ఎల్ఐసీ స్కాలర్షిప్
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ఏటా ఉపకారవేతనాలను అందిస్తుంది.
ఎవరు అర్హులు ?
- కనీసం 60 శాతం మార్కులతో పదోతరగతి, ఇంటర్ ఉత్తీర్ణులు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం, ఐటీఐ, డిప్లొమా, పాలిటెక్నిక్ ఏదైనా ఒకేషనల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- కుటుంబ వార్షికాదాయం రూ.లక్ష మించరాదు.
- స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ స్కీం కింద దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు పదోతరగతిలో కనీసం 60 శాతం మార్కులతో పాసై ఉండాలి. అండర్ గ్రాడ్యుయేషన్కు మాత్రమే స్కాలర్షిప్ ఇస్తారు.
ఎంపిక విధానం ఇలా !
కనీస అర్హతగా పేర్కొన్న పదోతరగతి లేదా ఇంటర్ మార్కులు, కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆధారంగా ఎంపిక చేస్తారు. తక్కువ ఆదాయం ఉన్న వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ స్కాలర్షిప్ను ఇస్తారు.
ఉపయోగాలు
దేశవ్యాప్తంగా ఒక్కో ఎల్ఐసీ డివిజనల్ సెంటర్కు 20 మందికి ఇస్తారు. దీనిలో 10 బాలురకు, 10 బాలికలకు ఇస్తారు. ఎంపికైన విద్యార్థికి ఏటా రూ.20 వేలు మూడు విడుతలుగా ఎల్ఐసీ చెల్లిస్తుంది.
ఈ మొత్తాలను నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తారు.
నోట్: మెడికల్, ఇంజినీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు 55 శాతం మార్కులను, సాధారణ డిగ్రీ కోర్సులో చేరినవారు కనీసం 50 శాతం మార్కులను పొందితేనే తర్వాతి సంవత్సరానికి స్కాలర్షిప్ కొనసాగుతుంది. రెగ్యులర్ హాజరు శాతాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
దరఖాస్తు: ఆన్లైన్లో
వెబ్సైట్: https://www.licindia.in
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్
ప్రతిభావంతులైన పేద మైనారిటీ విద్యార్థులు ప్రొఫెషనల్, టెక్నికల్ కోర్సులు చేయడానికి ఏర్పాటు చేసిన స్కాలర్షిప్ స్కీం ఇది.
ఎంతమందికి ఇస్తారు?
దేశవ్యాప్తంగా సుమారు 60 వేల మందికి ఈ స్కాలర్షిప్స్ను ఇస్తారు.
అర్హతలు: గుర్తింపు పొందిన విద్యాసంస్థలో టెక్నికల్/ప్రొఫెషనల్ డిగ్రీ/పీజీ చేస్తున్నవారు. అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. కుటుంబ వార్షికాదాయం రూ. 2.5 లక్షలు మించరాదు.
ఎంత ఇస్తారు?
ఏటా రూ. 20,000 ఇస్తారు. దీంతోపాటు హాస్టల్లో చదివేవారికి రూ.1000, డేస్కాలర్స్కు నెలకు రూ.500 ఇస్తారు.
దరఖాస్తులను ఏటా జూలై/ఆగస్టుల్లో స్వీకరిస్తారు.
వెబ్సైట్: https://scholarships.gov.in
కోటక్ కన్యా స్కాలర్షిప్ – 2021
కోటక్ మహీంద్ర గ్రూప్ కంపెనీకి చెందిన విద్య, జీవనోపాధిలకు సంబంధించిన సీఎస్ఆర్ ప్రాజెక్టు సహకారంతో కోటక్ కన్యా స్కాలర్షిప్ ఏర్పాటైంది. దీన్ని కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ నిర్వహిస్తుంది.
స్కాలర్షిప్ లక్ష్యం
వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన బాలికలను ఉన్నత విద్యనభ్యసించేలా ప్రోత్సహించడం.
ఎవరు అర్హులు ?
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతుండాలి. 75 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత.
కుటుంబ వార్షిక ఆదాయం మూడు లక్షలు మించరాదు.
దరఖాస్తు: ఆన్లైన్లో చివరితేది: సెప్టెంబర్ 30
వెబ్సైట్: https://www.buddy4study.com/page/kotak-kanya-scholarship
ఎల్&టీ బిల్డ్ ఇండియా స్కాలర్షిప్
ఇంజినీరింగ్ పూర్తిచేసి ఎంటెక్ చేసేందుకు ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు ఎల్&టీ బిల్డ్ ఇండియా స్కాలర్షిప్ను అందిస్తుంది.
వివరాలు
ఐఐటీ చెన్నై, ఢిల్లీ. ఎన్ఐటీ సూరత్కల్, తిరుచ్చి భాగస్వామ్యంతో ఎల్&టీ సంస్థ ఈ పథకాన్ని అందిస్తుంది.
ఈ స్కాలర్షిప్కు ఎంపికైన విద్యార్థులు పై నాలుగు ఇన్స్టిట్యూట్లలోనే ఎంటెక్ (కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్) పూర్తి చేయాల్సి ఉంటుంది.
కోర్సు కాలవ్యవధి రెండేండ్లు. ఈ ఇన్స్టిట్యూట్లకు సంబంధించిన స్పాన్సర్షిప్ ఫీజుతోపాటు ట్యూషన్ ఫీజును ఎల్&టీ సంస్థ నేరుగా సంస్థలకు చెల్లిస్తుంది.
దీనితోపాటు విద్యార్థులకు నెలకు రూ.13,400/ ఉపకార వేతనాన్ని అందిస్తుంది.
నోట్: ఈ స్కాలర్షిప్ ఒప్పందం ప్రకారం ఎంటెక్ విజయవంతంగా పూర్తిచేసుకున్న తర్వాత ఐదేండ్లపాటు ఎల్ అండ్ టీ సంస్థలో పని చేయాలి.
అర్హతలు: కనీసం 70 శాతం మార్కులతో బీఈ/బీటెక్ (సివిల్/ఎలక్ట్రికల్)లో ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు చేసుకున్నవారిని షార్ట్లిస్ట్ చేసి ఆన్లైన్ రాతపరీక్ష నిర్వహిస్తారు. దీనిలో అర్హత సాధించినవారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. అనంతరం మెడికల్ టెస్ట్ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్లో
వెబ్సైట్:
https://www.lntecc.com/homepage/
common/build-india-scholarship.html
మైనారిటీ బాలికలకు
దేశంలో బాలికల చదువుకు ఆర్థిక సమస్యలే ప్రధాన అడ్డంకి. మరీ ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు చెందిన వారిలో ఈ సమస్య మరింత అధికం. సరిగ్గా ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద మైనారిటీ విద్యార్థినుల కోసం అందించే స్కాలర్షిప్ల్లో బేగం హజ్రత్ మహల్ నేషనల్ స్కాలర్షిప్ ముఖ్యమైనది. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఏటా అందిస్తుంది.
లక్ష్యం
ప్రతిభావంతులైన మైనారిటీ వర్గాలలోని పేద బాలికలను ఉన్నత చదువులకు ప్రోత్సహించే లక్ష్యంతో ఈ స్కాలర్షిప్ను 2003లో కేంద్రం ప్రారంభించింది. ఈ ఉపకార వేతనాలను ఢిల్లీలోని మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అందిస్తుంది.
ఎవరు అర్హులు ?
దేశవ్యాప్తంగా తొమ్మిదో తరగతి నుంచి పన్నెండు అంటే ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థినులందరూ ఈ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థులు మైనారిటీ వర్గాల్లోని ముస్లిం, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, పార్శీ, జైన్ మతాలకు చెంది ఉండాలి.
కుటుంబ వార్షిక ఆదాయం రెండు లక్షలకు మించరాదు.
ముందు తరగతుల్లో కనీసం 50 శాతం మార్కులు పొంది ఉండాలి. అంటే ఇంటర్ విద్యార్థిని దరఖాస్తు చేసుకుంటే పదోతరగతి మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.
ప్రయోజనాలు
9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు నెలకు ఐదువందలు, ఇంటర్ విద్యార్థినులకు నెలకు ఆరువేల చొప్పున స్కాలర్షిప్ ఇస్తారు.
స్కాలర్షిప్ కింద డబ్బు ప్రతి నెలా నేరుగా అభ్యర్థుల ఖాతాలోకి జమ అవుతుంది.
దరఖాస్తు: ఆన్లైన్లో
పూర్తి వివరాల కోసం వెబ్సైట్: http://maef.nic.in
పోస్ట్ గ్రాడ్యుయేట్ మెరిట్ స్కాలర్షిప్
దేశంలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రతిభావంతులను ఉన్నత చదువు చదివేలా ప్రోత్సహించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఉపకారవేతనాలను అందిస్తుంది. ఈ స్కీంను పోస్ట్ గ్రాడ్యుయేట్ మెరిట్ స్కాలర్షిప్ అని పిలుస్తారు.
ఎవరు అర్హులు ?
- యూనివర్సిటీ స్థాయిలో ఏదైనా డిగ్రీ కోర్సులో టాపర్లుగా అంటే మొదటి, రెండో స్థానాలలో నిలిచినవారు, ప్రైవేట్, డీమ్డ్, అటానమస్ సంస్థల్లో టాపర్లుగా నిలిచిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- వీరు పీజీ మొదటి సంవత్సరంలో ప్రవేశం పొంది ఉండాలి.
- మొత్తం స్కాలర్షిప్స్: 3000 వీటి వ్యవధి రెండేండ్లు.
- ఈ స్కాలర్షిప్ కింద నెలకు రూ. 3,100 చొప్పున చెల్లిస్తారు.
- వయస్సు 30 ఏండ్లు మించరాదు
- పీజీలో మ్యాథ్స్, ఫిజికల్, కెమికల్, ఎర్త్, సోషల్ సైన్సెస్, కామర్స్, లాంగ్వేజ్ కోర్సుల్లో ప్రవేశం పొందినవారు అర్హులు.
- పీజీ మొదటి సంవత్సరం కనీసం 60 శాతం మార్కులు సాధిస్తేనే రెండో సంవత్సరం స్కాలర్షిప్ వస్తుంది.
- నోట్: ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సులు చదువుతున్నవారికి స్కాలర్షిప్ వర్తించదు.
- పూర్తి వివరాల కోసం వెబ్సైట్: https://scholarships.gov.in
- వీటితోపాటు దేశంలో అనేక రాష్ర్టాలు పలు రకాల స్కాలర్షిప్స్ను అందిస్తున్నాయి. ఫీజు రీ ఎంబర్స్మెంట్ కింద చదువుకు
- చేయూతనిస్తున్నాయి.
- నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ (ఎన్ఎస్పీ) ద్వారా పలు రకాల స్కాలర్షిప్స్కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనిలో సెంట్రల్ స్కీం, యూజీసీ/ఏఐసీటీఈ, స్టేట్ స్కీం కింది అనేక రకాల స్కాలర్షిప్స్ అందుబాటులో ఉన్నాయి.
పూర్తి వివరాల కోసం వెబ్సైట్: https://scholarships.gov.in
- Tags
- LIC Scholarship
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు