తెలంగాణ జలియన్‌వాలా బాగ్గా పేరుగాంచిన గ్రామం?
సామాజిక సంస్కరణ చట్టాలు
సతీ నిషేధ చట్టం- 1829- విలియం బెంటింక్
శిశు హత్యల నిషేధ చట్టం – 1829- విలియం బెంటింక్
బానిస వ్యవస్థ నిర్మూలన చట్టం- 1843- లార్డ్ ఎలెన్‌బరో
నరబలుల నిషేధ చట్టం-1846- హార్డింజ్-1
కుల వివక్షతా నిర్మూలన చట్టం- 1850- లార్డ్ డల్హౌసీ
వితంతు పునర్వివాహ చట్టం-1856- లార్డ్ డల్హౌసీ
విద్యా సంస్కరణ కమిషన్లు
చార్లెస్ ఉడ్స్ డిస్పాచ్- 1854- లార్డ్ డల్హౌసీ
డబ్యూడబ్యూ హంటర్ కమిషన్-1882- లార్డ్ రిప్పన్
థామస్ ర్యాలీ కమిషన్-1902- లార్డ్ కర్జన్
సాడ్లర్ కమిషన్-1917- లార్డ్ చేమ్స్‌ఫర్డ్
హార్టోగ్ కమిటీ- 1929- లార్డ్ ఇర్విన్
కమిషన్లు- అంశం
హంటర్ కమిషన్- జలియన్‌వాలాబాగ్ దుర్ఘటన
ఫ్రెజర్ కమిషన్- పోలీస్ సంస్కరణలు
హాలాండ్ కమిషన్- కర్మాగారాలు
లిన్లిత్గో కమిషన్- వ్యవసాయం
విట్లీ కమిషన్ (రాయల్ కమిషన్)- కార్మిక సమస్యలపై
బట్లర్ కమిషన్- భారత్‌లో రాష్ర్టాల మధ్య సంబంధాలపై
సైమన్ కమిషన్-1919 భారత ప్రభుత్వ చట్టం అమలు తీరుపై
రైల్వే విశేషాలు
దేశంలో తొలిరైలు 1853 ఏప్రిల్ 16న బొంబాయి- థానే మధ్య ప్రారంభమైంది.
దీన్ని గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ ప్రారంభించాడు
దీని పొడవు 34 కి.మీ.
మహబూబియా పాఠశాల
కంటోన్మెంట్‌కు సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్ పీ సోమసుందరం మొదలియార్ బ్రిటిష్ అధికారుల సహాయంతో 1862లో ఆంగ్లో వెర్నాక్యులార్ స్కూల్‌ను సికింద్రాబాద్‌లో ప్రారంభించారు. ఈ స్కూల్‌కు ఆరో నిజాం మీర్ మహబూన్ అలీఖాన్ నిధులను సమకూర్చడంతోపాటు ప్రతి ఏడాది పాఠశాల నిర్వహణకు గ్రాంట్ మంజూరు చేసేవారు. దీంతో ఈ పాఠశాల పేరును మహబూబియా పాఠశాలగా మార్చారు.
మహబూబియా కళాశాల
పాఠశాలగా ప్రారంభమై తర్వాత కాలంలో కాలేజీ స్థాయికి ఎదిగింది. ప్రముఖ సంఘ సేవకులు రఘపతి వెంకటరత్నం, మాడపాటి హనుమంతరావు ప్రిన్స్‌పాల్‌గా పనిచేశారు.
1893 ఫిబ్రవరి 13న స్వామి వివేకానంద స్థానిక ప్రజలను ఉద్దేశించి ఈ కాలేజీ ప్రాంగణం నుంచే ప్రసంగించారు.
తొలి పోస్టాఫీస్
హైదరాబాద్ నగరంలో తొలి పోస్టాఫీస్‌ను 1866, మార్చి 14న బొల్లారంలో ఏర్పాటు చేశారు.
నిజాం కాలంలో సికింద్రాబాద్‌లో బ్రిటిష్ వారు తమ స్థావరాలను ఏర్పాటు చేసుకోవడంతో వారి సమాచార సౌకర్యార్థం ఈ పోస్టాఫీస్‌ను ప్రారంభించారు.
తొలిసారిగా టెలిగ్రాఫ్ సౌకర్యం కూడా ఇక్కడి నుంచే ప్రారం భించారు.
ప్రాక్టీస్ బిట్స్
1.1887లో ఏ మీడియంలో విద్యను అందించేందుకు నిజాం కాలేజీని స్థాపించారు? (సి)
ఎ) ఉర్దూ బి) పర్షియన్
సి) ఇంగ్లిష్ డి) తెలుగు
2. కింది తెలంగాణ జిల్లాలను వాటి పూర్వనామాలతో జతపర్చండి? (బి)
1. కరీంనగర్ ఎ. పాలమూరు
2. ఆదిలాబాద్ బి. ఇందూరు
3. నిజామాబాద్ సి. ఎదులాపురం
4. మహబూబ్‌నగర్ డి. ఎలగందల
ఎ) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
డి) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
3. కింది జానపద కళాకారులను వారి దాతృకులాలతో జతపర్చండి? (డి)
1. సాధనాశూరులు ఎ. మాదిగలు
2. విప్రవినోదులు బి. పద్మశాలి
3. వీరముష్టి సి. ఆర్యవైశ్యులు
4. బైండ్ల డి. బ్రాహ్మణులు
ఎ) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
బి) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
సి) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
డి) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
4. ఇటీవల పద్మశ్రీ అవార్డు అందుకున్న తెలంగాణ జానపద కళాకారుడు దర్శనం మొగిలయ్య ఏ కళలో ప్రసిద్ధి? (ఎ)
ఎ) 12 మెట్ల కిన్నెర బి) యక్షగానం
సి) వీణ డి) కర్రసాము
5. నిజాం కాలంలో ఏర్పడిన పరిశ్రమలను అవి ఏర్పడిన సంవత్సరాలను జతపర్చండి? (ఎ)
1. డీబీఆర్ మిల్స్ ఎ. 1920
2. నిజాం షుగర్ ఫ్యాక్టరీ బి. 1938
3. సిర్పూర్ పేపర్ మిల్స్ సి. 1937
4. ఆల్విన్ మెటల్ వర్క్స్ డి. 1942
ఎ) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
బి) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
సి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
డి) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
6. కింది వారిలో ఎవరు విశాలాంధ్రను కోరుతూ ఎస్ఆర్సీకి నివేదిక ఇచ్చారు? (ఎ)
ఎ) కాళోజీ బి) దాశరథి
సి) కేవీ రంగారెడ్డి డి) కొండాలక్ష్మణ్
7. తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్ర పుస్తక రచయిత ఎవరు? (సి)
ఎ) రావి నారాయణరెడ్డి
బి) భీంరెడ్డి నర్సింహారెడ్డి
సి) దేవులపల్లి వేంకటేశ్వరరావు
డి) మల్లు స్వరాజ్యం
8. ఏ నిజాం రాజు కాలంలో హైదరాబాద్ రాజ్యంలో రాజభాషను పర్షియన్ నుంచి ఉర్దూకు మారుస్తూ ఆదేశాలిచ్చారు? (బి)
ఎ) నజీరుద్దౌలా
బి) మీర్ మహబూబ్ అలీఖాన్
సి) మీరు ఉస్మాన్ అలీఖాన్
డి) అఫ్జలుద్దౌలా
9. 1937లో 7వ నిజాం అరవముదం అయ్యంగార్ కమిటీని ఏ రంగంలో సంస్కరణల కోసం నియమించాడు? (బి)
ఎ) పోలీస్ సంస్కరణలు
బి) రాజ్యాంగపరమైన సంస్కరణలు
సి) వ్యవసాయ సంస్కరణలు
డి) రెవెన్యూ సంస్కరణలు
10. మలిదశ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల్లో తెలంగాణ కోసం పోరాడాలనే చైతన్యాన్ని నింపి, తెలంగాణ ప్రాంత సమస్యలపై,
అన్యాయాలపై ప్రశ్నించిన తొలి విద్యార్థి సంఘం? (బి)
ఎ) తెలంగాణ విద్యార్థి పరిషత్
బి) తెలంగాణ లిబరల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్
సి) పీడీఎస్‌యూ
డి) ఎస్ఎఫ్ఐ
11. 2001లో తెలంగాణ రాష్ట్రసమితి ఆవిర్భావ సభ ఎక్కడ జరిగింది? (సి)
ఎ) బీఆర్కే భవన్ బి) తెలంగాణ భవన్
సి) జలదృశ్యం డి) ఠాగూర్ అడిటోరియం (ఓయూ)
12. చిన్న, పెద్ద రాష్ర్టాల ఏర్పాటుకు అంబేద్కర్ సూచించిన మూడు నిర్ణయాంశాలు? (బి)
ఎ) భాష, ప్రాంతం, ఆర్థిక స్వావలంబన
బి) జనాభా, భౌగోళిక విస్తీర్ణం, ఆర్థిక స్వావలంబన
సి) భాష, జనాభా, సహజ వనరులు
డి) భాష, సంస్కృతి, మాండలికాలు
13. హైదరాబాద్ రాజ్యంలో జిలాబందీ వ్యవస్థను ఎప్పుడు ప్రారంభించారు? (బి)
ఎ) 1853-54 బి) 1864-65
సి) 1867-68 డి) 1883-84
14. 1997లో దోఖాతిన్న తెలంగాణ పేరుతో తెలంగాణ మహాసభ భారీ సమావేశం ఎక్కడ జరిగింది? (సి)
ఎ) భువనగిరి బి) వివేకవర్ధిని కళాశాల
సి) సూర్యపేట డి) వరంగల్
15. అవసరమైన సంప్రదింపుల ద్వారా ఏకాభి ప్రాయం కుదిర్చి సరైన సమయంలో యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు అంశాన్ని
చేపడుతుందని పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రకటన చేసిన వ్యక్తి? (బి)
ఎ) చిదంబరం బి) ఏపీజే అబ్దుల్ కలామ్
సి) సుశీల్‌కుమార్ షిండే డి) సోనియాగాంధీ
16. గుస్సాడి నృత్యం ఏ జిల్లాలో ప్రసిద్ధి? (డి)
ఎ) ఖమ్మం బి) వరంగల్
సి) మహబూబ్‌నగర్ డి) ఆదిలాబాద్
17. సిడ్నీ కాటన్, నిజాం అక్రమ ఆయుధాల సరఫరా ఒప్పంద సమాచారాన్ని భారత ఏజెంట్ జనరల్ కేఎం మున్షీకి చేరవేసింది ఎవరు? (డి)
ఎ) కొండాలక్ష్మణ్ బాపూజీ
బి) రావి నారాయణరెడ్డి
సి) ఆరుట్ల రామచంద్రారెడ్డి
డి) వందేమాతరం రామచందర్ రావు
18. ఆంధ్రమహాసభ పిలుపుమేరకు వెట్టికి వ్యతిరేకంగా పోరాడిన మహిళ? (సి)
ఎ) చాకలి ఐలమ్మ బి) ఆరుట్ల కమలాదేవి
సి) మల్లు స్వరాజ్యం డి) సదాలక్ష్మి
19. 1997 జూన్ 1న ప్రత్యేక తెలంగాణ ఉద్యమం – తెలంగాణ అభివృద్ధి – మా కార్యక్రమం పేరుతో ప్రకటన విడుదల చేసింది ఎవరు? (ఎ)
ఎ) పీపుల్స్‌వార్ కేంద్ర కమిటీ
బి) తెలంగాణ మహాసభ
సి) తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం
డి) తెలంగాణ మహాసభ
20. తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో సింహ గర్జన సభ ఎక్కడ జరిగింది? (సి)
ఎ) వరంగల్ బి) నల్లగొండ
సి) కరీంనగర్ డి) ఖమ్మం
21. శ్రీకృష్ణ కమిటీకి రాయల తెలంగాణ కావాలని విజ్ఞప్తి చేసిన రాజకీయ పార్టీ? (సి)
ఎ) లోక్‌సత్తా బి) వైఎస్సార్సీపీ
సి) ఎంఐఎం డి) తెలుగుదేశం
22. కింది వాటిని జతపర్చండి? (బి)
ఎ. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ 1. రాపోలు ఆనందభాస్కర్
బి. తెలంగాణ ప్రజాఫ్రంట్ 2. గద్దర్
సి. తెలంగాణ కళాసమితి 3. బెల్లి లలిత
డి. తెలంగాణ ప్రగతి వేదిక 4. విమలక్క
ఎ) ఎ-2, బి-3, సి-4, డి-1
బి) ఎ-4, బి-2, సి-3, డి-1
సి) ఎ-1, బి-2, సి-3, డి-4
డి) ఎ-3, బి-2, సి-1, డి-4
23. ధూంధాం ఎక్కడ జరిగింది? (ఎ)
ఎ) కామారెడ్డి బి) కరీంనగర్
సి) వరంగల్ డి) సంగారెడ్డి
24. కింది వాటిని జతపర్చండి? (డి)
ఎ. ఊరుమనదిరా ఈ వాడ మనదిరా 1. గూడ అంజయ్య
బి. పల్లె కన్నీరు పెడుతుందో 2. గోరటి వెంకన్న
సి. నీ ఆరు గుర్రాలు, నా ఆరు గుర్రాలు 3. వరంగల్ శంకర్
డి. చూడచక్కని తల్లి 4. అందెశ్రీ
ఎ) ఎ-1, బి-2, సి-4, డి-3
బి) ఎ-2, బి-3, సి-1, డి-4
సి) ఎ-1, బి-4, సి-3, డి-2
డి) ఎ-1, బి-2, సి-3, డి-4
25. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు 2010, జనవరి 23న హైదరాబాద్ నిజాం కాలేజీ ఆవరణలో జరిగిన సభకు హాజరైన ప్రముఖ వ్యక్తి? (డి)
ఎ) జార్జ్ ఫెర్నాండెజ్ బి) శిబుసోరెన్
సి) శరద్‌పవార్ డి) సుష్మాస్వరాజ్
26. కింది వాటిలో సరిగా లేని జత? (ఎ)
ఎ. తొవ్వ- అన్నవరం దేవేందర్
బి. పొక్కిలి- జూలూరీ గౌరీశంకర్
సి. దస్త్రం- సంగిశెట్టి శ్రీనివాస్
డి. ముంగిలి- దెంచనాల శ్రీనివాస్
ఎ) డి బి) సి సి) ఎ డి) బి
27. జోగినుల సమస్యలను అధ్యయనం చేయడా నికి నియమించిన కమిటీ? (డి)
ఎ) ఎన్ఆర్ శంకరన్ కమిటీ
బి) జగన్మోహన్రెడ్డి కమిటీ
సి) కుమారప్ప కమిటీ
డి) రఘునాథరావు కమిటీ
28. నిజాం ఆంధ్ర కేంద్ర జనసంఘం ఏ సంవత్స రంలో ఏర్పడింది? (బి)
ఎ) 1921 బి) 1923
సి) 1930 డి) 1911
29. ఏ సంవత్సరంలో హైదరాబాద్ రాజ్యంలో కమ్యూనిస్టులపై ఉన్న నిషేధాన్ని నిజాం ప్రభుత్వం ఎత్తివేసింది? (డి)
ఎ) 1946 బి) 1945
సి) 1947 డి) 1948
30. తెలంగాణ జలియన్‌వాలా బాగ్గా పేరుగాంచిన గ్రామం? (ఎ)
ఎ) బైరాన్‌పల్లి బి) గుండ్రాంపల్లి
సి) ఆకునూరు డి) పాలకుర్తి
31. కింది వాటిలో సరికానిది? (డి)
ఎ) హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనమైన సమయంలో హైదరాబాద్ రాజ్య ప్రధానిగా లాయక్ అలీ,
ఉపప్రధానిగా పింగళి వెంకట్రామిరెడ్డి ఉన్నారు
బి) నెహ్రూ నియమించిన పండిట్ సుందర్ లాల్ కమిటీ తన నివేదికలో భారతీయ సైన్యం ద్వారా వేలాది ముస్లింలు
మరణించారని తెలిపింది
సి) రాజగోపాలాచారి సూచనతో ఆపరేషన్ పోలోకు పోలీస్ చర్యగా భారత ప్రభుత్వం పేరు పెట్టింది
డి) హైదరాబాద్ రాజ్యంలో పోలీస్ దురంతాలు అనే పుస్తకాన్ని రావి నారాయణరెడ్డి రాశారు
32. పెద్ద మనుషుల ఒప్పందానికి తెలంగాణ ప్రాంతం నుంచి హాజరైన వ్యక్తులు? (ఎ)
ఎ) బూర్గుల, కేవీ రంగారెడ్డి, జేవీ నర్సింగరావు, మర్రి చెన్నారెడ్డి
బి) బూర్గుల, కేవీ రంగారెడ్డి, గౌతు లచ్చన్న, కొండా లక్ష్మణ్ బాపూజీ
సి) బూర్గుల, కేవీ రంగారెడ్డి, బెజవాడ గోపాల్‌రెడ్డి, కాళోజీ
డి) బూర్గుల, కేవీ రంగారెడ్డి, నీలం సంజీవరెడ్డి, అల్లూరి సత్యనారాయణ రాజు
33. 1969, ఏప్రిల్ 11న ప్రధాని ప్రకటించిన ఎనిమిది సూత్రాల పథకంలో హామీ ప్రకారం తెలంగాణ మిగులు నిధులు లెక్క తేల్చడానికి కేంద్రం నియమించిన కమిటీ? (బి)
ఎ) వాంఛూ కమిటీ బి) భార్గవ కమిటీ
సి) జై భరత్‌రెడ్డి కమిటీ డి) గిర్గ్లానీ కమిటీ
34. కొండపల్లి సీతారామయ్య గ్రామాలకు తరలిరండి అనే నినాదాన్ని ఎవరిని ఉద్దేశించి ఇచ్చారు? (బి)
ఎ) భూస్వాములు బి) విద్యార్థులు
సి) రైతులు డి) పెట్టుబడిదారులు
35. రైతు కూలీలు చేపట్టిన ప్రతిష్టాత్మక జగిత్యాల జైత్రయాత్ర ఎప్పుడు జరిగింది? (బి)
ఎ) 1978 సెప్టెంబర్ 8
బి) 1979 సెప్టెంబర్ 9
సి) 1978 సెప్టెంబర్ 7
డి) 1978 సెప్టెంబర్ 10
36. తెలంగాణ రాష్ట్రం – ఒక డిమాండ్ పుస్తక రచయిత? (బి)
ఎ) కాళోజీ
బి) జయశంకర్
సి) వీ ప్రకాష్
డి) ఘంటా చక్రపాణి
37. 2012, సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డుపై లక్షలాది మందితో తెలంగాణ కోసం నిర్వహించిన కార్యక్రమం? (బి)
ఎ) మిలియన్ మార్చ్
బి) తెలంగాణ మార్చ్ (సాగరహారం)
సి) వంటా-వార్పు డి) సమరదీక్ష
38. కింది వాటిలో తెలంగాణ నుంచి జాగ్రఫికల్ ఇండికేషన్ పొందనిది? (బి)
ఎ) హైదరాబాద్ హలీం
బి) హైదరాబాద్ బిర్యానీ
సి) గొల్లభామ చీర
డి) చేర్యాల స్క్రోల్ పెయింటింగ్
39. తెలంగాణ జేఏసీ పిలుపుమేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం సందర్భంగా తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న వ్యక్తి?
(డి)
ఎ) శ్రీకాంతాచారి బి) భూక్యా ప్రవీణ్
సి) వేణుగోపాల్‌రెడ్డి డి) యాదయ్య
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు