ఇంజినీరింగ్ స్కిల్స్‌కు లెవల్స్
– నాలుగేండ్లకు నాలుగు లెవల్స్
– అమలుకు ఏఐసీటీఈ ఆదేశం
వర్తమాన ప్రపంచంలోనైపుణ్యం ఉన్న వారికే ప్రపంచం రెడ్‌కార్పెట్ పరుస్తున్నది. ఇంజినీరింగ్ విద్యలోనూ నైపుణ్యతకు ప్రాధాన్యమిస్తూ అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ విద్యాసంవత్సరం నుంచి నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్ (ఎన్‌హెచ్‌ఈక్యూఎఫ్), నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ఎస్క్యూఎఫ్)ను అమలుచేయాలని నిర్ణయించింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమల్లో భాగంగా ఈ విధానాన్ని అమలుచేస్తున్నట్టు ఏఐసీటీఈ వెల్లడించింది. డిప్లొమా ఫస్టియర్‌ను లెవల్ 3గా పేర్కొనగా, సెకండియర్ను లెవల్ 4గా, థర్డ్ ఇయర్‌ను లెవల్ 5గా వ్యవహరిస్తారు. ఇంజినీరింగ్ కోర్సులను లెవల్-5 నుంచి 7 వరకు ప్రకటించారు. అంతర్జాతీయంగా నైపుణ్యాలు, చదువులను లెవల్స్గానే వ్యవహరిస్తున్నారు. మన దగ్గరి ఇంటర్, డిప్లొమా కోర్సుల గురించి అంతర్జాతీయంగా చాలా మందికి తెలియదు. దీంతో మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో స్కిల్స్, విద్యార్థుల ప్రతిభ ఆధారంగా లెవల్స్‌గా విభజించి అమలుచేస్తున్నారు. ఈ లెవల్స్‌ను అంతర్జాతీయంగా ఎక్కడికి వెళ్లినా వినియోగించుకోవచ్చని సాంకేతిక నిపుణులు తెలిపారు.
అంతర్జాతీయంగా..
సంవత్సరం లెవల్
బీటెక్ ఫస్టియర్ 5
బీటెక్ సెకండియర్ 6
బీటెక్ థర్డ్ ఇయర్ 7
బీటెక్ ఫోర్త్ ఇయర్ యూజీఇంజినీరింగ్ డిగ్రీ
అకడమిక్ లెవల్ సర్టిఫికెట్ యూనిఫైడ్క్రెడిట్స్
డిప్లొమా ఫస్టియర్/ 11వ తరగతి — 3.5
డిప్లొమా సెకండియర్ / 12వ తరగతి — 4.0
డిప్లొమా చివరి సంవత్సరం డిప్లొమా 4.5
బీటెక్ ఫస్టియర్ యూజీ సర్టిఫికెట్ 4.5
బీటెక్ సెకండియర్ యూజీ డిప్లొమా 5.0
బీటెక్ మూడో సంవత్సరం బ్యాచిలర్ ఆఫ్ నొకేషనల్ ఎడ్యుకేషన్ 5.5
బీటెక్ నాలుగో సంవత్సరం బీఈ/బీటెక్ 6.0
ఎంటెక్ ఫస్టియర్ పీజీ సర్టిఫికెట్ 6.5
ఎంసెట్ చివరి సంవత్సరం ఎంఈ/ ఎంటెక్ 7.0
పీహెచ్డీ పీహెచ్డీ 8.0
- Tags
- AICTE
- engineering
- Levels
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు