1. మురుమురాలు = వరి పేలాలు
2. తోగరు = కందులు
3. భండార = దైవ సంబంధమైన కార్యం దేవతకు అర్పించిన పసుపు
4. దోణి = నీళ్లు పారించే పనిముట్టు
5. రొట్ట = పెనంపై చేసిన రొట్టె
6. బయ్ = వయి
7. పు(వు)స్తుకముకడై = పాశము వండే పెద్దపాత్ర
8. ఝర్ని-ఝరా = నీళ్లయూట, జలపాతం
-ఖరోష్టి, బ్రాహ్మీ లిపులు కూడా లేకపోలేవు. తోగరు-ఝరా-బుదేర-గొంగొత్తు-గంగోజనాస్త-అంత్వాస్తరాము మొదలైన ప్రాకృత సంబంధమైన కొన్ని గ్రామాల పేర్లు తెలంగాణలో ఉన్నాయి. నా చరిత్ర పరిశోధనలో ఇలా ఎన్నో ఉన్నాయి.
I. ప్రాకృత (బ్రాహ్మీ) శాసనం (ఝరాసంగం వద్ద లభ్యమైంది)
సిరిస బారియా దెవస పుత్రదస వరదస కామదస
ధనదస/వేదసిరి-మాతు సతినోసిరి మస చమాతు యసీమ పథమయ!!!
సంస్కృతం (సంస్కృత ఛాయ)
శ్లో॥ శ్రియంః భార్యాయా దేవస్య పుత్ర దస్య వరదస్య కామదస్య
ధనదస్య, వేదశ్రీమాత్రా శక్తేః శ్రీమతః (శక్తి శ్రియః) చమాత్రా!!!
II. ప్రాకృత పదం- వరియ (నా) గవరదయినియ… సుగంధాయనీయ…
సంస్కృత పదం (ఛాయ) నాగ వరదాయిన్యా… సుగన్ద ద్రవ్యహుత్యా
లేదా సుగన్దీకృతా: అనికూడా చదువుకోవచ్చు. ప్రాకృత (బ్రాహ్మీ), పైశాచీ, సంస్కృత భాషల లిపులు ప్రాచీన తెలంగాణలో శాతవాహనుల కాలం కంటే ముందు నుంచి ఉన్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పటికీ తెలంగాణలో సంస్కృత-తెలుగు పండితులే కాదు ప్రాకృత బ్రాహ్మీ పండితులు కూడా ఉన్నారన్నది నిజం.
తెలంగాణలో ప్రాకృత పదాలు
ప్రాకృత (బ్రాహ్మీ): నిక్కిణ ఇ మహ మా సమ్మి పామరోపా ఇడింప ఇవేణ
ణి ద్ఢూమ మమ్మురవ్వి ఆసామలియధణో పడిచ్చన్తో!!!
సంస్కృత ఛాయః : విక్రీణితే మాఘమాసే పామరః ప్రావరదింబలీ వర్దేన
నిర్దూమ ముర్మురని బౌ శ్యామలాః స్తనౌ పశ్యన్!!!
ఏకమ్: శాసనమ్ సిద్దంనమః ప్రజాపతయే ధర్మాయ నమః
ఇంద్రాయ: నమస్సంకర్షణ వాసుదేవాభ్యాం-చంద్ర సూర్యాభ్యాం
మహిమావాద్భ్యాం చతుర్ఖ్యః చలోక పాలేభ్యః యవవరుణ
కుభేర వాసవేభ్యః నమః కుమార వరాయ వేదిశ్రియా! రాజ్ఞా!!!
పై పద్యానికి అర్థం: ధర్మ ప్రజాపతికి నమస్కారము. ఇంద్రునకు నమస్కారము. సంకర్షణవాసుదేవులకు, సూర్యచంద్రులకు హిమవంతులైన నలుగురు లోకపాలురు అయిన యమవరుణ కుబేరవాసవులకు నమస్కారము. కుమార వరుడైన వేదశ్రీకి కూడా నమస్కారము. రాజు అనే ఆజ్ఞ ఇందులో కుమారవరుడైన వేదశ్రీ (అనునామాంకము) అనేది చక్కని నామ సూచికము. ఈ శాసనమ్ చాలా ఆర్వా(ప్రా)చీనమైనది. ఇలాంటి శాసనాలు తెలంగాణలో అక్కడక్కడా వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఝరాసంగం (జహీరాబాద్ సమీపంలో) నందు చాలాకాలం క్రితం తవ్వకాల్లో ఈ శాసనం లభ్యమైంది.