ ఇండియా చట్టం
సి) 1833 చట్టం డి) 1853 చట్టం
8. కింది వాటిలో సరైనది గుర్తించండి. (బి)
ఎ) రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం గవర్నర్ కార్యనిర్వాహక మండలిలో సభ్యుల సంఖ్య 3
బి) పిట్స్ ఇండియా చట్టం ప్రకారం గవర్నర్ కార్యనిర్వాహక మండలిలో సభ్యుల సంఖ్య 3
సి) 1833 చట్టం ప్రకారం గవర్నర్ కార్యనిర్వాహక మండలిలో సభ్యుల సంఖ్య 5
డి) ఏదీ సరైనది కాదు
9. ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్‌కు కౌన్సిల్ తీర్మానాలపై వీటో అధికారాన్ని కల్పించారు? (సి)
ఎ) 1773 రెగ్యులేటింగ్ చట్టం
బి) 1984 పిట్స్ ఇండియా చట్టం
సి) 1793 చార్టర్ చట్టం
డి) 1909 మింటో మార్లే సంస్కరణలు
10. జతపరచండి (బి)
1. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎ. విలియం బెంటిక్
2. ళెక్షైసాయ్ కార్యనిర్వాహక మండలిలో సభ్యత్వం పొందిన తొలి భారతీయుడు బి. కానింగ్
3. తొలి వైశ్రాయ్ సి. ఎస్పీ సిన్హా
4. తొలి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా డి. వారెన్ హేస్టింగ్స్
ఎ) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
బి) 1-డి, 2-సి. 3-బి. 4-ఎ
సి) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
డి) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
11. 1919 మాంటెగ్ చేమ్స్‌ఫర్డ్ చట్టానికి సంబంధించి కింది వాటిలో సరికానిది? (డి)
ఎ) కేంద్ర స్థాయిలో ద్వి శాసనసభ విధానాన్ని ప్రవేశపెట్టారు
బి) రాష్ట్ర స్థాయిలో ద్వంద్వ పాలనను తీసుకొచ్చారు
సి) మత ప్రాతినిథ్య నియోజకవర్గాలను సిక్కులకు కూడా కల్పించారు
డి) రాష్ర్టాల్లో ద్వి శాసనసభ విధానాన్ని ప్రవేశపెట్టారు
12. ఏ చట్టం ద్వారా కేంద్ర శాసన మండలిని ఇంపీరియల్ లెజిస్లేటివ్‌గా మార్చారు? (సి)
ఎ) 1919 చట్టం బి) 1935 చట్టం
సి) 1909 కౌన్సిల్ చట్టం
డి) 1929 కౌన్సిల్ చట్టం
13. 1861 కౌన్సిల్ చట్టానికి సంబంధించి సరికానిది ఏది? (ఎ)
ఎ) కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లను వేరు చేశారు
బి) కేంద్ర స్థాయిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు
సి) పోర్ట్ ఫోలియో పద్ధతిని గుర్తించి కొనసాగించారు
డి) ఆర్డినెన్స్‌లను జారీచేసే అవకాశాన్ని ఇచ్చారు
14. ఏ చట్టం ద్వారా ప్రభుత్వ ఖాతాల సంఘం (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ)ను ఏర్పాటు చేశారు? (బి)
ఎ) 1909 చట్టం బి) 1919 చట్టం
సి) 1935 చట్టం
డి) 1947 భారత స్వాతంత్య్ర చట్టం
15. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఎన్ని ప్రావిన్సుల్లో ద్వి శాసనసభ విధానాన్ని ప్రవేశ పెట్టారు? (సి)
ఎ) 4 బి) 5 సి) 6 డి) 11
16. కింది అంశాలను కాలక్రమం ఆధారంగా అమర్చండి. (డి)
1. క్రిప్స్ రాయబారం
2. క్యాబినెట్ మిషన్ ప్లాన్
3. ఆగస్ట్ ప్రతిపాదనలు
4. వేవెల్ ప్రణాళిక
ఎ) 1, 4, 3, 2 బి) 3, 1, 2, 4
సి) 3, 4, 2, 1 డి) 3, 1, 4, 2
17. క్యాబినెట్ మిషన్‌లో కింది వారిలో లేనిది ఎవరు? (బి)
ఎ) లారెన్స్ బి) మౌంట్‌బాటెన్
సి) సర్ స్టాఫర్డ్ క్రిప్స్ డి) అలెగ్జాండర్
18. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం కింది వాటిలో సరికానిది? (సి)
ఎ) కేంద్ర జాబితాలో ఉన్న అంశాలు-59
బి) రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలు-54
సి) అవశిష్ట అధికారాలపై భారత రాజ్యాంగ సభకు అధికారం ఇచ్చారు
డి) ఉమ్మడి జాబితాలోఉన్న అంశాలు-36
19. కింది వాటిని కాలక్రమంలో అమర్చండి? (ఎ)
1. కమ్యూనల్ అవార్డ్
2. పూనా ఒప్పందం
3. గాంధీ-ఇర్విన్ ఒప్పందం
4. దీపావళి ప్రకటన
ఎ) 4, 3, 1, 2 బి) 4, 3, 2, 1
సి) 4, 1, 3, 2 డి) 4, 2, 3, 1
20. కిందివాటిలో సైమన్ కమిషన్ సూచనల్లో లేనిది ఏది? (డి)
ఎ) సమాఖ్య వ్యవస్థ ఏర్పాటు
బి) ద్వంద్వ పాలన తొలగింపు
సి) రాజ్యాంగ సభ ఏర్పాటు
డి) అన్ని అంశాల్లో సంస్థానాలకు స్వయం ప్రతిపత్తి
21. 1892 కౌన్సిల్ చట్టం ప్రకారం కేంద్ర శాసన మండలికి కిందివాటిలో ఎంపిక కాని వారు ఎవరు? (సి)
ఎ) సురేంద్రనాథ్ బెనర్జీ
బి) గోపాలకృష్ణ గోఖలే
సి) బాలగంగాధర్ తిలక్ డి) బిల్గ్రామ్
22. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తాత్కాలిక పార్లమెంట్‌గా విధులు నిర్వహించిన వ్యవస్థ ఏది? (బి)
ఎ) ఐఎన్‌సీ
బి) రాజ్యాంగ సభ
సి) నెహ్రూ నేతృత్వంలోని తాత్కాలిక కమిటీ
డి) వైశ్రాయ్ కార్యనిర్వాహక మండలి
23. శాసన నిర్మాణ ప్రక్రియలో భారతీయులకు తొలిసారి ప్రాతినిధ్యాన్ని ఇచ్చిన చట్టం? (బి)
ఎ) 1909 చట్టం బి) 1861 చట్టం
సి) 1919 చట్టం డి) 1935 చట్టం
24. కింది వాటిలో బ్రిటిష్ నుంచి స్వీకరించనిది? (సి)
ఎ) పార్లమెంటరీ తరహా ప్రభుత్వం
బి) స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవి
సి) చట్టం నుంచి సమాన రక్షణ
డి) సమ న్యాయ పాలన
25. వివిధ షెడ్యూళ్లు-అందులోని అంశాలతో జతపరచండి? (ఎ)
1. ఫిరాయింపు నిరోధక చట్టం ఎ. నాలుగో షెడ్యూల్
2. భాషలు బి. ఏడో షెడ్యూల్
3. కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితా సి.ఎనిమిదో షెడ్యూల్
4. రాష్ర్టాల ప్రాతినిధ్యం డి. పదో షెడ్యూల్
ఎ) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
బి) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
సి) 1-డి,2-సి, 3-ఎ, 4-బి
డి) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
26. కింది వాటిలో ఎనిమిదో షెడ్యూల్‌తో సంబంధం లేని రాజ్యాంగ సవరణ? (డి)
ఎ) 21 బి) 71 సి) 92 డి) 45
27. పదో షెడ్యూల్‌తో ముడిపడి ఉన్న రాజ్యాంగ సవరణలు? ( సి)
1. 52 2.89 3.91 4.62
ఎ) 1 బి) 2, 3 సి) 1, 3 డి) 1, 4
28. కింది వాటిలో నెహ్రూ నేతృత్వం వహించని కమిటీ? (డి)
ఎ) కేంద్ర రాజ్యాంగ కమిటీ
బి) కేంద్ర అధికారాల కమిటీ
సి) రాష్ర్టాలతో సంప్రదింపుల కమిటీ
డి) రాష్ర్టాల రాజ్యాంగ కమిటీ
29. ముసాయిదా కమిటీతో సంబంధం లేని వారిని గుర్తించండి? (బి)
ఎ) గోపాల స్వామి అయ్యంగార్
బి) రాజేంద్ర ప్రసాద్
సి) అల్లాడి కృష్ణ స్వామి అయ్యర్
డి) సయ్యద్ మహ్మద్ సాదుల్లా
30. కింది వాటిలో రాజ్యాంగ పరిషత్తు నిర్వహించని విధి? (సి)
ఎ) పార్లమెంట్ విధులు
బి) భారత జాతీయ జెండా గుర్తింపు
సి) భాష ప్రాతిపదికన రాష్ర్టాల ఏర్పాటు
డి) కేంద్ర ప్రభుత్వ భాషగా హిందీని ఆమోదించడం
31. కింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి (ఎ)
ఎ) 1833 చట్టం వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టింది
బి) కేంద్రీకరణకు తుదిమెట్టుగా 1833 చట్టం ఉంది
సి) వికేంద్రీకరణకు తొలి మెట్టుగా 1861 చట్టం ఉంది
డి) రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు ఏర్పాటైంది
32. ఏ చట్టం ప్రకారం హైకోర్టులను ఏర్పాటు చేశారు? (ఎ)
ఎ) 1861 చట్టం బి) 1773 చట్టం
సి) 1935 చట్టం డి) 1919 చట్టం
33. 1935 చట్టానికి సంబంధించి సరైనవి ఏవి? (డి)
1. భారత్‌కు ఇది అతిపెద్ద ఆధారంగా ఉంది
2. ప్రకారం సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేశారు
3. రాష్ర్టాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టారు
4. కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు
ఎ) 1, 2 బి) 1, 2, 3
సి) 2, 3 డి) 1, 2, 4
34. రాజ్యాంగ సభకు న్యాయ సలహాదారుగా వ్యవహరించింది ఎవరు? (బి)
ఎ) డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్
బి) బెనగల్ నరసింగరావు
సి) కేఎం మున్షీ
డి) రాజేంద్ర ప్రసాద్
35. కింది వాటిలో అక్వర్త్ కమిటీకి దేనితో సంబంధం ఉంది? (బి)
ఎ) భారత్‌కు సమాఖ్యను సూచించిన కమిటీ
బి) సాధారణ, రైల్వే బడ్జెట్లను విడదీయమని సూచించింది
సి) భారత్‌కు స్వయం ప్రతిపత్తి ఇవ్వడంతో పాటు సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది
డి) పైవన్నీ సరైనవే
36. కింది వాటిలో గుడ్ గవర్నెన్స్ చట్టం (సుపరిపాలన చట్టం) అని దేనికి పేరు? (డి)
ఎ) 1947 భారత స్వాతంత్య్ర చట్టం
బి)1935 భారత ప్రభుత్వ చట్టం
సి)1833 చట్టం
డి) 1858 చట్టం
37. ప్రతిపాదన: పిట్స్ ఇండియా చట్టం ద్వారా బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌ను ఏర్పాటు చేశారు (బి)
కారణం: రెగ్యులేటింగ్ చట్టం ద్వారా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏర్పాటయ్యింది
ఎ) ప్రతిపాదన, కారణం రెండూ సరైనవే, ప్రతిపాదనను కారణం సరిగ్గా వివరిస్తుంది
బి) ప్రతిపాదన, కారణం రెండూ సరైనవే, అయితే ప్రతిపాదనకు కారణం సరైన వివరణ కాదు
సి) ప్రతిపాదన సరైనదే, కారణం సరైనది కాదు
డి) ప్రతిపాదన సరైనది కాదు, కారణం సరైనదే
38. ఏ కమిటీ సూచన మేరకు కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు? (బి)
ఎ) బార్కర్ కమిటీ
బి) లీ కమిటీ
సి) అక్వర్త్ కమిటీ
డి) కారన్వాలిస్ కమిటీ
39. ఏ చట్టం ద్వారా మున్సిపాలిటీలకు చట్ట బద్ధత కల్పించారు? (సి)
ఎ) 1884 చట్టం బి) 1784 చట్టం
సి) 1793 చట్టం డి) 1813 చట్టం
40. 1935 చట్టానికి సంబంధించి సరి కానిది ఏది? (డి)
ఎ) జాబితా ఆధారంగా కేంద్ర, రాష్ర్టాల మధ్య అధికార విభజన
బి) రాష్ర్టాల్లో ద్వి సభ విధానం
సి) కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వం
డి) రాష్ట్రంలో ద్వంద్వ ప్రభుత్వం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు