బేసిక్ విద్య ప్రధాన లక్ష్యం ఏంటి?
విద్యా దృక్పథాలు
టీఆర్టీకి హాజరయ్యే ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, పండిట్ అభ్యర్థులు తొందరపాటు లేకుండా ప్రశ్నకిచ్చిన ఐచ్ఛికాలను (ఆప్షన్స్) జాగ్రత్తగా అవగాహన చేసుకోగలిగితే సులభంగా సమాధానం ఇవ్వవచ్చు. డీఎస్సీ-2012లో అడిగిన కింది ప్రశ్నను పరిశీలించండి.
ప్ర. కింది వాటిలో ఉపాధ్యాయుడి వృత్తిపరమైన అభివృద్ధికానిది?
1) సమ్మిళిత విద్యకు సంబంధించిన కార్యశాలకు హాజరవడం
2) సెమినార్లకు హాజరవడం, పత్ర సమర్పణ చేయడం
3) డైట్, ఎస్సీఈఆర్టీ వారి వృత్యంతర కార్యక్రమాలకు హాజరవడం
4) ప్రమోషన్ ద్వారా ఉన్నత స్థాయికి ఎదగడం
-పై ప్రశ్నను విశ్లేషిస్తే ఉపాధ్యాయ వృత్తిపరమైన అభివృద్ధి కానిది అని ప్రశ్న నెగెటివ్ (రుణాత్మకంగా)లో ఉన్నది. కాబట్టి టీఆర్టీ అభ్యర్థులంతా ఇచ్చిన నాలుగు ఐచ్ఛికాల్లో ఉపాధ్యాయ వృత్తిపరమైన అభివృద్ధికి సంబంధించిన అంశాలేవో తెలుసుకోగలిగితే, కానిది ఏదో సులభంగా తెలిసిపోతుంది.
-మొదటి ఐచ్ఛికాన్ని పరిశీలిస్తే ఉపాధ్యాయుడు సమ్మిళిత విద్య కార్యశాల (ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ వర్క్‌షాప్)కు హాజరైతే ప్రత్యేక అవసరాలుగల పిల్లలకు, సాధారణ పిల్లలతో కలిపి ఎలా బోధించాలో అవగతమై ఆ జ్ఞానం వృత్తిపరమైన అభివృద్ధికి దోహదపడుతుంది. కానీ ప్రశ్నలో అభివృద్ధికానిది ఇచ్చారు. కాబట్టి ఈ ఐచ్ఛికం సరైనది కాదు.
-రెండో ఐచ్ఛికాన్ని పరిశీలిస్తే సెమినార్లకు హాజరుకావడం వల్ల తను స్వతహాగా రచించిన పత్ర సమర్పణ చేయడమనేవి వృత్తిపరమైన అభివృద్ధికి దోహదపడుతాయి. ఇది కూడా సరైనది కాదు.
-మూడో ఐచ్ఛికాన్ని గ్రహిస్తే డైట్, ఎన్సీఈఆర్టీ వృత్యంతర కార్యక్రమాలకు హాజరైతే బోధనామెలకువలు, అవగాహన పెరిగి వృత్తిపర అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ జవాబు కూడా సరైనది కాదు.
-నాలుగో ఐచ్ఛికం ప్రమోషన్ ఉపాధ్యాయుని హోదాను పెంచుతుంది. కానీ దానివల్ల జ్ఞానం పెరిగి వృత్తిపర అభివృద్ధి జరగదు. కాబట్టి ఉపాధ్యాయ వృత్తిపరమైన అభివృద్ధికానిది నాలుగో ఐచ్ఛికం.
-టీఆర్టీ పరీక్షలో ఒకేలా ఉండి తికమకపెట్టే ఇలాంటి ఐచ్ఛికాలను జాగ్రత్తగా విశ్లేషించి జవాబిస్తే విజయం మీదే.
విజయానికి దోహదపడే మాదిరి ప్రశ్నలు
1. వేదకాలం నాటి విద్యకు సంబంధించనిది?
1) మోక్ష సాధన 2) ఆత్మసాక్షాత్కారం
3) సర్వం దుఃఖం 4) జ్ఞానం పొందడం
2. కలకత్తా, ముంబై, మద్రాస్ విశ్వవిద్యాలయాలు కార్యరూపం దాల్చిన ఏడాది?
1) 1967 2) 1857 3) 1957 4) 1867
3. విశ్వవిద్యాలయ చట్టం-1904ను వ్యతిరేకించిన తొలి భారతీయుడు?
1) గాంధీజీ 2) గోపాలకృష్ణ గోఖలే
3) గోవింద్ జీ 4) ఏదీకాదు
4. బేసిక్ విద్య ప్రధాన లక్ష్యం?
1) శిశుకేంద్రీకృత విద్య
2) విద్య ఉత్పాదకతతో ముడిపెట్టడం
3) సమగ్రమూర్తిమత్వం పెంచడం 4) పైవన్నీ
5. 3 నుంచి 6 ఏండ్ల పూర్వప్రాథమిక విద్యకు నాంది పలికినవారు?
1) సార్జంట్ 2) శాడ్లర్ 3) ఉడ్స్ 4) హంటర్
6. మాధ్యమిక విద్యను బలోపేతం చేస్తే విశ్వవిద్యాలయ విద్య మెరుగుపడుతుందన్న రాష్ట్రపతి?
1) రాజేంద్రప్రసాద్ 2) రాధాకృష్ణన్
3) రామ్‌నాథ్ 4) అబ్దుల్ కలాం
7. 1952-53 విద్యాకమిషన్ లక్ష్యం?
1) సెకండరీ విద్యను మెరుగుపర్చడం
2) ప్రాజెక్ట్, క్రీడాపద్ధతులకు ప్రాధాన్యమివ్వడం
3) బహుళసార్థక పాఠశాలలు నెలకొల్పడం 4) పైవన్నీ
8. ఉపసంపద పండుగకు సంబంధించిన విద్య?
1) వేదవిద్య 2) బౌద్ధవిద్య
3) ఇస్లాం విద్య 4) జైనవిద్య
9. నూతన జాతీయ విద్యావిధానం రూపొందించిన సంవత్సరం?
1) 1968 2) 1986 3) 1978 4) 1987
10. ఆంగ్లంరాని భారతీయులకు మాతృభాషలోనే బోధించాలని పేర్కొన్న మొదటి వ్యక్తి?
1) హంటర్ 2) ఉడ్స్ 3) సార్జంట్ 4) హార్పాగ్
11. పాఠశాల మాద్యమిక విద్యను బలపర్చడానికి సెకండరీ విద్యా కమిషన్ 1952-53ను నియమించినవారు?
1) రాష్ట్ర ప్రభుత్వం 2) ఎస్సీఈఆర్టీ
3) సీఏపీఈ 4) సీఏబీఈ
12. ఒకటో తరగతి నుంచే ఆంగ్లభాష బోధనకు ప్రాముఖ్యత ఇవ్వాలన్నది ఎవరు?
1) ఆచార్య రామ్మూర్తి 2) ప్రొ. యశ్పాల్
3) గోఖలే 4) ఆదిశేషయ్య
13. సక్సెస్ పాఠశాలలో స్టేట్ సిలబస్‌ను ప్రవేశపెట్టాలన్న కమిటీ?
1) శాడ్లర్ 2) సార్జంట్ 3) కొఠారి 4) యశ్పాల్
14. 6-14 ఏండ్ల బాలబాలికలకు ఉచిత విద్య అందించాలన్న ప్రముఖులు?
1) సార్జంట్ 2) గోఖలే 3) హార్టాగ్ 4) కొఠారి
15. పీఓఏ-ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ ఏర్పడిన సంవత్సరం?
1) 1990 2) 1992 3) 1993 4) 1991
16. భారతీయ విద్యా కమిషన్ అధ్యక్షులు?
1) కొఠారి 2) మొదలియార్
3) రాధాకృష్ణన్ 4) గోఖలే
17. వేదకాలంలో ఉపనయనం పొందినవారిని ఏమంటారు?
1) గురువులు 2) ద్విజులు
3) సమవర్తనులు 4) శిష్యులు
18. మదరసాల్లో బోధించే వైద్యవిద్య దేనికి సంబంధించినది?
1) రియాబి 2) మదర్సా 3) తాబీ 4) ఇలాహి
19. వేదకాలంలో క్షత్రియుల విద్య ప్రారంభమయ్యే వయస్సు?
1) ఎనిమిదేండ్లు 2) పన్నెండేండ్లు
3) పద్నాలుగేండ్లు 4) పదేండ్లు
20. హంటర్ కమిషన్-1882ను నియమించిన గవర్నర్ జనరల్?
1) లార్డ్ రిప్పన్ 2) మెకాలే
3) బెంటింగ్ 4) డల్హౌసీ
21. ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మార్చాలన్న కమిటీ?
1) రామ్మూర్తి కమిటీ 2) ఆదిశేషయ్య కమిటీ
3) ఛటోపాధ్యాయ కమిటీ 4) యశ్పాల్ కమిటీ
22. ఉడ్స్ డిస్పాచ్ ఏర్పడిన సంవత్సరం?
1) 1835 2) 1882 3) 1854 4) 1857
23. ప్రాథమిక విద్యను మెరుగుపరిచే తొలి భారతీయ విద్యా కమిషన్?
1) హార్టాగ్ కమిషన్ 2) హంటర్ కమిషన్
3) శాడ్లర్ కమిషన్ 4) ఉడ్స్ కమిషన్
24. బహుళ సార్థక పాఠశాలలు విద్యార్థుల భవిష్యత్తుకు దోహదపడుతాయన్నవారు?
1) కొఠారి 2) ఈశ్వరీబాయి పటేల్
3) మొదలియార్ 4) జనార్దన్‌రెడ్డి
25. సమవర్తనోత్సవం అనే పండుగ జరిపిన కాలం?
1) బ్రిటిష్‌కాలం 2) వేదకాలం
3) బౌద్ధకాలం 4) ఇస్లాంకాలం
26. క్యుములేటివ్ రికార్డ్స్ పాఠశాలలో ప్రవేశపెట్టడంవల్ల విద్యార్థి సమగ్రాభివృద్ధిని అవగాహన చేసుకోవచ్చన్నవారు?
1) రాధాకృష్ణన్ 2) మొదలియార్
3) యశ్పాల్ 4) కొఠారి
27. కిందివాటిలో సరైన జతను గుర్తించండి.
1. శాడ్లర్ ఎ. భారం లేని విద్య
2. మొదలియార్ బి. 10+2+3 విద్యావిధానం
3. కొఠారి సి. 5+3+4+3
4. యశ్పాల్ డి. త్రిభాషా సూత్రం
1) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-ఎ, 2-సి, 3-డి, 4-సి
4) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
28. విద్యాస్థాయిలో పాఠశాల స్థాయిలను సూచించినవారు?
1) కొఠారి 2) చార్లెస్ఉడ్
3) హార్టాగ్ 4) హంటర్
29. వృథా-స్తబ్ధత నివారించడానికి ఏర్పడిన కమిటీ?
1) సార్జంట్ 2) రామ్మూర్తి
3) హార్టాగ్ 4) శాడ్లర్ కమిటీ
30. ఓబీబీ, నవోదయ పాఠశాలలు రావడానికి ఆధారమైనది?
1) ఎన్పీఈ-68 2) పీఓఏ-92
3) ఎన్పీఈ-86 4) ఏదీకాదు
31. విద్యార్థుల ఏ అంశాన్ని గురించి శ్రద్ధ వహించేది ఉత్తమ పాఠశాల?
1) మానసిక విద్య 2) శారీరక విద్య
3) సమగ్రాభివృద్ధి 4) సాంఘిక విద్య
32. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొదించడానికి తోడ్పడే బోధనా మెళకువలలో ఒకటి?
1) సహకార పని 2) జట్టు పని
3) ప్రశ్న, సమాధానమివ్వడం 4) మేధోమథనం
33. తరగతి గదిలో వైయక్తి భేదాల జ్ఞానం, ఉపాధ్యాయునికి ఎందుకు ఉపయోగపడుతుంది?
1) విద్యార్థుల ఇంటిపనిని మూల్యాంకనం చేయడానికి
2) తరగతిలో క్రమశిక్షణను నిర్వహించడానికి
3) తరగతిలో ఆవశ్యకమైన ఏర్పాట్లు చేసుకోవడం
4) బోధనాభ్యసన కృత్యాల రూపకల్పనకు
34. ఒక సాంఘిక ఉప-వ్యవస్థగా, విద్య ముఖ్యపాత్ర?
1) సమాజంలోని లోపాలను ఎత్తిచూపడం, సరిచేయడం
2) రాబోయే తరాలకు సాంఘిక విలువలు అందించడం
3) ప్రజలు శాంతియుత జీవనాన్ని గడపడానికి తోడ్పడటం
4) సమాజంలోని ఆధునీకరణను ప్రవేశపెట్టడం
35. కిందివాటిలో విద్యమూల స్తంభాల్లో ఒకటి కానిది?
1) వ్యక్తిగా రూపుదిద్దుకోవడానికి అభ్యసించడం
2) తెలుసుకొనేందుకు అభ్యసించడం
3) సంపాదనకు అభ్యసించడం
4) పనిచేయడానికి అభ్యసించడం
36. కిందివాటిలో భిన్నమైన సామర్థ్యం ఉన్న పిల్లల విద్యకు సంబంధం లేనిది?
1) వికలాంగులకు సమైక్య విద్య 2) సమ్మిళిత విద్య
3) సృజనాత్మక విద్య 4) ప్రత్యేక విద్య
37. ఆహ్లాదం, సంతృప్తి లేకపోగా భయం, ఒత్తిడితో కూడిన అభ్యసనం?
1) మంచి మార్కులు సంపాదించడానికి సహాయపడుతుంది.
2) దీర్ఘకాలిక స్మృతికి దోహదపడుతుంది
3) అభ్యసనాన్ని ఆటంకపరుస్తుంది
4) అభ్యసనాన్ని పెంచుతుంది
38. శిశుకేంద్రిత విద్యాబోధన అంటే?
1) విద్యార్థులు, వారికి ఇష్టమైన వాటిని చేసేందుకు అనుమతించడం
2) శిశువు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా సిద్ధపరిచేందుకు బోధించడం
3) ఆకర్షణీయమైన శ్రవ్య-దృశ్యోపకరణాలతో బోధించడం
4) విద్యార్థుల అనుభవాలకు, అభిప్రాయాలకు చురుగ్గా పాల్గొనేందుకు ప్రాధాన్యం ఇవ్వడం
సమాధానాలు
1-3, 2-2, 3-2, 4-4, 5-1, 6-2, 7-4, 8-2, 9-2, 10-2, 11-4, 12-2, 13-4, 14-1, 15-2, 16-1, 17- 2, 18-2, 19- 4, 20-1, 21- 1, 22-3, 23-2, 24-2, 25-2, 26-4, 27-1, 28-2, 29-3, 30-3, 31-3, 32-4, 33-4, 34-4, 35-3, 36-3, 37- 3, 38-4
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు