భగవంతుడిని విశ్వసించనివారు.. పునర్జన్మను నమ్మేవారు
జైన విద్యా విధానం
- జైన లేదా జిన అంటే భౌతిక సుఖాలను నియంత్రించుకొని మోక్షాన్ని పొందినవారు. వీరినే హీరో, విజేత లేదా జయించినవారు అంటారు.
- జైనులు భగవంతుడిని విశ్వసించరు. కానీ పునర్జన్మ, కర్మను నమ్ముతారు.
- ఈ అనంత విశ్వాన్ని నడిపించే శక్తి రెండు భాగాలు.
1. ఉత్ సర్పిని అంటే ఆనందం, సంతోషం, వైభవం, 2. అవసర్పిని అంటే దుఃఖం, బాధ - జైనమత మూలపురుషుడు – రుషభనాథుడు. వీరిని మొదటి తీర్థంకరుడు అని అంటారు. తీర్థంకర అంటే తీరానికి చేర్చేవాడు,
త్రిరత్నాలను సాధించినవారు. - పార్శనాథుడు- 23వ తీర్థంకరుడు, చారిత్రక పురుషుడు
- వర్ధమాన మహావీరుడు- తల్లి త్రిశాల, భార్య యశోధర, తండ్రి సిద్ధార్థ.
- ఇతడిని 24వ తీర్థంకరుడు అంటారు. జైన మతాన్ని వెలుగులోకి తీసుకొచ్చినవాడు. ‘సర్వజ్ఞుడు’ అనే బిరుదు పొందినవాడు.
- త్రిరత్నాలు- సమ్యక్ దర్శనం- విశ్వాసం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ చరితం-ప్రవర్తన
పంచమహావ్రతాలు
1. సత్యం
2. అహింస-హింసించకుండా ఉండుట
3. అస్తేయ- దొంగతనం చేయరాదు
4. అపరిగృహ- బంధనాల నుంచి విముక్తి
5. బ్రహ్మచర్యం- వర్ధమాన మహావీరుడు ప్రతిపాదించాడు. 1-4 వరకు ఉన్న నియమాలను పార్శనాథుడు ప్రతిపాదించాడు.
- వీరిని అనుసరించి జ్ఞానం ఐదు రకాలు- యత్రి, శ్రుతి, అవధి, కేవలం, మన:పర్యాయం.
- మోక్ష సాధన వ్రతం- సల్లేఖన వ్రతం/సంతారా అంటే ఆహారం, పానీయాన్ని వదిలివేయడం.
- ముఖ్య సిద్ధాంతం- అనేకాంతవాదం అంటే ఒక వస్తువుకు భిన్న ధర్మాలు ఉంటాయి. కాబట్టి భిన్న కోణాల్లో పరిశీలించాలి.
విద్యా లక్ష్యం: లోక కల్యాణం, పరలోక ప్రాప్తి. పరలోక ప్రాప్తి రెండు దశలు.
1. సంవర, 2. నిర్జర
- విద్యా ప్రారంభ వయస్సు-5 సం.లు
- విద్యా సంస్థలు- జైన ఆరామాలు, జైన విహారాలు
- ఉపాధ్యాయుడు- జైన సన్యాసి
- సన్యాసి అంటే సంస్కృతి పరిరక్షకులు
- సన్యాసిగా నియమించటానికి అనుభవం 10 సం.ల పరివాజక జీవితం.
- బోధన భాష- ప్రాకృతం
- ముఖ్య బోధనా పద్ధతి- వైయక్తిక బోధన (వ్యక్తిగత)
- జైన మతంలోని భాగాలు
- శ్వేతాంబరులు, దిగంబరులు
- భారతదేశంలో జైన మత దేవాలయాలు ఉన్న ప్రాంతం- మౌంట్ అబు
- మహిళా విద్యకు దూరం కావడానికి కారణం-పరిణయం
- బౌద్ధ విద్యా విధానం
- బౌద్ధ మతానికి మూల పురుషుడు సిద్ధార్థుడు/గౌతముడు/బుద్ధుడు/ఆసియా జ్యోతి అని ప్రఖ్యాతి గాంచినవాడు. తల్లిదండ్రులు-మహామాయ, శుద్ధోధనుడు
సిద్ధార్థుడు బుద్ధుడిగా మారటానికి
- కారణాలు- 1.శిశువు, 2. రోగి,3. వృద్ధుడు, 4. కళేబరం, 5. సన్యాసి.
- సిద్ధార్థుడు 29వ సంవత్సరంలో ఇంటిని వదిలేయడం- మహాభినిష్క్రమణం
- బౌద్ధ సిద్ధాంతానికి మరో పేరు- మధ్యేమార్గం
- బుద్ధుని మొదట బోధన సారనాథ్‌లో ధర్మ చక్రపరివర్తన
- బుద్ధుడు తనువు చాలించుట ‘కుశీ నగరం’లో
- నిర్యాణం చెందడం- మహాపరి నిర్యాణం
- బౌద్ధ విద్య ముఖ్య ఉద్దేశం- నిర్యాణం/మోక్షం
- బుద్ధుని బోధనలు శిష్యులు ప్రచారం చేయటాన్ని ‘సంగీతి’ అంటారు.
- బోధనలోని అంశం త్రిపీఠకాలు- 1. వినయ పీఠిక (సంఘ జీవనం గురించి వివరిస్తుంది), 2. సుత్త పీఠిక (దీనిలో అనేక విషయాలను గురించిన చర్చలు, వివరణలు పొందుపరిచారు), 3. అభిధమ్మ పీఠిక (దార్శనిక విజ్ఞానం 7 గ్రంథాల్లో వివరించారు)
ఆర్య సూత్రం
- దుఃఖం,దుఃఖానికి కారణం ఉంటుంది (ఇవి 12 కారణాలు ఉంటాయి. దీన్నే ‘ప్రతిత్యసముత్పాదవాద’ సిద్ధాంతం అంటారు),
- దుఃఖాన్ని నివారించవచ్చు,దుఃఖ నివారణ మార్గం అష్టాంగ మార్గం: సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వాక్కు, సమ్యక్ కర్మం, సమ్యక్ జీవనం, సమ్యక్ వ్యాయామం, సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధి.
బౌద్ధ విద్య ప్రారంభ వయస్సు 8 సం.లు
- అన్ని కుల, మతాల వారికి విద్యా ప్రారంభ ఉత్సవం- పబ్బజ్జ
- బోధనా భాషలు- పాళీ, పాకృతం, ఉన్నతవిద్యలను సంస్కృతంలో కూడా బోధించారు.
- పబ్బజ్జ అంటే పాళీ భాషలో ముందుకు వెళ్లడం అని అర్థం.
- విద్యా సంస్థలు- బౌద్ధ ఆరామాలు, బౌద్ధ విహారాలు
- విహారాలు ఎక్కువగా ఉండటం వల్ల మగధ సామ్రాజ్యాన్ని విహార్ అని పిలిచిన నేటి ప్రాంతమే బీహార్.
- బౌద్ధ కాలంలో గుర్తించిన విద్యాసంస్థలు- నలంద, తక్షశిల, నాడిమ, మిథిల, ఓదంతపురి
- ఉపాధ్యాయులు- సన్యాసి (10 సంవత్సరాల అనుభవం), ఆచార్య (7 సం.ల అనుభవం)
- జంతుబలి నిషేధం
- విద్యపై సమావేశాలు నిర్వహించారు. నెలలో రెండుసార్లు అంటే పౌర్ణమి, అమావాస్య.
- ప్రార్థన – బుద్ధం శరణం గచ్ఛామి
- విద్యా లక్ష్యాలు: నిరాడంబర జీవితం, జీవితానికి సంసిద్ధులు కావడం.
- కనీస విద్య అభ్యసన కాలం- 12 సంవత్సరాలు
- కింది స్థాయి విద్యలోని అంశాలు- చిత్రకళ, నూలు వడకటం, బట్టలు నేయడం మొదలైనవి
- అందరికి నైతిక శిక్షణ, విజ్ఞాన యాత్రలను బోధనల్లో భాగం చేశారు
- ఉన్నత విద్యలో 7 సం.ల వైద్య విద్య, న్యాయశాస్త్ర వృత్తి, పారిశ్రామిక విద్యలు ఉండేవి.
- విద్యా ముగింపు ఉత్సవం- ఉపసంపద
- బౌద్ధమతం మహాయానం, హీనయానంగా విభజించబడింది. ప్రపంచస్థాయి విద్యార్థులందరిని ఒకేచోట చేర్చిన ఘనత బౌద్ధ విద్యదే.
మహిళా విద్య
- మహామాయ ప్రోత్సాహంతో ప్రారంభించారు.
- సమనేరులు అనే విద్యార్థులను సంబోధించారు
- మహిళా ఉపాధ్యాయురాళ్లను ‘భిక్షుణి’ అంటారు
- సిలోన్ ప్రాంతంలో బౌద్ధమత వ్యాప్తికి కృషి చేసిన మహిళ- సంఘమిత్ర
బౌద్ధకాలంలో గుర్తించిన విద్యా సంస్థలు
- నలంద, తక్షశిల వేదకాలం నుంచి ఉన్నప్పటికి బౌద్ధకాలంలో తక్షశిలకు 7 సం.ల వైద్య విద్య, న్యాయ విద్యలో పేరు గాంచింది. వీటితో పాటు సాడియా, మిథిల, ఓదంతపురి, జగద్దల, నాగార్జున మొదలైన సంస్థలు.
- వేదకాలానికి గుర్తుగా కంచిలో వెలసిన ధర్మపీఠం, బౌద్ధ విద్యా సంస్థలకు గుర్తుగా బెంగాల్‌లోని ‘TOLS’
మధ్యయుగ విద్యా విధానం (మహమ్మదీయుల విద్యా విధానం)
- 8వ శతాబ్దంలో తరుష్కుల దండయాత్ర ద్వారా భారతదేశంలోకి మహమ్మదీయులు ప్రవేశించారు.
- ఇస్లాం మత మూల పురుషుడు- మహ్మద్ ప్రవక్త. అమీనా, అబ్దుల్లాల సంతానం
- ఇస్లాం అంటే ఆత్మ సమర్పణ
- మహ్మదీయుల పవిత్ర గ్రంథం ఖురాన్.
- ఖురాన్‌లోని భగవంతుని ఆజ్ఞలకు క్రియా రూపమే సున్హా. సున్హా అంటే వ్యాఖ్యానం.
- ఖురాన్‌లోని సురాహి-ఇ-ఇక్రా అనే అధ్యాయంలో ఇల్మ్ను అనుసరించి విద్యను అభ్యసించినవారు అల్లాకు ప్రీతిపాత్రులు.
- మహ్మద్ ప్రవక్తను అనుసరించి బంగారం దానం చేయడం కంటే విద్యను నేర్పడమే గొప్ప.
- మహమ్మదీయుల దృష్టిలో దేశభక్తుని ప్రాణం కంటే మేధావి కలంలోని సిరానే గొప్పది.
- విద్యా సంస్థలకు నష్టం కలిగించినవారు- మహ్మద్ గజినీ.
- ఉపాధ్యాయుడు/మతపెద్ద- మౌల్వి
- బోధనా భాషలు- అరబిక్, పర్షియన్, ఉర్దూ
- విద్యా ప్రారంభ వయస్సు- 4 సం.ల 4 నెలల 4 రోజులు
- విద్యా ప్రారంభ ఉత్సవం- బిస్మిల్లా (బాలురు), జార్ఫీఫాన్ (బాలికలు)
- బిస్మిల్లా ఉత్సవం సందర్భంలో ఖురాన్‌లోని 55, 87వ అధ్యాయంలోని ప్రవచనాలు పలకలేకపోతే వాటికి బదులుగా పలికిన పదమే ‘బిస్మిల్లా’
- విద్యా సంస్థలు: మక్తాబ్, మదర్సా, మదర్సా-ఐలా
మక్తాబ్
- విశ్వవిద్యాలయాలు లేవు.
- 1192 కాలంలో మహమ్మద్ ఘోరీ ప్రారంభించిన ప్రాథమిక విద్యా సంస్థ.
- మక్తాబ్లలో ముందు పద ఉచ్ఛారణ నేర్పేవారు. రాత కోసం కొంత శిక్షణా సమయం ఉండేది.
- ఖురాన్‌లోని ప్రార్థన అంశాల కోసం 30వ అధ్యాయం పలికించేవారు. మమ్కీమక్, కరికుషన్, ఖలీఖద్రి వంటి పవిత్ర గ్రంథాలను అభ్యసించేవారు.
- ఎక్కాలను వల్లెవేయడం- పహరాస్
మదర్సా
- కట్టె పుస్తకాలు- టాక్టిస్ ను ఉపయోగించేవారు
- ఇల్టుట్మిష్ ఢిల్లీలో మదర్సా-ఇ-మ్యుజ్జి అనే పేరుతో మదర్సాను ప్రారంభించారు.
- మక్తాబ్ అంటే కుతుబ్ అనే అరబిక్ పదంలో రాయడం నేర్పించే స్థలం అని అర్థం.
- మదర్సా దీనికి మూలమైన అరబిక్ పదం ‘దార్స్’ అంటే ఉపన్యాసం అని అర్థం.
- మదర్సా అంటే అరబిక్ పదంలో అభ్యసించే స్థలం అని అర్థం.
- మిత్రస ఇబ్రూ పదం. అంటే మత సంబంధ విషయాల అధ్యయనం అని అర్థం.
- ఈ స్థాయిలో విద్యా సంబంధ అంశాలు అంటే తాబ్జీ (వైద్య శాస్త్రం), రియాబి (విజ్ఞాన శాస్త్రం) మొదలైన విషయాలతో పాటు మత సంబంధ అంశాలు ఐదు ఇలాహి (ఆధ్యాత్మిక చర్చ) మొదలైన అంశాలు ఉండేవి.
- మానిటోరియల్ విధానంతో పాటు మానిటరింగ్/పర్యవేక్షణ/పెబ్బ, విశ్లేషణ, సంశ్లేషణ పద్ధతి.
గుర్తింపు పొందిన వ్యక్తులు
- అక్బర్, ఔరంగజేబు
- అక్బర్- హిందూ, ముస్లింల మధ్య సామరస్యత, విద్యా సామర్థీకరణ, విద్యా విధానాన్నే మార్చటానికి కృషి చేసిన వ్యక్తి.
- ఔరంగజేబు- మహ్మదీయులకు మాతృభాషలో అభ్యసించుకునే అవకాశాలు కల్పించాడు.
- ఉన్నత ఉద్యోగాలు: ఖాజీ (జడ్జ్), వాజిర్ (మినిస్టర్)
- సరిగా అభ్యసించకపోతే తీవ్రమైన శిక్షలు విధించేవారు. బహుమతులుగా ‘సనార్’ వంటి సర్టిఫికెట్స్, టంషు అనే పథకాలు ఇచ్చేవారు
విద్యా విధానంపై ఆసక్తి తగ్గడానికి కారణాలు
- మహమ్మదీయులు పట్టణాలపై దృష్టిని పెట్టినట్లుగా గ్రామాలపై దృష్టిని కేంద్రీకరించలేదు.
- హిందువుల వీధి బడులు ప్రారంభం
వైష్ణవ మత వ్యాప్తి
- భగవద్గీత ప్రచారం
- హిందూ సంస్కృతే గొప్ప
- సమాజ అవసరాలు తీర్చేలా విద్య ఉండాలి
- 8వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దంలో బ్రిటిష్‌వారు జోక్యం చేసుకునే వరకు మధ్యలో ఉన్న ఈ కాలాన్ని అత్యంత అంధకార యుగం (Darkest Education time) అంటారు.
మహిళా విద్యా విధానం
బాలికలకు మసీదుల్లో, మసీదును ఆనుకొని ఉన్న మక్తాబ్లలో ఖురాన్ చదవడం, రాయడం మాత్రమే నేర్పేవారు. పరదా విధానం ఉండేది. ఇది ఉన్నత వర్గ మహిళలకే అవకాశం ఉండేది. సార్వత్రీకరణ జరగలేదు.
1. గుల్సావల్ బేగం- హుమాయూన్
నామా గ్రంథం రచించింది.
2. రజియా సుల్తానా- మేధావి, యుద్ధ విద్యలు
3. జహనారా బేగం, నూర్జహాన్, ముంతాజ్ బేగం సాహిత్యం, కళల్లో ప్రసిద్ధి చెందారు.
4. జెబ్ ఉన్నిసా అరబిక్, పర్షియన్ భాషల్లో ప్రావీణ్యురాలు. ఈమె రచించిన గ్రంథం Dewana- E-Makhafi.
- డే స్కూల్స్‌ను స్థాపించినవారు- ముస్లింలు
మాదిరి ప్రశ్నలు
1. జైన ధర్మం ప్రధాన తత్వం?
1. సత్ప్రవర్తన 2. ఆధ్యాత్మిక చింతన
3. కఠిన క్రమశిక్షణ 4. పైవన్నీ
2. త్రిరత్నాలు ఏ విద్యావిధానంలో అనుసరిస్తారు?
1. జైన 2. బౌద్ధ
3. వేద 4. ప్రాచీన
3. కింది వాటిలో జైన మత గ్రంథం కానిది?
1. ద్వాదశాంగం 2. త్రిపీఠకం
3. త్రిరత్నాలు 4. పైవన్నీ
4. తీర్థంకరులు ఏ మత గురువులు?
1. జైన 2. బౌద్ధ
3. వేద 4. ప్రాచీన
5. పబ్బజ్జ అనే ఉత్సవం ఎవరికి సంబంధించినది?
1. ముస్లిం 2. బౌద్ధులు
3. జైనులు 4. చార్వాకులు
6. బౌద్ధుల కాలంలో వైద్య విద్యకు ప్రాముఖ్యత చెందినది?
1. తక్షశిల 2. విక్రమశిల
3. నాగార్జున 4. నలంద
సమాధానాలు
1. 4 2. 1 3. 1 4. 1
5. 2 6. 1
దుర్గాప్రసాద్
ఫ్యాకల్టీ, ఏకేఆర్ స్టడీ సర్కిల్, వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు